- Predictions By Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
🔍 Search Our Site / మా వెబ్సైట్లో సెర్చ్ చేయండి:
ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.
Persons born under Dhanishta (3rd and 4th Padas), Shatabhisha (1st, 2nd, 3rd, and 4th Padas), or Purvabhadra (1st, 2nd, and 3rd Padas) belong to Kumbha Rasi (Aquarius).
శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 09, అవమానం - 06
- For Kumbha Rasi (Aquarius) in Sri Plavanga Nama Samvatsara (2027–2028), the annual financial and status statistics (Adaya-Vyaya & Raja Pujyam-Avamanam) are as follows:
• Income (Adayam): 11
• Expenditure (Vyayam): 05
• Honor/Respect (Raja Pujyam): 09
• Dishonor/Humiliation (Avamanam): 06
పూర్వ పద్దతి లో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి కెరీర్ పరంగా లభించు మంచి అవకాశములను సూచించుచున్నది.
- Under the traditional methodology (Purva Paddhati), the remaining key number (Shesa Sankhya) obtained for Kumbha Rasi (Aquarius) is "7". This indicates highly favorable and promising career opportunities manifesting for Kumbha Rasi natives during the Sri Plavanga Nama Samvatsara year.
కుంభరాశి వారికి శ్రీ ప్లవంగ నామ తెలుగు చాంద్రమాన సంవత్సరంలో అనగా 7 ఏప్రిల్ 2027 బుధవారం నుండి 26 మార్చి 2028 ఆదివారం వరకు గురుగ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమయ్యే 25 జూన్ 2027 వరకు కుంభ రాశి వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా అపరిమితమైన ధన వ్యయాన్ని ఎదుర్కొంటారు. తలపెట్టినటువంటి ఏ పని ముందుకు సాగదు. మీ కింది స్థాయి వ్యక్తులే మీకు నష్టాన్నికలగజేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూలశంక లేదా ఇతర మూలాధార ఆరోగ్య సమస్యలు బాధించే పరిస్థితులు ఉన్నాయి. వైద్య రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఈ కాలం కలిసి వస్తుంది. అదేవిధంగా పరదేశాలందు నివసించడానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ కాలం కలిసి వస్తుంది. మిగిలిన రంగాల వారికి గోదావరి నది పుష్కరాలు ప్రారంభం అయ్యేంతవరకు గురు గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. 26 జూన్ 2027 నుండి కుంభ రాశి వారికి గురు గ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. వివాహ సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి అతి చక్కటి వివాహ సంబంధాలు దొరుకుతాయి. వివాహ మూలకంగా ఆర్థికంగా మిక్కిలి లాభపడతారు. సంతాన సంబంధ ప్రయత్నాలు చేస్తున్న వారికి వ్యక్తిగత జాతకంలో చక్కటి గురుగ్రహ మరియు కుజగ్రహ బలాలు కలిగి ఉన్న వారికి పుత్ర సంతాన ప్రాప్తి తప్పక ప్రాప్తిస్తుంది. దీర్ఘకాలికంగా న్యాయస్థానాల తీర్పు కోసం ఎదురుచూస్తున్న వారికి అనుకూలమైనటువంటి తీర్పులు లభిస్తాయి. అన్ని విధాల గురు గ్రహము కుంభ రాశి వారికి గోదావరి నది పుష్కరాల ప్రారంభం నుండి శ్రీ ప్లవంగ నామ సంవత్సరం పూర్తి అయ్యేంతవరకు చక్కటి అనుకూల కాలాన్ని ఏర్పరుస్తుంది.
For Kumbha Rasi (Aquarius) natives in the Sri Plavanga Nama Telugu Lunar Year (7 April 2027, Wednesday through 26 March 2028, Sunday), Jupiter (Guru) will yield mixed results. In particular, until June 25, 2027—when the sacred Godavari Pushkarams begin—Kumbha Rasi natives will face adverse outcomes. You will encounter unlimited financial expenditures, and none of your initiated tasks will progress smoothly. Situations indicate that subordinates or junior staff may cause losses to you. Health discomforts such as hemorrhoids (piles) or other lower-abdomen/base-spine issues may cause trouble. However, this period will prove encouraging for students aspiring to enter the medical field and for individuals attempting to settle abroad. For those in other fields, Jupiter will not provide favorable results until the commencement of the Godavari Pushkarams. From June 26, 2027 onwards, Jupiter's favorable influence will fully benefit Kumbha Rasi natives. Those seeking marriage alliances will secure excellent matches and gain substantial financial benefits through marriage. Individuals making efforts for children—provided their personal natal charts possess strong Jupiter and Mars placements—will certainly be blessed with a male child. Those waiting long-term for court verdicts will receive favorable judgments. In every respect, Jupiter bestows a highly auspicious period for Kumbha Rasi from the start of the Godavari Pushkarams through the end of Sri Plavanga Nama Samvatsara.
కుంభ రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో శని గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. గత ఏడున్నర సంవత్సరాలుగా కుంభరాశి వారిని ఇబ్బంది పెడుతున్న ఏలినాటి శని దశ ఈ సంవత్సరం 21 మే 2027తో పూర్తవుతుంది. 21 మే 2027 వరకు కుంభరాశి వారికి కలిసి రాదు. ఆర్థికంగా ధన సంపాదన ఉన్నప్పటికీ చేతిలో ధనం ఏమాత్రం నిలవదు. అధిక ధన సంపాదన కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ముందుకు సాగవు. తమ వ్యక్తిగత ఆరోగ్య విషయాలలో కూడా కుంభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. విపరీత ధోరణితో కూడిన ఆలోచనలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. తమ వ్యక్తిగత జాతకంలో శని గ్రహబలం లోపించిన వారు 21 మే 2027 వరకు అన్ని విషయాలలోనూ మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతికూల పరిస్థితుల తీవ్రతను అనుసరించి శనికి శాంతి జరిపించుకోవడం అవసరం. 22 మే 2027 నుండి కుంభ రాశి వారికి ఏలినాటి శని దశ పూర్తయ్యాక శని గ్రహం యొక్క అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. నూతన అవకాశాలు నిదానంగా పొందుతారు. స్వయంకృషితో గత కాలంలో పోగొట్టుకున్నటువంటి సర్వసంపత్తులను తిరిగి నెమ్మదిగా ఆర్జించడం మొదలు పెడతారు. ప్రతి విషయమందు పట్టుదల ప్రదర్శించి కార్య విజయాన్ని పొందుతారు. వ్యక్తిగత జాతకంలో శని గ్రహబలం లోపించిన వారు మాత్రం చిత్ర విచిత్ర మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. స్వార్థంతో తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోతారు. బంధు వర్గానికి దూరం అవుతారు.
