
మూడు దశాబ్దాలుగా నమ్మకానికి, ఖచ్చితమైన జ్యోతిష్య ఫలితాలకు మారుపేరు "ఓం శ్రీ పరాశర జ్యోతిష్య వాస్తు నిలయం". 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి తూర్పు గోదావరి జిల్లా ( ప్రస్తుత కాకినాడ జిల్లా) లోని పెద్దాపురం పట్టణంలో కీర్తి శేషులు దైవజ్ఞ శ్రీ పిచ్చిక గిరిరాజు సిద్ధాంతి గారి ద్వారా సామాన్యులకు కూడా సరళంగా అర్ధం అయ్యే విధంగా ఖచ్చితత్వంతో కూడిన జ్యోతిష్య వాస్తు సేవలను అందించడానికి ఈ ప్రస్థానం ప్రారంభమైంది.
"Om Sri Parashara Jyotishya Vastu Nilayam" has been a hallmark of trust and precise astrological insights for over three decades. Our journey began in 1990 in Peddapuram—located in the East Godavari (present-day Kakinada) district of Andhra Pradesh. It was founded by the late Daivagna Shri Pichika Giriraju Siddhanti Garu, whose vision and expertise laid the foundation for our enduring legacy.
శ్రీ పిచ్చిక గిరిరాజు సిద్ధాంతి గారు ఇంగ్లీష్ లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు జ్యోతిష్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. అనేక ఆధ్యాత్మిక, తాత్విక గ్రంథాలను రచించిన శ్రీ గిరిరాజు సిధాంతి గారిని , జ్యోతిష్య రంగంలో చేసిన విశేష కృషికి గాను 2002లో "జ్యోతిష్య సమ్రాట్" బిరుదుతో సత్కరించారు.
Shri Pichika Giriraju Siddhanti Garu held a Post-Graduation degree in English Literature, as well as a Post-Graduation in Astrology. A prolific scholar, he authored numerous spiritual and philosophical treatises. In recognition of his extraordinary contributions to the field of astrology, he was conferred with the prestigious title of "Jyotishya Samrat" in 2002.
పురాతన జ్యోతిష్య శాస్త్రాన్ని సామాన్యులకు సైతం చేరువ చేయాలనే సంకల్పంతో శ్రీ గిరిరాజు సిధాంతి గారు మరియు వారి ఏకైక కుమారుడు Dr అరవింద్ సిధాంతి గారు సామాన్యులకు కూడా అర్ధం అయ్యే విధంగా సరళమైన విధానంలో, అత్యంత ఖచ్చితమైన తిధి, నక్షత్ర, యోగ మరియు కరణ సమయాలతో పంచాంగ గణన చేసి అనేక పురాణ సంబంధమైన మరియు సమకాలిక జీవన ఉన్నతి కి సంబందించిన అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలతో కూడిన “ శ్రీ పిచ్చిక వారి ఆధ్యాత్మిక తెలుగు గంటల పంచాంగాన్ని' ప్రచురించడం మొదలుపెట్టారు.
With a profound vision to make the ancient wisdom of Astrology accessible to the common man, Shri Giriraju Siddhanti Garu, along with his only son Dr. Aravind Sidhanthi, pioneered a simplified approach to celestial calculations. They began publishing "Shri Pichika Vari Adhyatmika Telugu Gantala Panchangam," a comprehensive almanac that provides highly accurate timings for Tithi, Nakshatra, Yoga, and Karana. Beyond precise calculations, this publication serves as a spiritual guide, enriching lives with profound insights from the Puranas and practical wisdom for contemporary personal growth.
డాక్టర్ అరవింద్ సిద్ధాంతి గారు తన తండ్రి గారి బాటలోనే నడుస్తూ ఈ నూతన యువ తరానికి జ్యోతిష్య శాస్త్రాన్ని మరింత చేరువ చేయాలనే ఉద్దేశం తన హైస్కూల్ విధ్యాభ్యాస సమయంలోనే పంచాంగ గణన చేస్తూ తన తండ్రికి సహకరిస్తూ తన జ్యోతిష్య ప్రయాణాన్ని ప్రారంభించారు. Dr అరవింద్ సిద్ధాంతి గారు 1998 వ సంవత్సరంలో 2050వ సంవత్సరం వరకు రాబోయే సూర్య, చంద్ర గ్రహణ సమయాలను ఖచ్చితంగా గణించి 'ఇండియన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ' వారి ప్రశంసలు అందుకున్నారు.
Following in his father’s illustrious footsteps, Dr. Aravind Sidhanthi began his astrological journey during his high school years, driven by a mission to bridge the gap between ancient Shastras and the modern generation. Even at that young age, he actively assisted his father in the intricate calculations of the Panchangam. A testament to his mathematical precision occurred in 1998, when Dr. Aravind accurately calculated the timings of all Solar and Lunar eclipses up to the year 2050. This remarkable feat earned him prestigious recognition and accolades from the Indian Astronomical Society.
