- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
🔍 Search Our Site / మా వెబ్సైట్లో సెర్చ్ చేయండి:
మీ జన్మ నక్షత్రం కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదములలో ఒకటి ఐయిన మీది వృషభరాశి.
If your birth star falls under the 2nd, 3rd, or 4th quarters (Padas) of Krittika, any of the 4 quarters of Rohini, or the 1st or 2nd quarters of Mrigasira, your zodiac sign is Vrishabha Rasi (Taurus).
2027 - 2028 శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 11, రాజ పూజ్యం - 06, అవమానం - 01.
In Sri Plavanga Nama Samvatsara (2027–2028), the financial and social status metrics for Vrishabha Rasi (Taurus) native individuals are as follows: Income (Aadaya) – 14, Expenditure (Vyaya) – 11, Honor (Raja Poojyam) – 06, and Dishonor/Humiliation (Avamanam) – 01.
పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "0". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎదురగు గౌరవ హాని ని సూచిస్తున్నది.
According to the traditional calculations, the remaining remainder (Shesa Sankhya) obtained for Vrishabha Rasi (Taurus) native individuals is "0". In Sri Plavanga Nama Samvatsara, this resulting number indicates potential loss of honor, personal slights, or reputational risks for Taurus natives.
వృషభరాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. సోదర సోదరీ వర్గం వారికి సంబంధించిన ఆరోగ్య విషయాలు మాత్రం ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా మీ యొక్క సోదర సోదరీ వర్గం వారు చేసేటటువంటి ప్రయాణాల విషయంలో మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ వ్యక్తిగత జాతక విషయానికి వస్తే శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో గురు గ్రహము సంవత్సర ప్రారంభంలో మీకు కలగజేసేటటువంటి యోగవంతమైన జీవితం సంవత్సరం ముగిసే సమయానికి అంత యోగవంతంగా ఉండదు. వ్యాపార రంగంలోని వారు మీ కింద పనిచేసేటటువంటి సేవకా వర్గం వల్ల నష్టాలను ఎదుర్కొనవలసిన సూచనలు ఉన్నాయి. విద్యార్థులు మందబుద్ధిని ప్రదర్శించడం లేదా ఏకాగ్రతను కోల్పోవడం వల్ల తమ యొక్క విలువైన విద్యా సంవత్సరాన్ని వృధా చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి గారి బంధువులకు సహాయపడి వారి యొక్క ఆదరణ అభిమానాలను సంపాదించుకుంటారు. గురు గ్రహ అనుకూలత వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తగాదాల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. పవిత్ర గోదావరి నదీ పుష్కరాల ప్రారంభం తదుపరి వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా వారసత్వ సంబంధమైనటువంటి విషయాలలో లాభపడతారు. భూమి లేదా గృహము వంటి స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము. దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వృషభ రాశి వారు ఈ సంవత్సరము గురుగ్రహ అనుకూలత వల్ల మీ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో వృషభ రాశి వారు గురు గ్రహం వల్ల అధిక శాతము అనుకూల ఫలితాలని పొందుతారు.
In Sri Plavanga Nama Samvatsara (from Wednesday, 7 April 2027 to Sunday, 26 March 2028), Vrishabha Rasi (Taurus) native individuals will experience mixed results owing to Jupiter's (Guru) transit influences. Health matters concerning siblings may cause concern, demanding strict vigilance, particularly during their travels. Individually, the highly favorable and auspicious life circumstances conferred by Jupiter at the beginning of the year may lose some momentum toward the year's end. Business professionals face potential losses caused by employees or sub-staff. Students risk wasting a valuable academic year due to mental distraction, lethargy, or lack of focus. In married life, extending assistance to your spouse's relatives will earn you their genuine affection, support, and respect. Favorable planetary alignment of Jupiter will bring long-awaited relief from prolonged disputes and litigation. Following the commencement of the sacred Godavari Nadi Pushkaralu, favorable turnarounds will manifest for Taurus natives, yielding substantial gains in ancestral properties and heritage matters. This year stands as an opportune time for acquiring fixed assets such as land or residential property. Those enduring chronic health ailments will experience significant recovery and relief through Jupiter's benign grace. Overall, Vrishabha Rasi natives will reap predominantly positive and beneficial outcomes through Jupiter throughout Sri Plavanga Nama Samvatsara.
వృషభరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో శని గ్రహం వల్ల 21 మే 2027 వరకు తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగ జీవనంలో మిక్కిలి పేరు ప్రతిష్టలని ఆశించినటువంటి పదోన్నతులని పొందగలుగుతారు. అన్ని వర్గాల వారు తాము ఆశించిన విధంగా ధనాన్ని సంపదలను నిలువ చేసుకోగలుగుతారు. విదేశీ సంబంధ ఉద్యోగ లేదా విద్యా ప్రయత్నాలు చేస్తున్న వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉన్నత వర్గాల స్నేహము లభించడం ద్వారా జీవితంలో పైకి వస్తారు. అన్ని విధాల సౌకర్యవంతమైన జీవితాన్ని వృషభ రాశి వారు ఏర్పాటు చేసుకోగలుగుతారు. 22 మే 2027 నుండి వృషభ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దశ ప్రారంభం అవుతుంది. 22 మే 2027 నుండి శ్రీ ప్లవంగ నామ సంవత్సర ముగిసేంత వరకు వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ ప్రథమ పాదం యొక్క ప్రతికూల తీవ్రత వల్ల పూర్వపు యోగం చెడిపోతుంది. అనవసరమైనటువంటి శత్రుత్వాలు, ఆరోగ్య సమస్యలు, వృధా ధనవ్యయము, అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు లేదా పోటీ పరీక్షలు రాస్తున్నవారు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో శ్రీ శనైచ్చరుల వారు ఏ విధమైనటువంటి బలంతో ఉన్నారు అనే విషయంపై ఆధారపడి ఏలినాటి శని దశ ప్రథమ పాదం యొక్క ఫలితాల తీవ్రత మారుతూ ఉంటుంది. ఏలినాటి శని దశ ప్రారంభమైన నాటి నుండి ప్రతి రోజు ఉదయం స్నానం అనంతరం శని గ్రహ స్తోత్రం పటించడం మంచిది. ఏలినాటి శని దశ ప్రారంభమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి వారు చేసేటటువంటి పరదేశ ధనార్జన సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏలినాటి శని దశ ఫలితాల తీవ్రతను అనుసరించి శ్రీ శనైచ్చరుల వారికి శాంతి జరిపించుకోవడం మంచిది.