During the Sri Plavanga Nama Samvatsara year, Saturn (Shani) will deliver mixed results for Kumbha Rasi (Aquarius) natives. The grueling Elinati Shani (Sade Sati) phase, which has been troubling Kumbha Rasi individuals for the past seven and a half years, will finally conclude this year on May 21, 2027. Until May 21, 2027, circumstances will remain unfavorable. Even though there will be financial income, money will not stay in your hands. Efforts to earn excessive or quick wealth will fail to progress. Kumbha Rasi natives must also exercise caution regarding personal health matters. Extreme or erratic thinking patterns may disturb your mental peace. Individuals whose personal horoscopes lack Saturn's strength must act with extreme caution in all matters until May 21, 2027; depending on the severity of negative conditions, performing Saturn remedial rituals (Shani Shanti) is necessary. From May 22, 2027 onwards, following the completion of Sade Sati, Saturn's favorable effects will commence for Kumbha Rasi natives. You will gradually secure new opportunities. Through self-effort and determination, you will slowly begin regaining all the assets and wealth lost in the past. You will demonstrate perseverance in every endeavor and achieve victory in your undertakings. However, those whose personal charts lack Saturn's planetary strength may exhibit unpredictable or strange behavior, suffer losses due to selfish decisions, and drift away from relatives.
కుంభరాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. దుష్ట స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. అనవసరమైనటువంటి వ్యయం అధికంగా చేయవలసి వస్తూ ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కానీ లేదా రాహు గ్రహం బలం లోపించిన వారు ధర్మం విడిచి ప్రవర్తించే परिस्थितियों ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల పట్ల దయా దాక్షిణ్యాలు లేకుండా ప్రవర్తిస్తారు. మానసికంగా అనవసరమైన దుఃఖాన్ని అనుభవిస్తారు. వ్యక్తిగత జాతకంలో రాహు గ్రహబలం లేని వారు ఈ ప్లవంగ నామ సంవత్సరం అంతా ఆర్థికపరంగా ఎటువంటి నూతన పెట్టుబడులు పెట్టడం లేదా స్టాక్ మార్కెట్ వంటి ట్రేడింగ్ సంబంధిత వ్యాపారాలు చేయడం లేదా ఉద్యోగ పరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నేత్ర సంబంధమైన ఆరోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నది. వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి ఉన్నవారు మరియు రాహు గ్రహబలం లోపించిన వారు శ్రీ ప్లవంగనామ సంవత్సరంలో రాహు గ్రహ శాంతి జరిపించుకుంటూ ఉండటం మంచిది.
For Kumbha Rasi (Aquarius) natives, Rahu will yield adverse results throughout the entire Sri Plavanga Nama Samvatsara year. You may form new acquaintances with individuals of questionable or deceitful character, leading to heavy and unnecessary expenditures. Those with Kala Sarpa Dosha or a weak Rahu placement in their personal natal charts may be driven to act unethically or stray from righteous conduct. You might exhibit a lack of compassion toward family members and experience unnecessary mental anguish and grief. Individuals lacking Rahu's planetary strength must strictly avoid making new financial investments, engaging in speculative stock market trading, or taking bold, risky professional decisions throughout this entire year. Eye-related health issues may also cause concern. It is highly advisable for individuals with Kala Sarpa Dosha or a poorly placed Rahu in their birth charts to perform Rahu Shanti remedial pujas periodically during the Sri Plavanga Nama Samvatsara year.
కుంభ రాశి వారికి శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. అనవసరమైన శత్రుత్వాల వలన ధన ఆర్జన మార్గాలు మూసుకుపోతాయి. సదా అస్థిరమైన మనసు బాధిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యం కూడా పాడవుతుంది. అనవసరమైనటువంటి శత్రుత్వాల వల్ల ఊహించని మరియు ఆరోగ్య సమస్యల వల్ల అధికమైనటువంటి ధన వ్యయం వల్ల కుంభ రాశి వారు శ్రీ ప్రవంగనామ సంవత్సరంలో కేతు గ్రహం వలన బాధింప పడే సూచనలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం లేదా కేతు గ్రహబలం లోపించిన వారు ఈ సంవత్సరం కేతు గ్రహ శాంతులు జరిపించుకుంటూ ఉండటం మంచిది.
For Kumbha Rasi (Aquarius) natives, Ketu will yield adverse results throughout the entire Sri Plavanga Nama Samvatsara year. Unnecessary rivalries and enmities may block your sources of income, and you will be troubled by a constantly restless or unstable mind. Personal health may also suffer. Due to unexpected enmities and heavy medical expenditures arising from health issues, Kumbha Rasi individuals face strong indications of being adversely affected by Ketu during Sri Plavanga Nama Samvatsara. In particular, individuals whose personal horoscopes feature Kala Sarpa Dosha or lack Ketu's planetary strength should perform Ketu Shanti remedial rituals periodically throughout the year.
మొత్తం మీద శ్రీ ప్లవంగ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి గురువు మరియు శని వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును. రాహు మరియు కేతు గ్రహాల వలన ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత జాతకంలో గురువు, శని, రాహువు మరియు కేతు గ్రహాలలో ఏ గ్రహం అయితే అధిక బలంతో ఉంటుందో ఆ గ్రహ ఫలితాలే ఈ సంవత్సరం అంతా ప్రస్పుటంగా ప్రతిఫలిస్థాయి. ఇక్కడ పేర్కొన్న ప్రతికూల ఫలితాల వలన అధైర్య పడకండి. మీ వ్యక్తి గత జాతకంలో ప్రతికూల ఫలితాలకు కారణమైన గ్రహం బలమైన స్థానంలో అనుకూలంగా ఉంటే ప్రతికూల ఫలితాల తీవ్రత తగ్గుతుంది.
Overall, during the Sri Plavanga Nama Samvatsara year, Kumbha Rasi (Aquarius) natives will experience mixed results due to Jupiter (Guru) and Saturn (Shani), while Rahu and Ketu will bring adverse influences. In your individual horoscope, whichever planet among Jupiter, Saturn, Rahu, and Ketu possesses greater strength will predominantly shape your real-world outcomes throughout the year. Do not lose heart over the unfavorable predictions mentioned above. If a planet causing negative planetary transits occupies a strong and favorable position in your personal natal chart, the intensity of those adverse effects will be significantly reduced.
