Placeholder image

2026 - 2027 శ్రీ పరాభవ నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు

Sree Parabhava Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu

- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)

2026 2027 sri parabhava naama samvatsara midhuna rasi phalitalu gemini astrology predictions

 

  • 2026 - 2027 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 11, రాజ పూజ్యం - 01, అవమానం - 07 

    In the Sri Parabhava year (2026 - 2027), for those born under Mithuna Rashi (Gemini), the financial and social status figures are: Income - 08, Expenditure - 11, Honor/Social Status - 01, and Dishonor/Insult - 07.

  • పూర్వ పద్దతిలో మిధున రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "2". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఏర్పడుబోవు ధన మరియు ఆరోగ్య సంబంధ అనుకూలతను, విజయవంతమగు ప్రయత్న ఫలితాలను సూచిస్తున్నది. According to the traditional method, the remainder number for Mithuna Rashi (Gemini) is '2'. This indicates that in the Sri Parabhava year, those born under Gemini will experience favorable conditions regarding wealth and health, along with successful outcomes for their efforts.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Midhuna Rasi / Gemini Sign nature.....
  • రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

మిధున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అధిక భాగం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సర ప్రారంభం నుండి 31 అక్టోబర్ 2026 వరకు మిధునరాశి వారు అనుకూలుడైన గురు గ్రహం వలన మిక్కిలి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పుత్ర సంతానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి వంశాభివృద్ధి ఏర్పడుతుంది. మిక్కిలి రూపవంతుడైన, దేహ దారుడ్యత కలిగిన పుత్ర సంతానం లభిస్తుంది. మిధునరాశి వారి పరోపకారతత్త్వం వలన సమాజంలో ప్రత్యెక గుర్తింపు కలిగిన స్థానం ఏర్పరచుకుంటారు. ముఖ్యంగా జూన్, జూలై మరియు ఆగష్టు మాసాలలో ఆరోగ్య పరంగా, భాగ్య సంపదల పరంగా మిక్కిలి అనుకూలత కలిగిన కాలం ఎదుర్కొంటారు. చిరకాలంగా ఎదురుచూస్తున్న విధంగా ధనాన్ని నిలువ చేయగలుగుతారు. ఈ కాలంలో అన్ని వర్గాల వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వివాహ సంబంధ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి. ఉన్నత విలువలు కలిగిన కుటుంబం నుండి జీవిత భాగస్వామి లభిస్తుంది. ఎవరి వ్యక్తిగత జాతకంలో అయెతే గురువు బలహీనంగా లేదా పూర్తి వ్యతిరేకంగా ఉంటారో వారికి పైన పేర్కొన్న ఫలితాలు ప్రతికూలంగా ఏర్పడతాయి. 01 నవంబర్ 2026 నుండి 23 జనవరి 2027 వరకు గురువు  మిధున రాశి వారందరికీ ప్రతికూల ఫలితాలు ప్రసాదించును.  సోమరితనం వలన , తమ స్థాయిని మించి గొప్పలకు పోవుట వలన ఇబ్బందులు ఎదురగును. రక్తంలో కొవ్వు పెరుగుట, కాలేయ సంబంధ వ్యాధులు బాధించుట వంటి ఆరోగ్య విషయాలు ఎదురగును. ముఖ్యంగా వ్యసనాలకు లొంగిపోయినవారు ఈ కాలంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. 24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సరం చివరి వరకు గురువు వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఆర్ధిక సంబంధ విషయాలలో ఆశించిన ప్రయోజనాలు పొందగలుగుతారు.

The Sree Parabhava Naama Samvatsaram (March 19, 2026, to April 6, 2027), a year where Midhuna Rasi (Gemini) natives will enjoy predominantly favorable results due to the transit of Jupiter. From the beginning of the year until October 31, 2026, Jupiter’s benevolent influence will bring significant fame and reputation, while those aspiring for children may be blessed with a healthy and handsome son to carry forward the family lineage. Your philanthropic nature will earn you a unique standing in society, particularly during June, July, and August, which stand out as peak months for health, fortune, and the successful accumulation of long-awaited savings. Marriage efforts are highly likely to succeed during this period, bringing a partner from a family of high values; however, these positive effects may be reversed for individuals whose personal horoscopes feature a weak or antagonistic Jupiter. A challenging phase occurs from November 1, 2026, to January 23, 2027, where laziness or pretentious behavior could lead to setbacks, and health concerns like liver issues or high cholesterol may arise, requiring extra caution for those with lifestyle addictions. Fortunately, from January 24, 2027, until the end of the Telugu year, Jupiter returns to a favorable position, restoring positive momentum and ensuring that your financial goals and desired benefits are successfully realized

మిధునరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శనైచ్చరుని వలన కూడా సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. సొంత గృహ ఆకాంక్ష నెరవేరును. రాజకీయ వర్గంలోని వారికి ఆశించిన విధంగా ప్రధాన నాయకత్వం లభిస్తుంది. ఉత్తమ స్థాయి జీవితాన్ని పొందగలుగుతారు. మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.మంత్ర తంత్ర సంబంధ విషయాలు మిమ్మల్ని ఆకర్షించును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో బుధ మరియు రవి గ్రహ సంపూర్ణ బలాలు కలిగిన వారు జ్యోతిష్య సంబంధ విషయాలలో ఈ సంవత్సరం శాస్త్ర పరిజ్ఞానాన్ని సంపాదించగలుగుతారు. విద్యార్ధులకు తమ భవిష్యత్ గురించిన దూరదృష్టి పెరుగుతుంది. తమ రంగాలలో రాణించాడని అవసరం అగు ఊహాశక్తి జనిస్తుంది. వ్యక్తిగత జాతకంలో అనుకూల శని గ్రహ బలాన్ని కలిగి ఉన్నవారికి దైవ నిర్ణయాలు అన్ని తృప్తిని కలుగచేయునట్లు ఉండును. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

This year marks the beginning of a highly auspicious period for Midhuna Rasi (Gemini) natives, as the transit of Saturn (Shani) throughout the Sree Parabhava Naama Samvatsaram will yield consistently favorable results. During this year, long-held aspirations of owning a home are likely to be fulfilled, while those in the political sphere can expect to secure significant leadership positions as desired. You will enjoy an improved standard of living and witness a notable rise in your social status and reputation. A newfound interest in spiritual, mantra, and tantra-related subjects will emerge; specifically, individuals with strong Mercury (Budha) and Sun (Ravi) placements in their personal horoscopes will have the opportunity to gain profound knowledge in the field of astrology. Students will develop a clear vision for their future and gain the creative imagination necessary to excel in their respective fields. For those who possess a favorable Saturn in their personal birth charts, divine interventions will consistently bring satisfaction and success. Most importantly, Midhuna Rasi natives are completely free from the influence of Elinati Shani (Sade Sati) during this Sree Parabhava Naama year.

మిదునరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన 4 డిసెంబర్ 2026 వరకు కొద్దిపాటి అనుకూల ఫలితాలు ఏర్పడును. కానీ 5 డిసెంబర్ 2026 నుండి సంవత్సర ముగింపు వరకు తీవ్ర ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. జాతకులు అపసవ్యమైన ఖర్మలు చేయు వారు అగును. తలపెట్టిన వ్యవహారాలు అన్నీ అనేక చిక్కులను ఎదుర్కొనును. ధన నష్టములు సంభవించును. శత్రు బాధలు అనుభవించవలసి వచ్చును. సర్పం లేదా ఇతర విష క్రిమి కీటకాదుల విషయాలలో జాగ్రత్తగా ఉండవలెను. జూదం వలన నష్టపోవుదురు. జీవితంలో అనిచ్చితి అనుభవిoచుదురు. ఈ సంవత్సరం రాహు గ్రహ ప్రతికూల ప్రభావం వలన మీ జీవితం నుండి ఉత్తమ మిత్ర వర్గం దూరం అగు సూచన ఉన్నది. వ్యక్తిగత జీవితంలో ప్రతికూల రాహువు లేదా కాల సర్ప దోషం కలిగిన వారు ఈ సంవత్సరం అధిక ప్రతికూల ఫలితాలు పొందుతారు. మిధునరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరం అంతా నిత్యం ఈ క్రింది మంత్రమును పటించిన మంచిది. పరిస్థితుల తీవ్రతను బట్టి తరచుగా రాహు గ్రహ శాంతి జపం జరిపించుకోనుట మంచిది.

