- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
🔍 Search Our Site / మా వెబ్సైట్లో సెర్చ్ చేయండి:
మృగశిర 3,4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధునరాశికి చెందును.
Individuals born under the 3rd and 4th padas of Mrigasira, all 4 padas of Arudra, or the 1st, 2nd, and 3rd padas of Punarvasu belong to Mithuna Rasi (Gemini).
2027- 2028 శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మిధున రాశీ వారికి ఆదాయం - 02, వ్యయం - 11, రాజ పూజ్యం - 02, అవమానం - 04
In the Sri Plavanga Nama Samvatsaram (2027–2028), the Navanayaka Kandaya (astrological financial and socio-status figures) for Mithuna Rasi (Gemini) are as follows: Income (Adayam) – 02, Expenditure (Vyayam) – 11, Honor/Respect (Raja Poojyam) – 02, and Dishonor/Humiliation (Avamanam) – 04.
పూర్వ పద్దతిలో మిధున రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "4". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి తరచుగా ఏర్పడుబోవు ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నది.
According to the traditional method, the remainder number (Shesa Sankhya) obtained for Mithuna Rasi (Gemini) is "4". In the Sri Plavanga Nama Samvatsaram, this indicates frequent health complications and physical ailments that Gemini natives may encounter throughout the year.
మిధున రాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మీరు ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. విశేషమైన ధనాన్ని సంపాదించి నిలువ చేయగలుగుతారు. జీవిత భాగస్వామి వలన ఆర్థికంగా లాభపడతారు కానీ అదే జీవిత భాగస్వామి గారితో మీ సంబంధ బాంధవ్యాలు ఒడిదుడుకులకు లోనయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వయంకృషితో పూర్వకాలంలో ఉన్నటువంటి మీ జీవిత హోదాను మించిన హోదాని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోగలుగుతారు. గురు గ్రహం వలన వ్యాపార వర్గం వారికి మరియు ఉద్యోగ లేదా వృత్తిపరమైన జీవితం చేయువారికి చక్కటి ధన లాభాలు ఏర్పడతాయి. గోదావరి నది పవిత్ర పుష్కరాల ప్రారంభం నుంచి గురువు యొక్క అనుకూల ఫలితాలు లభించడం తగ్గుతుంది. 2027 జూలై నుండి ఆరోగ్య సంబంధమైన విషయాలలో మిధున రాశి జాతకులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా నవజాత శిశువుల ఆరోగ్య విషయంలోనూ బాలారిష్ట దశలో ఉన్నటువంటి చిన్నారుల ఆరోగ్య విషయంలోనూ మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. మీ ఇరుగుపొరుగు వారితో అనవసర తగాదాలు ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి. పుత్ర సంతాన సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్న వారు నిరాశకు గురవుతారు. విద్యార్థులకు తమ యొక్క విద్యాభ్యాసంలో కోరుకున్నటువంటి ఫలితాలే లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మానసికంగా క్రుంగు బాటుకు లోను చేస్తాయి. ఆర్ధిక నష్టాలలో ఇరుక్కున్న వారు తమ సోదర వర్గం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార రంగంలోని వారు అదే విధంగా కార్పొరేట్ స్థాయిలో మంచి హోదాలో ఉన్న వారు తమ కింద స్థాయి సేవకుల వల్ల మిక్కిలి లాభపడతారు. మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో బృహస్పతి వలన మిధున రాశి వారు అధిక శాతం అనుకూలమైన ఫలితాలని పొందుతారు.
In the Sri Plavanga Nama Telugu Lunar Year—from Wednesday, April 7, 2027 to Sunday, March 26, 2028—Mithuna Rasi (Gemini) native individuals will experience highly auspicious and favorable results throughout the year due to the benevolent influence of Jupiter (Guru Graha), enabling you to achieve your financial goals, earn and accumulate significant wealth, gain monetary benefits through your spouse despite occasional marital ups and downs caused by new acquaintances, and elevate your social status beyond past achievements through self-effort. While Jupiter brings excellent financial gains for businesspersons, employees, and corporate executives—who will also benefit immensely from subordinates—and helps those in financial distress overcome losses through timely assistance from siblings, its favorable effects will begin to taper off following the commencement of the sacred Godavari Nadi Pushkaralu; consequently, from July 2027 onward, Gemini natives must exercise extra caution regarding health matters (especially for newborn infants and young children under Balarishta doshas), manage potential disputes with neighbors, and handle romantic affairs carefully to avoid emotional strain, even as students achieve their desired academic outcomes and overall outcomes remain predominantly positive throughout the Sri Plavanga Nama Samvatsaram.
మిధునరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో శ్రీ శనైచ్చరుల వారి వల్ల సంవత్సరమంతా మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక సంబంధ విషయాలలో ఉద్యోగ జీవనంలోని వారు ముఖ్యంగా పరదేశాలందు స్థిరపడిన వారు మరియు పరదేశ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు లాభపడతారు. విదేశాలందు స్థిరపడిన వారికి చక్కటి ధన లాభాలు లభిస్తాయి. మీరు కోరుకున్న విషయాలలో అదృష్టం కలిసి వస్తుంది. విదేశీయుల మైత్రి వలన మీ అధికార వాంఛ నెరవేరుతుంది. మిధున రాశికి చెంది ఉండి వ్యాపార పరమైన ధనార్జన చేస్తున్న వారికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాదు. వ్యాపారపరమైనటువంటి నష్టాలను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి నూతన వ్యాపార ప్రారంభాలు కానీ భారీ వ్యాపార సంబంధమైన పెట్టుబడులు కానీ పెట్టకుండా ఉండడం మంచిది. శ్రీ శనైచ్చరుల వారి వల్ల మిధున రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో దైవచింతన పెరుగుతుంది. మాతృ వర్గీయుల ఆరోగ్య సమస్యలు మీకు మానసికంగా ఇబ్బందిని కలగచేస్తాయి. స్వదేశంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చివరి నిమిషంలో అదృష్టం కలిసి వస్తుంది. మీ దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. రాజకీయ లేదా కళా రంగాలలో ఉన్నటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మిధున రాశికి చెందినవారు వారసత్వ సంపద పరంగా లభించినటువంటి సంపదను మీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఖర్చు పెట్టడం లేదా తాకట్టు పెట్టడం వంటి పనులు చేయకూడదు. శ్రీ ప్రవంగనామ సంవత్సరంలో మిధున రాశి వారికి గోచార రీత్యా శ్రీ శనైచ్చరుల వారి వలన ఏలినాటి శని లేదా అర్ధ అష్టమ శని లేదా అష్టమ శని వంటి ప్రతికూల దశల ప్రభావము లేదు.
In the Sri Plavanga Nama Samvatsaram, Mithuna Rasi (Gemini) native individuals will experience mixed results throughout the year due to Saturn (Shani Bhagavan). In financial matters, those in employment—particularly individuals settled abroad and those attempting foreign employment—will benefit significantly, while those living overseas will enjoy excellent financial gains, lucky turns in desired matters, and the fulfillment of authority and status aspirations through international friendships. Conversely, Gemini natives deriving income through business ventures will not find this year very favorable, facing potential business losses and risks; hence, it is advisable to avoid launching new businesses or making heavy commercial investments. Spiritually, Saturn's transit will deepen your inclination toward divine pursuits, although health issues concerning maternal relatives may cause mental anxiety and distress. Those pursuing government job opportunities domestically will experience a stroke of good fortune at the very last moment, leading to the fulfillment of long-cherished desires, while individuals in politics or the arts will see a rise in fame and public stature. However, Gemini natives must exercise caution with ancestral property and inherited wealth, refraining from spending, pledging, or risking it on adventurous decisions. Overall, according to planetary transits, Mithuna Rasi natives do not have negative influences such as Elinati Shani, Ardhashtama Shani, or Ashtama Shani due to Saturn during the Sri Plavanga Nama Samvatsaram.
మిదునరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో రాహు గ్రహం వల్ల సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. మిధున రాశికి చెంది ఎవరికైతే తమ వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కానీ రాహు గ్రహము ప్రతికూల స్థానంలో కానీ ఉండడం జరుగుతుందో వారి చేతి మీద అనేకమైన అపసవ్య కర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. తలపెట్టిన ప్రతి కార్యక్రమం అనేక అవాంతరాలను, వ్యవహారపు చిక్కులను ఎదుర్కొంటుంది. శత్రు బాధ అధికమవుతుంది. ఆరోగ్య విషయాలలో కూడా మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సర్పము లేదా ఇతర విషపూరిత క్రిమి కీటకాల విషయంలో శ్రీ ప్లవంగనామ సంవత్సర అంతా కూడా మిధున రాశి వారు జాగ్రత్త వహించాలి. రాహు గ్రహ ప్రతికూల ప్రభావం వల్ల జూదం పట్ల లేదా ఇతర చెడు వ్యసనాల పట్ల మిక్కిలి ఆకర్షితులయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కావునా ఇంద్రియ నిగ్రహాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. స్త్రీలకు మరియు పురుషులకు ఇరువురికి కూడా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం లేదా రాహు గ్రహము అనుకూలత లేకుండా ఉన్నవారు రాహు గ్రహ శాంతి జరిపించుకోవడం అవసరం.
In the Sri Plavanga Nama Samvatsaram, Rahu Graha will yield unfavorable and challenging results throughout the year for Mithuna Rasi (Gemini) native individuals. Specifically, Gemini natives who have Kala Sarpa Dosha or an adversely placed Rahu in their individual birth charts will encounter situations forcing them into improper, unintended, or unethical actions. Every single task and endeavor undertaken will face numerous obstacles, setbacks, and procedural complications. Enemy troubles and opposition will increase noticeably. In terms of health, Gemini natives must exercise extreme caution throughout the year—particularly regarding snakes, reptiles, and poisonous insects. Under Rahu's adverse transit influence, there is a strong tendency to get lured or attracted toward gambling, speculation, or other bad habits; hence, cultivating self-restraint and sensory control is essential. Both men and women of this sign face indications of health complications related to the reproductive system. Individuals who have Kala Sarpa Dosha or an unfavorable Rahu positioning in their personal horoscopes are strongly advised to perform Rahu Graha Shanti rituals and remedies for relief.
