Sree Parabhava Nama Samvatsara Kanya Rasi / Virgo Sign Free Telugu Rasi Phalalu
- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 08, వ్యయం- 11, రాజ పూజ్యం- 03, అవమానం - 03.
In the Sri Parabhava year (2026 - 2027), for those born under Kanya Rashi (Virgo), the financial and social status figures are: Income - 08, Expenditure - 11, Honor/Social Status - 03, and Dishonor/Insult - 03
పూర్వ పద్దతిలో కన్యారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎదురగు ఆర్ధిక లాభములను మరియు వైవాహిక జీవన ప్రతిబంధకాలను సూచించుచున్నది.
According to the traditional method, the remainder number for Kanya Rashi (Virgo) is '7'. This indicates that in the Sri Parabhava year, those born under Virgo will experience financial gains alongside obstacles or setbacks in their married life.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. 31 మే 2026 వరకు అన్ని విధములా సౌకర్యవంతమైన జీవితాన్ని కలుగచేయును. పేరు ప్రతిష్టలు ప్రాప్తింప చేయును. నూతన వాహన సౌఖ్యమును ఏర్పరచును. స్త్రీలకు సువర్ణ సంబంధ లాభములు ప్రాప్తించును. మీ శాంత స్వభావం విద్వాంసులను ఆకర్షిస్తుంది మరియు వారి స్నేహం లభించునట్లు చేస్తుంది. విద్యార్ధులు చక్కటి శ్రమ పట్టుదల ప్రదర్శించెదరు. వ్యవసాయ దారులకు ఈ కాలం చక్కటి ఆశించిన దిగుబడిని ప్రసాదించును. చక్కటి మాత్రు మరియు పిత్రు సౌఖ్యం అనుభవిస్తారు. యువకులు మిక్కిలి న్యాయవర్తనులుగా జీవించి జీవితంలో అభివృద్దిని మరియు కీర్తిని పొందుతారు. 01 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు చక్కటి ఆరోగ్యమును అనుభవిస్తారు. స్వార్జిత ధనం వలన భూమి లేదా గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఎదిగిన పుత్ర సంతానం వలన మీ చిరకాల స్వప్నాలు కార్యరూపం దాల్చును. సంగీత ప్రీతి మరియు వేదాంత ప్రీతి పెరుగును. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కార్యాలయంలో మీ క్రింద స్థాయిలో అతి చక్కటి సేవకా వర్గం లభిస్తుంది. ఆర్ధికంగా ఈ కాలం మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. 31 అక్టోబర్ 2026 నుండి 23 జనవరి 2027 వరకు కన్యారాశి వారికి బృహస్పతి వలన ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా కన్యారాశి కి చెందిన చిన్నారులు ఆరోగ్య సంబంధ విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దలు డాంభికమైన ధర్మకార్యములు చేయుట వలన అధిక వ్యయం ఎదుర్కొంటారు. ఈ కాలంలో యువకులు స్త్రీ సంబంధ విషయాలలో తప్పుడు పనులు చేయుట వలన సమస్యలను ఎదుర్కోను సూచనలు ఉన్నవి. రాజకీయ నాయకులకు ప్రజలతో విరోధములు ఎదురగును. ప్రజా సంబంధ శాసనాలు చేయునపుడు పలుమార్లు ఆలోచించవలెను. జూద సంబంధ క్రీడల్లో భారీ నష్టములను పొందుతారు. ఈ కాలంలో సంతాన ప్రయత్నాలు కూడా ఫలించవు. 24 జనవరి 2027 నుండి శ్రీ పరాభవ నామ సంవత్సర ముగింపు వరకు కన్యారాశి వారికి బృహస్పతి వలన తిరిగి చక్కటి అనుకూల ఫలితాలు ప్రాప్తించును.