అప్పటికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అయిన ఇంటర్నెట్ వ్యవస్థ ప్రపంచాన్ని మొత్తం ఏకం చేయడం ప్రారంభం అయ్యింది. అప్పటి వరకు పుస్తక రూపం లో పంచాంగ సంస్కృతిని సమాజానికి అందిస్తున్న ఓం శ్రీ పరాశర జ్యోతిష్య వాస్తు నిలయం Dr అరవింద్ సిధాంతి గారి సంకల్పంతో 2001 వ సంవత్సరంలో ప్రపంచంలో మొట్టమొదటి సారిగా తెలుగు పంచాంగాన్ని మరియు రాశీ ఫలితాలను ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఉచితంగా briefcase.yahoo.com ద్వారా అందించారు.
At a time when the internet was beginning to unify the world through advanced technology, Om Sri Parashara Jyotishya Vastu Nilayam—which had until then preserved the tradition of the Panchangam in print—embraced the digital era. Driven by the vision of Dr. Aravind Sidhanthi, the institution achieved a global milestone in 2001. For the first time in the world, the Telugu Panchangam and Rashi Phalalu (astrological forecasts) were made accessible Online. Through briefcase.yahoo.com, these services were provided free of cost to the Telugu-speaking community worldwide, marking the beginning of a new chapter in digital astrology.
ఈ ఇంటర్నెట్ యుగంలో తమకంటూ ఒక ప్రత్యెక స్థానం ఉండాలి అనే లక్ష్యంతో 2008 వ సంవత్సరంలో Dr అరవింద్ సిధాంతి గారు తాను స్వయంగా డిజైన్ చేసిన https://www.oursubhakaryam.com అనే website ప్రారంభించడం ద్వారా యావత్ ప్రపంచానికి మన హైందవ వైదిక జ్యోతిష్య శాస్త్ర గొప్పదనాన్ని, శాస్త్ర విశిష్టతను తెలియచేసారు. 2008 వ సంవత్సరం నుండి నేటి వరకు ప్రతీ సంవత్సరం రాశిఫలాలు మరియు తెలుగు వారికే సొంతం అయిన గంటల పంచాంగము అనే సంస్కృతిని ఎటువంటి ధనాపేక్ష లేకుండా అందరికి ఉచితంగా అందిస్తున్నారు. అందుకే మీకు మా https://www.oursubhakaryam.com website లో ఎక్కడా వాణిజ్య పరమైన వ్యాపార ప్రకటనలు కనిపించవు. 2008లో ప్రారంభం అయిన https://www.oursubhakaryam.com వెబ్‌సైట్ ద్వారా ఏటా లక్షలాది మందికి ఉచిత పంచాంగ మరియు రాశీఫలితాలు మరియు పలు విధాలైన జ్యోతిష్య సేవలు అందిస్తున్నారు.
In 2008, with the goal of establishing a unique identity in the INTERNET era, Dr. Aravind Sidhanthi personally designed and launched https://www.oursubhakaryam.com . Through this platform, he has been showcasing the profound greatness and scientific significance of Hindu Vedic Astrology to the entire world. Since its inception in 2008, the institution has remained steadfast in its commitment to serving the community. We provide annual Rashi Phalalu and the traditional Gantala Panchangam entirely free of charge, driven by a spirit of service rather than commercial gain. This is why you will find no commercial advertisements on our website; our focus remains solely on providing authentic spiritual knowledge. Today, OurSubhakaryam.com serves millions of users annually, offering free almanacs, astrological forecasts, and various other Vedic services.
Dr అరవింద్ సిధాంతి గారు కేవలం జ్యోతిష్య శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన జ్యోతిష్య పంచాంగ గణిత సిద్ధాంతి మాత్రమే కాదు, నిష్ణాతులైన దంత వైద్యులు కూడా. 2010లో తన Bachelor of Dental Surgery పూర్తి చేసి, యూరప్‌లో అత్యాధునిక Dental Implantology రంగంలో అధునాతన వైద్య విధానాలను అభ్యసించి, 2011 వ సంవత్సరం నుండి పెద్దాపురంలో తన తండ్రి గారి పేరుపై 'శ్రీ గిరిరాజ్ డెంటల్ హాస్పిటల్ & ఇంప్లాంట్ సెంటర్' ను స్థాపించి దాని ద్వారా వేలాది మందికి దంత వైద్య సేవలు అందిస్తున్నారు.
Dr. Aravind Sidhanthi is not only a scholar of Astrological Mathematics with a Post-Graduation in Astrology but also an accomplished Dental Surgeon. After completing his Bachelor of Dental Surgery (B.D.S.) in 2010, he pursued advanced training in cutting-edge Dental Implantology in Europe, mastering the latest international medical protocols. In 2011, Dr. Aravind Sidhanthi established "Sri Giriraj Dental Hospital & Implant Centre" in Peddapuram, named in honor of his father. Since then, he has been dedicated to providing high-quality dental care, serving thousands of patients with expertise and compassion.