మిధునరాశి వారికి శ్రీ ప్లవంగనామ సంవత్సరములో కేతు గ్రహం వల్ల పారమార్థక చింత అధికమవుతుంది. కేతు గ్రహం వలన ధనాన్ని ప్రసాదిస్తారు అదేవిధంగా దైవ సంబంధమైన కార్యక్రమాల కోసం ఆ ధనం వ్యయమేయేటట్టు చేస్తారు. కేతు గ్రహ ప్రభావం వల్ల మిధున రాశి వారు శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మిక్కిలి పౌరుషం కలిగిన వారిగా ప్రవర్తిస్తారు. ఈ స్వభావం వలన అనవసర తగాదాలు ఎదుర్కొంటారు. ఇతరులను విమర్శించడం మానుకోవాలి. ఉద్యోగ పరంగా నూతన విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకుంటారు. మీ సహజ సిద్ధమైన సూక్ష్మ గ్రాహ్యత వలన లాభపడతారు. సోదర వర్గంతో విభేదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తం మీద మిధునరాశి వారు శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన అధిక శాతం అనుకూల ఫలితాలు పొందుతారు.
In the Sri Plavanga Nama Samvatsaram, Ketu Graha will enhance spiritual contemplation, philosophical thinking, and devotional inclination for Mithuna Rasi (Gemini) native individuals. Ketu bestows financial prosperity while simultaneously guiding that wealth to be spent on sacred rituals, divine causes, and religious activities. Under Ketu's influence, Gemini natives will exhibit heightened pride, bold assertiveness, and strong ego during this year, which may trigger unnecessary disputes; hence, avoiding criticism of others is strongly advised. Professionally, you will acquire new domain knowledge, technical expertise, and skills, benefiting greatly from your innate quick comprehension and sharp intellect. However, you may face differences of opinion or friction with siblings. Overall, Mithuna Rasi natives will reap predominantly favorable and supportive outcomes from Ketu Graha during the Sri Plavanga Nama Samvatsaram.
శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి గురు గ్రహం వలన, శని వలన మరియు కేతువు వలన కలసి వస్తుంది. రాహు గ్రహ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండవలెను. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తి గత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.
In the Sri Plavanga Nama Samvatsaram, Mithuna Rasi (Gemini) native individuals will enjoy favorable and supportive influences from Jupiter (Guru), Saturn (Shani), and Ketu. However, you must exercise caution and mindfulness regarding Rahu Graha. Throughout this year, the planetary results that manifest most prominently will depend on whichever planet among Jupiter, Saturn, Rahu, and Ketu possesses greater strength in your individual birth chart. Do not be disheartened or anxious by the negative outcomes mentioned here; if the planet responsible for adverse results holds a strong, well-disposed position in your personal horoscope, the intensity of those negative effects will be significantly reduced.
నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...
ఈ మాసంలో ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు చేయు వారికి అతి కష్టం మీద ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. రాజకీయ రంగంలోని వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఈ మాసంలో వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగుతాయి. తృతీయ వారంలో గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వహించబడతాయి. బంధు వర్గముతో కలువుట వలన నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆరుద్ర జన్మ నక్షత్ర జాతకులు తమ కుటుంబ సభ్యులపై మీ ప్రేమను చాటుకుంటారు. మిధునరాశి కి చెందిన స్త్రీల కు తమ ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఏర్పడుట కొంత ఊరట కలుగచేస్తుంది. మాసాంతంలో పారిశ్రామిక వేత్తలకు తాము దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త లభిస్తుంది. మ్రిగాశిర నక్షత్ర జాతకుల వివాహ సంబంధ ప్రయత్నములు ఈ మాసంలో ఫలిస్తాయి. ఈ మాసంలో 8,10,14,19 మరియు 22 తేదీలు మిధునరాశి వారికి అనుకూలమైనవి.
In April 2027—the opening month of the Sri Plavanga Nama Samvatsaram—Mithuna Rasi (Gemini) native individuals will secure desired employment opportunities only after considerable effort and perseverance. Financial inflow (Dhana Adayam) will remain modest and average throughout the month. Your acquaintances with influential political figures will enhance your prestige and reputation in society. Business activities and professional trades will continue smoothly at a steady pace. During the third week, unexpected auspicious functions or family celebrations will take place at home. Interacting with relatives will bring new insights and useful information. Individuals born under the Arudra nakshatra will express deep affection and devotion toward their family members. Gemini women will experience relief as health conditions show noticeable improvement. Towards the end of the month, industrialists and business entrepreneurs will receive long-awaited good news. Matrimonial efforts for individuals born under the Mrigasira nakshatra will yield successful results. The 8th, 10th, 14th, 19th, and 22nd of this month are favorable dates for Gemini natives.
ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.
Key festivals and auspicious days in April 2027: The sacred Sri Plavanga Nama Samvatsaram commences on the 7th. Matsya Jayanti and Saubhagya Gauri Vratam take place on the 9th. Sri Panchami falls on the 11th. Sri Rama Navami is celebrated on the 15th. Dharmaraja Dashami falls on the 16th. Matatraya Ekadashi and the sacred Vadapalli Teertham take place on the 17th. Ontimitta Kodandaramaswamy Kalyanotsavam is celebrated on the 19th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th.
