Sree Parabhava Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu
- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం - 02, వ్యయం - 11, రాజ పూజ్యం - 04, అవమానం - 07
In the Sri Parabhava year, for those born under Karkataka Rashi (Cancer), the financial and social status figures are: Income - 02, Expenditure - 11, Honor/Social Status - 04, and Dishonor/Insult - 07.
పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "4". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎదురగు ఆరోగ్య సంబంధ చికాకులను సూచిస్తున్నది.
According to the traditional method, the remainder number for Karkataka Rashi (Cancer) is '4'. This indicates that in the Sri Parabhava year, those born under Cancer will experience health-related irritations or minor ailments.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. 31 మే 2026 వరకు మీ ద్వారా భారీ ధర్మకార్యములు నిర్వహించబడతాయి. పిత్రార్జితం లేదా వారసత్వ సంపదను ధార్మిక కార్యక్రమాల కొరకు వినియోగిస్తారు. 01 జూన్ 2026 నుండి సంవత్సరం ముగింపు వరకు గురు గ్రహం వలన సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. చెడు వ్యసనాల నుండి బయటపడతారు. ఆరోగ్య వంతమైన లక్షణాలు అలవాటు చేసుకుంటారు. నూతన విద్యలు అభ్యసించాలి అనే కోరిక నెరవేరుతుంది. సర్వదా సంతోషం కలిగిన ఆశాజీవులుగా ఉంటారు. ఉదారత మరియు దయాదాక్షిణ్యాలు కలిగి ప్రవర్తిస్తారు. సుఖ శాంతులతో విలాసయాత్రాలు చేస్తారు. స్త్రీలకూ అదృష్టం వరిస్తుంది. దైవానుగ్రహం వశమున సర్వ సుఖములు ప్రాప్తించును. నాయకులు ప్రజాభిమానం సంపాదించుకుంటారు. ద్రవ పదార్ధాల ఆధారిత వ్యాపారములు మరియు గృహాలంకరణ కు సంబందించిన వ్యాపారములు బాగా లాభిస్తాయి. మీ కార్య నిర్వాహక సామర్ధ్యం మరింత పెరుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయి ని పొందవలెను అనే ఆకాంక్ష అధికం అవుతుంది. కళారంగంలోని వారికి నటనా కౌసల్యం పెరుగుతుంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో గురు గ్రహం వలన బాగా లబ్ది చేకూరుతుంది.
For the Karkataka Rashi (Cancer) natives, the Sri Parabhava Naama year (March 19, 2026 – April 6, 2027) promises highly auspicious results due to the benevolent influence of Jupiter throughout the period. Until May 31, 2026, you will be inclined toward significant charitable works and may utilize ancestral wealth for spiritual purposes, while from June 1st onward, Jupiter’s full favor will help you overcome negative habits, embrace a healthier lifestyle, and fulfill your desires for higher learning. This year is marked by a joyful and optimistic outlook, characterized by generosity, successful luxury travels, and divine grace that brings worldly comforts, particularly favoring women and those in leadership roles who will gain immense public support. Professionally, businesses involving liquids or home decor will flourish, your administrative capabilities will reach new heights, and those in the arts will see a surge in their creative skills, making this a transformative and highly profitable year for your Rashi.
కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శనైచ్చరుని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా పితృ వర్గీయులకు ఆరోగ్య పరంగా మరియు ఆర్ధిక పరంగా ఇబ్బందులు ఎదురగును. ఇంద్రియ సుఖవాంచ అధికం అవుతుంది. దంత సంబంధ మరియు ఉదర సంబంధ వ్యాధులు బాధించును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఆటంకములను ఎదుర్కొనును. నూతన గృహ నిర్మాణం గావిస్తున్న వారికి ఆర్ధిక అంచనాలు గాడి తప్పుతాయి. నిర్మాణ పనులలో తీవ్ర జాప్యం ఎదురగును. వ్యక్తిగత జాతకంలో ప్రతికూల స్థానంలో శని ని కలిగి ఉన్నవారు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా ప్రతీ దినం ఈ క్రింది మంత్రమును ఒక పర్యాయం పటించుట మంచిది మరియు తరచుగా శని గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట వలన ప్రతికూల ప్రభావం తగ్గును. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
“ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం చాయమార్తండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం”
For Karkataka Rashi natives, the Sri Parabhava Naama year will bring unfavorable results due to the influence of Saturn throughout the year, particularly causing health and financial difficulties for paternal relatives. During this period, there may be an increase in the desire for sensory pleasures, and individuals may suffer from dental or abdominal-related ailments. Those who are unmarried may face obstacles in their wedding prospects, while those constructing new homes might find their financial estimates overshooting and face significant delays in construction. Those with Saturn in a negative position in their personal horoscopes may encounter various daily struggles; however, it is noted that Karkataka Rashi is not currently undergoing the Elinaati Shani (Sade Sati) phase. To mitigate these adverse effects,
it is recommended to chant the Shani Mantra daily and perform Shani Shanti Japa regularly.