In Sri Plavanga Nama Samvatsara, the transit influence of Saturn (Shani) brings highly auspicious results for Vrishabha Rasi (Taurus) native individuals until 21 May 2027, ensuring the successful completion of every undertaken endeavor and initiative. In professional and service life, you will earn immense prestige, recognition, and long-awaited career promotions. Individuals across all sectors will successfully accumulate wealth and build lasting financial reserves as desired. Those making efforts for overseas education or foreign employment opportunities will experience exceptional good fortune. Associations with high-ranking, influential personalities will pave the way for your personal and professional elevation, enabling Taurus natives to establish a comfortable, well-appointed lifestyle. However, from 22 May 2027 onwards, the seven-and-a-half-year period of Elinati Shani (Sade Sati) commences for Vrishabha Rasi natives. From 22 May 2027 until the conclusion of Sri Plavanga Nama Samvatsara, the adverse severity of the first phase (Prathama Padam) of Elinati Shani will diminish your earlier favorable fortune. During this phase, you may encounter unnecessary animosity, health troubles, wasteful financial expenditure, and unwarranted long-distance travel. Individuals preparing for competitive examinations or actively seeking employment will need to exert extraordinary hard work and sustained effort. The actual intensity and severity of Elinati Shani's first phase results will vary depending on the natal strength and disposition of Lord Shani in your individual birth chart. From the onset of Elinati Shani, reciting the Shani Graha Stotram daily after morning bathing is highly recommended. Despite the initiation of Elinati Shani, Taurus natives will still see success in their efforts related to foreign income generation and overseas financial gains. Based on the felt intensity of Elinati Shani's transit effects, performing appropriate Shani Graha Shanti remedies is advisable.
వృషభ రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో రాహు గ్రహం వల్ల వ్యక్తిగతంగా మంచి ఫలితాలు ఏర్పడతాయి. అయితే బాలారిష్ట దశలో ఉన్నటువంటి చిన్నారులను మాత్రం శ్రీ ప్లవంగ నామ సంవత్సరం మొత్తం కూడా తరచుగా ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం కానీ లేదా రాహువు ప్రతికూల బలంతో కానీ ఉంటారు వారి చేతి పై అనేక అపసవ్యమైన కర్మలు చేయబడడం జరుగుతుంది. సదా మానసికంగా కారణం తెలియని శత్రు సంబంధమైన భయం వెంటాడే పరిస్థితుల్లోకి ప్రవేశిస్తారు. పితృ వర్గం యొక్క సహకారము మీరు ఆశించిన సమయానికి మీకు లభించదు. మీరు ఊహించని విధంగా వ్యవహారపు చిక్కులు మరియు ఆర్థిక పరమైనటువంటి నష్టములు ఎదురవుతాయి. రాహు గ్రహ ప్రతికూలత తీవ్రత ఆధారంగా మీ పేరుపై రాహు గ్రహ శాంతులు జరిపించుకోవడం మంచిది.
In Sri Plavanga Nama Samvatsara, Rahu's transit influence brings favorable personal results for Vrishabha Rasi (Taurus) native individuals on an individual level. However, infants and young children undergoing the Balarishta Dasha phase will be frequently troubled by health ailments throughout the entire year. Individuals whose natal birth charts contain Kala Sarpa Dosha or an adversely placed Rahu may inadvertently find themselves drawn into committing improper or unethical actions. You may also experience persistent mental anxiety and an inexplicable, lingering fear of hidden enemies or hostility. Expecting timely support from paternal relatives will prove fruitless during crucial moments. Unforeseen transactional complications, legal/procedural tangles, and unexpected financial losses are indicated. Depending on the severity of Rahu's adverse transit effects, performing personalized Rahu Graha Shanti propitiatory rituals in your name is highly recommended.
వృషభ రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వల్ల సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. రాహువు వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురైనా మీ వ్యక్తిగత జాతకంలో కేతువు గ్రహం యొక్క స్థానం వల్ల కేతు గ్రహం యొక్క బలం వల్ల భూమి లేదా ధన సంపదల విషయంలో లాభపడతారు. మీరు ప్రదర్శించే దాతృత్వం వల్ల మరియు నిర్వహించే పుణ్య కార్యక్రమాల వల్ల సమాజంలో చక్కటి గుర్తింపును మరియు జన ప్రియత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. అయితే శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కేతు గ్రహం వల్ల కోప స్వభావం అధికమయ్యే సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ను అదుపులో పెట్టుకోవడానికి ఆధ్యాత్మిక సాధన చేయుట మంచిది.
In Sri Plavanga Nama Samvatsara, Ketu's transit influence brings favorable and auspicious results for Vrishabha Rasi (Taurus) native individuals throughout the entire year. Even if Rahu causes adverse situations, Ketu's auspicious placement and strength in your natal birth chart will yield significant gains in land, real estate, and financial assets. Through your charitable deeds, philanthropy, and participation in righteous or sacred activities, you will earn wide social recognition and immense popular goodwill. However, Ketu's influence during Sri Plavanga Nama Samvatsara may also trigger a rise in quick temper or irritability. Engaging in regular spiritual practices and meditation is highly recommended to maintain inner calm and mental equilibrium.
మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురు గ్రహము మరియు కేతు గ్రహాల వల్ల అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. శని గ్రహము మరియు రాహు గ్రహాల వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తి గత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.
Overall, during Sri Plavanga Nama Samvatsara, Vrishabha Rasi (Taurus) native individuals will experience favorable and auspicious results primarily due to the transit influences of Jupiter (Guru) and Ketu. Conversely, Saturn (Shani) and Rahu will manifest adverse and challenging outcomes. Within your personal birth chart (Jathakam), whichever among Jupiter, Saturn, Rahu, or Ketu possesses dominant strength and placement will be the planet whose results reflect most prominently throughout this year. Do not feel disheartened or anxious by the potential adverse influences mentioned here; if the planets causing unfavorable transit results happen to be strongly and beneficially positioned in your individual birth chart, the actual severity and intensity of those negative outcomes will diminish significantly.
నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...
ఈ మాసంలో వృషభరాశి వారికి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. పరదేశ నివాశ సంబంధ లేదా ఉద్యోగ స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార రంగంలోని వారికి ఆశించిన విధంగా లాభాలు లభిస్తాయి. ఉద్యోగ జీవనంలోని వారు సమయాభావం వల్ల తమ సంతాన సంబంధమైన ముఖ్య విషయాలపై శ్రద్ధ చూపించలేరు. సమయానికి అందుతుంది అనుకున్న ధనం మీ చేతికి రాకపోవడం వలన ఇబ్బంది పడతారు . గత కొంత కాలంగా కుటుంబంలో ఏర్పడుతూ వస్తున్న తగాదాల తీవ్రత ఈ మాసంలో తగ్గుతుంది. ట్రేడింగ్ సంబంధిత వ్యాపారం చేసేవారికి ఈ మాసం అంతగా కలిసి రాదు. కావునా సాహసోపేతమైన నిర్ణయాలు లేదా దురాశతో కూడిన నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ మాసంలో 14వ తేదీ నుండి 26వ తేదీ మధ్యకాలంలో మీ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ముఖ్య విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో బుద్ధిబలం లోపిస్తుంది. మీ శక్తికి మించిన కార్యభారాన్ని మీ పై వేసుకునే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రోహిణి నక్షత్ర జాతకులు నిర్భీతిగా వ్యవహరించడం లేదా ఆర్థిక పరమైన హామీలు ఇవ్వడం ఈ మాసంలో చేయకుండా ఉండడం మంచిది.
In April 2027, Vrishabha Rasi (Taurus) native individuals will experience ordinary and moderate financial inflow (Dhana Adayam). However, those making efforts toward foreign residency, overseas settlement, or international job stability will encounter highly encouraging and promising prospects. Business professionals will achieve their desired profit margins and trade success. Those in employment and service sectors may find it challenging to devote adequate time and attention to important matters regarding their children due to demanding schedules. Delay or non-receipt of expected funds during crucial moments may cause temporary inconvenience and distress. On a positive note, the intensity of ongoing domestic disputes and family tensions that persisted over recent times will ease significantly. Individuals engaged in trading businesses will find this month less favorable, making it vital to avoid speculative risks, hasty actions, or greed-driven decisions. Between the 14th and 26th of this month, you may experience a lack of clarity, judgment, or intellectual strength when taking critical personal life decisions, alongside a tendency to shoulder responsibilities beyond your capacity. Individuals born under the Rohini nakshatra must particularly exercise restraint by avoiding overconfidence, reckless behavior, or standing as financial guarantors for others.
ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.
Key festivals and auspicious days in April 2027: The sacred Sri Plavanga Nama Samvatsaram commences on the 7th. Matsya Jayanti and Saubhagya Gauri Vratam take place on the 9th. Sri Panchami falls on the 11th. Sri Rama Navami is celebrated on the 15th. Dharmaraja Dashami occurs on the 16th. Matatraya Ekadashi and the sacred Vadapalli Teertham fall on the 17th. Ontimitta Kodandarama Swamy Kalyanotsavam is observed on the 19th. Sankashtahara Chaturthi Vratam takes place on the 24th.
ఈ మాసం వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. గత కాలంలో మీరు చేసినటువంటి వాగ్దానాల వల్ల ఈ మాసంలో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. పంతాలకు మరియు పట్టుదలకు వెళ్లడం వలన ఆర్ధికంగా నష్టపోతారు. ద్వితీయ మరియు తృతీయ వారాలలో అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ ప్రత్యర్ధుల విమర్శల వలన మానసికంగా ఇబ్బంది పడతారు. పనులలో ఏకాగ్రత లోపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. చిన్న పిల్లలు శ్వాస సంబంధిత అనారోగ్యం వల్ల ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్య సంబంధిత విషయాలలో మీరు శ్రద్ధ చూపించవలసిన అవసరం ఉంది. ఈ మాసంలో 13, 14, 26 మరియు 29 తేదీలు వృషభ రాశి వారికి అనుకూలమైనవి కావు. ఈ తేదీలలో ముఖ్య నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. ఈ తేదీలలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నవి. కావునా జాగ్రత్త వహించవలెను. ఈ మాసం నుండి వృషభ రాశి వారికి ఏడున్నార సంవత్సరముల ఏలినాటి శని దశ ప్రారంభం అవుతుంది. ఈ మాసంలో వృషభ రాశి వారికి ధనాదాయం సామాన్యంగా ఉంటుంది.