For the upcoming Sri Parabhava Naama Samvatsaram (March 19, 2026, to April 6, 2027), individuals born under Kanya Rashi (Virgo) are poised to enjoy predominantly auspicious results due to the benevolent influence of Jupiter. Until May 31, 2026, life will be marked by comfort, the acquisition of new vehicles, and a heightened social reputation, with women particularly benefiting from gains in gold and jewelry. Your composed nature will foster meaningful connections with intellectuals, while students will exhibit remarkable diligence and farmers achieve their desired yields. The period from June 1 to October 30, 2026, remains exceptionally positive, characterized by robust health and the opportunity to invest self-earned wealth into real estate or housing; furthermore, the progress of elder children will help fulfill long-held aspirations as your personal influence and professional support system grow. Conversely, a cautionary phase arises between October 31, 2026, and January 23, 2027, as Jupiter’s transit may trigger health concerns for children and financial strain due to ostentatious charitable spending. During this interval, youth should exercise moral caution, politicians must navigate public relations with care, and all should avoid speculative ventures or gambling, as progeny-related efforts may not yield results. Fortunately, the tide turns favorably once again from January 24, 2027, ensuring the Telugu year concludes on a successful and prosperous note.
కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లేనివారికి శని వలన దుర్జన స్త్రీ సహవాసం ఎదురగును. స్త్రీ సంబంధంగా అవమానములను ఎదుర్కొంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి సంబంధంగా నష్టములు పొందుతారు.లేదా మీ జాతక ప్రభావం వలన మీ జీవిత భాగస్వామి కి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురగును. వినికిడికి సంబందించిన సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. కన్యారాశి వారు ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని గ్రహ దోషం కలిగి వున్నవారు ఈ సంవత్సరం తరచుగా శనివారం రోజున శనైచ్చరునికి తైలాభిషేకములు జరిపించుకోనుట మంచిది. అదేవిధంగా బ్రాహ్మణులకు నల్ల నువ్వులు దానం ఇవ్వవలెను. ప్రతీరోజు క్రింది మంత్రమును పటించుట మంచిది. కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.
“ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం చాయమార్తండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం”
During the Sri Parabhava Naama year, Kanya Rashi individuals will face predominantly challenging results due to the influence of Saturn. This impact will be particularly pronounced for those whose personal horoscopes lack a strong Jupiter (Guru) influence. Such individuals may encounter unfavorable associations or face social humiliation regarding personal relationships. Significant setbacks or severe health complications for one’s spouse are indicated during this period. Additionally, individuals may suffer from hearing-related ailments and find themselves increasingly dependent on others during travels. It is important to note, however, that Kanya Rashi is not currently under the influence of Elinaati Shani (Sade Sati).
Remedies and Recommendations: For those with a prominent Saturn affliction (Shani Dosha) in their birth charts, performing Tailabhishekam (oil abhishekam) to Lord Shani on Saturdays is highly recommended throughout the year. Furthermore, donating black sesame seeds to Brahmins is advised. Reciting the following Shani Stotram daily will help mitigate these adverse effects:
“Neelanjana Samabhasam Raviputram Yamagrajam Chaya Martanda Sambhutam Tam Namami Shanaishcharam”
కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా ఒక్క సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన అన్ని విషయాలలో అనుకూల ఫలితాలు ఎదురగును. శత్రువులపై విజయం లభిస్తుంది. గృహంలో విలాసవంతమైన జీవితం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. పరదేశ సంచారం చేయును. సంతాన విషయాలలో దత్తత తీసుకొనవలెను అనే ఆలోచన ఉన్నవారికి ఈ సంవత్సరం ఆరోగ్య వంతులైన దత్త సంతాన యోగం ఉన్నది. స్త్రీలను గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు బాధించును. నిర్మాణ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ సంబంధ భారీ కాంట్రాక్టులు లభిస్తాయి.
