Placeholder image

సకల పాపహరణి "వరూధిని ఏకాదశి" పర్వదినం - వైదిక ప్రాముఖ్యత మరియు జ్యోతిష్య విశిష్టత

Varuthini Ekadashi, the Destroyer of All Sins - Vedic Importance and Astrological Significance

మరిన్ని వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.

 

ప్రతీ సంవత్సరం చైత్రమాసం కృష్ణ పక్షంలో అంటే అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని 'వరూధిని ఏకాదశి' అంటారు. ఈ వరూధిని ఏకాదశి చాలా శక్తివంతమైనది మరియు ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు ను పూజించడం వలన "ఇహమున సౌఖ్యం - పరమున మోక్షం" పొందగలుగుతారు. వరూధిని ఏకాదశి గురించి భవిష్య పురాణంలో ప్రముఖంగా పేర్కొన్నారు. 'వరూధిని' అంటే రక్షణ అని అర్థం. ఈ పర్వదినాన శ్రీ మహా విష్ణువును ప్రధానంగా 'వామనుడి' రూపంలో పూజించడం వలన జీవితానికి ఆపదల నుండి రక్షణ లభిస్తుంది అని భవిష్య పురాణంలో పేర్కొనడం జరిగింది.

Observed annually during the Krishna Paksha of the Chaitra month, just before the New Moon, Varuthini Ekadashi is revered as an exceptionally powerful and sacred day dedicated to Lord Sri Maha Vishnu. According to the Bhavishya Purana, the term 'Varuthini' signifies "Protection," and worshipping the Lord—specifically in His Vamana avatar—on this auspicious day acts as a divine shield against life's calamities. Devotees believe that observing this fast with devotion bestows the ultimate blessing of "Sukham" (happiness) in this world and "Moksham" (liberation) in the hereafter.

మిగిలిన ఏకాదశలలో శ్రీ మహా విష్ణువును పూజించడం వలన  మోక్షం లేదా పాపక్షయం వంటి ఫలితాలు పొందుతాము. కానీ, వరూధిని ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం వలన  మనం ఎదుర్కోనబోయే దురదృష్టం నుండి రక్షణ లభిస్తుంది. మన వెంటే ఉంటూ మనల్ని నష్ట పెట్టేవారి నుండి రక్షణ లభిస్తుంది. శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. శారీరక వైకల్యాల నుండి రక్షణ లభిస్తుంది.  అనారోగ్యాల నుండి రక్షణ లభిస్తుంది. ఈ వరూధిని ఏకాదశి ఒక అదృశ్య రక్షణ కవచంలా  పనిచేస్తుంది.

While most Ekadashis are observed for spiritual liberation (Moksha) or the cleansing of sins, Varuthini Ekadashi holds a unique significance as it serves as a divine shield against the trials of the material world. Worshipping Lord Sri Maha Vishnu on this sacred day provides protection from impending misfortune, shields one from those who intend to cause harm while remaining close, and guards against enemies. Furthermore, it is believed to offer a spiritual defense against physical disabilities and ailments, acting as an invisible protective armor (Raksha Kavach) that secures the devotee's well-being in this life.

ఇతర ఏకాదశులు మనస్సును శుద్ధి చేస్తే, వరూధిని ఏకాదశి గత జన్మల పాపం వల్ల కలిగే శారీరక బాధల నుండి మరియు ప్రారబ్ధ కర్మల నుండి విముక్తి కలిగిస్తుందని చెప్పబడింది. అందుకే దీనిని 'పాప విమోచన ఏకాదశి ' అని కూడా అంటారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఇతర ఏకాదశులు వైకుంఠ ప్రాప్తికి మార్గం చూపిస్తే, వరూధిని ఏకాదశి ఈ లోకంలో సుఖంగా ఆరోగ్యవంతంగా జీవించడానికి మరియు మరణానంతరం మోక్షాన్ని పొందడానికి రెండింటికీ సమ ప్రాధాన్యతనిస్తుంది. అందుకే వరూధిని ఏకాదశి నాడు శ్రీ మహా విష్ణువు ను పూజిస్తే , ఉపవాసం ఉండగలిగితే మళ్ళీ గర్భవాస నరకం ఉండదు అంటే పునర్జన్మ ఉండదు అని పురాణాలూ పేర్కొంటున్నాయి.