ఈ మాసంలో మిధునరాశి వారికి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసంలో వ్యాపార పరంగా అధిక లాభాలు ఆశించిన వారికి నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగ జీవనములో స్థిరత్వం ఉండదు. కుటుంబ సంతోషములు మాధ్యమంగా ఉంటాయి. నూతన గృహ నిర్మాణ సంబంధ ఆర్ధిక ప్రయత్నాలు, ఉద్యోగ రీత్యా స్థానచలన ప్రయత్నాలు విజయవంతం అవ్వవు. ఈ మాసంలో 14 వ తేదీ తదుపరి తలపెట్టు నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహంలో నూతన వస్తువుల అమరిక ఏర్పడుతుంది. మాసాంతంలో వివాహిత స్త్రీలకు తమ వైవాహిక జీవన భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన ఉన్నది. ఈ మాసంలో మ్రిగాశిర నక్షత్ర జాతకులకు 6,10 మరియు 19 తేదీలు అనుకూలమైనవి కావు.
In May 2027, Mithuna Rasi (Gemini) native individuals will experience modest financial inflow (Dhana Adayam). Those expecting high profit margins in business ventures will face disappointment, and stability in job and employment matters may remain elusive. Domestic happiness will be average and moderate. Financial efforts toward constructing a new home and attempts for job relocation or transfer will not yield success during this period. However, after the 14th of the month, new plans and ideas initiated by you will begin to take concrete shape, and new household furnishings or amenities will be arranged at home. Towards the end of the month, married women may experience anxiety regarding the future of their marital life. For individuals born under the Mrigasira nakshatra, the 6th, 10th, and 19th of this month are unfavorable dates.
మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.
Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri takes place on the 4th, which also marks the commencement of Vastu Kartari (concluding on May 30th). The holy month of Vaisakha Masa begins on the 7th. Akshaya Tritiya, Parashurama Jayanti, and the sacred Chandanotsavam at Simhachalam Sri Appanna Swamy Temple all fall on the 9th. Sri Vasavi Ammavari Jayanti is celebrated on the 15th. Sarva Ekadashi and Annavaram Sri Satyanarayana Swamy Kalyanotsavam take place on the 16th. Nrusimha Jayanti falls on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaisakhi are celebrated on the 20th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th. Rohini Karte commences on the 25th. Sri Hanuman Jayanti is celebrated on the 30th.
ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గు సూచనలు ఉన్నవి. ముఖ్యంగా బుధ గ్రహ ప్రతికూలత వలన అన్ని రకముల వ్యాపార వర్గములకు ఆశించిన విధంగా వ్యాపారములు జరగవు. ఈ మాసం ప్రధమ వారంలో మిత్రులతో లేదా మీ ఉన్నత అధికారులతో విభేదములు ఏర్పడు సూచన ఉన్నది. ద్వితియ వారంలో లాభ వ్యయాలు సమానంగా ఉండును మరియు కుటుంబ జీవనంలో ప్రతికూల్ల ఫలితాలు ఎదురగును. తృతీయ వారం సంతానం ప్రయత్నాలు చేయు వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం తిరిగి మీ అదుపులోకి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సాధించగలుగుతారు. రాజకీయ రంగంలోని వారికి పదవుల పరంగా విజయం చేకూరుతుంది. 22 వ తేదీ నుండి ఆర్ధిక పరమైన విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. గతకాలంలో ప్రారంభించిన పనుల్లో మరింత పురోగతి సాధించగలుగుతారు.
In June 2027, Mithuna Rasi (Gemini) native individuals will see a slight decrease in financial inflow (Dhana Adayam). Due to the adverse position of Mercury (Budha Graha), business ventures across all sectors will not perform as expected. During the first week of the month, indications suggest potential differences of opinion or disagreements with friends or high-ranking superiors. In the second week, income and expenditure will balance out equally, though you may encounter challenging situations in family life. The third week proves favorable for those making efforts toward children or progeny prospects; domestic atmosphere will return to your control, enabling you to build harmony and understanding among family members. Individuals in the political sphere will achieve success regarding positions and leadership roles. From the 22nd onward, financial matters will turn favorable, and you will make swift progress on long-pending tasks initiated in the past.
జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.
Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st. Masa Shivaratri takes place on the 3rd. The holy month of Jyeshtha Masa commences on the 5th. Buddha Jayanti is celebrated on the 6th. Dasha Papa Hara Dashami falls on the 13th. Nirjala Ekadashi and Smarta Ekadashi take place on the 14th. Eruwaka Purnima and Vata Savitri Vratam fall on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. The sacred Godavari Nadi Pushkaralu begin on the 26th (with the Godavari Nadi Adi Pushkaralu concluding on July 7th). Sarva Ekadashi falls on the 30th.
ఈ మాసంలో ధనాదాయం పెరుగుతుంది. ఎదురుచూస్తున్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి అవుతాయి. ఆదాయం పెరగడం వలన మానసికంగా ఉల్లాసభరిత కాలాన్ని అనుభవిస్తారు. ఈ మాసం ప్రధమ వారంలో అన్ని వర్గముల వృత్తి వ్యాపారములు లాభదాయకంగా కొనసాగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసంలో 10, 11, 12 మరియు 14 తేదీలు అనుకూలమైనవి. ఈ మాసం ద్వితియ వారంలో పునర్వసు నక్షత్ర జాతకుల సువర్ణ సంబంధ కోరికలు తీరును. నూతన పరిచయాలు ఏర్పడతాయి. తృతీయ వారం సామాన్య ఫలితాలు ప్రసాదిస్తుంది. వివాహ ప్రయత్నాలలో కొద్దిపాటి ఆటంకములు మాత్రం ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో కళత్ర సంబంధ దోషాల పరిశీలన చేయించుకొనుట మంచిది.