In May 2027, Vrishabha Rasi (Taurus) native individuals seeking matrimonial alliances will find favorable and encouraging progress. However, promises or commitments made in the past may give rise to awkward complications and trouble during this month. Stubbornness, rigid attitudes, and false pride will lead to financial losses. You will be required to undertake unnecessary and unproductive travel during the second and third weeks. Unwarranted criticism from rivals and opponents will cause mental distress, resulting in a lack of focus and concentration in your tasks. Government employees face indications of location transfer or departmental movement. Young children are vulnerable to respiratory health issues, making it essential to pay extra attention to their health and well-being. The 13th, 14th, 26th, and 29th of this month are unfavorable dates for Taurus natives; it is advisable to defer major decisions and exercise strict emotional restraint on these days to avoid impulsive actions. The seven-and-a-half-year period of Elinati Shani (Sade Sati) commences for Vrishabha Rasi from this month. Overall financial inflow (Dhana Adayam) will remain modest and ordinary throughout May 2027.
మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.
Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri takes place on the 4th, marking the commencement of Vastu Kartari, which concludes on May 30th. The holy month of Vaishakha Masa begins on the 7th. Akshaya Tritiya, Parashurama Jayanti, and the sacred Simhachalam Sri Appanna Swamy Chandanotsavam fall on the 9th. Sri Vasavi Ammavari Jayanti is celebrated on the 15th. Sarva Ekadashi and the holy Kalyanotsavam of Annavaram Sri Satyadeva Swamy take place on the 16th. Nrisimha Jayanti falls on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaishaki fall on the 20th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th. Rohini Karte commences on the 25th. Sri Hanuman Jayanti is celebrated on the 30th.
ఈ మాసంలో వృషభ రాశి వారికి ఆదాయంలో కొద్దిపాటి తగ్గుదల ఎదురవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీ ప్రతిభకు లభించవలసిన పురస్కారం లభించక బాధపడతారు. తగాదాలలో రాజీ ప్రయత్నాలు అతి కష్టం మీద విజయవంతమవుతాయి. కుటుంబ పెద్దలతో కొన్ని విషయాలలో మీరు విభేదించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధనార్జన సంబంధ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు, ఆరోగ్య విషయాలు మరియు సంతాన సంబంధ ప్రయత్నాలపై శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఏలినాటి శని దశ ప్రతికూల ప్రతిబంధకాలను తగ్గించుకోవడానికి నిత్యం శనిగ్రహ స్తోత్ర పఠనం చేయడం మంచిది. కెరియర్ పరంగా మీ యొక్క అంచనాలు తారుమారు అవుతాయి. ఈ మాసంలో మీరు చేసేటటువంటి ఎటువంటి ఒప్పంద విషయంలో అయినా చట్టరీత్యా అన్ని అంశాలను పరిశీలించుకున్న తదుపరి ముందుకు వెళ్లాలి. న్యాయపరమైన సలహాలు తీసుకోవడం మంచిది. ఈ మాసంలో 5, 7, 9, 11, 24 మరియు 25 తేదీలు వృషభ రాశి వారికి అనుకూలమైనవి కాదు.
In June 2027, Vrishabha Rasi (Taurus) native individuals will experience a slight decline in income, alongside expenditure that exceeds overall financial earnings. You may feel deeply disappointed due to a lack of recognition or reward for your talents and merit. Efforts toward compromise and settlement in ongoing disputes will succeed only after facing immense difficulty. Indications suggest potential disagreements and conflicting opinions with family elders on certain matters. The adverse transit influence of Saturn (Elinati Shani) will negatively impact efforts related to wealth generation, matrimonial prospects, personal health, and progeny. To alleviate these obstacles and minimize the severity of Elinati Shani, daily recitation of the Shani Graha Stotram is strongly recommended. From a career standpoint, your expectations and strategic estimates may be overturned. Before entering into any contracts or formal agreements this month, it is essential to thoroughly examine all legal clauses and seek professional legal counsel. The 5th, 7th, 9th, 11th, 24th, and 25th of this month are unfavorable for Taurus natives.
జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.
Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st. Masa Shivaratri takes place on the 3rd. The holy month of Jyeshtha Masa begins on the 5th. Buddha Jayanti is celebrated on the 6th. Dasha Papa Hara Dashami falls on the 13th. Nirjala Ekadashi and Smartha Ekadashi take place on the 14th. Eruwaka Purnima and Vata Savitri Vratam fall on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. The sacred Godavari Nadi Pushkaralu commences on the 26th, with the Adi Pushkaralu concluding on July 7th. Sarva Ekadashi falls on the 30th.
ఈ మాసంలో వృషభ రాశి వారికి ధనాదాయం బాగుంటుంది. గతకాలపు ఆర్థిక నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ప్రతీ విషయంలో శారీరక శ్రమ అధికమవుతుంది. ఈ మాసంలో ఇతరులపై విమర్శలు చేయుట లేదా ఇతరులను దూషించుట వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. నేత్ర సంబంధమైన సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు. రోహిణి నక్షత్ర జాతకులు తొందరపాటు నిర్ణయాలు తీసుకొనడం వలన ధన నష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవనంలో మీ పై అధికారులకు సంజాయిషీ ఇవ్వవలసిన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఈ మాసంలో వృషభ రాశి వారు రుణ సంబంధమైన ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. కొన్ని ముఖ్యమైన కుటుంబ మరియు ఆర్థిక అంశాలలో స్తబ్దత ఏర్పడుతుంది. ఈ మాసంలో ముఖ్యమైన వ్యక్తి అనుకున్న వారితో విభేదాలు ఏర్పడటం మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తుంది. మృగశిర నక్షత్ర జాతకులు తమ యొక్క కోప స్వభావాన్ని అదుపులో పెట్టుకోవలెను.
