Akshaya Tritiya Festival Significance
మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను వీక్షించండి.
వైశాఖ మాసం శుక్ల పక్షంలో తృతీయ తిథి రోజును అక్షయ తృతీయ అని ఒక పర్వదినంగా జరుపుకుంటాము. దీనికి కారణం ఏమిటి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజున నవగ్రహ కూటమి రారాజు సూర్యుడు మేష రాశిలో తన ఉచ్చ స్థానంలో మరియు నవగ్రహ కూటమి కి తల్లి వంటి చంద్రుడు వృషభ రాశిలో తన ఉచ్ఛ స్థితులలో ఉంటారు.
We celebrate the third day of the bright fortnight in the month of Vaishakha as the auspicious festival of Akshaya Tritiya; this is highly significant because, according to Vedic astrology, the Sun (the king of the planets) reaches its state of exaltation in Aries while the Moon (the mother of the planets) simultaneously reaches its highest exaltation in Taurus on this very day.
ఈ ఖగోళ స్థితి వల్ల ఈ రోజు అత్యంత శక్తివంతమైనది. ఇదే రవి - చంద్ర గ్రహ కూటమి ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్ష తదియ తిధి నాడు పునరావృతం అవుతుంది. ఇది ప్రకృతిని సృష్టించిన ఆ అఖండ పరాశక్తి స్థిరపరిచిన స్వయం సిద్ధ ముహూర్తం. ఈ రోజున ఏదైనా మంచి పని ప్రారంభించడానికి ప్రత్యేకంగా ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున ఏ పుణ్య కార్యం చేసినా దాని పుణ్య ఫలితం అంతం లేకుండా కొనసాగుతూ ఉంటుంది అని ఆ సర్వేశ్వరుడు శ్రీ పార్వతీ దేవికి ఉపదేశించారు. అందుకే వైశాఖ మాసంలో వచ్చే శుక్ల పక్ష తదియ రోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు. సంస్కృతంలో 'అక్షయ' అంటే 'క్షయం లేనిది' లేదా 'ఎప్పటికీ తరిగిపోనిది' అని అర్థం. ఈ రోజున చేసే ఏ శుభకార్యమైనా, దానధర్మాలైనా అనంతమైన ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి.
This celestial alignment makes the day exceptionally powerful, as this specific conjunction of the Sun and Moon recurs every year on the third day of the bright fortnight in the month of Vaishakha. It is considered a "Swayam Siddha Muhurta"—a self-manifested auspicious moment established by the supreme primordial power of nature—meaning there is no need to search for a specific auspicious time to begin any good deed. Lord Shiva himself enlightened Goddess Parvati, explaining that any virtuous act performed on this day yields spiritual merit that flows eternally without end. This is why it is called Akshaya Tritiya; in Sanskrit, 'Akshaya' means 'undecaying' or 'that which never diminishes.' Our Puranas affirm that any auspicious task or act of charity performed on this day yields infinite and everlasting results.
ఈ రోజుకు సంబంధించి అనేక పురాణ విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని విశిష్టమైన గాధలను పరిశీలిద్దాం. / There are numerous Puranic legends associated with this day; let us explore some of these significant and sacred stories.
ఈ అక్షయ తృత్రియ రోజున చేసే దానం అత్యంత పుణ్యప్రదం అని మన మహర్షులు పేర్కొన్నారు. ఈ రోజున ముఖ్యంగా జల పాత్రలు, విసనకర్రలు, గొడుగులు, బియ్యం లేదా పప్పు ధాన్యాలను దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మిని, కుబేరుడిని ఈ రోజున పూజించడం విశేషమైన పుణ్య ప్రదం. ఈ రోజున బంగారం లేదా ఇతర ఆస్తులు కొంటే అవి అక్షయంగా మరొక విధంగా చెప్పాలి అంటే నిరంతరంగా వృద్ధి చెందుతాయని ఒక బలమైన సామాజిక నమ్మకం ఏర్పడి ఉంది.
Our sages have stated that charity performed on the day of Akshaya Tritiya is exceptionally meritorious; it is believed that donating water pots, hand fans, umbrellas, rice, or lentils on this day specifically invokes the blessings of one's ancestors (Pitru Devatas). Worshipping Goddess Lakshmi, the deity of wealth and prosperity, and Lord Kubera on this day bestows immense spiritual merit, and there is a strong cultural belief that purchasing gold or other assets on this day ensures they remain "Akshaya"—meaning they will grow and multiply continuously.
కేవలం వస్తువుల కొనుగోలు మాత్రమే కాకుండా, మనలోని సద్గుణాలను పెంపొందించుకోవడం, ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా 'అక్షయమైన' పుణ్యాన్ని సంపాదించుకోవడమే ఈ పండుగలోని అసలైన అంతరార్థం.
The true essence of this festival lies not just in the purchase of material goods, but in the cultivation of noble virtues and the act of helping others, thereby earning spiritually "Akshaya" (imperishable) merit.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.