While other Ekadashis primarily focus on purifying the mind, Varuthini Ekadashi is unique as it is said to provide liberation from physical sufferings caused by past sins and the burdens of Prarabdha Karma, earning it the title of 'Papa Vimochana Ekadashi.' Simply put, while most Ekadashis pave the way to Vaikuntha (heaven), Varuthini Ekadashi balances worldly and spiritual well-being by ensuring a healthy, prosperous life here on Earth while simultaneously securing liberation after death. According to the Puranas, sincerely worshipping Lord Sri Maha Vishnu and observing a fast on this day frees the soul from the cycle of rebirth, ensuring that one never has to endure the pain of returning to the womb again.

ఏకాదశి తిధి ఎందుకు శ్రీ మహా విష్ణువుకు అంత ప్రముఖమైనది / Why is the Ekadashi Tithi so Sacred?

ఏకాదశి తిధి శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరం అని మన అందరికి తెలుసు. అసలు ఏకాదశి తిధికి  శ్రీ మహా విష్ణువు కు ఉన్న సంబంధం ఏమిటి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. పద్మ పురాణం ప్రకారం, పూర్వం మురాసురుడు అనే అసుర రాజు దేవతలను హింసిస్తుండేవాడు. అతనితో పోరాడి అలసిపోయిన విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా, మురాసురుడు ఆయనను చంపడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక దివ్యమైన కన్యకా శక్తి  ఉద్భవించి నిద్రా ఆహారాలు మాని మురాసురిడితో తీవ్రంగా పోరాడి సంహరించింది.

It is widely known that the Ekadashi Tithi is most beloved to Lord Sri Maha Vishnu. To understand the deep-rooted connection between the Lord and this sacred day, we must look to the Padma Purana. According to this scripture, in ancient times, a demon king named Murasura tormented the Devas and sages. After a long and exhausting battle, Lord Vishnu sought rest in a cave at Badarikashrama. Seeing the Lord asleep, Murasura attempted to strike Him. At that pivotal moment, a divine female energy (Kanyaka Shakti) manifested from the Lord’s body. Forsaking both food and sleep, she fought valiantly and eventually slayed the demon Murasura, protecting the Lord and the universe.

ఆ తదుపరి నిద్ర నుండి మేల్కొన్న విష్ణువు ఆమె సాహసానికి మెచ్చి ఆమెకు వరం ఇస్తూ  నేటి నుండి నువ్వు నా శక్తివి.  నువ్వు ఆవిర్భవించిన ఈ ఏకాదశి తిధి నాడు ఎవరైతే ఉపవాశం వుండి నన్ను భక్తి శ్రద్దలతో పూజిస్తారో వారికి నా అనుగ్రహం లభిస్తుంది అని వరమిచ్చారు. ఆ రోజు నుండి ఏకాదశి తిధి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదిగా పరిగణించబడుతుంది.

Upon waking from His slumber, Lord Vishnu was deeply impressed by her courage and granted her a boon, declaring, "From this day forth, you are my divine strength. Since you manifested on this Ekadashi Tithi, anyone who observes a fast and worships me with steadfast devotion on this day shall receive my complete grace." Since that sacred moment, the Ekadashi Tithi has been revered as the most beloved day to Lord Sri Maha Vishnu, serving as a powerful bridge between the devotee and the Divine.