In July 2027, Mithuna Rasi (Gemini) native individuals will experience a welcome increase in financial inflow (Dhana Adayam). Long-awaited key tasks and important projects will be completed smoothly. This rise in income will bring mental satisfaction, joy, and a cheerful period overall. During the first week of the month, business and professional ventures across all sectors will run profitably. For unemployed individuals seeking job opportunities, the 10th, 11th, 12th, and 14th of this month are highly favorable. In the second week, desires related to gold or precious jewelry will be fulfilled for individuals born under the Punarvasu nakshatra, and new acquaintances will be made. The third week will yield moderate and average results. However, minor obstacles will persist in marriage alliance efforts; therefore, it is advisable to have your personal horoscope examined for potential marital or spouse-related doshas (Kalatra Dosha).
జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.
Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. The holy Ashadha Masa commences on the 5th, alongside the grand celebration of the Puri Sri Jagannatha Swamy Rath Yatra; Shukra Mudhami also begins on this day (concluding on September 18, 2027). Toli Ekadashi, Sayana Ekadashi, and the commencement of Chaturmasya Vratam take place on the 14th. Dakshinayana Period begins on the 17th. Guru Purnima and Vyasa Purnima fall on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. Sarva Ekadashi falls on the 29th. Masa Shivaratri and Shani Trayodashi take place on the 31st.
ఈ మాసంలో మిధునరాశి వారికి ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ధన వ్యయం అధికి అదుపు తప్పుతుంది. మీరు రూపొందించుకున్న పొదుపు ప్రణాళికలు విఫలం అవుతాయి. ఆర్ధిక పరంగా చిన్న చిన్న విషయాలు కూడా ఇబ్బందికరంగా మారతాయి. మిధునరాశి కి చెందిన స్త్రీలు ప్రేమ వ్యవహారముల వలన నష్టపోవుదురు. మీరు నమ్మిన వ్యక్తుల వ్యవహారశైలి మీకు అర్ధం అవ్వదు. గతకాలంలో మీరు చేసుకున్న ప్రమాణాల పై నిలబడి వ్యవహరించరు. అపవాదులు మరియు నమ్మక ద్రోహం ఎదురగును. ఈ మాసంలో 15 మరియు 17 తేదీలలో ఆరోగ్య సమస్యలు ఎదురగును. మొట్టమ మీద మిధునరాశి వారికి మాసాంతంలో కూడా అధిక ధనవ్యయం ఎదురగును. మొత్తం మీద ఈ మాసం అంత అనుకూలం కాదు.
In August 2027, Mithuna Rasi (Gemini) native individuals will experience a challenging period where effort yields little visible result despite hard work. Expenditure will escalate significantly and go out of control, disrupting your planned savings strategies. Even minor financial matters may turn into troublesome hurdles. Gemini women may suffer losses or emotional distress due to love affairs and romantic complications. The behavior of people you trust will prove puzzling and disappointing, as they fail to stand by past promises or commitments made to you. You may have to face false allegations, slander, and breach of trust. Health complications are indicated on the 15th and 17th of the month. Heavy financial outflows will persist even through the end of the month. Overall, this month will not be very favorable for Gemini natives.
ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.
Key festivals and auspicious days in August 2027: A partial solar eclipse (Pakshika Surya Grahanam) occurs on the 2nd, lasting from 3:58 PM to 5:40 PM. Individuals born under the Pushyami nakshatra and Karkataka Rasi (Cancer) should not view this eclipse and are advised to perform Graha Shanti remedies. The holy Sravana Masa commences on the 3rd. Garuda Panchami falls on the 6th. Sri Varalakshmi Vratam is celebrated on the 13th. Shani Trayodashi takes place on the 14th. Guru Mudhami period begins on the 15th (concluding on September 16, 2027). Sravana Purnima and Rakhi Purnima (Raksha Bandhan) are celebrated on the 17th. Sankashtahara Chaturthi Vratam is observed on the 20th. Sri Krishna Janmashtami is celebrated on the 24th. Matatraya Ekadashi falls on the 28th. Masa Shivaratri takes place on the 30th. Polala Amavasya is observed on the 31st.
ఈ మాసం మిధునరాశి వారు కొంత అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాల పరంగా నిలిచిపోయిన పనులు మరియు ఉద్యోగ మార్పుకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అగును. కానీ వ్యక్తిగత జీవితంలో గృహ సంతోషములు మధ్యమ సంతోషములు పొందుతారు. ఈ మాసంలో మిధునరాశి వారు చేయు సంతాన ప్రయత్నములు లాభించును. చట్టపరమైన వ్యవహారాలు మరియు కోర్టు వ్యవహారాలు కలిగిన వారు గందరగోళ వాతావరణం అనుభవిస్తారు. ఈ మాసంలో 20వ తేదీ నుండి 28వ తేదీల మధ్య ఆర్ధిక సంబంధ కార్యక్రమాలలో జాగ్రత్త వహించవలెను. ఈ కాలంలో వ్యాపార రంగంలోని వారికి ఆశించిన విధంగా లాభములు పొందుతారు. వివాహ సంబంధ ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్ర జాతకులు వివాహ సంబంధ విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి.