Throughout the Sri Parabhava Naama year, Rahu will bestow highly favorable results for Kanya Rashi individuals across almost all aspects of life, with the singular exception of matters related to progeny. You will achieve significant victories over your rivals and enemies. There will be a focused effort toward enhancing domestic luxury, with new arrangements made for a sophisticated lifestyle. This period also indicates opportunities for foreign travel or international residence. For those considering adoption, this year presents a highly auspicious yoga for adopting a healthy child. However, women should remain vigilant regarding health issues related to the reproductive system. For professionals in the construction and infrastructure sectors, this year is particularly promising, as it brings the likelihood of securing major government contracts.
కన్యారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతువు వలన కుడా సంవత్సరం అంతా మిక్కిలి అనుకూల ఫలితాలు లభిస్తాయి. సదా మంచి వస్త్ర భాగ్యత లభిస్తుంది. మూలశంఖ వంటి మూలాధారిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార మెళుకువలు నేర్చుకుంటారు. 2027 జనవరి , ఫెబ్రవరి మాసాలలో కేతువు వలన మిక్కిలి లాభదాయక ఫలితాలు పొందుతారు.
During the Sri Parabhava Naama year, Ketu will also provide highly favorable outcomes for Kanya Rashi individuals throughout the duration of the transit. You will consistently enjoy the comfort of fine clothing and a sophisticated lifestyle. On the health front, there is a possibility of minor ailments related to the lower abdomen or issues such as hemorrhoids (Piles), which may require attention. Professionally, this is an excellent period for growth, as you will successfully master new business strategies and technical skills. The months of January and February 2027 are particularly noteworthy, as Ketu will bestow significant financial gains and exceptionally beneficial results during this time.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
మార్చ్ 2026 కన్యారాశి రాశిఫలాలు / March 2026 Virgo Predictions:
ఈ మాసంలో గృహంలోనూ , వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనంలో అనుకూలమైన పరిస్థితిలు ఏర్పడతాయి. చక్కటి లాభకరమైన వాతావరణం మరియు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. నూతన వాహన సంబంధ ప్రయత్నాలు లాభించును. కాలయాపన చేస్తూ , వాయిదా వేస్తూ వస్తున్న పనుల వలన మరింత ఇబ్బందులు ఎదుర్కొందురు. 16 నుండి 21 వ తేదీ మధ్య ఆహార సంబంధ అనారోగ్యం భాదించు సూచన.
During this month, highly favorable conditions will prevail both at home and within your professional spheres, including business and employment. You can expect a profitable environment and a series of satisfying results across your endeavors. Efforts directed toward the acquisition of a new vehicle are likely to meet with success. However, it is important to avoid procrastination; tasks that have been repeatedly delayed may lead to increased complications if not addressed promptly. Regarding health, please exercise caution between the 16th and 21st of the month, as there are indications of potential food-related illnesses or digestive discomfort.
ఏప్రిల్ 2026 కన్యారాశి రాశీఫలితాలు / April 2026 Virgo Predictions:
ఈ మాసంలో నూతన గృహం కొరకు చేయు ప్రయత్నాలు ఫలించును. గృహ నిర్మాణ పనులు సజావుగా కొనసాగును. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలకు కూడా ఇది మంచి కాలం. ఆదాయం బాగుండును. సంతాన పరమైన సంతోషాలు అనుభవిస్తారు. ఉద్యోగులకు అప్రయత్నంగా మంచి అవకాశములు కలసి వచ్చును. కుటుంబ ప్రశాంతత వలన ఆహ్లాదకరమైన గృహ వాతావరణం అనుభవిస్తారు. చివరి వారంలో స్నేహితుల వ్యక్తిగత విషయాలలో జోఖ్యం చేసుకోవడం వలన అపఖ్యాతి పొందుతారు. ఈ మాసంలో 25 , 26 ,27 మరియు 28 తేదీలలో చేయు ప్రయాణాలలో చోరుల వలన నష్టములు ఎదుర్కొనుటకు సూచన ఉన్నది కావునా తగిన జాగ్రత్తలు తీసుకొనుట మంచిది.