In July 2027, Vrishabha Rasi (Taurus) native individuals will experience good financial inflow (Dhana Adayam), enabling you to make up for past financial losses. However, physical exertion and hard labor will increase significantly across all activities. It is advisable to strictly avoid criticizing or insulting others during this period. Eye-related health issues or optical discomfort may require medical attention. Individuals born under the Rohini nakshatra face risks of incurring financial losses due to hasty, impulsive decisions. In professional and service life, situations may arise where you are required to offer explanations or justifications to your superiors. It is best for Taurus natives to refrain from applying for new loans or incurring debt during this month. A sense of stagnation or delay may affect certain key family and financial matters. Furthermore, developing sharp differences or disagreements with a person you consider important will cause deep mental distress. Individuals born under the Mrigasira nakshatra must exercise strict control over their temper and anger.
జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.
Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. Ashadha Masa commences on the 5th, marked by the grand celebration of Sri Jagannatha Swamy Rath Yatra in Puri. Shukra Moodhami (combustion of Venus) begins on this day and continues until September 18, 2027. Toli Ekadashi, Sayana Ekadashi, and the commencement of the sacred Chaturmasa Vratam fall on the 14th. Dakshinayana Period begins on the 17th. Guru Purnima and Vyasa Purnima take place on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 22nd. Sarva Ekadashi falls on the 29th. Masa Shivaratri and Shani Trayodashi take place on the 31st.
ఈ మాసంలో నమ్మక ద్రోహానికి గురి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భాగస్వామ్య విషయాలలో మీ బుద్ధి బలం ఉపయోగించాలి. కుటుంబ పరమైన వ్యయం అదుపు తప్పుతుంది. ఆర్థిక ప్రణాళికలు మీరు రచించుకున్న విధంగా ఉండవు. అవసరమైన సమయంలో కుటుంబ సభ్యుల సహకారం లభించడం మీకు మంచి అనుభవాన్ని మిగులుస్తుంది. మీ యొక్క రహస్య కార్యాచరణలు వాయిదా వేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ మాసంలో ఉద్యోగ మరియు వ్యాపార విషయాలలో ఆర్థికంగా ఆశించిన ఫలితాలు లభించవు. ఈ మాసంలో ధనాదాయము సామాన్యంగా ఉంటుంది. సంతాన సంబంధ శుభవార్త వింటారు. ఈ మాసం చివరి వారంలో పితృ వర్గీయులతో ఫలవంతమైన చర్చలు జరుపుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి లేదా వాహనాల మార్పిడి చేయడానికి ఈ మాసం అనుకూలమైనది కాదు. ఈ మాసంలో 1, 9 మరియు 23 తేదీలు అనుకూలమైనవి కాదు.
In August 2027, Vrishabha Rasi (Taurus) native individuals face heightened risks of encountering betrayal, breach of trust, or deceit. It is essential to exercise sharp discernment and intellectual caution in partnership matters. Domestic and family-related expenses will tend to go out of control, causing your financial plans to deviate from expectations. However, receiving timely help and support from family members when needed most will leave you with a comforting and reassuring experience. Situations will arise requiring you to defer or postpone your confidential plans and secret strategies. Professional and business activities will not yield the expected financial returns during this period, and overall monetary inflow (Dhana Adayam) will remain modest and ordinary. On a positive note, you will hear joyful news regarding your children. During the final week of the month, you will engage in fruitful and productive discussions with paternal relatives. This month is not favorable for purchasing new vehicles or exchanging existing ones. The 1st, 9th, and 23rd of this month are unfavorable dates for Taurus natives.
ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.
Key festivals and auspicious days in August 2027: A partial solar eclipse (Surya Grahanam) occurs on the 2nd. Individuals born under the Pushyami nakshatra and Karkataka Rasi (Cancer) should not view this eclipse and are advised to perform appropriate Graha Shanti remedies. This partial solar eclipse commences at 3:58 PM and concludes at 5:40 PM. The holy month of Shravana Masa begins on August 3rd. Garuda Panchami falls on the 6th. The sacred Sri Varalakshmi Vratam is observed on the 13th. Shani Trayodashi falls on the 14th. Guru Moodhami (combustion of Jupiter) begins on the 15th and concludes on September 16, 2027. Shravana Purnima and Rakhi Festival take place on the 17th. Sankashtahara Chaturthi Vratam is observed on the 20th. Sri Krishna Janmashtami is celebrated on the 24th. Matatraya Ekadashi falls on the 28th. Masa Shivaratri takes place on the 30th. Polala Amavasya falls on the 31st.
ఈ మాసంలో వృషభ రాశికి చెందిన అన్ని వర్గముల వారికి వారు ఆశించినటువంటి ధన లాభాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన అంగీకారం కుదరడం వలన మిక్కిలిగా లాభపడతారు. భాగస్వామ్య వ్యవహారాలకు ఈ మాసం అనుకూలమైనది. స్పెక్యులేషన్ ఆధారిత వ్యాపారం చేసేవారు మాత్రం సంయమనం పాటించాలి. ఈ మాసంలో మీ ప్రతిభకు మరియు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. లౌకిక విషయాలపై ఆశక్తి పెరుగుతుంది. స్నేహితుల వలన సమాజంలో విశిష్టత కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ యొక్క మనోధైర్యం మరియు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సోదర సోదరీ వర్గం వల్ల ఈ మాసంలో లాభపడతారు. జీవిత భాగస్వామికి తెలియకుండా రహస్య మంతనాలు చేయవద్దు. ఈ మాసంలో 2, 11 మరియు 23 తేదీలలో అనవసరమైన విషయాలలో తల దూర్చవద్దు.