జ్యోతిష్య శాస్త్ర పరంగా ఏకాదశి ఎందుకు ముఖ్యమైనదో పరిశీలిస్తే, నవ గ్రహాలలో చంద్రుడు సమస్త జీవరాశుల మానసిక ప్రవర్తనను ప్రభావితం చేస్తారు. చంద్రుడు ఈ విధంగా మానసిక నిగ్రహతను అదుపు చేయడం ఏకాదశి తిధి నుండి అధికం అవుతుంది. ఏకాదశి సమయంలో మనస్సు చంచలంగా మారే అవకాశం ఉంటుంది. చంద్రుని గమనం వల్ల మన శరీరంలోని నీటి శాతంపై, మనస్సుపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ఆ సమయంలో ఆహారాన్ని తగ్గించి, భగవత్ నామ స్మరణ చేస్తూ ఉండడం వల్ల మెదడు మరియు నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటాయి. ఈ క్రమశిక్షణను అలవాటు చేసే తిథి కాబట్టి జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏకాదశి తిధి ప్రత్యేకమైనది. మనసు అదుపు తప్పకుండ ఉండడానికి మన రుషిశ్వరులు ఏకాదశి తిధి నాడు ఉపవాశం ఆచరించి భగవత్ స్మరణలో ఉండేటట్టు చేసారు.

From an astrological perspective, Ekadashi holds immense significance because the Moon governs the mental behavior and emotions of all living beings. This celestial influence on our self-control and mental stability becomes most intense starting from the Ekadashi Tithi. During this period, the lunar movement can cause restlessness and exert a negative impact on both our mind and the water content within our bodies. By reducing food intake and engaging in the constant remembrance of the Divine, one can maintain a calm brain and nervous system. Our ancient sages established the practice of fasting and spiritual contemplation on Ekadashi specifically to instill this discipline, ensuring the mind remains steady and balanced during this astrologically sensitive time.

మానవ శరీర ధర్మ రీత్యా చూసినా  'ఏకాదశి' అనే పదానికి అర్థం పదకొండు. మన శరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఐదు కర్మేంద్రియాలు కాళ్లు, చేతులు, వాక్కు, జననేంద్రియం, పాయువు మరియు మనస్సు... వెరసి పదకొండు ఉన్నాయి. సాధారణంగా మనిషి మనస్సు ఈ ఇంద్రియాల వెంట పడి ప్రాపంచిక విషయాల్లో తిరుగుతుంటుంది. విష్ణువు అంటే 'సర్వవ్యాపి'. ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం ద్వారా ఈ పదకొండు ఇంద్రియాలను నియంత్రించి, మనస్సును విష్ణువు మీద లగ్నం చేస్తాం. ఇలా ఇంద్రియాలను గెలిచి తన వైపు వచ్చే భక్తుడంటే విష్ణువుకు అత్యంత ప్రీతి అని పురాణ ఉవాచ.మనలో ఉన్న పరమాత్మను దర్శించుకునే సమయం ఈ ఏకాదశి. అందుకే  భగవంతుడికి ఈ తిథి అంటే అంత మక్కువ.

From the perspective of human physiology, the word 'Ekadashi' signifies the number eleven, representing the eleven distinct elements of our being: the five sensory organs (eyes, ears, nose, tongue, and skin), the five motor organs (legs, hands, speech, reproductive organ, and excretory organ), and the mind. Typically, the human mind follows these senses, wandering aimlessly among worldly distractions; however, by fasting on Ekadashi, we discipline these eleven elements and focus our entire consciousness upon Lord Vishnu, the 'All-Pervasive.' The Puranas declare that the Lord is most pleased with a devotee who conquers their senses to seek Him, making Ekadashi the ideal time to realize the Supreme Soul within ourselves—which is why this Tithi remains so incredibly dear to the Divine.

పురాణ గాథల ప్రకారం, సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది ఏకాదశి నాడే. దేవతలకు అమృతాన్ని పంచి, వారిని మృత్యువు నుండి రక్షించిన రోజు కాబట్టి, ఏకాదశి రోజున తనను స్మరించే వారికి విష్ణువు అమృత తుల్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

According to Puranic legends, it was on the auspicious day of Ekadashi that the divine nectar, Amrit, emerged during the churning of the cosmic ocean (Samudra Manthan). Since this was the day Lord Vishnu distributed the nectar to the Devas, saving them from mortality, it is believed that He bestows nectar-like supreme wisdom upon those who remember and contemplate Him on Ekadashi.