In September 2027, Mithuna Rasi (Gemini) native individuals will experience somewhat favorable and supportive outcomes. Pending job application processes and efforts toward career changes or position transfers will succeed. However, in personal life, domestic happiness and family satisfaction will remain moderate and average. Efforts related to progeny and children's prospects will yield positive results during this month. Individuals dealing with legal matters or court cases will face an atmosphere of confusion and uncertainty. Financial activities and monetary transactions require careful handling between the 20th and 28th of the month. During this same period, business professionals will reap anticipated profits and financial gains. Avoid making hasty decisions regarding marriage proposals or matrimonial alliances; individuals born under the Arudra nakshatra must exercise extra caution in marital matters.
సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.
Key festivals and auspicious days in September 2027: The holy Bhadrapada Masa commences on the 1st. Sri Balarama Jayanti falls on the 2nd. Sri Varaha Jayanti is celebrated on the 3rd. Sri Vinayaka Chavithi (Ganesh Chaturthi) takes place on the 4th. Rishi Panchami falls on the 5th. Parivartana Ekadashi is observed on the 11th. Sri Vamana Jayanti falls on the 12th. Sri Ananta Padmanabha Swamy Vratam takes place on the 14th. The Guru Mudhami period concludes on the 16th, and the sacred Mahalaya Paksham (Pitru Paksha) begins on the same day, lasting through Bhadrapada Amavasya on the 29th. The Shukra Mudhami period concludes on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 19th. Sarva Ekadashi falls on the 26th. Masa Shivaratri takes place on the 28th. Mahalaya Amavasya is observed on the 29th.
ఈ మాసంలో పునర్వసు నక్షత్ర జాతకుల శరీర అనారోగ్యం చికాకులు ఏర్పరచును. ట్రేడింగ్ సంబంధిత పెట్టుబడులు పెట్టు వారికి ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు. స్థిరాస్థి సంబంధమైన ఆస్తుల విషయ సంబంధమైన విక్రయాలు ఆటంకాలు ఏర్పరచును. మిధునరాశి వారు తమ కెరీర్ విషయంలో కోరుకొన్న మార్పులు చివరి నిమిషంలో నిలిచిపోవును. ఈ మాసంలో ధార్మిక కార్యక్రమాల కొరకు వ్యయం చేయవలసిన పరిస్థితులు ఎదురగును. ధార్మిక ప్రవర్తన కొంత వరకు మీరు ఎదుర్కొంటున్న మానసిక అశాంతి ని పోగొడుతుంది. ఈ మాసంలో మిధునరాశి వారు నిత్యం బుధ గ్రహ స్తోత్ర మననం చేసుకొనుట మంచిది. ఈ మాసంలో 17 వ తేదీ తదుపరి మిధునరాశి వారికి కొంత అనుకూల పరిస్థితులు ప్రారంభం అవుతాయి. తలపెట్టిన పనులలో వ్యవహార విజయం, వృత్తి వ్యాపారదులలో జయం పొందగలుగుతారు. ఈ మాసంలో 23,24,25, 26 తేదీలు ఉద్యోగ సంబంధ మార్పులకు లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైనవి. వ్యాపార వర్గంలోని వారు ఈ మాసంలో భారీ పెట్టుబడులు పెట్టకుండా ఉండుట మంచిది.
In October 2027, Mithuna Rasi (Gemini) native individuals born under the Punarvasu nakshatra will experience bodily ill-health and physical discomforts that cause mental irritation. This month is not favorable for those engaging in stock trading or speculative investments. Real estate dealings and property sale transactions will face unexpected hurdles and delays. Desired career changes or job modifications for Gemini natives will come to a halt at the very last moment. You will encounter circumstances requiring expenditure on religious, spiritual, or charitable activities; however, adopting a righteous and pious demeanor will help alleviate the mental unrest you are experiencing. It is advisable for Gemini natives to chant or meditate upon the Budha Graha Stotram daily throughout this month. From the 17th onward, conditions will begin to turn favorable for Mithuna Rasi natives, allowing you to achieve success in key endeavors and victories in your trade or profession. The 23rd, 24th, 25th, and 26th of this month are highly suitable for job changes or fresh employment efforts. Business owners should refrain from making heavy capital investments during this month.
అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ महिషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in October 2027: The holy Ashwayuja Masa and the sacred Devi Sharad Navaratri commence on the 1st, dedicated to the worship of Goddess Sri Bala Tripura Sundari. Goddess Sri Gayatri Devi is worshipped on the 2nd. Goddess Sri Annapurna Devi is worshipped on the 3rd. Goddess Sri Maha Chandi Devi is worshipped on the 4th. Goddess Sri Lalitha Tripura Sundari Devi is worshipped on the 5th. Goddess Sri Saraswati Devi is worshipped on the 6th. Due to Tithi Sandhi on the 7th, Goddess Sri Mahalakshmi Devi is worshipped along with Goddess Sri Durga Devi on Durgashtami. Mahanavami falls on the 8th, featuring the worship of Goddess Sri Mahishasura Mardhini Devi. Vijayadashami (Dussehra) is celebrated on the 9th with the worship of Goddess Sri Rajarajeshwari Devi, with Shami Puja scheduled between 1:40 PM and 2:38 PM. Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi takes place on the 28th. Deepavali is celebrated on the 29th, alongside Dhanalakshmi Puja and Kedara Gauri Vratam. Bali Padyami and the commencement of the holy Kartika Masa take place on the 30th.