నెలవారీ రాశీ ఫలితాలను మరియు ముఖ్య పర్వదినాల వివరాలను క్రింద పొందగలరు...You can find the details of monthly horoscope predictions and important festival dates below...
ఈ మాసంలో కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సంసార సంబంధంగా బాధిస్తున్న చికాకులను చక్కదిద్దుకోవడంలో విజయం సాధిస్తారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. దీర్ఘకాలంగా ఉన్న రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధ పెట్టుబడులు నష్ట పరచును. వాహన సంభందిత వ్యయం ఎదురవుతుంది. ద్వితియ మరియు తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ధనలాభములు లభిస్తాయి. తలపెట్టిన పనులలో విజయం చేకూరుతుంది. శతభిషా నక్షత్ర జాతకులు తమ శ్రమకు తగిన ఫలితం మరియు గుర్తింపు పొందగలుగుతారు. ఇంట్లో జరగవలసిన శుభ కార్యములు వాయిదా వేయవలసి వస్తుంది. మాసాంతంలో ఆర్ధిక పరంగా వృద్ది పొందుతారు. విద్యార్ధులకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఆశించిన విద్యా అవకాశములు పొందగలరు. ఈ మాసంలో 7,8, 11 తేదీలు కుంభరాశి వారికి అనుకూలమైనవి కావు.
In April 2027 (the first month of Sri Plavanga Nama Samvatsara), Kumbha Rasi (Aquarius) natives will experience mixed results. You will successfully resolve domestic issues and family-related irritations that have been troubling you. Financially, there will be no major hurdles; your financial income will be good throughout the month, and long-pending debt burdens will be cleared. However, real estate and land-related investments may yield losses, and unexpected vehicle-related expenses will arise. During the second and third weeks, you will reap financial gains in both employment and business, achieving success in all initiated tasks. Individuals born under Shatabhisha Nakshatra will receive due recognition and appropriate rewards for their hard work. Auspicious events or celebrations planned at home may have to be postponed. Toward the end of the month, you will see strong financial growth. For students, this month is very favorable, enabling them to secure desired educational opportunities. During this month, the 7th, 8th, and 11th dates are not favorable for Kumbha Rasi natives.
ఏప్రిల్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7 తేదీ శ్రీ ప్లవంగ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. 9వ తేదీ మత్స్య జయంతి మరియు సౌభాగ్య గౌరీ వ్రత దినం. 11వ తేదీ శ్రీ పంచమి. 15వ తేదీ శ్రీరామనవమి పర్వదినం. 16వ తేదీ ధర్మరాజ దశమి. 17వ తేదీ మతత్రయ ఏకాదశి మరియు వాడపల్లి తీర్థం. 19వ తేదీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి కల్యాణోత్సవం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం.
Key festivals and auspicious days in April 2027: The Sri Plavanga Nama Samvatsara commences on the 7th. Matsya Jayanti and Saubhagya Gauri Vratam fall on the 9th. Sri Panchami takes place on the 11th. The grand festival of Sri Rama Navami is celebrated on the 15th, followed by Dharmaraja Dashami on the 16th. Matatraya Ekadashi and the revered Vadapalli Teertham fall on the 17th. The auspicious Kalyanotsavam of Sri Kodandarama Swamy at Vontimitta takes place on the 19th. Sankashtahara Chaturthi Vratam is observed on the 24th.
ఈ మాసంలో ముఖ్యమైన కార్యములను అనుకున్న విధంగా పూర్తి చేయగలరు. ఆర్ధిక విషయాల్లో పిత్రు వర్గం వారి సహకారం లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. రాజకీయంగా నూతన పదవులు, హోదా పొందుటకు ప్రయత్నాలు చేయడానికి ఈ మాసం అనువైన కాలం. ఎదిగిన పుత్రికా సంతానం యొక్క ప్రవర్తన కొంత ఆందోళన కలుగచేయును. విదేశాలలో పౌరసత్వం కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. వ్యాపార రంగంలోని వారికి నూతన పెట్టుబడులు లాభించును. వ్యాపార విస్తరణ కు ఈ మాసం అనుకూల కాలం. మాసాంతంలో ఉద్యోగ జీవులకు తమ ప్రతిభ కు తగిన ప్రోత్సాహం పొందుతారు. ఈ మాసంలో కుంభరాశి వారిని ఉదర సంభందమైన సమస్యలు భాదించును.
In May 2027, Kumbha Rasi (Aquarius) natives will be able to complete important tasks as planned. In financial matters, support from paternal relatives will be beneficial. Financial income will remain ordinary throughout the month. This month is an opportune time for political efforts to secure new posts or official statuses. However, the behavior of grown daughters may cause some anxiety. Efforts toward securing foreign citizenship will yield success. For business professionals, new investments will yield good profits, making this an ideal time for business expansion. Toward the end of the month, employed individuals will receive appropriate recognition and encouragement for their talent and hard work. During this month, stomach-related health issues may cause trouble for Kumbha Rasi natives.
మే 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ వరూధిని ఏకాదశి. 4వ తేదీ మాస శివరాత్రి మరియు ఈ రోజు నుండి వాస్తు కర్తరి ప్రారంభం అవుతుంది. వాస్తు కర్తరి మే 30వ తేదీన ముగుస్తుంది. 7వ తేదీ వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. 9వ తేదీ అక్షయ తృతీయ మరియు పరశురామ జయంతి మరియు సింహాచల శ్రీ అప్పన్న స్వామి చందనోత్సవ దినం. 15వ తేదీ శ్రీ వాసవి అమ్మ వారి జయంతి. 16వ తేదీ సర్వ ఏకాదశి దినం మరియు అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవ పర్వ దినం. 18వ తేదీ నృసింహ జయంతి. 20వ తేదీ శ్రీ అన్నమాచార్య జయంతి మరియు బుద్ధ పౌర్ణమి మరియు మహా వైశాకి పర్వదినం. 24వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 25వ తేదీ రోహిణి కార్తె ప్రారంభ దినం. 30వ తేదీ శ్రీ హనుమాన్ జయంతి.
Key festivals and auspicious days in May 2027: Varudhini Ekadashi falls on the 2nd. Masa Shivaratri and the commencement of Vastu Kartari take place on the 4th (Vastu Kartari concludes on May 30th). The sacred Vaishakha Masa begins on the 7th. Akshaya Tritiya, Parasurama Jayanti, and the famous Chandanotsavam of Sri Appanna Swamy at Simhachalam fall on the 9th. Sri Vasavi Ammavari Jayanti is observed on the 15th. Sarva Ekadashi and the grand Kalyanotsavam of Sri Satyadeva at Annavaram fall on the 16th. Nrusimha Jayanti takes place on the 18th. Sri Annamacharya Jayanti, Buddha Purnima, and Maha Vaishaki are celebrated on the 20th. Sankashtahara Chaturthi Vratam falls on the 24th. The period of Rohini Karte commences on the 25th. Sri Hanuman Jayanti is celebrated on the 30th.