"Neelanjana Samabhasam Raviputram Yamagrajam Chaya Martanda Sambhutam Tam Namami Shanaishcharam"
కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా ఇబ్బందికర పరిస్థితులు ఎదురగును. శత్రువుల వలన , ఆరోగ్య సమస్యల వలన , అనవసర ఋణాల వలన కష్టములు ఎదురగును. కళత్ర జీవితంలో కూడా విచారత ఎదురవుతుంది. తీవ్ర కాల సర్ప దోషం కలిగిన వారు ఉన్మాద ప్రవ్రుత్తి కి సంబంధించిన లేదా క్షయ వ్యాదికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోను సూచన ఉన్నది. ఈ సంవత్సరం ఒక రాగి పాత్ర లేదా రాగితో చేసిన సర్ప ప్రతిమను బ్రాహ్మణులకు దానం ఇచ్చుట మంచిది. సంవత్సరం అంతా ప్రతీ దినం ఈ క్రింది మంత్రమును ఒక పర్యాయం పటించుట మంచిది మరియు తరచుగా రాహు గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట వలన ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.
“ అర్ధకాయం మహా వీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం రాహుం తమ్ ప్రణమామ్యహం”
For Karkataka Rashi natives, the influence of Rahu throughout the Sri Parabhava Naama year will present several challenging situations, including difficulties arising from enemies, health issues, and the burden of unnecessary debts. There are also indications of distress or sorrow within marital life. Those with severe Kala Sarpa Dosha in their personal birth charts are cautioned about potential risks related to mental instability or chronic ailments like tuberculosis. To mitigate these adverse effects, it is recommended to donate a copper vessel or a copper idol of a serpent to a Brahmin. Additionally, chanting the Rahu Mantra once daily and frequently performing Rahu Graha Shanti Japa will help reduce these negative impacts.
"Ardhakayam Maha Veeram Chandraditya Vimardanam Simhika Garbha Sambhutam Rahum Tam Pranamamyaham"
కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. తరచుగా వృధా ధన వ్యయం మరియు ఆరోగ్య సంబంధ చికాకులు ఎదురగును. ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్య విషయంలో సదా జాగ్రత్తగా ఉండవలెను. మాత్రు వర్గానికి మంచిది కాదు. యువత తమ వంశ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించు సూచనలు ఉన్నవి. 05 డిసెంబర్ 2026 తదుపరి ఉద్యోగ జీవితంలో ఒక నష్టమును ఎదుర్కొనవలసి వస్తుంది. అశాంతికర వాతావరణం బాధిస్తుంది. ఈ సంవత్సరం తరచుగా బ్రాహ్మణులకు ఉలవలు దానం ఇచ్చుట మంచిది. నిత్యం ఈ క్రింది మంత్రమును పటించుట మంచిది.
“ ఫలాస పుష్ప సంకాశం తారకా గ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ్ కేతుం ప్రణమామ్యహం”
For Karkataka Rashi natives, the influence of Ketu throughout the Sri Parabhava Naama year will also lead to unfavorable results, characterized by frequent wasteful expenditures and persistent health-related irritations. It is particularly important to remain vigilant regarding the health of children, and the period may also prove challenging for maternal relatives. There are indications that the youth might behave in a manner that could tarnish their family's reputation. After December 5, 2026, you may encounter a setback in your professional life, and a restless atmosphere may cause distress. To mitigate these effects, it is recommended to frequently donate horse gram (Ulavalu) to Brahmins and to daily chant the Ketu Mantra:
"Palasa Pushpa Sankasham Taraka Graha Mastakam Raudram Raudratmakam Ghoram Tam Ketum Pranamamyaham."
మొత్తం మీద కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఒక్క గురు గ్రహం మాత్రమే అనుకూలంగా ఉన్నారు. శని, రాహు మరియు కేతు గ్రహముల వలన ఇబ్బందులు ఎదురగును.