ఈ మాసం మిధునరాశి వారికి చక్కటి అనుకూలమైన కాలం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మాసంలో మిధునరాశి వారు తలపెట్టే ప్రతీ కార్యం విజయవంతం అగును. చేపట్టిన పనులలో అడ్డంకులు ఎదురైనా బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కార్య విజయాన్ని పొందగలుగుతారు. ఈ మాసంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి లభించుట వలన ఆర్ధికంగా చక్కటి ప్రశాంతత అనుభవించెదరు. చట్టపరమైన సమస్యల నుండి మరియు కోర్టు వ్యవహారములలో చికాకుల నుండి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి చాలా వరకూ ఉపశమనం పొందుతారు. ఈ మాసం అన్ని రంగముల వారికి అనుకూల ఫలితాలు ఏర్పరుస్తుంది. దూరమైన బంధుత్వాలు ఈ మాసంలో తిరిగి దగ్గరగును. ఈ మాసంలో 5,9,17,26 తేదీలు అన్ని విధములా మిధునరాశి వారికి అనుకూలమైనవి.
In November 2027, Mithuna Rasi (Gemini) native individuals will enjoy a highly auspicious and favorable period. In fact, virtually every task and endeavor undertaken during this month will culminate in success. Even if initial obstacles arise in your work, the timely support of friends and relatives will ensure a successful outcome. Long-pending or expected funds will reach your hands on time, bringing wonderful financial peace of mind. You will gain relief from legal entanglements and ongoing court case anxieties. Significant recovery and relief from health ailments will also be experienced. This month offers positive and profitable results across all professional sectors. Strained or distant family relationships will mend, bringing relatives closer once again. The 5th, 9th, 17th, and 26th of this month are exceptionally favorable in every aspect for Gemini natives.
నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi falls on the 2nd. Ksheerabdi Dwadashi takes place on the 11th, which also marks the conclusion of Chaturmasya Vratam. Kartika Purnima is celebrated on the 13th, along with the traditional Jwala Thoranam ritual. Sankashtahara Chaturthi Vratam is observed on the 17th. Matatraya Ekadashi falls on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti take place on the 26th. The holy Margashirsha Masa commences on the 29th.
ఈ మాసంలో వ్యక్తిగత జీవన సంబంధ వ్యవహరాదులు సంతోషకరంగా నడుస్తాయి. ముఖ్యంగా మ్రిగాశిర నక్షత్ర జాతకులకు ధనాదాయం పెరుగుతుంది. బంధు వర్గం వారి తోడ్పాటు వలన లాభములు పొందుతారు. ఆర్ధికపరమైన రుణాలకు సంబందించిన ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగ జీవన పరంగా కొంత అనిశ్చితపూరిత వాతావరణం ఎదురగును. ఆశించిన విధంగా సమయానికి ప్రాజెక్టులు ముందుకు సాగవు. మొత్తం మీద మిధునరాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఎదురగును.
In December 2027, personal life matters and domestic affairs will progress smoothly and joyfully for Mithuna Rasi (Gemini) native individuals. Specifically, those born under the Mrigasira nakshatra will experience an increase in financial inflow (Dhana Adayam) and reap substantial benefits with the support of relatives. Pressures and stress related to financial loans or debts will ease significantly. However, in professional life and employment matters, you may face an environment of uncertainty, as key projects may not move forward on time as anticipated. Overall, December 2027 will yield mixed results for Gemini natives.
డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in December 2027: Sri Subrahmanyeswara Swamy Shasthi falls on the 4th. Sarva Ekadashi and Gita Jayanti take place on the 9th. Shani Trayodashi falls on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam is observed on the 16th. Sri Kala Bhairava Ashtami falls on the 20th. Sarva Ekadashi is observed on the 23rd. Shani Trayodashi falls on the 25th. Masa Shivaratri takes place on the 26th. The holy Pushya Masa commences on the 28th.
ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఎదురగును. వ్యాపార రంగంలో మీ పోటీదారుల తెలివితేటల వలన మీ ఆదాయంలో కొంత తగ్గుదల ఏర్పడుతుంది. మాతృ వర్గీయుల ఆరోగ్య సమస్యల వలన మీకు కొంత మానసిక అశాంతి ఎదురగును. ఈ మాసంలో 10,11,12 తేదీలలో తలపెట్టు నూతన వ్యవహారాలు సులువుగా పూర్తి అగును. 23,24 మరియు 25 తేదీలలో అనారోగ్య సంబంధ వ్యయం వలన ఇబ్బందులు ఎదుర్కొనుటకు సూచనలు ఉన్నవి. ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. వైద్య సంబంధ వృత్తి వలన ధనార్జన చేయువారు ఈ మాసంలో 24 నుండి 29 వ తేదీల మధ్య కాలంలో చేసే శస్త్ర చికిత్సల్లో జాగ్రత్తగా ఉండవలెను. మొత్తం మీద ఈ మాసంలో మిధునరాశి వారు వ్యక్తిగత జీవనంలో అనుకూల ఫలితాలు పొందినప్పటికీ ఆర్ధికంగా మాత్రం అసంపూర్తికర వాతావరణం ఎదుర్కొంటారు.