ఈ మాసంలో కుంభరాశి వారు చక్కటి ధన సంపాదన పొందుదురు. గృహ వాతావరణం లో చికాకులు తొలగును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల నుండి ఒక అనుకూల సమాచారం లభిస్తుంది. 10వ తేదీ తదుపరి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగ జీవనంలో పని భారం కొంత తగ్గుతుంది. ఈ మాసంలో ప్రమోషన్లకు అవకాశం ఉన్నది. మాసాంతంలో వృధా వ్యయం ఎదురగు సూచన ఉన్నది. ప్రభుత్వ సంబంధ వ్యవహారములు మరియు కాంట్రాక్టు పనుల కోసం ప్రయత్నించు వారికి విజయం లభించును. ఈ నెలలో 6, 16, 23 , 25, తేదీలు అనుకూలమైనవి కావు.
In June 2027, Kumbha Rasi (Aquarius) natives will achieve excellent financial earnings. Domestic irritations and tensions within the household environment will clear up. Efforts made by unmarried individuals toward marriage alliances will bear fruitful results. You will receive positive and encouraging news from distant places. After the 10th, job search efforts by unemployed individuals will yield success. The workload in professional life will reduce to some extent, and there are promising opportunities for promotions this month. Toward the end of the month, indications suggest unexpected or wasteful expenses. Those pursuing government-related matters and contract works will attain success. During this month, the 6th, 16th, 23rd, and 25th dates are not favorable for Kumbha Rasi natives.
జూన్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ మతత్రయ ఏకాదశి. 3వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది. 6వ తేదీ బుద్ధ జయంతి. 13వ తేదీ దశ పాప హర దశమి. 14వ తేదీ నిర్జల ఏకాదశి మరియు స్మార్త ఏకాదశి. 18వ తేదీ ఏరువాక పూర్ణిమ మరియు వట సావిత్రి వ్రత దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీన పవిత్ర గోదావరి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. జూలై 7వ తేదీతో గోదావరి నది ఆది పుష్కరాలు పూర్తి అవుతాయి. 30వ తేదీ సర్వ ఏకాదశి దినం.
Key festivals and auspicious days in June 2027: Matatraya Ekadashi falls on the 1st. Masa Shivaratri takes place on the 3rd. The sacred Jyeshtha Masa begins on the 5th. Buddha Jayanti is observed on the 6th. Dasha Papa Hara Dashami falls on the 13th. Nirjala Ekadashi and Smarta Ekadashi take place on the 14th. Eruvaka Purnima and Vata Savitri Vratam are celebrated on the 18th. Sankashtahara Chaturthi Vratam falls on the 22nd. The grand and holy Godavari Nadi Pushkarams commence on the 26th (with the Adi Pushkarams concluding on July 7th). Sarva Ekadashi falls on the 30th.
ఈ మాస ప్రారంభంలో కుంభరాశి వారికి మంచి అనుకూల వాతావరణం సిద్ధిస్తుంద. 16 వ తేదీ తదుపరి కుటుంబంలో చికాకులు, మానసిక ఆందోళన ఏర్పడును. మొదటి వారంలో ఆశించిన ధనప్రాప్తి లభిస్తుంది. ఆశించిన విధంగా చక్కటి వాహన సౌఖ్యం పొందుదురు. కుటుంబ వ్యవహారాలలో మీకు అనుకూలంగా మార్పులు ఏర్పడతాయి. దూరమైన మిత్రులు తిరిగి దగ్గర అవుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు వింటారు. అఖస్మిక బంధువుల లేదా స్నేహితుల రాక పోకలు ఆర్ధికంగా మరియు శారీరక శ్రమను కలుగచేయును. విదేశీ నివాస ప్రయత్నములు చేయువారికి అనుకూల ఫలితాలు ప్రాప్తించును. ద్వితీయ వారం చివరి వరకూ పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. 16 వ తేదీ నుండి కుటుంబంలోని పెద్దవయ్యస్సు వారి అనారోగ్య సమస్యలు అధికం అగును. మాసాంతంలో వృత్తిలో ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఉద్యోగ నష్టం లేదా మార్పుకు సూచనలు ఉన్నవి. ఈ మాసంలో 20 మరియు 21 తేదీలు అనుకూలమైనవి కావు.
At the beginning of July 2027, Kumbha Rasi (Aquarius) natives will enjoy a highly favorable and positive environment. However, after the 16th, domestic irritations and mental anxiety will arise. During the first week, you will achieve expected financial gains and enjoy fine vehicle comforts as anticipated. Favorable changes will occur in family affairs. Long-estranged friends will reconnect with you, and you will hear joyful news regarding your children. Unexpected visits from relatives or friends will cause both financial burden and physical exertion. Efforts made for overseas residency will yield successful results. There will be no major hurdles until the end of the second week. From the 16th onwards, health issues concerning elderly family members will escalate. Toward the end of the month, adverse results will manifest in your profession, with strong indications of job loss or an unwanted job change. During this month, the 20th and 21st dates are not favorable for Kumbha Rasi natives.
జూలై 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ మాస శివరాత్రి. 5వ తేదీ నుండి ఆషాడమాసం ప్రారంభమవుతుంది మరియు పూరి లోని శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఘనంగా జపరబడుతుంది. ఈ రోజు నుండి శుక్ర మూఢమి ప్రారంభమవుతుంది. శుక్ర మూఢమి 18 సెప్టెంబర్ 2027వ తేదీతో పూర్తి అవుతుంది. 14వ తేదీ తొలి ఏకాదశి మరియు శయన ఏకాదశి మరియు చాతుర్మాస వ్రత ఆరంభ దినం. 17వ తేదీ నుండి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది.18వ తేదీ గురు పౌర్ణమి మరియు వ్యాస పౌర్ణమి దినం. 22వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 29వ తేదీ సర్వ ఏకాదశి దినం. 31వ తేదీ మాస శివరాత్రి మరియు శని త్రయోదశి.