Overall, for Karkataka Rashi natives during the Sri Parabhava Naama year, only the planet Jupiter remains favorable. In contrast, the placements of Saturn, Rahu, and Ketu are likely to bring various challenges and difficulties throughout the year.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
మార్చ్ 2026 కర్కాటకరాశి రాశిఫలాలు / March 2026 Cancer Predictions:
ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలు ప్రతికూల ఫలితాలు ఇచ్చును. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సామాన్య యోగమును కలుగచేయును. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవనంలో నూతన వ్యక్తీ వలన తీవ్ర మానసిక ఆందోళన అనుభవిస్తారు. నిరుద్యోగులకు కూడా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ఆశించిన ఉద్యోగాలు చివరి నిమిషంలో చేజారిపోవును. నరఘోష వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. మితభాషణం మంచిది. ఈ మాసంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతీ పని స్వయంగా చేసుకోవడం మంచిది. తగాదలలో సర్దుకుపోవడం ఉత్తమం.
In March 2026, matters related to children may yield negative results, while professional and business affairs are expected to remain average. Financial income will be ordinary, but you may experience severe mental anxiety due to a new person entering your personal life. Unemployed individuals might also face unfavorable outcomes as expected job opportunities could slip away at the last moment. You may encounter difficulties due to the "evil eye" (Nara Ghosha), making it advisable to practice soft speech and avoid taking any adventurous or risky decisions this month. It is better to handle every task personally and remain conciliatory in disputes to ensure a smoother period.
ఏప్రిల్ 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / April 2026 Cancer Predictions:
ఈ మాసం నూతన కార్యములు ఆరంభించుటకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రసాయన సంబంధ వ్యాపారములు బాగా లాభించును. మిగిలిన వ్యాపారాదులు ఆశించిన విధంగా ముందుకు సాగును. వృత్తి రీత్యా విరోదులపై విజయం ఏర్పడును. కోర్టు కేసుల తీర్పులు అనుకూలంగా వెలువడుతాయి. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. మాస ద్వితియార్ధంలో పుష్యమి నక్షత్ర జాతకులకు గౌరవ పురస్కారాలు లభించును. బ్యాంకు సంబంధ ఋణ బాధలు తొలగును. ఈ మాసంలో మిత్రు వర్గం నుండి ఆర్ధిక భాగస్వామ్యాలలో దూరంగా ఉండటం మేలు. అనాలోచితముగా మాట్లాడి అనంతరం బాధ పడుదురు. చివరి వారంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో పై అధికారుల ఆదరణ, ప్రోత్సాహం లభిస్తుంది. ఇతరుల సలహాలకు విలువ ఇచ్చుట అలవాటు చేసుకోవాలి. ఈ మాసంలో మోకాళ్ళకు సంబందించిన సమస్య బాధించు సూచన.
This month will be highly encouraging for starting new ventures, with chemical-related businesses specifically seeing significant profits while other trades progress as expected. Professionally, you will achieve victory over rivals, and court verdicts are likely to be in your favor. While financial income remains strong and bank-related debt issues are resolved, it is advisable to avoid financial partnerships with friends during this period. You should be cautious of impulsive speech to avoid later regret, though your talents will receive due recognition by the final week, along with support and encouragement from superiors at the workplace. It is important to cultivate the habit of valuing others' advice, and you should remain alert regarding potential knee-related health issues, noting that those born under the Pushyami nakshatra will receive honors and awards during the second half of the month.
మే 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / May 2026 Cancer Predictions:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుంటుంది. వ్యాపార, ఉద్యోగ , వృత్తి జీవనంలోని వారికి అనుకూలమైన ఫలితాలు కొనసాగును. రావలసిన ధనం సమయానికి చేతికి అందును. ఏకాగ్రత పెరుగుతుంది. వ్యక్తిగత , వైవాహిక జీవనములలో చక్కటి సంతోషపూరిత రోజులు అనుభవిస్తారు. అవివాహితులకు , నిరుద్యోగులకు ఈ మాసం శుభవార్తలను అందచేయును. సమయానుకూలంగా పనులు పుర్తిఅగును. ఎలాంటి అస్థిర పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినా చలించరు. వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు అభివృద్ధి చెందును. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. విషయములందలి శుభాశుభములు సావధానంగా గ్రహించి క్రమ నిర్ణయము గావిస్తారు. అందరూ హర్షించే కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగ జీవనంలో ఆఖస్మిక మార్పులకు సిద్ధపడాలి. కుటుంబ సభ్యుల మధ్య ఆర్ధిక తగాదాలు పరిష్కారం చేస్తారు. భాత్రు వర్గం వారి పాదాలపై వారు నిలబడు స్థితికి అవసరం అగు సహాయం చేస్తారు.