In September 2027, Vrishabha Rasi (Taurus) native individuals across all sectors will achieve their expected financial gains and monetary rewards. The finalization of an important agreement or contract will yield significant profits and advantages. This month is highly favorable for business partnerships and collaborative ventures. However, individuals engaged in speculation-based businesses must exercise restraint and caution. Your talent, hard work, and dedication will receive due recognition and appreciation. Your interest in material, social, and practical affairs will grow. Through friends, you will establish valuable acquaintances with influential and distinguished personalities in society. Your mental strength, self-confidence, honor, and reputation will rise noticeably. You will reap tangible gains and benefit through your siblings this month. Avoid holding secret discussions or confidential dealings without the knowledge of your spouse. On the 2nd, 11th, and 23rd of this month, refrain from interfering in unnecessary matters or third-party affairs.
సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.
Key festivals and auspicious days in September 2027: The sacred month of Bhadrapada Masa begins on the 1st. Sri Balarama Jayanti falls on the 2nd. Sri Varaha Jayanti is celebrated on the 3rd. Sri Vinayaka Chavithi takes place on the 4th. Rishi Panchami falls on the 5th. Parivartana Ekadashi is observed on the 11th. Sri Vamana Jayanti falls on the 12th. Sri Ananta Padmanabha Swamy Vratam takes place on the 14th. Guru Moodhami concludes on the 16th, and the sacred Mahalaya Paksham period commences from this day, continuing through Bhadrapada Amavasya on the 29th. Shukra Moodhami concludes on the 18th. Sankashtahara Chaturthi Vratam is observed on the 19th. Sarva Ekadashi falls on the 26th. Masa Shivaratri takes place on the 28th. Mahalaya Amavasya falls on the 29th.
ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని ముఖ్య విషయాలను గోప్యంగా ఉంచవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కృత్తిక నక్షత్ర జాతకుల గర్వం భంగం అవుతుంది. ఈ మాసంలో మీ యొక్క మనోవాంఛలు ఆలస్యంగా సిద్ధిస్తాయి. నిద్రలేమి తగ్గుతుంది. విద్యార్థుల కల్పనా శక్తి పెరుగుతుంది. సోమరితనం తగ్గుతుంది. ఉద్యోగ జీవనంలోని వారికి పై అధికారులతో ఆశాజనక పరిస్థితులు ఏర్పడతాయి. ఈ మాసంలో అనవసరమైన వస్తువుల కోసం రుణాలు చేయవలసి వస్తుంది. ఈ మాసం చివరి వారంలో సంతాన సంబంధ విషయాలలో కుటుంబంలో వివాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది. స్వయం వృత్తుల వారికి ఈ మాసం ఆశాజనకంగా ఉంటుంది. స్త్రీలకు దైవచింతన అధికమవుతుంది మరియు విశ్రాంతి తక్కువ అవుతుంది. ఈ మాసంలో 2, 11 మరియు 23 తేదీలు వృషభ రాశి వారికి అనుకూలమైనవి.
In October 2027, Vrishabha Rasi (Taurus) native individuals will experience ordinary and moderate financial inflow (Dhana Adayam). You will take a crucial and decisive personal life decision during this period. Situations will arise requiring you to maintain strict confidentiality regarding certain key matters. Individuals born under the Krittika nakshatra face situations that may puncture their pride or ego. Your desires, plans, and aspirations will materialize after delays. On a positive note, sleep patterns will improve, easing previous insomnia, while students will experience enhanced imagination, creative thinking, and a noticeable reduction in lethargy. Those in employment and service sectors will find promising, encouraging equations with their superiors. However, you may be compelled to incur debts or loans to purchase non-essential items. During the final week of the month, family disputes or differences of opinion concerning children may surface. Self-employed individuals and freelancers will find this month encouraging and progressive. Women born under this sign will experience an inclination toward spiritual pursuits and religious activities alongside reduced rest and increased routine busyness. The 2nd, 11th, and 23rd of this month are favorable dates for Taurus natives.
అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in October 2027: The holy month of Ashwayuja Masa commences on the 1st, marking the beginning of the sacred Devi Sharad Navaratri celebrations. On this first day of Navaratri, Goddess Sri Bala Tripura Sundari Devi is worshiped. Goddess Sri Gayatri Devi is worshiped on the 2nd. Goddess Sri Annapurna Devi is worshiped on the 3rd. Goddess Sri Maha Chandi Devi is worshiped on the 4th. Goddess Sri Lalitha Tripura Sundari Devi is worshiped on the 5th. Goddess Sri Saraswati Devi is worshiped on the 6th. Due to the conjunction of two tithis on the 7th, Goddess Sri Mahalakshmi Devi is worshiped on this day, which is also celebrated as Durgashtami for the worship of Goddess Sri Durga Devi. Mahanavami falls on the 8th, dedicated to the worship of Goddess Sri Mahishasura Mardini Devi. Vijayadashami is celebrated on the 9th with the worship of Goddess Sri Rajarajeswari Devi, during which Shami Puja should be performed between 1:40 PM and 2:38 PM. Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi takes place on the 28th. Deepavali is celebrated on the 29th, marked by Dhanalakshmi Puja and Kedara Gauri Vratam. Bali Padyami falls on the 30th, which also marks the commencement of the holy Kartika Masa.
ఈ మాసంలో వృషభ రాశి వారు కుటుంబ సంబంధమైన దీర్ఘకాలిక రుణాలను తీర్చి వేయగలుగుతారు. శని యొక్క ప్రతికూల ప్రభావం వలన ఉద్యోగ జీవనంలో మీరు ఆశించని స్థాన చలనాలు ఏర్పడతాయి. కానీ ఈ మాసంలో చంద్రుడి యొక్క అనుకూలత ఉండడం వలన మానసిక వ్యాకులత తగ్గుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. ఈ మాసంలో సాహసోపేతమైన ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది. చంద్రగ్రహ బలం వలన రోహిణి నక్షత్ర జాతకులకు ఈ మాసంలో శరీర తేజస్సు పెరుగుతుంది. కుటుంబ నిర్వహణలో ముఖ్యమైన విధాన నిర్ణయాలను ఖరారు చేస్తారు. ఈ మాసం వృషభ రాశికి చెందిన స్త్రీలకు యోగవంతంగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించి కెరియర్ విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సంపాదనలు పురుషుల కంటే ముందు ఉంటారు. ఈ మాసంలో ధనాదాయం మీరు ఆశించిన విధంగా ఉంటుంది.