Key festivals and auspicious days in July 2027: Masa Shivaratri falls on the 2nd. The sacred Ashadha Masa begins on the 5th, alongside the grand celebration of Sri Jagannath Swamy Rath Yatra at Puri. Shukra Mudhami also commences on this day (concluding on September 18, 2027). Toli Ekadashi, Shayana Ekadashi, and the commencement of Chaturmasya Vratam take place on the 14th. The period of Dakshinayana begins on the 17th. Guru Purnima and Vyasa Purnima are celebrated on the 18th. Sankashtahara Chaturthi Vratam falls on the 22nd. Sarva Ekadashi is observed on the 29th. Masa Shivaratri and Shani Trayodashi both fall on the 31st.
ఈ మాసంలో కుంభరాశి వారికి ధనసంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం ప్రాప్తిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం పెరుగును. నూతన ప్రాజెక్టులు లభిస్తాయి. మాతృ వర్గీయులు వైరాగ్య భావన వలన బాధించబడతారు. ద్వితియ వారంలో సామాన్య ఫలితాలు ఏర్పడతాయి . తృతీయ వారంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యక్తిగత జీవనంలో ఆశించిన విధంగా సుఖ సంతోషములు నెలకొనును. ఈ మాసంలో చేసే సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభములు కలుగచేయును. మహిళలు ఎంతో కాలంగా వేచి చూస్తున్న వారసత్వ సంబంధ లాభములు పొందగలుగుతారు. ఈ మాసంలో ప్రారంభించు భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ మాసంలో 10వ తేదీ నుండి 15 వ తేదీ మధ్య కాలం వివాహ ప్రయత్నములు చేయుటకు మిక్కిలి శుభకరమైన కాలం.
In August 2027, financial irritations and worries will clear up for Kumbha Rasi (Aquarius) natives. However, you must exercise caution when making new acquaintances. Job search efforts will yield victory and success in career endeavors. Financial income will increase during this month, and you will secure new projects. On the domestic front, maternal relatives may suffer from feelings of detachment or despondency. The second week brings average results, while the third week will see a reduction in mental stress. Longed-for peace and happiness will establish themselves in your personal life. Gold and precious metal investments made during this month will deliver good returns. Women will successfully receive long-awaited ancestral property benefits or inheritance gains. Partnership businesses initiated this month will turn out to be profitable. Furthermore, the period between the 10th and 15th of this month is exceptionally auspicious for making marriage alliance efforts.
ఆగష్టు 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీన పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాన్ని పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశికి చెందినవారు చూడకూడదు. పుష్యమి నక్షత్ర జాతకులు మరియు కర్కాటక రాశికి చెందిన జాతకులు గ్రహ శాంతులు జరిపించుకోవాలి. ఈ పాక్షిక సూర్యగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు పూర్తి అవుతుంది. ఆగష్టు 3వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. 6వ తేదీ గరుడ పంచమి. 13వ తేదీ శ్రీ వరలక్ష్మీ దేవి వ్రత దినం. 14వ తేదీ శని త్రయోదశి. 15వ తేదీ నుండి గురు మూడమి కాలం ప్రారంభమవుతుంది. ఈ గురు మూడమి 16 సెప్టెంబర్ 2027 వ తేదీన ముగుస్తుంది. 17వ తేదీ శ్రావణ మాస పౌర్ణమి మరియు రాఖీ పండుగ. 20వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ శ్రీ కృష్ణ జన్మాష్టమి. 28వ తేదీ మతత్రయ ఏకాదశి. 30వ తేదీ మాస శివరాత్రి. 31వ తేదీ పొలాల అమావాస్య పర్వదినం.
Key festivals and auspicious days in August 2027: A partial solar eclipse (Pakshika Surya Grahanam) occurs on the 2nd. Individuals born under Pushyami Nakshatra and Karkataka Rasi (Cancer) should not view this eclipse and are advised to perform remedial eclipse pujas (Graha Shanti). This partial solar eclipse begins at 3:58 PM and concludes at 5:40 PM. The auspicious Sravana Masa commences on August 3rd. Garuda Panchami falls on the 6th. The holy Sri Varalakshmi Vratam is celebrated on the 13th, followed by Shani Trayodashi on the 14th. Guru Mudhami period begins on the 15th (concluding on September 16, 2027). Sravana Purnima and the Rakhi festival (Raksha Bandhan) take place on the 17th. Sankashtahara Chaturthi Vratam falls on the 20th. The grand celebration of Sri Krishna Janmashtami takes place on the 24th. Matatraya Ekadashi falls on the 28th, Masa Shivaratri on the 30th, and Polala Amavasya is observed on the 31st.
ఈ మాసంలో సోదర వర్గంతో వివాదముల మూలంగా ఆర్ధిక నష్టములు ఏర్పడు సూచన కలదు. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలుగచేయును. నివసిస్తున్న గృహంలో మార్పులు చేయుటకు ఈ మాసం అనుకూలమైనది కాదు. ప్రతీ వ్యవహారం నిదానంగా పూర్తి అగును. మీరు మంచి చెప్పినా ఎదుటి వారు లెక్క చేయని పరిస్తితులు ఎదురగును. చివరి వారంలో వాహన ప్రమాదం ఎదుర్కోను సూచన ఉన్నది లేదా అఖస్మిక ఆరోగ్య రుగ్మతలు బాధించును. 23వ తేదీ తదుపరి చేయు ప్రయాణము లందు జాగ్రత్త అవసరం. ఈ నెలలో 7, 15, 18, 21, 24 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది.
In September 2027, Kumbha Rasi (Aquarius) natives face indications of financial losses arising from disputes or conflicts with siblings. You will have to undertake unnecessary journeys. Job search efforts will cause some disappointment, and this month is not favorable for making modifications or changes to your current residence. Every task or transaction will progress slowly. You may encounter situations where people disregard your advice, even when given in good faith. During the final week of the month, there are strong indications of vehicle accidents or sudden health ailments causing distress. Extreme caution is required during travels undertaken after the 23rd. Financially, income will remain ordinary throughout the month. During this month, the 7th, 15th, 18th, 21st, and 24th dates are not favorable for Kumbha Rasi natives.
సెప్టెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. 2వ తేదీ శ్రీ బలరామ జయంతి. 3వ తేదీ శ్రీ వరాహ జయంతి. 4వ తేదీ శ్రీ వినాయక చవితి. 5వ తేదీ ఋషి పంచమి దినం. 11వ తేదీ పరివర్తన ఏకాదశి పర్వదినం. 12వ తేదీ శ్రీ వామన జయంతి. 14వ తేదీ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రత దినం. 16వ తేదీ గురు మూడమీ పూర్తి అవుతుంది మరియు ఈ 16 వ తేదీ నుండి భాద్రపద మాస అమావాస్య వరకు అనగా 29వ తేదీ వరకు మహాలయ పక్షం జరుగుతుంది. 18వ తేదీన శుక్ర మూఢమి పూర్తి అవుతుంది. 19వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 26వ తేదీ సర్వ ఏకాదశి దినం. 28వ తేదీ మాస శివరాత్రి. 29వ తేదీ మహాలయ అమావాస్య.