In January 2028, Mithuna Rasi (Gemini) native individuals will continue to experience mixed results. In the business sector, tactical competition from rivals may cause a slight decline in your earnings and profit margins. Health complications concerning maternal relatives will lead to mental unrest and anxiety. Tasks and new initiatives undertaken on the 10th, 11th, and 12th of this month will be completed with ease and efficiency. However, indications suggest potential stress due to medical and health-related expenditures on the 23rd, 24th, and 25th. This month is not suitable for initiating job changes or career transitions. Medical professionals and healthcare practitioners must exercise extra care and diligence while performing surgical procedures between the 24th and 29th. Overall, while Gemini natives will enjoy supportive outcomes in personal life, financial matters will present an incomplete and unsatisfactory atmosphere.
జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in January 2028: Sri Vaikuntha Ekadashi and Mukkoti Ekadashi fall on the 8th. Bhogi Festival takes place on Friday, the 14th. On Makar Sankranti, Saturday, the 15th, the sun god Sri Surya Bhagavan enters Makara Rasi (Capricorn) at 9:21 AM, marking the sacred commencement of the Uttarayana Period. Kanuma Festival is celebrated on Sunday, the 16th. Mukkanuma Festival takes place on Monday, the 17th. Sarva Ekadashi falls on the 22nd. Masa Shivaratri takes place on the 24th. Chollangi Amavasya is observed on the 26th. The holy Magha Masa commences on the 27th.
ఈ మాసం మిధునరాశి వారికి చక్కటి అనుకూల ఫలితాలు ప్రసాదించును. ఈ మాసంలో మిధునరాశి వారు తాము ఆశించిన విధంగా ఉద్యోగ జీవనంలో ఉన్నతి లేదా స్థిరాస్తి సంబంధమైన ఆర్ధిక లాభాలు పొందుతారు. స్త్రీలకు మానసిక ధైర్యం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వలన లాభపడతారు మరియు మీకు అవసరమైన సౌఖర్యములు ఏర్పరచుకొంటారు. కుటుంబ సభ్యుల మధ్య కలహములు మీ జోక్యం వలన తొలగుతాయి. ఈ మాసంలో మిధునరాశి వారికి , వారి కుటుంబానికి సమాజంలో కీర్తి - ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ మాసంలో 18,19, 20 వ తేదీలలో చేయు పరదేశ సంబంధ ప్రయాణములు కలసి వచ్చును. ఈ మాసం మ్రిగాశిరా నక్షత్ర జాతకులకు వారి వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మార్పును ఏర్పరుస్తుంది. తమ వ్యక్తిగత జీవితంలో కుజ దోషం కలిగిన మ్రిగాశిరా నక్షత్ర జాతకులు ఈ మాసంలో తమ వ్యక్తిగత జీవిత విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను.
In February 2028, Mithuna Rasi (Gemini) native individuals will enjoy wonderful and highly favorable outcomes. During this month, you will attain desired professional growth in your job or secure significant financial gains through real estate and property dealings. Gemini women will experience an increase in mental fortitude and self-confidence; taking independent decisions will prove advantageous and allow you to arrange necessary personal comforts. Intervening in family matters will help resolve conflicts and disputes among domestic members. This month will enhance prestige, social standing, and reputation for Gemini natives and their families. Overseas travel or foreign-related journeys undertaken on the 18th, 19th, and 20th will prove fortunate and successful. This month marks a major turning point in the personal life of individuals born under the Mrigasira nakshatra; however, those with Kuja Dosha in their personal horoscopes must exercise utmost caution regarding personal life matters.
ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bhishma Ashtami fall on the 3rd. Bhishma Ekadashi and the holy Antarvedi Teertham take place on the 7th. Sankashtahara Chaturthi Vratam is observed on the 13th. Matatraya Ekadashi falls on the 21st. The sacred Maha Shivaratri is celebrated on the 23rd. The holy Phalguna Masa commences on the 26th.
ఈ మాసంలో మిధునరాశి వారికి చక్కటి ధనాదాయం ప్రాప్తిస్తుంది. అన్ని వర్గముల వారికి ఈ మాసం ఆర్ధికంగా కలసి వస్తుంది. మీ ఇష్ట దైవ సంబంధ దేవాలయ దర్శన భాగ్యం పొందగలుగుతారు. మీ కుటుంబంలోని పెద్ద వయస్సు వారికి ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గుట మానసికంగా మీకు పెద్ద ఉపశమనాన్ని కలుగచేస్తుంది. కొద్దిపాటి కటినమైన స్వభావం ప్రదర్సించకపోతే ఈ మాసంలో మీరు తలపెట్టిన పనులు పూర్తి అవ్వవు. వాయిదా పడుతూనే వస్తూ ఉంటాయి. ఈ మాసంలో జీవిత భాగస్వామి వలన ఆశించిన సౌఖ్యం పొందగలరు.
In March 2028, Mithuna Rasi (Gemini) native individuals will enjoy excellent financial inflow (Dhana Adayam). This month proves financially rewarding and profitable for people across all professions and sectors. You will have the fortunate opportunity to visit and seek blessings at the temple of your favorite deity (Ishta Daivam). A reduction in the severity of health issues affecting elderly members in your family will bring immense mental peace and relief. However, unless you display a firm and slightly decisive approach, tasks undertaken during this month may face continuous delays and remain unfulfilled. In domestic life, you will receive wonderful happiness, comfort, and support from your spouse.
మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahanam takes place on the 9th. Holi Festival is celebrated on the 10th. Sarva Ekadashi falls again on the 21st. Masa Shivaratri takes place on the 24th. Ugadi Festival falls on the 27th, marking the grand commencement of the new Telugu New Year, Sri Kilaka Nama Samvatsaram.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.