03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు.
Financial income will remain strong this month, with favorable results continuing for those in business, employment, and professional sectors. Pending funds will reach you on time, and an increase in concentration will allow you to enjoy happy, fulfilling days in both personal and marital life. This month brings auspicious news for the unmarried and the unemployed, as tasks will be completed on schedule and you will remain steady even in the face of unstable conditions. Your personal reputation and prestige will grow, previously stalled projects will be restarted, and you will make firm decisions by carefully weighing the pros and cons of every situation. While you engage in activities that earn everyone's appreciation, you must be prepared for sudden changes in your professional life. Finally, you will resolve financial disputes among family members and provide the necessary support to help your siblings become self-reliant.
The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies.
జూన్ 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / June 2026 Cancer Predictions:
ఈ మాసంలో ధనాదాయంలో కొంత తగ్గుదల కనిపిస్తుంది. సంతాన ప్రయత్నాలు ఫలించు గ్రహ అనుకూలత ఉన్నది. అన్ని రకముల వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. భాగస్వామ్య వ్యవహారాలు ప్రారంభించుటకు ఇది అనుకూల కాలం కాదు. ఈ మాసంలో ఉదర సంబంధ సమస్యలు బాధించు సూచన. తృతీయ వారంలో పునర్వసు నక్షత్ర జాతకులకు కెరీర్ విషయంలో మానసిక ప్రశాంతత లోపించు పరిస్థితులు కలవు. కార్యనిర్వాహక నిపుణత తగ్గుతుంది. మీ క్రింది స్థాయి సిబ్బంది సహకారం లోపిస్తుంది. ఈ మాసంలో ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. మాసాంతానికి పరిస్థితులలో కొంత అనుకూలత ఏర్పడును. ఈ మాసంలో 7, 12, 15, 23 మరియు 28 తేదీలు అనుకూలమైనవి కావు.
01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి.
Financial income will see a slight decrease this month, though planetary alignments are favorable for those aspiring to have children. All types of businesses will continue at a moderate pace, but this is not an auspicious time to enter into new partnership ventures. You should remain cautious regarding stomach-related health issues that may cause distress. During the third week, those born under the Punarvasu nakshatra may face situations leading to a lack of mental peace in their careers, alongside a decline in executive skills and a lack of cooperation from subordinate staff. While you will manage to escape from potential accidents this month, conditions will become somewhat more favorable toward the month's end; however, please note that the 7th, 12th, 15th, 23rd, and 28th are not favorable dates.
With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026
జూలై 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / July 2026 Cancer Predictions:
ఈ మాసంలో ఆలోచనలలో వేగం కనిపిస్తుంది. కానీ ఆచరణలో ఆ వేగం లోపిస్తుంది. ఏకాగ్రతతో కూడిన ప్రణాళిక అవసరమగును. ముందుకు దీక్షతో కొనసాగిపోవలసిన సమయములో సందేహించి వెనుకంజ వేస్తారు.కుటుంబం లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. ఇతరుల కష్టం కూడా గుర్తించి ప్రవర్తించాలి. పెద్దలను లేదా అనుభవజ్ఞులైన వారిని సంప్రదించవలసి వస్తుంది. ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. ఆర్ధిక ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. నూతన భాధ్యతలు స్వీకరిస్తారు. ధార్మిక విషయాలందు ఆసక్తి పెరుగుతుంది. ఆశ్లేషా నక్షత్ర జాతకులకు వాక్ పటిమ కూడా పెరుగుతుంది. క్రీడా రంగంలోని వారికి ఈ మాసం మంచి విజయాలు లభిస్తాయి.
15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
This month, you will experience a swiftness in your thoughts, but that same speed may be lacking when it comes to practical execution, making focused planning essential. You might find yourself hesitating or stepping back during moments that require determined action, and it is advisable to avoid taking unilateral decisions within the family. It is important to recognize the hard work of others and behave accordingly, as you may need to consult with elders or experienced individuals for guidance. Financial income will be strong, allowing you to overcome all economic difficulties and take on new responsibilities. While interest in spiritual matters increases, those born under the Ashlesha nakshatra will see an improvement in their eloquence and communication skills, and individuals in the field of sports will achieve significant success this month.