“ అర్ధకాయం మహా వీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం రాహుం తమ్ ప్రణమామ్యహం” 

The Sree Parabhava Naama Samvatsaram, where Midhuna Rasi (Gemini) natives will experience moderate favorability from Rahu until December 4, 2026, followed by a period of severe adversity starting December 5, 2026, through the end of the year. During this later phase, there is a risk of being drawn toward improper actions, facing numerous complications in all undertaken tasks, financial losses, and harassment from enemies. Extra caution is advised regarding snakes or other venomous insects, and one should strictly avoid gambling as it will lead to significant losses and general instability in life. This negative influence of Rahu may also cause the loss of good friends; those with a weak Rahu or Kala Sarpa Dosha in their personal horoscopes will feel these negative effects most intensely. To mitigate these challenges throughout the Sree Parabhava year, it is recommended to daily chant the mantra,

"Ardhakayam Mahaviryam Chandraditya Vimardanam, Simhika Garbha Sambhutam Rahum Tam Pranamamyaham,"

and, depending on the severity of the situation, performing a Rahu Graha Shanti Japam is highly advised.

మిధునరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 4 డిసెంబర్ 2026 వరకు పూర్తిగా అనుకూల ఫలితాలు ప్రసాదించును. ముఖ్యంగా భూ సంబంధ విషయాలలో లాభములు పొందుతారు. ధన సంపదలను నిలువ చేసుకోగలరు. 5 డిసెంబర్ 2026 నుండి కేతువు వలన వృధాగా ధనవ్యయం ఏర్పడుట ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా బాదించును. ఇతరులను విమర్సించు స్వభావం వలన తీవ్ర తగాదాలను ఎదుర్కొనవలసి వస్తుంది. మొత్తం మీద మిధునరాశి వారు ఈ సంవత్సరం రాహు గ్రహం వలన అధిక ఒడిదుడుకులు ఎదుర్కొందురు.

The Sree Parabhava Naama Samvatsaram, where Midhuna Rasi (Gemini) natives will encounter mixed results due to the influence of Kethu. Until December 4, 2026, Kethu will provide highly favorable outcomes, particularly in land-related matters and real estate, allowing you to successfully accumulate wealth and assets. However, from December 5, 2026, the trend shifts toward unproductive expenditures and potential health issues that may cause significant distress. During this latter period, a tendency to criticize others could lead to intense disputes and conflicts, so maintaining restraint in speech is essential. Overall, while Kethu offers a period of prosperity early on, Midhuna Rasi natives must remain vigilant throughout the year, as the combined planetary transits—particularly from Rahu—suggest a year defined by significant fluctuations and challenges. 

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

మార్చ్ 2026 మిధునరాశి రాశిఫలాలు / March 2026 Gemini Predictions:

ఈ మాసంలో పనులలో విఘ్నములు క్రమేపి తగ్గుముఖం పట్టును. ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలు, స్థిర నివాశ మార్పులకై చేయు ప్రయత్నాలు విజయవంతం అగును. తృతీయ వారంలో 13, 14, 15 తేదీలలో వాహన సంబంధ తగాదాలు ఎదురగుట వలన అశాంతి పొందుతారు. ఈ మాసంలో 18, 19, 20, 21 తేదీలలో నూతన ఉన్నత అవకాశములు లభించును. మాసాంతానికి గృహంలోకి నూతన వస్తువుల సమకుర్చుకొందురు. భూ సంబంధ క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం వంటి అనుకూల ఫలితాలు ఏర్పడును.

March 2026 brings a period where obstacles in your tasks will gradually diminish, though your financial income is expected to remain average. Efforts toward securing new employment or moving to a permanent residence will be successful during this month, signaling a positive shift in your living situation. You should be cautious during the third week, specifically on the 13th, 14th, and 15th, as disputes related to vehicles may cause some mental unrest. However, significant high-level opportunities will arise between the 18th and 21st, leading to a productive phase where you may acquire new items for your home by the month's end. Furthermore, you can expect favorable gains in real estate transactions and will enjoy a sense of comfort and support from your life partner throughout this period.

ఏప్రిల్ 2026 మిధునరాశి రాశీఫలితాలు / April 2026 Gemini Predcitions:

ఈ మాసంలో మిధునరాశికి చెందిన స్త్రీలు ప్రయనాలందు ప్రమాదములు ఎదుర్కోను సూచన. వాహన ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఈ మాసంలో తలపెట్టిన నూతన ప్రయత్నాలు లాభించవు. అన్ని రకముల వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. విద్యార్ధులు తమ లక్ష్య సాధనకు శ్రమించవలెను. ఈ మాసంలో ధన ఆదాయం సామాన్యంగా ఉండును. మూడవ వారంలో నూతన వ్యక్తుల పరిచయాల వలన మానసిక ఆనందం కలుగుతుంది. ఈ వారంలో గృహ సంబంధ భాద్యతలు పెరుగును. 22 వ తేదీ తదుపరి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. మీ మేధాశక్తి మీకు మార్గదర్శకంగా ఉంటుంది. మీ మనోవికారములను అదుపులో ఉంచుకొనవలెను. ఈ మాసంలో ఏ విషయంలోనూ అతిగా ప్రవర్తించారాదు. చివరి వారంలో సంతానంతో విలువైన ఆనందకర సంతోష సమయం గడిపెదరు. మీ ఆశావాద దృక్పదంతో ఇతరులను కూడా ఉత్సాహా పరచగలరు.

