Placeholder image

వాస్తు కర్తరి అనగా ఏమిటి? 2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్తరి సమయాలు...

గోచార రీత్యా రవి భరణీ నక్షత్రం యొక్క 3 , 4 పాదములందు , కృత్తిక నక్షత్రం యొక్క 1,2,3,4 పాదములందు మరియు రోహిణీ నక్షత్రం యొక్క 1 వ పాదమునందు సంచరించు కాలమును కర్తరీ కాలం అందురు.

ఈ కర్తరీ కాలమును రెండు భాగములుగా విభజించినారు. రవి భరణీ నక్షత్రం 3,4 పాదములలో సంచరించుకాలమును డొల్లు కర్తరీ అని, కృత్తిక నక్షత్రం 1,2,3,4 పాదములు రోహిణీ నక్షత్రం 1 వ పాదమున సంచరించు కాలమును నిజ కర్తరీ కాలం అని పరిగణించబడును.

ఈ కర్తరీ కాలములో గృహ సంభంధమైన శంఖుస్థాపనలు , నిర్మాణములు చేయరాదు. చేసినచో అగ్ని ప్రమాదములు జరుగుటకు అవకాసం అధికం. ఇంకనూ చెట్లు నరకుట, వ్యవసాయం ఆరంభించుట, భూమిని తవ్వుట, తోటలు వేయుట, నూతన వాహనములు తీసుకొనుట, గర్భాదానం చేయుట , క్షౌరము చేసుకొనుట నిషేధించబడినది.

ఈ కర్తరీ కాలంలో గృహ ప్రవేశములు చేయవచ్చును. ఇంకనూ కర్తరీ కాలంలో ఉపనయనములు, వివాహములు, నిత్య ఖర్మలు చేయవచ్చును.

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్తరీ సమయములు ఈ క్రింది విధంగా ఏర్పడినవి

డొల్లు కర్తరీ: ది.04- మే - 2017 నుండి ది.11 - మే - 2017 వరకూ

నిజ కర్తరీ: ది.11 - మే - 2017 నుండి ది.28 - మే - 2017 వరకూ

 

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.