The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.
ఆగష్టు 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / August 2026 Cancer Predictions:
ఈ మాసంలో కుటుంబ సభ్యులు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక అహంభావానికి సంబందించిన ఇబ్బందులకు దారితీస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మీ మనోభావాలను మార్చుకోవడం నేర్చుకుంటారు. ఉద్యోగ కార్యాలయంలో మీ పట్ల వ్యతిరేక భావన కలిగిన వ్యక్తులతో జాగ్రత్త అవసరం. అతిగా దయాదాక్షిణ్యాలు ప్రదర్శించి ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వ్యాపార వర్గం వారికి ధనాదాయం తగ్గుతుంది. ఆశించిన స్థాయిలో వ్యాపారం ఉండదు. మాస ద్వితీయ భాగంలో (16 వ తేదీ తదుపరి) ప్రయత్నించు వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఈ మాసంలో జల ప్రయాణాలు చేయువారు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు జల సంబంధ ప్రయాణాలు లేదా జల సంబంధ సాహసోపేతమైన కార్యములను వాయిదా వేయుట మంచిది.
This month, you may face situations where family members question your personality, and the arrival of new individuals in the family could lead to ego-related conflicts. You will learn to adapt your mindset according to these evolving circumstances, but it is essential to remain cautious of colleagues at the workplace who may harbor negative feelings toward you. Avoid displaying excessive kindness or mercy, as it could unintentionally invite trouble. While financial income remains average and the business sector sees a decline in expected profits, marriage proposals initiated in the second half of the month, specifically after the 16th, are likely to be successful. Finally, those traveling by water should be extremely careful, and it is advisable to postpone water-based journeys or adventurous activities whenever possible.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
సెప్టెంబర్ 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / September 2026 Cancer Predictions:
ఈ మాసంలో గతకాలంలో గాడి తప్పిన వ్యాపార వ్యవహారాలు తిరిగి సక్రమ మార్గంలోకి వచ్చును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం కలసి వస్తుంది. ఉద్యోగ జీవనంలో మార్పులు ఆశిస్తున్న వారికి కూడా ఈ మాసం కలసి వస్తుంది. సొంత ఇంటి కోసం ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన వాహనాల కొనుగోలుకు కూడా ఈ మాసం అనుకూలమైనది. నూతన పదవులు లభించును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. స్త్రీలకు ఉదర సంబంధ అనారోగ్య సమస్యకు సూచనలు కలవు. 19, 20, 21 తేదీలలో సంతాన సంబంధమైన ఆందోళన ఎదుర్కొనవలసి వస్తుంది. చివరి వారంలో ఆత్మీయులకు సంబందించిన పని వలన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
This month, previously disrupted business affairs will return to the right track, and it will be a favorable period for those seeking government jobs or transitions in their professional lives. Long-standing efforts to acquire a dream home are likely to reach a conclusion, and the timing is also auspicious for purchasing new vehicles or attaining new positions of authority. While financial income remains average, women should be cautious regarding potential stomach-related health issues. You may face some anxiety concerning your children on the 19th, 20th, and 21st, and the final week of the month might require long-distance travel to attend to matters involving close relatives.
అక్టోబర్ 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / October 2026 Cancer Predictions:
ఈ మాసం మాత్రు వర్గీయులకు ఆరోగ్య రీత్యా మంచిది కాదు. వ్యాపార వ్యవహారాలు మరియు ధనాదాయం సామాన్యంగా ఉండును. వ్యక్తిగత జీవనంలో కొద్దిపాటి అశాంతి, సౌఖ్యం తగ్గును. తక్కువ స్థాయి స్త్రీలతో పరిచయాల వలన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. 11 వ తేదీ నుండి 20 వ తేదీ మధ్య కాలంలో నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గత కాలంలో వాయిదా వేసిన పనులను పూర్తీ చేయగలుగుతారు. మాసం చివరి వారంలో శారీరక అలసట అధికం అవుతుంది. ఈ మాసంలో 25, 26, 27 మరియు 28 తేదీలు అనుకూలమైనవి కావు. ఈ మాసంలో శని గ్రహ ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ఒక శనివారం శనైచ్చరునికి తైలాభిషేకము చేయుట మంచిది. నిత్యం శని గ్రహ స్తోత్రం పటించుట కూడా మంచిది.