వరూధిని ఏకాదశి పురాణ గాధ / The Story of King Mandhata:

భవిష్యోత్తర పురాణం ప్రకారం పూర్వం మాంధాత అనే ధర్మబద్ధమైన రాజు ఉండేవారు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ, దైవచింతనలో ఉండేవారు. ఒకరోజు మాంధాత రాజు తన ఉద్యాన వనంలో తపస్సు చేసుకుంటుండగా, ఒక అడవి ఎలుగుబంటి అక్కడికి వచ్చి, తపస్సులో ఉన్న రాజు కాలును పట్టుకుని కొరకడం ప్రారంభించింది. అయినా రాజు కోపగించలేదు, హింసకు దిగలేదు. అది తన ప్రారబ్ధ కర్మ అని భావించి, రక్షించమని మనసులోనే శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. భక్తుని మొర ఆలకించిన విష్ణుమూర్తి అక్కడ వరాహ రూపంలో  ప్రత్యక్షమై, ఆ ఎలుగుబంటిని సంహరించారు.

According to the Bhavishyottara Purana, there once lived a righteous King named Mandhata, who ruled his subjects with the love of a father and remained constantly immersed in divine contemplation. One day, while the King was performing deep penance in his royal garden, a wild bear arrived and began gnawing at his leg. Despite the excruciating pain, the King neither lost his temper nor resorted to violence; instead, he accepted the ordeal as his Prarabdha Karma (accumulated fate) and silently prayed to Lord Sri Maha Vishnu for protection. Hearing the sincere plea of His devotee, Lord Vishnu instantly manifested there in His Varaha form and slayed the bear to rescue the King.

ఎలుగుబంటి దాడి వల్ల రాజు కాలు తీవ్రంగా గాయపడింది. అప్పుడు మాంధాత ఎంతో విచారించగా, విష్ణుమూర్తి ఇలా సెలవిచ్చారు: "రాజా! బాధపడకు. ఇది నీ పూర్వజన్మ పాపఫలం. ఈ బాధ నుండి విముక్తి పొందాలంటే, నువ్వు వామన అవతారంలో ఉన్న నన్ను భక్తితో పూజించి, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఆచరించి వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించు. దానివల్ల నీ శరీరం తిరిగి మునుపటిలా ఆరోగ్యవంతంగా మారుతుంది.

Due to the bear's attack, King Mandhata's leg was severely injured, causing him immense grief. At that moment, Lord Vishnu consoled him, saying: 'O King! Do not despair. This suffering is a result of sins from your past life. To be liberated from this pain and to restore your body to its former healthy state, observe the Varuthini Ekadashi Vrat with devotion by worshipping Me in My Vamana avatar and fasting from sunrise to sunset. By doing so, you shall regain your health and well-being.

భగవంతుని ఆజ్ఞ ప్రకారం మాంధాత చక్రవర్తి భక్తిశ్రద్ధలతో ఈ ఏకాదశి ఉపవాస వ్రతాన్ని ఆచరించారు. వ్రత ప్రభావంతో ఆయన కాలు తిరిగి పూర్వస్థితికి చేరుకోవడమే కాకుండా, ఆయనకు అనంతమైన పుణ్యఫలం లభించింది. ఈ విషయం తెలుసుకున్న మునీశ్వరులు తమ అనుచరుల చేత చైత్రమాస బహుళ ఏకాదశి రోజున వరూధిని ఉపవాస దీక్ష వామన వ్రతం ఆచరింప చేసేవారు. ఆనాటి నుండి వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత జ్ఞానులు తెలుసుకొని అందరికి తెలియచేసారు.

Following the divine command, Emperor Mandhata observed the Ekadashi fast and rituals with unwavering faith and devotion. By the spiritual power of this Vrat, not only was his leg completely healed and restored to its original state, but he also attained infinite divine merit. Upon witnessing this miracle, great sages began encouraging their followers to observe the Varuthini fast and Vamana Vrat on the Krishna Paksha Ekadashi of the Chaitra month. From that time onwards, the enlightened ones recognized the immense significance of Varuthini Ekadashi and shared its wisdom with the world.

బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేసి, అతనికి మోక్షాన్ని ప్రసాదించిన వామనుడు. వరూధిని ఏకాదశి నాడు భక్తుల పాపాలను హరించి, వారికి రక్షణ కవచంలా (వరూధిని) నిలుస్తాడు అనే విశ్వాసముతో ఈ రోజున శ్రీ మహా విష్ణువును వామన అవతార రూపంలో పూజిస్తాము. ఈ వరూధిని ఏకాదశి కధ మనకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే మనం చేసే తప్పులకు ఫలితం అనుభవించక తప్పదు. ప్రారబ్ధ కర్మను తప్పించుకోలేము. కానీ భగవంతుని శరణు వేడితే ఆ కష్టాల తీవ్రత తగ్గుతుంది.

It was Lord Vamana who humbled the ego of King Bali and ultimately granted him liberation. In the same vein, we worship Lord Sri Maha Vishnu in His Vamana avatar on Varuthini Ekadashi, believing that He will destroy our sins and stand as a protective shield (Varuthini) for His devotees. The profound message of the Varuthini Ekadashi story is that one cannot escape the consequences of their actions; we must inevitably endure the results of our Prarabdha Karma. However, it teaches us that by seeking total surrender (Sharanagati) at the feet of the Divine, the severity of those hardships is significantly diminished. 

ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక పుణ్యమే కాకుండా, శారీరక అనారోగ్యాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. మాంధాత చక్రవర్తి తనను హింసిస్తున్న మృగాన్ని కూడా శిక్షించకుండా దైవాన్ని ప్రార్థించడం ఆయనలోని క్షమాగుణానికి నిదర్శనం. క్షమాగుణాన్ని కలిగిన వారిని దైవం వెన్నంటి ఉంది కాపాడుతుంది అని ఈ కధ మనకి తెలియచేస్తుంది.

The observance of this fasting ritual bestows not only spiritual merit but also provides profound relief from physical ailments. King Mandhata’s choice to pray to the Divine rather than retaliating against the beast that tormented him stands as a testament to his exceptional quality of forgiveness. This story serves as a powerful reminder that the Divine ever remains beside and protects those who possess the virtue of forgiveness.

వరూధిని ఏకాదశి ఉపవాస వ్రతం వల్ల కలిగే ఫలితాలు / The fruits and benefits of observing the Varuthini Ekadashi fasting ritual: 

వరూధిని ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయని భవిష్య పురాణం తెలియచేస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనవి :

The Bhavishya Purana states that observing the fasting ritual on Varuthini Ekadashi bestows immense spiritual merit. Among the most significant benefits are:

సులభంగా వరూధిని ఏకాదశి నాడు ఆ భగవంతుడిని పూజించే విధానం:

వరూధిని ఏకాదశి రోజున నిష్టతో శ్రీ మహా విష్ణువును శ్రీ వామన అవతారం రూపంలో  వ్రతం ఆచరించి ఉపవాసం ఉండడం అత్యుత్తమం. ఆ విధంగా నియమ నిష్టలతో శ్రీ వామన వ్రతం ఆచరించడానికి అవకాశం లేని వారు సులువైన ఈ క్రింది పద్దతులలో ఎదో ఒక విధానంలో శ్రీ మహా విష్ణువును పూజించి వరూధిని ఏకాదశి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు.

While it is most auspicious to observe the Varuthini Ekadashi fast by strictly performing the Sri Vamana Vrat with total devotion, those who are unable to follow the traditional rituals can still attain the divine merits of this day by following any of these simpler methods:

 "ఇహమున సౌఖ్యం - పరమున మోక్షం" ను ప్రసాదించే ఈ వరూధిని ఏకాదశి రోజున ఆ భగవత్ నామ స్మరణలో  గడుపుదాం. శ్రీ మహా విష్ణువు యొక్క కృపా కటాక్షములను పొందుదాం.  

May we spend this sacred Varuthini Ekadashi—which bestows 'Sukham' (happiness) in this life and 'Moksham' (liberation) in the afterlife—immersed in the constant remembrance of the Divine. Let us seek and attain the supreme grace and blessings of Lord Sri Maha Vishnu.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.