April 2026 for Midhuna Rasi starts with a focus on cautious progress, as women born under this sign should remain particularly vigilant during travel to avoid potential accidents. While new initiatives taken early in the month might not yield immediate profits and business activities generally remain average, the period requires students to exert extra effort to reach their academic targets. Financial growth remains steady but modest, yet the third week offers a refreshing change with new social connections bringing mental happiness, even as household responsibilities demand more of your time. From the 22nd of the month, those aspiring for international career opportunities will see their efforts bear fruit, guided by sharp intellectual clarity and a balanced emotional state. By avoiding excesses in behavior and maintaining your composure, you will conclude the month on a high note, spending quality time with your children and using your natural optimism to motivate everyone around you.

మే 2026 మిధునరాశి రాశీఫలితాలు / May 2026 Gemini Predictions:

ఈ మాసంలో కొద్దిగా అనుకూల ఫలితాలు ఏర్పడును. వృత్తి, వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మంచి మార్పులు ప్రాప్తించును. కుటుంబ జీవనంలో మాత్రం అసంతృప్తి కలిగించే సంఘటనలు ఎదుర్కొనవలసి వస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి తరపు బంధువులతో తగాదాలు మిమ్మల్ని భాదిస్తాయి. మీ సొంత మనుష్యులే మీ పట్ల తీవ్ర విమర్శలు చేస్తారు. ఈ మాసంలో 14 వ తేదీ నుండి 23 వ తేదీ మధ్య కాలంలో తలపెట్టిన నూతన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ముఖ్యంగా ఈ మాసంలో ద్వితీయ ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేయవచ్చు. అవివాహితులకు ఈ మాసం చివరి వారంలో చక్కటి సంబంధం కుదురుతుంది. ఈ మాసంలో 3, 4, 9, 13, 18 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది.

03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు  మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు. 

May 2026 brings a slightly favorable period for Midhuna Rasi, characterized by long-awaited positive transformations in your professional life, business ventures, and employment status. However, this progress in your career may be contrasted by some dissatisfaction in your domestic life, where conflicts with your spouse's relatives could lead to mental distress and unexpected criticism from those you consider your own. The period between the 14th and 23rd is particularly auspicious for launching new projects, and it is an excellent time to pursue efforts toward establishing a secondary source of income. For those seeking marriage, the final week of the month is likely to bring a very suitable alliance, though you should remain cautious on the 3rd, 4th, 9th, 13th, and 18th as these dates are unfavorable. While your overall financial income remains average this month, the professional growth and potential for new beginnings provide a constructive path forward.

The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies. 

జూన్ 2026 మిధునరాశి రాశీఫలితాలు / June 2026 Gemini Predictions:

ఈ మాసంలో కుటుంబ సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యయం కొద్దిగా అంచనాలను మించును. ఉద్యోగ జీవితంలో పెరిగిన శారీరక శ్రమ వలన ఆరోగ్యం కొద్దిగా మందగిస్తుంది. గృహ నిర్మాణ లేదా నూతన గృహ సంబంధ ప్రణాళికల విషయాలలో అనుకూలత ఉంది. ఈ మాసం ప్రధమ వారంలో ఉద్యోగ మార్పు ప్రయత్నాలు విజయవంతమగును. వైష్ణవ పుణ్య క్షేత్ర సందర్శన వలన ఆర్ధిక పుతోగతి లభిస్తుంది. ద్వితీయ మరియు తృతీయ వారములలో స్నేహితుల వలన వ్యాపార విస్తరణకు నూతన అవకాశములు లభించును. చివరి వారం అన్ని వర్గముల వారికి మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ అనుకూలత కలిగిన వారికి ఈ మాసం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో అయినా కొద్దిపాటి ప్రయత్నంతోనే విజయాన్ని పొందగలుగుతారు.

01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి. 