17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
This month may not be favorable for the health of maternal relatives, and both business affairs and financial income are expected to remain average. You might experience slight unrest and a decrease in comfort in your personal life, and it is wise to be cautious as associations with certain individuals could lead to complications. Between the 11th and the 20th, your efforts to find new sources of income will bear fruit, and you will be able to complete tasks that were previously postponed. Physical exhaustion will increase during the final week, and the 25th, 26th, 27th, and 28th are not favorable dates. Due to the significant negative influence of Saturn (Shani) this month, it is recommended to perform Tailabhishekam to Lord Shaneswara on a Saturday and regularly chant the Shani Graha Stotram for relief.
The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.
నవంబర్ 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / November 2026 Cancer Predictions:
ఈ మాసంలో ఇష్ట దేవతా అనుగ్రహ ప్రాప్తి లభిస్తుంది. స్వ శక్తితో కార్యాలను పూర్తీ చేయగలుగుతారు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారాన్ని పొంది సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఒక కష్టతరమైన పనిని పూర్తీ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఉద్యోగ జీవనంలో కోరుకొన్న మార్పులు పొందుతారు. సమాజంలో గౌరవ సత్కారములు పొందుదురు. కుటుంబానికి సంబందించిన శుభకార్యములు విజయవంతంగా నిర్వహిస్తారు. న్యాయవాద వృత్తి వారికీ, విదేశే పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మాసం నిరాశపూరిత ఫలితాలు ప్రసాదించును.
This month, you will receive the divine blessings of your favored deity and will be able to complete your tasks through your own self-effort. You will enjoy comfort and happiness by receiving the expected support from your spouse, and your ability to finish a difficult task will draw positive attention from everyone. Desired changes in your professional life will manifest, leading to honors and respect within society, and you will successfully organize auspicious family events. However, the month may yield disappointing results for those in the legal profession and for individuals seeking foreign citizenship.
డిసెంబర్ 2026 కర్కాటకరాశి రాశీఫలితాలు / December 2026 Cancer Predictions:
ఈ మాసంలో ఆర్ధిక విషయాలలో అభివృద్ధి క్రమానుగతంగా తగ్గుతుంది. వ్యాపార వ్యవహరాదులలో ఊహించని రీతిలో చికాకులు ఎదురగును. అదృష్టం కలసి రాదు. మంచి మంచి అవకాశములు ఆఖరి నిమిషంలో చేజారిపోవును. సమస్యల పరిష్కారం కోసం ఇతరులను ఆశ్రయించవలసి వస్తుంది. వ్యవసాయదారులకు సరిహద్దు విషయాలలో సమస్యలు ఎదురగును. ఇతరుల దృష్టిలో గొప్పగా కనిపించుటకు అనవసర సామాగ్రి కొనుగోలు చేస్తారు. చివరి వారంలో అధిక శ్రమతో కూడిన జీవనం ఎదురగును. తలపెట్టిన నూతన ప్రయత్నాలు కలసిరావు. పాత మిత్రుల సహకారం అవసరం అవుతుంది. అనుభవపూర్వకంగా నూతన విషయాలు తెలుసుకొనగలరు.
In this month, your financial growth will gradually decline, and you will encounter unexpected irritations in business matters. Luck may not be on your side as excellent opportunities are likely to slip away at the last moment, forcing you to seek the assistance of others to resolve your problems. Farmers may face issues regarding land boundaries, and there is a tendency to purchase unnecessary items simply to impress others. The final week of the month will bring a period of high physical strain and hard work, and any new ventures initiated during this time are unlikely to yield success. You will find it necessary to rely on the support of old friends, and through these experiences, you will gain valuable new insights and wisdom.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
జనవరి 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / January 2027 Cancer Predictions:
ఈ మాసంలో కూడా జీవన అభివృద్ధిలో వేగం తగ్గుముఖం పడుతుంది. జీవన మార్గంలో ఎదో ఒక అశాంతి లేదా అసంతృప్తి కలిగించు పరిస్థితులు ఎదురగుచుండును. ఈ మాసంలో ధనాదాయం అంత ఆశాజనకంగా ఉండదు. నూతన వ్యాపారాలు లేదా వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ మాసం 17 వ తేదీ లోపున అమలు చేయవలెను. నూతన ఒప్పందాల పట్ల జాగ్రత్తగా ఉండవలెను. మిత్రుల మధ్య అభిప్రాయ బేదాలు తలెత్తును. ఈ మాసంలో స్వ ఆరోగ్య విషయాలు కూడా అంతగా సహకరించవు. అనారోగ్యమూలక ధన వ్యయం ఎదురగును. మాసాంతానికి రాబడికి మించని ఖర్చులు ఉన్నాయి. ఋణాలు తీసుకుంటారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకర రాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.
భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం).
సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)
కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)
ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం)
This month, the pace of your personal and professional growth will continue to slow down, and you may encounter situations that cause a sense of restlessness or dissatisfaction in your daily life. Financial income will not be very encouraging, so any attempts at starting new ventures or expanding existing businesses should be implemented before the 17th of the month. It is essential to remain cautious regarding new agreements, as differences of opinion may arise among friends. Additionally, your health may not be very supportive during this period, leading to medical expenses that could cause your total expenditures to exceed your income by the end of the month, potentially requiring you to take out loans.
In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.
Bhogi Festival: January 14, 2027 (Thursday)
Sankranti Festival: January 15, 2027 (Friday)
Kanuma Festival: January 16, 2027 (Saturday)
Mukkanuma Festival: January 17, 2027 (Sunday)
ఫిబ్రవరి 2027 కర్కాటకరాశి రాశీ ఫలితాలు / February 2027 Cancer Predictions:
ఈ మాసంలో కూడా వృధా వ్యయం కొనసాగుతుంది. ఆర్ధిక ప్రణాళికలు అనుకున్న విధంగా ముందుకు సాగవు. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బందిని కలుగ చేయును. సొంత మనుష్యుల నుండి నమ్మక ద్రోహానికి లోనగు సంఘటనలు ఎదుర్కొంటారు. ఇతరుల విషయాలలో హామీలు ఇవ్వకపోవడం మంచిది. భూ సంబంధ క్రయవిక్రయాలు కూడా చేయకుండా ఉండుట మంచిది. గృహ నిర్మాణ సంబంధ విషయాలు అధిక వ్యయప్రయాసలు కలుగచేయును. ఒక విలువైన వస్తువు లేదా దస్తావేజును కోల్పోతారు. జ్ఞాపక శక్తి కి సంబందించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ మాసంలో 8,10,14, 16, 20, 21తేదీలు అనుకూలమైనవి కావు.
Wastage of money and unnecessary expenditures will continue this month, preventing your financial plans from progressing as intended. In addition to these economic challenges, health issues may cause further distress, and you might face instances of betrayal by those close to you. It is advisable to avoid giving guarantees or sureties for others and to refrain from engaging in real estate transactions involving the purchase or sale of land. Matters related to house construction will likely involve excessive costs and significant strain, and there is a risk of losing a valuable item or an important document. You may also experience issues related to memory or forgetfulness; therefore, please note that the 8th, 10th, 14th, 16th, 20th, and 21st of this month are not favorable dates.
మార్చి 2027 కర్కాటకరాశి రాశీఫలితాలు / March 2027 Cancer Predictions:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ఎదిగిన సంతానమ వలన సమాజంలో గౌరవ హాని ఏర్పడుతుంది. ఇంటి సమస్యలు తీర్చుట కష్టం అవుతుంది. మీ ఆహార నియమాలు మార్చుకోవడం మంచిది. ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు పడతారు. గురు గ్రహ ఆశీస్సులతో వంశ వృద్ది విషయంలో మీ చింత తీరుతుంది. చిన్న చిన్న సంభాషణలలో ఓర్పు వహించడం మంచిది. పంతాలకు పోవుట వలన ఇబ్బందులు పడతారు. శాస్త్రీయ సమాలోచనలు చేస్తారు. ప్రకృతి సంబంధ వింతల పట్ల ఆశక్తి పెరుగుతుంది.
This month, financial income will remain average, but you may face situations where the actions of grown children lead to a loss of respect in society. Resolving domestic problems will prove difficult, and it is advisable to make necessary changes to your dietary habits to maintain well-being. While you may encounter some challenges related to government matters, your worries regarding family lineage and progeny will be resolved through the blessings of Jupiter (Guru). It is important to exercise patience during small conversations, as being stubborn or over-insistent can lead to unnecessary trouble. Finally, you will find yourself engaging in scientific discussions and developing a keen interest in the wonders of nature.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.