Key festivals and auspicious days in September 2027: The sacred Bhadrapada Masa begins on the 1st. Sri Balarama Jayanti is observed on the 2nd, followed by Sri Varaha Jayanti on the 3rd. The grand festival of Sri Vinayaka Chavithi (Ganesh Chaturthi) takes place on the 4th, followed by Rishi Panchami on the 5th. Parivartana Ekadashi falls on the 11th. Sri Vamana Jayanti is celebrated on the 12th, and Sri Ananta Padmanabha Swamy Vratam is observed on the 14th. Guru Mudhami concludes on the 16th, marking the beginning of Mahalaya Paksham, which runs through the Bhadrapada Amavasya on the 29th. Shukra Mudhami concludes on the 18th. Sankashtahara Chaturthi Vratam falls on the 19th. Sarva Ekadashi is observed on the 26th, Masa Shivaratri on the 28th, and Mahalaya Amavasya takes place on the 29th.
ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. గత కాలంలో తెలియక చేసిన తప్పుల వలన అవమాన భారం ఎదుర్కొందురు. మాతృ వర్గం వారికి అనారోగ్య సూచన ఉన్నది. ప్రధమ వారంలో ట్రేడింగ్ సంబందిత వ్యాపారం చేయువారికి బాగా కలసి వస్తుంది. షేర్ల విక్రయాల వలన ఆర్ధిక లాభములు ఏర్పడు సూచన. భాతృ వర్గం వారితో నెలకొనిన వివాదములు తొలగును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. తృతియ వారం విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉండును. పరదేశ విద్యాభ్యాసం కోసం చెసే ప్రయత్నాలు లాభించను. బందువుల రాకపోకల వలన ధన వ్యయం ఉండగలదు. చివరి వారంలో స్వతంత్ర వృత్తి జీవనంలోని వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఆశించిన రాజకీయ పదవులు లభించును. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు స్థిరచిత్తంతో ప్రయత్నించవలెను. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్న కార్యములను పూర్తి చేయగలుగుతారు.
In October 2027, financial income will remain ordinary for Kumbha Rasi (Aquarius) natives. You may face humiliation or distress due to past errors committed unknowingly. Indications suggest potential health issues for maternal relatives. During the first week, individuals engaged in trading-related businesses will see good success, with strong prospects of financial gains from the sale of shares. Disputes with siblings will be resolved. The second week will deliver average results. The third week will be highly favorable for students, and efforts made toward overseas education will bear fruit. Visits from relatives may lead to monetary expenditures. During the final week, independent professionals and freelancers will experience an increase in fame and reputation. Aspirants will secure desired political positions or posts. Efforts toward new business expansion should be pursued with determination and a steady mind; although initial hurdles may arise, you will successfully overcome them and complete all intended tasks.
అక్టోబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 1వ తేదీ నుండి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతుంది మరియు అమ్మవారి పవిత్ర శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. నవరాత్రుల ప్రారంభ దినమైన ఈ రోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవిని పూజించాలి. 2వ తేదీ శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజించాలి. 3వ తేదీ శ్రీ అన్నపూర్ణా దేవి అమ్మవారిని పూజించాలి. 4వ తేదీ శ్రీ మహా చండీ దేవి అమ్మ వారిని పూజించాలి. 5వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని పూజించాలి. 6వ తేదీ శ్రీ సరస్వతీ దేవి అమ్మవారిని పూజించాలి. 7వ తేదీ ఈ రోజు రెండు తిధుల సంధి ఏర్పడడం వలన ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించాలి మరియు ఈ రోజును దుర్గాష్టమి పర్వ దినంగా పరిగణించి శ్రీ దుర్గా దేవిని పూజించాలి. 8వ తేదీ మహానవమి పర్వదినం. ఈ రోజున శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారిని పూజించాలి. 9వ తేదీ విజయదశమి. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించాలి. ఈ రోజున మధ్యాహ్నం 1.40 నుండి మధ్యాహ్నం 2.38 గంటల మధ్య శమీ పూజను నిర్వహించాలి. 11వ తేదీ మతత్రయ ఏకాదశి. 18వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 28వ తేదీ నరక చతుర్దశి. 29వ తేదీ దీపావళి పర్వదినం. ఈ రోజునే ధనలక్ష్మి పూజ నిర్వహించాలి మరియు కేదార గౌరీ వ్రతం ఆచరించాలి. 30వ తేదీ బలి పాడ్యమి మరియు ఈ రోజు నుండే పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in October 2027: The sacred Ashwayuja Masa begins on the 1st, marking the commencement of Devi Sharad Navaratri.
Matatraya Ekadashi falls on the 11th. Sankashtahara Chaturthi Vratam is observed on the 18th. Naraka Chaturdashi falls on the 28th. The grand festival of Deepavali is celebrated on the 29th, along with Dhana Lakshmi Puja and Kedara Gauri Vratam. Bali Padyami and the commencement of the holy Karthika Masa take place on the 30th.
ఈ మాసంలో గృహంలో వాయిదా వేస్తూ వస్తున్నా శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చక్కటి మానసిక ప్రశాంతత లభించును. దీర్హకాలిక పెట్టుబడులు పెడతారు. ఈ మాసంలో ధనాదాయం లో పెరుగుదల ఏర్పడును. అవివాహితుల వివాహాది విషయములకై తీవ్రంగా చర్చలు జరుపవలసి వస్తుంది. చివరి వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు ఎదురగును. ఉన్నత అధికారులు మీ ప్రతిభా పాటవాలు గుర్తిస్తారు. కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగ రీత్యా స్థానచలనం పొందగలుగుతారు. రోజువారీ కుటుంబ వ్యయం కూడా అదుపులోకి వస్తుంది. స్త్రీ మూలక ధన లాభములు పొందుతారు. వ్యాపార రంగం లోని వారు గౌరవ ప్రధమైన వారిగా గుర్తింపు పొందుతారు.