June 2026 for Midhuna Rasi will be a month focused on resolving long-standing family issues, bringing a sense of relief to your domestic life. While your overall financial income is expected to be average, those born under the Arudra Nakshatra should be mindful as expenses may slightly exceed their initial estimates. Increased physical strain in your professional life could lead to minor health setbacks, so it is important to balance hard work with adequate rest. This month is particularly favorable for planning new home constructions or housing-related projects, and those seeking a change in employment will find success in their efforts during the very first week. Visiting Vaishnava pilgrimage sites is recommended, as it is likely to bring about a positive shift in your financial progress. During the second and third weeks, opportunities for business expansion will arise through your social circle and friends, while the final week promises to be highly beneficial for people of all walks of life. For individuals who have a favorable Jupiter in their personal birth charts, this month will be exceptionally profitable, allowing you to achieve significant success with only minimal effort.

With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026

జూలై 2026 మిధునరాశి రాశీఫలితాలు / July 2026 Gemini Predictions:

ఈ మాసంలో భూ సంబంధమైన వ్యాపారాదులు బాగా లాభించును. ధనాదాయం పెరుగుతుంది. దీర్గకాళిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ స్వశక్తితో గతకాలంలో నిలిచిపోయిన పనులను పూర్తి అగునట్లు చెసుకొనగలరు. కార్య నిర్వహణలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుదురు. వృత్తి జీవనంలోని వారికి పురస్కారాలు లభించును. స్త్రీలకు స్థిరాస్థి వ్యవహారాలు సానుకూల పడతాయి. సువర్ణ లాభములు ఉన్నవి. నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఈ మాసంలో రాజకీయనాయకులకు నూతన పదవులు ప్రాప్తించును. భాధ్యతాయుతమైన అధికారం నిర్వహించగలరు. ఈ మాసంలో 12వ తేదీ నుండి 25 వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. వ్యక్తిగత జీవితంలో ఇతరుల కన్నా మీరు అధిక ప్రేమాభిమానములు వాంచిస్తారు. ఇది సమస్యలకు కారణం అవుతుంది.

15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు. 

July 2026 promises to be a month of significant growth for Midhuna Rasi, especially for those involved in real estate and land-related businesses, which are expected to yield substantial profits. You will see a noticeable increase in financial income and a welcome relief from long-standing health issues, providing you with the vitality needed to complete previously stalled tasks through your own efforts. Professional talent will finally receive the recognition it deserves, with those in specialized fields likely to receive awards or accolades. For women, this period is highly favorable for fixed asset transactions, and there are strong indications of gains in gold and the purchase of new household appliances. Politicians can look forward to attaining new positions and exercising responsible authority during this time. Employment efforts initiated between the 12th and 25th are slated for success, but on a personal level, you must be cautious of an excessive desire for affection and attention compared to others, as this tendency could become a source of emotional friction.

The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.

ఆగష్టు 2026 మిధునరాశి రాశీఫలితాలు / August 2026 Gemini Predictions:

ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. అన్ని విధములైన కోర్టు సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండును. మహిళలను శిరోవేదనకు సంబందించిన సమస్యలు తరచుగా బాధించును. ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు ఆశించవచ్చు . పని చేయు కార్యాలయంలో మీ తోటి ఉద్యోగుల నుండి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన విషయాల పట్ల అవగాహన పెంచుకోనగలుగుతారు. సమయాన్ని లాభాపూరితంగా గడిపెదరు. నిర్దేశించుకున్న ఆర్ధిక లక్ష్యాలను చేరుకోనగలరు. వ్యక్తిగత జీవనంలో చక్కటి సంతోషాలు పొందుతారు . మాసాంతానికి వెన్నుపూస సంబంధ ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది. ఈ మాసంలో 10 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య చేయు ప్రయాణాలు లాభిస్తాయి. చివరి వారంలో వ్యాపార వర్గం వారికి అధిక ధనాదాయం లభిస్తుంది. ఈ మాసంలో 23, 24 మరియు 25 తేదీలలో పితృ వర్గం వారికి ఆరోగ్య పరంగా మంచిది కాదు.