In November 2027, Vrishabha Rasi (Taurus) native individuals will successfully clear long-standing family-related debts and financial liabilities. However, due to the adverse transit influence of Saturn (Shani), unexpected location changes, transfers, or position shifts may occur in your professional and employment sphere. Fortunately, favorable lunar alignments (Chandra Balam) this month will significantly reduce mental anxiety and inner restlessness, ensuring that your expectations and strategic plans prove accurate. It is advisable to avoid high-risk or overly adventurous ventures during this period. Due to strong lunar positioning, individuals born under the Rohini nakshatra will experience enhanced vitality, physical charisma, and overall well-being. You will finalize key operational and financial decisions regarding household management. This month proves exceptionally auspicious and favorable for Taurus women, who will see encouraging growth in career matters and outpace men in earnings and overall financial independence. Financial inflow (Dhana Adayam) will meet your expectations throughout November 2027.
నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi falls on the 2nd. Ksheerabdi Dwadashi takes place on the 11th, marking the formal completion of the Chaturmasa Vratam. Kartika Purnima is celebrated on the 13th, the auspicious day for conducting Jwala Thoranam. Sankashtahara Chaturthi Vratam is observed on the 17th. Matatraya Ekadashi falls on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti take place on the 26th. The holy month of Margashirsha Masa commences on the 29th.
ఈ మాసంలో వృషభ రాశి వారికి ధనాదాయం బాగున్నప్పటికీ వ్యక్తిగత ప్రతిష్ట విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కెరీర్ రీత్యా కూడా అనేక ప్రతిబంధకాలను ఎదుర్కొనవలసి వస్తుంది. చిన్న విషయాలకు కూడా అధికమైన ఆందోళన అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇష్టం లేని నిర్ణయాలను అంగీకరించవలసి వస్తుంది. ఈ మాసంలో జీవిత భాగస్వామితో దాంపత్య అంశాలపై అవగాహన లోపించడం వలన వివాదాలను ఎదుర్కొనవలసి వస్తుంది. మాస ద్వితియార్ధం లో తల్లితండ్రుల నిర్ణయాలను పక్కకు పెట్టడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదర సంబంధమైన ఆరోగ్య సమస్య వలన బాధింపబడతారు. రక్తసంబంధీకులతో న్యాయపోరాటం చేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దూరప్రాంత ప్రయాణాలు లేదా విదేశీ నివాస లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఈ మాసంలో చివరి వారానికి కెరియర్ సంబంధిత విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఈ మాసంలో వాహన చోదన విషయంలో మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను.
In December 2027, Vrishabha Rasi (Taurus) native individuals will experience good financial inflow (Dhana Adayam); however, you will encounter challenges regarding personal prestige and reputation. On the career front, you will face numerous obstacles and hurdles, while even minor issues may cause heightened anxiety and stress. You may be forced to acquiesce to decisions that go against your personal preferences. Lack of mutual understanding with your spouse on marital matters will give rise to domestic disputes. In the second half of the month, disregarding the counsel and decisions of your parents will lead to complications. Health-wise, abdominal or stomach-related ailments may cause distress. Circumstances may arise requiring legal disputes or litigation with blood relatives. Efforts related to long-distance travel, foreign settlement, or overseas employment opportunities will not bear fruit during this period. However, career matters will turn favorable during the final week of the month. Exercise extreme caution while driving or operating vehicles throughout this month.
డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in December 2027: Sri Subrahmanyeswara Swamy Shashti falls on the 4th. Sarva Ekadashi and Gita Jayanti take place on the 9th. Shani Trayodashi falls on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam is observed on the 16th. Sri Kala Bhairava Ashtami falls on the 20th. Sarva Ekadashi falls on the 23rd. Shani Trayodashi occurs on the 25th. Masa Shivaratri takes place on the 26th. The holy month of Pushya Masa commences on the 28th.
ఈ మాసంలో వృషభ రాశి వారిని వెంటాడుతూ వస్తున్న మానసిక వ్యాకులత తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యముల తీవ్రత తగ్గుతుంది. పట్టుదలతో మరియు సమయమనంతో మీరు కోరుకున్నటువంటి కార్యసిద్ధతను సాధించగలుగుతారు. ముఖ్యమైన చర్చలలో మీరు ప్రధాన పాత్రను పోషించవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో ధనాదాయం మాత్రం సామాన్యంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోగలుగుతారు. బంధువులతో అభిప్రాయ బేధాలు ఏర్పడినప్పటికీ మీ మనసులోని మాటను గోప్యంగా ఉంచడం మంచిది. మీ పై అధికారుల విమర్శలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ మాసంలో 3, 8, 12 మరియు 30వ తేదీలు అనుకూలమైనవి కాదు. ముఖ్యంగా ఈ తేదీలలో ఇతరుల సహాయ సహకారాలు అడగకుండా ఉండడం మంచిది. అదే విధంగా కుటుంబ పరమైన విషయాలను ఇతరుల వద్ద చర్చించకుండా ఉండుట మంచిది.