During this month, your endeavors toward acquiring a new home will prove successful, and any ongoing construction projects will progress smoothly without hindrance. This is also an auspicious period for those seeking to purchase a new vehicle. Financial inflows remain strong, and you will experience significant joy and pride through your children. Professionals can look forward to unexpected yet excellent career opportunities coming their way. A sense of domestic harmony will prevail, creating a pleasant and peaceful home environment. However, exercise caution during the final week; interfering in the personal matters of friends could lead to unnecessary criticism or a loss of reputation. Furthermore, please be vigilant during travels on the 25th, 26th, 27th, and 28th, as there are indications of potential loss due to theft. Taking adequate precautions with your belongings is highly recommended.
మే 2026 కన్యారాశి రాశీఫలితాలు / May 2026 Virgo Predictions:
ఈ మాసంలో కుటుంబ పరమైన అవసరాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. షేర్ మార్కెట్ లో నూతన పెట్టుబడులు పెట్టుట లాభించును. ఉద్యోగ జీవులకు పై అధికారుల పరిచయాలు కెరీర్ పరంగా కలసి వచ్చును. ఆర్ధిక లక్ష్యాలను సాధించగలుగుతారు. తలపెట్టిన పెద్ద కార్యములు పూర్తి చేస్తారు. కుటిల స్వభావులైన మిత్ర వర్గం నుండి బయటపడతారు. ఇతరులతో సంభాషించునపుడు వాగ్ధాటి ప్రదర్శిస్తారు. చిన్నారులకు వేదవాజ్మయములందు ఆశక్తి ఏర్పడుతుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం కొన్ని విషయాలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొందురు. కుటుంబ శుభకార్యాలలో పాల్గొంటారు. వైద్య రంగంలోని వారికి మంచి ఆర్ధిక ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయదారులకు గో సంబంధ లాభములు ప్రాప్తించును. 12,13 తేదీలలో ఆర్ధికంగా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురగును. ఈ మాసంలో 20వ తేదీ తదుపరి ధనాదాయం బాగుండును.
03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు.
During this month, increased family responsibilities may lead to higher physical exertion. On the financial front, making new investments in the share market will prove to be profitable, and you will successfully achieve your financial goals. Professionals will benefit from developing acquaintances with high-ranking officials, which will aid in career advancement. Major projects or tasks that you have undertaken will reach successful completion. Socially, you will be able to distance yourself from deceptive or ill-intentioned friends. Your communication skills and eloquence will be particularly impressive during interactions with others. Children in the family may develop a keen interest in Vedic literature and ancient knowledge. While you will enjoy participating in auspicious family functions, you might face some challenging situations in your personal life. For those in the medical profession, this month brings excellent financial incentives. Farmers can expect gains related to livestock and cattle. Although the 12th and 13th may present minor financial hurdles, your income will significantly improve after the 20th of the month.
The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies.
జూన్ 2026 కన్యారాశి రాశీఫలితాలు / June 2026 VIrgo Predictions:
ఈ మాసం నూతన ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగ జీవనంలో మార్పులకు, నూతన దంపతుల సంతాన ప్రయత్నాలకు, అన్ని రకముల వ్యాపార పెట్టుబడులకు అత్యంత లాభకరమైన పరిస్థితి కలుగచేయును. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. దూరపు బంధు కలయికల వలన సంతోషం పొందుతారు. సమాజంలో పరపతి కలిగిన నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించుట అవసరమగును. హస్తా నక్షత్ర జాతకులకు మూడవ సోమవారం నుండి ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నవి ముఖ్యంగా మానసిక ప్రశాంతత లోపించును. నూతన ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ద్వారా వ్యాపార రంగంలో మీదైన గుర్తుంపు నిలబెట్టుకుంటారు. ఈ మాసంలో 6,7, 19, 20, 24 తేదీలు అనుకూలమైనవి కావు.
01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి.