August 2026 for Midhuna Rasi will be a period of strong financial growth and positive outcomes in legal or court-related matters. While your professional life shows great promise with potential promotions and excellent cooperation from colleagues, women of this sign may experience frequent headaches or migraine-related issues that require attention. You will find yourself gaining a deeper understanding of new subjects and utilizing your time profitably to reach your specific financial goals. Personal life remains joyful, and by the end of the month, any lingering spine or back-related health concerns are likely to improve. Travel undertaken between the 10th and 18th will prove beneficial, and the final week holds the potential for significant financial gains for those in the business sector. However, please be cautious around the 23rd, 24th, and 25th, as these dates indicate potential health setbacks for paternal relatives.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

సెప్టెంబర్ 2026 మిధునరాశి రాశీఫలితాలు / September 2026 Gemini Predictions:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. అనుకోని విధంగా వాహన నిర్వహణ సంబంధ వ్యయం ఎదురవుతుంది. గృహ మార్పిడి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత , ఆనందాన్ని పొందుతారు. దూర ప్రాంత లేదా పరదేశ ఉద్యోగ జీవన సంబందించిన విషయాలలో పురోగతి లభిస్తుంది. వ్యాపార వర్గాలకు ఈ మాసం ఆశించిన లాభములను ఇచ్చును. ఈ మాసంలో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేయవచ్చు. విశ్వాస పాత్రులగు భాగస్వాములు లభిస్తారు. సంఘం పట్ల ప్రీతి పెరుగుతుంది. లలిత కళాకారులకు ఈ మాసం అనుకూలమైన కాలం. పురస్కారాలు అందుకుంటారు. ఈ మాసంలో 1, 4, 16, 18, 26 తేదీలు నూతన కార్యములు తలపెట్టుటకు అనుకూలమైనవి.

September 2026 for Midhuna Rasi will see a steady but average financial income, though you should be prepared for unexpected expenses related to vehicle maintenance or repairs. This is an excellent month for those seeking to change their residence, as efforts toward moving to a new home will be successful, and you will find yourself gaining mental peace and joy as personal problems begin to resolve. Progress is indicated for those seeking employment in distant lands or foreign countries, while the business community can expect the desired profits and favorable conditions for expansion, including the acquisition of trustworthy partners. Your interest in social welfare and community involvement will grow, and those in the field of fine arts will find this period particularly rewarding, with many likely to receive awards or public recognition. For those planning to launch new initiatives or important tasks, the 1st, 4th, 16th, 18th, and 26th are the most auspicious dates to do so.

అక్టోబర్ 2026 మిధునరాశి రాశీఫలితాలు / October 2026 Gemini Predictions:

ఈ మాసంలో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగ విద్యా వ్యవహారాలలో అనోకొని విధంగా ఒక నష్టం ఎదురగు సూచన. ఏ మాత్రం సంస్కారం లేని వ్యక్తులతో ఆకస్మిక వివాదం ఒకటి ఏర్పడును. ఈ మాసంలో మీ ప్రయత్నాలకు పూర్తి స్థాయి శక్తిని వినియోగించాలి. ఆటంకాలు ఎదురు అవ్వుట వలన పట్టుదలని కోల్పోకూడదు. ఆటంకాలు ఎదురైనా విజయం చేకూరు గ్రహ పరిస్థితులు ఉన్నవి. మాస మధ్యమంలో సంతానంతో వ్యతిరేకత ఏర్పడి కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. తృతీయ వారం చాలా నిరాశాజనక ఫలితాలు ఏర్పడు గ్రహ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ చూపాలి. ప్రతీ విషయం నందు బాగోగులు పరిపూర్ణంగా విచారించుట మంచిది. ఈ మాసంలో ప్రయాణాలు , ముఖ్యులను కలిసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. మూత్ర సంబంధ ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 17, 18, 25, 26, 27 తేదీలు అనుకూలమైనవి కావు.

17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.  

October 2026 presents a challenging period for Midhuna Rasi natives, where planetary alignments suggest that conditions may not be very favorable across business, employment, and educational sectors. You may face unexpected losses or sudden conflicts with individuals who lack refinement, making it essential to channel your full energy into your efforts and maintain persistence despite the obstacles that arise. The middle of the month could bring tension to the family environment due to disagreements with children, and the third week, in particular, indicates disappointing results that require you to pay extra attention to the well-being of your family members. It is advisable to postpone significant travels or meetings with influential people during this time and to be thorough in verifying the details of every matter you handle. Health-wise, you should be cautious regarding urinary tract issues, and it is important to note that the 17th, 18th, 25th, 26th, and 27th are particularly unfavorable dates this month.

The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.

నవంబర్ 2026 మిధునరాశి రాశీఫలితాలు / November 2026 Gemini Predictions:

ఈ మాసంలో కూడా గత మాసం వలె సమస్యలు కొనసాగును. ధనాదాయం కొంత తగ్గుతుంది. మీ ఆలోచనలు ఏ విధంగానూ ముందుకు సాగని పరిస్థితులు ఎదురగును. తలపెట్టిన పనులలో అదృష్టం కలసి రాదు. నూతన వ్యవహారాలు ప్రారంభించుటకు ఇది మంచి సమయం కాదు. స్త్రీలు ముఖ్యంగా గర్భిణిలు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను. ఈ మాసంలో రాహు గ్రహ ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ మాసంలో రెండు బుధవారాలు మినుములను బ్రాహ్మణులకు దానం ఇచ్చుట మంచిది.