In November 2027, long-postponed auspicious events and auspicious functions at home will be successfully conducted. You will enjoy excellent mental peace and tranquility. Long-term investments will be made, and there will be a noticeable increase in financial income throughout the month. For unmarried individuals, intensive discussions regarding marriage alliances will take place. During the final week, those in professional careers may encounter minor irritations; however, higher authorities will recognize your skills and talent, allowing you to secure desired job transfers to preferred locations. Daily family expenses will come under control. You will reap financial gains through women or female relatives. Business individuals will gain strong recognition and respect in their respective fields.
నవంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 2వ తేదీ నాగుల చవితి. 11వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి మరియు ఈ రోజున చాతుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. 13వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం ఈ రోజునే జ్వాలాతోరణం నిర్వహించాలి. 17వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 24వ తేదీ మతత్రయ ఏకాదశి దినం. 26వ తేదీ మాస శివరాత్రి మరియు ధన్వంతరి జయంతి. 29వ తేదీ నుండి మార్గశీర్ష మాసము ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in November 2027: Nagula Chavithi takes place on the 2nd. The highly auspicious Ksheerabdi Dwadashi falls on the 11th, marking the conclusion of the Chaturmasya Vratam. Karthika Purnima is celebrated on the 13th, during which the traditional Jwala Thoranam ritual is performed. Sankashtahara Chaturthi Vratam falls on the 17th. Matatraya Ekadashi is observed on the 24th. Masa Shivaratri and Dhanvantari Jayanti both fall on the 26th. The holy Margashirsha Masa commences on the 29th.
ఈ మాసంలో సంతాన సంబంధ లాభములు మరియు జీవన అభివృద్ధి కి సంబందించిన లాభములు పొందుతారు. ఈ మాసంలో ధనాదాయం పెరుగుతుంది. 14వ తేదీ తదుపరి ఉద్యోగ జీవనం లోని వారు ఉన్నతిని ఆశించవచ్చు. అందరి మన్ననలూ పొందుదురు. సొంత గృహ ప్రయత్నములు ఫలించును. మాస మధ్యమం నుండి కుజ గ్రహ ప్రతికూల ప్రభావము వలన మానసిక ఒత్తిడి అధికమగును. దగ్గరి బంధువుల అనారోగ్య సంబంధ దుర్వార్త వినవలసి వస్తుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు అగ్ని వలన నష్టము లేదా ఆరోగ్య సంబంధ భయము, స్నేహ వర్గంతో భేదాభిప్రాయాలు వంటి ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు. ఈ మాసంలో వ్యాపార సంబంధంగా నూతన భాగస్వాములను సమకుర్చుకోగలరు. ఉద్యోగ రంగంలోని వారు నూతన ప్రాజెక్టులను దక్కించు కోగలుగుతారు. కళా రంగంలోని వారికి ఆశించిన అవకాశములు లభించుట వలన ఆర్ధిక సమస్యల నుండి బయటపడతారు.
In December 2027, you will reap gains related to progeny and overall life progress. Financial income will increase during this month. After the 14th, employed individuals can look forward to advancement and higher status, earning appreciation from everyone. Efforts to build or acquire a personal home will bear fruit. From the middle of the month, due to the adverse influence of Mars (Kuja), mental stress will increase, and you may hear troubling news regarding the health of close relatives. Individuals born under Dhanishta Nakshatra may face negative outcomes such as losses due to fire, health-related fears, or differences of opinion with friends. In business, you will be able to onboard new partners. Employed professionals will secure new projects. Those in creative fields and arts will receive desired opportunities, enabling them to overcome financial difficulties.
డిసెంబర్ 2027 మాసంలో ముఖ్య పర్వదినాలు: 4వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి. 9వ తేదీ సర్వ ఏకాదశి మరియు గీతా జయంతి. 11వ తేదీ శని త్రయోదశి. 13వ తేదీ శ్రీ దత్తాత్రేయ జయంతి. 16వ తేదీ సంకష్టహర చతుర్ధి వ్రత దినం. 20వ తేదీ శ్రీ కాలభైరవ అష్టమి. 23వ తేదీ సర్వ ఏకాదశి. 25వ తేదీ శని త్రయోదశి. 26వ తేదీ మాస శివరాత్రి. 28వ తేదీ నుండి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.
Key festivals and auspicious days in December 2027: Sri Subrahmanyeswara Swamy Shashti falls on the 4th. Sarva Ekadashi and Gita Jayanti take place on the 9th, followed by Shani Trayodashi on the 11th. Sri Dattatreya Jayanti is celebrated on the 13th. Sankashtahara Chaturthi Vratam falls on the 16th, and Sri Kala Bhairava Ashtami is observed on the 20th. Sarva Ekadashi falls on the 23rd, followed by another Shani Trayodashi on the 25th and Masa Shivaratri on the 26th. The sacred Pushya Masa commences on the 28th.
ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం ప్రాప్తిస్తుంది. నూతన వ్యాపార పెట్టుబడుల ద్వారా చక్కటి ధన ఆర్జన చేయగలరు. ఈ మాసంలో అన్ని వర్గముల వారికీ ధన సంపాదన పెరుగును. ఉద్యోగ జీవనంలోని వారికి మిశ్రమ ఫలితాలు ఎదురగును. మీ అజాగ్రత్త వలన పై అధికారులతో మాట పడవలసి వస్తుంది. మీరు పడిన శ్రమకు తగిన ఫలితం వుండదు. మీ రంగంలోని పోటీదారుల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. వ్యాపారస్తులకు మినహా మిగిలిన అన్ని వర్గముల వారికి ఈ మాసం తృతీయ వారం వరకు సామాన్య ఫలితాలు ఎదురగును. మాసాంతంలో మీరు ఎంతగానో ఆశ పడి ప్రయత్నిస్తున్న ఒక ముఖ్య వ్యవహారం అర్ధాంతరంగా నిలచిపోవును. జీవిత భాగస్వామితో మాట కలయికలో ఇబ్బందులు ఎదురగును. సదాచారవంతమైన జీవితం ప్రారంభించడానికి, వ్యసనాల భారీ నుండి బయట పడడానికి ఈ మాసం అనుకూల కాలం.
In January 2028, Kumbha Rasi (Aquarius) natives will find this month highly favorable for legal matters, court cases, and marriage alliance efforts for unmarried individuals. Unexpectedly, your opponents or rivals will come forward and prepare for a compromise. Financial income will remain very strong and yield expected returns. The arrival of new individuals into the family will strengthen domestic bonds. For employed individuals, this month provides an opportunistic time for job changes and career shifts. The household environment will stay positive and harmonious as anticipated. Business expansion opportunities will arise, and partnership business endeavors will prove to be profitable. Particularly for business professionals, the 25th, 26th, and 27th dates of this month will deliver lucrative gains.
జనవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 8వ తేదీ శ్రీ వైకుంఠ ఏకాదశి పర్వదినం మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినం. 14వ తేదీ శుక్రవారం భోగి పండుగ. 15వ తేదీ శనివారం మకర సంక్రాంతి రోజున ఉదయం 9 గంటల 21 నిమిషాలకు గ్రహ రాజు శ్రీ సూర్య భగవానుల వారు మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. ఈ క్షణం నుండి పవిత్ర ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 16వ తేదీ ఆదివారం కనుమ పండుగ. 17వ తేదీ సోమవారం ముక్కనుమ పండుగ. 22వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 26వ తేదీ చొల్లంగి అమావాస్య. 27వ తేదీ నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in January 2028: Sri Vaikunta Ekadashi and Mukkoti Ekadashi are celebrated on the 8th. The festive period begins with Bhogi on Friday, the 14th. On Saturday, January 15th, Makara Sankranti is celebrated as the Sun God (Sri Surya Bhagavan) enters Makara Rasi (Capricorn) at 9:21 AM, marking the commencement of the holy Uttarayana period. Kanuma falls on Sunday, the 16th, followed by Mukkanuma on Monday, the 17th. Sarva Ekadashi falls on the 22nd. Masa Shivaratri is observed on the 24th, and Chollangi Amavasya takes place on the 26th. The sacred Magha Masa commences on the 27th.
ఈ మాసం కోర్టు వ్యవహరాలకు, అవివాహితుల వివాహ ప్రయత్నములకు అనుకూలంగా ఉండును. మీ ప్రత్యర్ధులు మీరు ఊహించని విధంగా రాజీ పడడానికి సిద్ధపడతారు. ఈ మాసంలో ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. నూతన వ్యక్తుల చేరిక వలన కుటుంబ బలం పెరుగుతుంది. ఉద్యోగ పరంగా మార్పు ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణం మీరు ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారములు విస్తరించే అవకాశములు లభించును. భాగస్వామ్య వ్యాపార ప్రయత్నములు కూడా లాభించును. ముఖ్యంగా వ్యాపార వర్గం వారికి ఈ మాసంలో 25, 26, 27 తేదీలు మంచి లాభములను కలిగించును.
In February 2028, Kumbha Rasi (Aquarius) natives will find this month highly favorable for legal matters, court cases, and marriage alliance efforts for unmarried individuals. Unexpectedly, your opponents or rivals will come forward and prepare for a compromise. Financial income will remain very strong and yield expected returns. The arrival of new individuals into the family will strengthen domestic bonds. For employed individuals, this month provides an opportunistic time for job changes and career shifts. The household environment will stay positive and harmonious as anticipated. Business expansion opportunities will arise, and partnership business endeavors will prove to be profitable. Particularly for business professionals, the 25th, 26th, and 27th dates of this month will deliver lucrative gains.
ఫెబ్రవరి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 3వ తేదీ రథసప్తమి పర్వదినం మరియు భీష్మాష్టమి పర్వదినం. 7వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినం మరియు అంతర్వేది తీర్థం. 13వ తేదీ సంకష్టహర చతుర్థి వ్రత దినం. 21వ తేదీ మతత్రయ ఏకాదశి. 23వ తేదీ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. 26వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in February 2028: Ratha Saptami and Bheeshmashtami are observed on the 3rd. The holy Bheeshma Ekadashi and the famous Antarvedi Teertham take place on the 7th. Sankashtahara Chaturthi Vratam falls on the 13th. Matatraya Ekadashi is observed on the 21st. The grand and sacred Maha Shivaratri festival is celebrated on the 23rd. The holy Phalguna Masa commences on the 26th.
ఈ మాసంలో కూడా కుంభరాశి వారికి ధనాదాయం బాగుంటుంది. సమాజంలో చక్కటి పేరుప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మీ ప్రవర్తనతో తోటి ఉగ్యోగుల గౌరవం పొందుతారు. నూతన ఆదాయ మార్గములు లభిస్తాయి. కోరుకున్న విధంగా మీ శత్రువులపై విజయం లభిస్తుంది. శత్రువులు కూడా మీకు విధేయులుగా మారతారు. అన్ని విషయములందు విజయములు పొందుతారు. సంతాన సంబంధ శుభ వార్తలు వింటారు. ఒక వ్యక్తిగత విషయంలో మీ అంచనాలు నిజమగును. ఈ మాసంలో చేయు ప్రయాణాల వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురగును. కుటుంబ సభ్యుల వద్ద ఆర్భాటాలకు పోకుండా ఉండుట మంచిది. ఈ మాసంలో 2, 4, 16 మరియు 25 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ తేదీలలో కుంభరాశి వారు ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది.
In March 2028, financial income will continue to remain strong and favorable for Kumbha Rasi (Aquarius) natives. You will earn fine reputation and status in society. Through your commendable behavior, you will gain the respect of fellow colleagues at the workplace. New avenues of income will present themselves. You will achieve victory over your adversaries as desired, and even enemies will turn subservient to you. Success will crown your efforts across all endeavors. You will hear joyful news regarding your children, and your forecasts or expectations in a personal matter will prove true. However, travels undertaken during this month may bring minor health issues. It is advisable to avoid showiness and extravagance before family members. During this month, the 2nd, 4th, 16th, and 25th dates are not favorable for Kumbha Rasi natives, and it is best to postpone taking major decisions on these specific days.
మార్చి 2028 మాసంలో ముఖ్య పర్వదినాలు: 7వ తేదీ సర్వ ఏకాదశి. 9వ తేదీ కామ దహన దినం. 10 వ తేదీ హోలీ పండుగ. 21వ తేదీ సర్వ ఏకాదశి దినం. 24వ తేదీ మాస శివరాత్రి. 27వ తేదీ ఉగాది. ఈ రోజు నుండి నుండి శ్రీ కీలక నామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
Key festivals and auspicious days in March 2028: Sarva Ekadashi falls on the 7th. Kama Dahanam takes place on the 9th, followed by the vibrant festival of Holi on the 10th. Sarva Ekadashi is observed on the 21st, and Masa Shivaratri falls on the 24th. The grand festival of Ugadi is celebrated on the 27th, marking the auspicious beginning of the Sri Keelaka Nama Samvatsaram.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Oursubhakaryam.com's Official YouTube Channel - WhatsApp Channel - Instagram - Facebook - Telegram - Contact Us
Connect on WhatsAppWe offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.