పురాతన జ్యోతిష్య శాస్త్రం అనేది భగవంతుడు మానవాళికి ఇచ్చిన గొప్ప వరం. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ విజ్ఞానం ద్వారా ప్రయోజనం పొందాలన్నదే మా ఆశయం. కంప్యూటర్ యుగంలో మన సంస్కృతిని, పంచాంగ సంప్రదాయాన్ని భావితరాలకు సులభంగా అందించడమే https://www.oursubhakaryam.com ప్రధాన ఉద్దేశ్యం. మా వెబ్‌సైట్ ద్వారా మీరు ప్రతి ఏటా ఉచితంగా తెలుగు గంటల పంచాంగం మరియు ఖచ్చితమైన రాశి ఫలితాలు ఉచితంగా పొందవచ్చు. అనేకమైన జ్యోతిష్య శాస్త్ర సంబంధ విషయాలపై అవగాహనను పొందవచ్చు.
Ancient Astrology is a divine gift bestowed upon humanity. Our mission is to ensure that everyone, transcending all religious boundaries, can benefit from this profound wisdom. In this digital age, the primary objective of https://www.oursubhakaryam.com is to preserve our rich culture and the tradition of the Panchangam, passing it on to future generations in an accessible and simplified manner. Through our platform, you can continue to access the Telugu Gantala Panchangam and precise Rashi Phalalu (astrological forecasts) every year, free of cost. We invite you to explore our website to gain deeper awareness and insights into the various facets of Vedic Astrology.
Dr అరవింద్ సిధాంతి గారు సామాన్యులకు కూడా అర్ధం అయ్యే విధానంలోప్రతీ సంవత్సరం పంచాంగ శ్రవణ సభలు నిర్వహించడం ద్వారా , వివిధ విద్యా సంస్థలలో రాబోయే తరాలలో శాస్త్రంపై నమ్మకం కలిగించడానికి జ్యోతిష్య శాస్త్ర అవగాహనా సెమినార్లు నిర్వహించడం ద్వారా మరియు తన youtube మరియు ఇతర సోషల్ మీడియా చానల్స్ ద్వారా వివధ పర్వదినాలు - వాటి ప్రాముఖ్యత, జ్యోతిష్యానికి ఆధునిక సైన్సు కి మధ్యన ఉన్న పోలికలను వివరిస్తూ మన హైందవ సంస్కృతి వైభవాన్ని, నిత్య జీవితంలో జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనాలను తెలియచేస్తూ వస్తున్నారు.
With a commitment to making complex concepts accessible to everyone, Dr. Aravind Sidhanthi conducts annual Panchanga Shravanam gatherings (Almanac recitations). To instill faith and scientific curiosity in future generations, he frequently organizes awareness seminars on Vedic Astrology in various educational institutions.
Through his YouTube and other social media channels, he reaches a global audience by explaining the spiritual significance of various festivals. Furthermore, he bridges the gap between traditional wisdom and modern science, illustrating their parallels and highlighting the practical benefits of Astrology in daily life. His efforts continue to showcase the magnificent grandeur of our Hindu culture and heritage.
Dr అరవింద్ సిధాంతి గారు ఇప్పటివరకు దేశవిదేశాల్లోని సుమారు 3000 మందికి పైగా వ్యక్తులకు వారి వ్యక్తిగత జ్యోతిష్య మార్గనిర్దేశనం చేసిన అనుభవంతో, మీ జీవిత వ్యక్తిగత జాతక సమస్యలకు, జాతక దోష నివారనలకు మరియు మీ వ్యక్తిగత జీవిత సందేహాల నివృత్తికి “వారసత్వం - విజ్ఞానం - నిరంతర ఖచితత్వంతో కూడిన జ్యోతిష్య సేవ” అనే సత్ సంకల్పంతో సిద్ధంగా ఉన్నారు.
With a wealth of experience in providing personal astrological guidance to over 3,000 individuals across the globe, Dr. Aravind Sidhanthi stands ready to assist you. Whether you seek solutions for complex planetary doshas, guidance for personal life challenges, or clarity on your future path, he is dedicated to serving you. Guided by the noble vision of "Heritage, Wisdom, and Consistent Accuracy," Dr. Aravind offers expert astrological services to help you navigate life's uncertainties with confidence and spiritual balance.
మీ విలువైన సూచనలు మా సేవలను మరింత మెరుగుపరుస్తాయని ఆశిస్తున్నాము. We value your feedback and believe that your insightful suggestions will help us further refine and enhance our services.
with best regards
Oursubhakaryam.com team
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.