In January 2028, the lingering mental anxiety and distress that has been troubling Vrishabha Rasi (Taurus) native individuals will diminish noticeably. The intensity of chronic health ailments will also subside. Through sheer determination, patience, and self-restraint, you will succeed in accomplishing your desired tasks and objectives. You will be required to play a pivotal role in crucial discussions and negotiations. Efforts toward matrimonial alliances will bear fruit. However, overall monetary inflow (Dhana Adayam) will remain modest and ordinary, though you will successfully curb unnecessary expenditure. Even if differences of opinion arise with relatives, it is best to keep your personal thoughts and strategies confidential. You may face criticism or sharp feedback from your superiors at work. The 3rd, 8th, 12th, and 30th of this month are unfavorable for Taurus natives; specifically on these dates, avoid seeking financial or personal help from others, and refrain from discussing private family matters with outsiders.
జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in January 2028: Sri Vaikunta Ekadashi and Mukkoti Ekadashi take place on the 8th. Bhogi Festival falls on Friday, the 14th. On Saturday, the 15th, Makara Sankranti is celebrated, with Sun God (Surya Bhagavan) entering Makara Rasi at 9:21 AM, marking the commencement of the sacred Uttarayana period. Kanuma Festival is celebrated on Sunday, the 16th. Mukkanuma Festival falls on Monday, the 17th. Sarva Ekadashi falls on the 22nd. Masa Shivaratri takes place on the 24th. Chollangi Amavasya falls on the 26th. The holy month of Magha Masa commences on the 27th.
ఈ మాస ప్రారంభంలో కఠినంగా మాట్లాడడం వలన వృషభ రాశి వారు సమస్యలు ఎదుర్కొంటారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకొనవలసి వస్తుంది. అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోలేకపోతే ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని పొందలేరు. అనవసరమైన గతకాలపు విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండడం వలన స్థిమితంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఈ మాసంలో సాధారణం కంటే కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి. మీపై అపనిందలు వేసేవారు కూడా అధికమవుతారు. 19 వ తేదీ తదుపరి అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. విదేశీ సంబంధ ఉద్యోగ లేదా ధనార్జన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ మాసంలో తోబుట్టువుల వలన లాభపడతారు. సొంత గృహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆర్ధిక పరమైన అడ్డంకులు ఎదురవుతాయి. ఈ మాసంలో వృషభ రాశి వారికి 5, 10, 17 మరియు 24 తేదీలు అనుకూలమైనవి కాదు.
In February 2028, Vrishabha Rasi (Taurus) native individuals will face difficulties and complications at the beginning of the month due to harsh or blunt speech. You will find it necessary to refine your personal behavior, attitude, and communication style, making the guidance of experienced individuals essential. Failing to adapt your demeanor will impede your success in key undertakings and important projects. Dwelling on irrelevant past events and memories will disturb your mental peace and impair your ability to make firm, composed decisions. Expenditure will increase slightly above average during this period, and the number of people attempting to cast false accusations or slander against you will rise. However, favorable and positive outcomes will begin to take shape after the 19th. Efforts related to overseas employment, foreign ventures, or international monetary inflow will succeed. You will reap financial gains or support through your siblings this month. Those making efforts toward owning or constructing a personal home will encounter financial hurdles and delays. The 5th, 10th, 17th, and 24th of this month are unfavorable dates for Taurus natives.
ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bhishma Ashtami take place on the 3rd. Bhishma Ekadashi and the sacred Antarvedi Teertham fall on the 7th. Sankashtahara Chaturthi Vratam is observed on the 13th. Matatraya Ekadashi falls on the 21st. The holy Maha Shivaratri festival is celebrated on the 23rd. The sacred month of Phalguna Masa commences on the 26th.
ఈ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అవివాహితులకు వివాహయోగం సిద్ధిస్తుంది. కుటుంబ పరమైన విరోధాలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించగలుగుతారు. ఆర్థికంగా కూడా బలపడతారు. మృగశిర నక్షత్ర జాతకుల సంతాన సంబంధ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. హుందాతనాన్ని ప్రదర్శించడం వల్ల అధికారులచే మన్ననలు పొందుతారు. స్థాన చలనానికి సంబంధించిన విషయాలలో ఈ మాసం అనుకూల ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మాసంలో తృతీయ మరియు చివరి వారాలలో మనోవాంఛలు నెరవేరుతాయి. ఈ మాసంలో 5, 6, 10,13 మరియు 15 తేదీలు వృషభ రాశి వారికి అనుకూలమైనవి. ఈ మాసంలో కృత్తికా నక్షత్ర జాతకులు అన్ని విధములా లాభపడతారు.
In March 2028—the final month of the Sri Plavanga Nama Samvatsaram—Vrishabha Rasi (Taurus) native individuals will experience highly favorable and supportive outcomes. Matrimonial alliances and marriage prospects will materialize successfully for unmarried individuals. Domestic friction and family disputes will ease significantly, enabling you to build harmony and consensus among family members. Your financial position will strengthen noticeably. Individuals born under the Mrigasira nakshatra will achieve success in efforts related to progeny and children's prospects. By displaying dignity, composure, and professional conduct, you will earn praise and appreciation from superiors and authorities. Matters regarding location changes, job transfers, or relocation will yield favorable results this month. Your desires and long-held aspirations will be fulfilled, particularly during the third and final weeks of the month. The 5th, 6th, 10th, 13th, and 15th of this month are favorable dates for Taurus natives. Furthermore, individuals born under the Krittika nakshatra will reap gains and benefits across all endeavors throughout this period.
మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahanam takes place on the 9th. The festival of Holi is celebrated on the 10th. Sarva Ekadashi falls on the 21st. Masa Shivaratri takes place on the 24th. Ugadi is celebrated on the 27th, marking the formal commencement of the sacred Sri Keelaka Nama Samvatsaram.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.