November 2026 for Midhuna Rasi will see a continuation of the challenges faced in the previous month, with a noticeable dip in financial income and a sense of stagnation in your creative or strategic thinking. Luck may not favor your current endeavors, making this an unfavorable time to launch any new business ventures or important projects. It is especially critical for women, particularly those who are pregnant, to take extra precautions regarding their health and well-being during this period. The negative influence of Rahu will be quite strong throughout the month; to mitigate these effects, it is traditionally recommended to donate black gram (minumulu) to Brahmins on two Wednesdays during this month to seek planetary peace and balance.

డిసెంబర్ 2026 మిధునరాశి రాశీఫలితాలు / December 2026 Gemini Predictions:

ఈ మాసంలో సమస్యల తీవ్రత కొంచెం తగ్గుతుంది. ధనాదాయం తిరిగి సామాన్య స్థితికి వస్తుంది. ఇతరుల నుండి ఆశించిన ఆర్ధిక మరియు మాట సహకారం లభించుట వలన లక్ష్యాలను పూర్తీ చేయగలుగుతారు. జీవన మార్గంలో ప్రోత్సాహకర సంఘటనలు ఏర్పడును. ఆర్ధిక వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాదులలో ఆశించినంత రాబడి ఉంటుంది. ద్వితీయ తృతీయ వారములలో నిరుద్యోగులకు శుభకరమైన రోజులు ఉన్నవి. వ్యక్తిగత జీవనంలో కఠిన నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది. మీకున్న సహజ సిద్దమైన గర్వతత్వం నిగ్రహించుకోవలెను. ఇతరుల మనోభావములు నొప్పించునంత నిష్కర్షగా మాట్లాడు స్వభావాన్ని విడనాడాలి. ఈ మాసంలో 10, 18, 20, 29, 30 మరియు 31 తేదీలు అనుకూలమైనవి కావు.

December 2026 brings a welcome decrease in the intensity of your problems as Midhuna Rasi (Gemini) natives find their financial income returning to a normal, steady state. During this month, you will receive expected financial and verbal support from others, enabling you to successfully complete your goals and encounter encouraging events in your career path. The hurdles in your financial dealings will begin to clear, and business ventures will yield the desired returns, while the second and third weeks offer particularly promising days for those seeking employment. On a personal level, you may be required to make some tough decisions, necessitating control over any natural tendencies toward pride or ego. It is essential to avoid being overly blunt or harsh in your speech to prevent hurting the feelings of those around you; additionally, please keep in mind that the 10th, 18th, 20th, 29th, 30th, and 31st are not favorable dates this month.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.

జనవరి 2027 మిధునరాశి రాశీఫలితాలు / January 2027 Gemini Predictions:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ వ్యాపార వ్యవహారములలో ఆశించిన మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఊహించని రీతిలో విరోధులపై విజయం పొందుతారు. ప్రయాణాల వలన మాత్రం ధనం వృధాగా వ్యయమగును. ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులు ప్రయాణాల పట్ల జాగ్రత్తగా ఉండవలెను. వీలుయినచో దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మలను మీరు మార్చుకొనుట అలవాటు చేసుకొని ప్రవర్తిస్తారు. ఈ ప్రవర్తన మంచికి దారి తీస్తుంది. ఉద్యోగ జీవులకు నూతన ఒప్పందాలు లభిస్తాయి. స్థిరాస్తుల ద్వారా నూతన ఆదాయం లభిస్తుంది. వివాహ సంబంధాలు మాత్రం చివరి నిమిషంలో ఒడిదుడుకులు ఎదురగు సూచన. ముందుగా వివాహ పొంతన విషయంలో జాగ్రత్తగా పరిశీలించుకోనవలెను. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభించి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మకర సంక్రమణ తదుపరి మిధునరాశి వారికి ప్రభుత్వ సంబంధ ఉద్యోగ అనుకూల శుభవార్త లభిస్తుంది. లేదా ఉద్యోగ విషయంలో ఆశిస్తున్న మార్పు లభిస్తుంది.

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకర రాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.  

భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం). 

సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)

కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)

ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం) 

January 2027 for Midhuna Rasi starts the year on a strong note with good financial income and favorable results in both professional and business sectors. You will achieve an unexpected and significant victory over your rivals, though you should be cautious as travel may lead to wasteful expenditures. Specifically, those born under the Punarvasu Nakshatra should take extra care regarding travel or, if possible, postpone long journeys altogether. Your ability to adapt your behavior to suit changing circumstances will prove to be a great asset, leading to positive outcomes and new contracts for those in service. While fixed assets will generate fresh sources of income, marriage alliances may face last-minute hurdles, making it essential to thoroughly verify astrological compatibility beforehand. For the unemployed, the month offers encouraging new opportunities, and following the Makara Sankranti festival, you can expect particularly good news regarding government jobs or a much-desired professional transfer.

In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.

Sankranti Festival Dates:

ఫిబ్రవరి 2027 మిధునరాశి రాశీఫలితాలు / February 2027 Gemini Predictions:

ఈ మాసంలో ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. వ్యవసాయ ఆధారిత రంగంలోని వారికి ఈ మాసం అనుకూలమైనది కాదు. గిట్టుబాటు ధర విషయంలో నష్టములు ఎదుర్కొందురు. ఈ మాసంలో 6 వ తేదీ నుండి 12 వ తేదీ మధ్య చేయు విదేశీ ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి లేదా ప్రమోషన్లు కొరకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మాట పట్టింపులు తొలగును. ఖర్చులు పెరిగినా అవసరాలకు తగినంత ధనం సర్దుబాటు అవుతుంది. 15 వ తేదీ తదుపరి ప్రభుత్వ పరంగా నిలచిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఈ మాసం నిర్మాణ రంగంలోని వారికి, కాంట్రాక్టు పనులు చేయువారికి బాగా కలసి వస్తుంది. మిత్ర వర్గంతో దూరం పెరుగుతుంది. చివరి వారంలో దైవ సంబంధ శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.

February 2026 marks the period of preparation for these upcoming trends, where February 2027 for Midhuna Rasi will see a balance between income and expenditures. While those in the agricultural sector may face a difficult time with unfavorable pricing and potential losses, the window between the 6th and 12th of the month is highly auspicious for pursuing foreign opportunities, job changes, or promotions. Individuals born under the Mrigasira Nakshatra will see their importance grow within the family as long-standing misunderstandings are finally cleared, and despite rising expenses, you will be able to manage your financial needs effectively. After the 15th, any pending government-related tasks are likely to reach a successful conclusion, and those in the construction or contracting fields will find this month particularly profitable. Although you may experience some distance from your circle of friends, the month ends on a positive note with participation in auspicious spiritual or divine programs.

మార్చి 2027 మిధునరాశి రాశీఫలితాలు / March 2027 Gemini Predictions:

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ఉద్యోగ జీవనంలో మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ప్రతీ విషయంలోనూ మీరు కోరుకున్న విధంగా పనులు పూర్తి అవుతాయి. వ్యక్తిగత జీవితంలో సందేహాలు నివృత్తి అవుతాయి. వ్యాపార రంగంలోని వారికి అధికారుల నుండి కోరుకున్న పరిమితులు లభిస్తాయి. కార్మికుల కొరత వలన సమస్యలు ఎదుర్కొంటారు. కుల వృత్తుల పై ఆధారపడిన వారి జీవనం మాత్రం సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీ అవసరాలను గమనించి తగువిధంగా నడుచుకొందురు. సంతానం కోసం ప్రయత్నాలు చేయువారికి శుభవార్తలు. ఈ మాసంలో స్పెక్యులేషన్ వలన నష్ట పోవు సూచనలు అధికంగా ఉన్నవి. పునర్వసు నక్షత్ర జాతకుల సొంత గృహం కల నెరవేరుతుంది.

March 2027 brings a highly positive financial outlook for Midhuna Rasi (Gemini) natives. During this month, mental stress in your professional life will dissipate, and you will find that tasks are completed exactly as you envisioned. In your personal life, long-standing doubts will finally be cleared, and those in business will receive the necessary clearances or permissions from authorities, although some challenges may arise due to labor shortages. While those dependent on traditional or ancestral occupations may find their income to be average, your life partner will be particularly attentive to your needs and supportive of your goals. This is a very auspicious month for those aspiring for children, as good news is likely on the horizon; however, you must be extremely cautious as there is a high risk of losses through speculation or gambling. For individuals born under the Punarvasu Nakshatra, this month holds the special promise of fulfilling the long-held dream of owning your own home.

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.