This month presents an exceptionally favorable period for those seeking new employment, pursuing career transitions, or making advancements in their professional lives. For newly married couples, this is a highly auspicious time for progeny-related efforts. All forms of business investments are likely to yield significant profits, and overall financial inflows will remain strong throughout this period.
You will experience joy through reunions with distant relatives and forge new connections with influential figures in society. However, it is essential to remain attentive to the health of your children. Specifically, for those born under the Hasta Nakshatra, the third Monday of the month may bring health concerns and a potential lack of mental peace. In the business sector, introducing new products or strategies will help you establish a distinctive identity and reputation. Cautionary Dates: Please note that the 6th, 7th, 19th, 20th, and 24th are not favorable for major activities.
With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026
జూలై 2026 కన్యారాశి రాశీఫలితాలు / July 2026 Virgo Predictions:
ఈ మాసంలో కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన మంచి పనులకు శ్రీకారం చేయుదురు. జీవిత మార్గంలో ఆశించిన ఫలితాలు ఏర్పడును. సమాజంలో గౌరవం పెరుగును. ద్వితీయ వారంలో అధికారులతో వివాదాలు ఏర్పడు సూచన. రహస్యంగా అపరాధాలు చేయుటకు, వ్యసనాల పట్ల ఆకర్షణ పొందడానికి అవకాశం ఉన్నది. ఈ మాసంలో ఆదాయం మాత్రం బాగుండును. ఈ మాసంలో ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు లేదా అధికారులతో సంప్రదింపులు చేయుట మంచిది కాదు. తృతీయ వారం నుండి అవకాశములు నిదానంగా లభించును. మీ ఎత్తుగడలను ఇతరులు ఊహించలేరు. అవివాహితుల వైవాహిక ప్రయత్నాలు లాభించును. దూర ప్రాంత ప్రయాణాలు , వ్యాపార వ్యవహరాదులు కలసి వచ్చును. చివరి వారం సామాన్య ఫలితాలు ప్రసాదించును.
15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
This month, you will initiate significant activities aimed at the welfare and prosperity of your family. Your life path will align with your expectations, leading to the achievement of desired results and an increase in your social standing. During the second week, there are indications of potential disputes with higher authorities; it is advised to handle professional interactions with caution. Be mindful of your personal conduct, as there may be a temporary inclination toward secretive activities or addictive habits. Despite these challenges, your financial income will remain robust. It is not an ideal time to pursue job changes or engage in critical negotiations with superiors during the first half of the month. However, from the third week onwards, new opportunities will gradually emerge. Your strategic thinking will be exceptional, making it difficult for others to anticipate your moves. For the unmarried, matrimonial efforts will prove successful, and long-distance travels related to business will yield positive outcomes. The final week of the month is expected to produce moderate or average results.
The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.
ఆగష్టు 2026 కన్యారాశి రాశీఫలితాలు / August 2026 Virgo Predictions:
ఈ మాసంలో వ్యక్తిగత జీవిత విషయాలలో అశాంతి, అసంతృప్తి కలిగించు సంఘటనలు ఎదురగును. సొంత మనుష్యలతో చికాకులు ఎదురగుట మానసిక ఆవేదనను ఏర్పరచును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగించును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. భూమి లేదా గృహం వంటి స్థిరాస్థి కొనుగోలు విషయాలకు ఈ మాసం మంచిది కాదు. ఇంద్రియ నిగ్రహం కొరకు ఆధ్యాత్మిక మార్గం అవసరం అవుతుంది. కుటుంబ సంబంధ వసతుల కల్పనకు వ్యయం చేయుదురు. నూతన ఆలోచనలను కార్యరూపంలో పెట్టుటకు కూడా ఇది మంచి సమయం కాదు. ఈ మాసంలో కన్యారాశి వారు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. కుటుంబ పెద్దలతో మాటలందు జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 14, 15, 18 తేదీలు అనుకూలమైనవి కావు.
This month, you may encounter incidents in your personal life that lead to restlessness and dissatisfaction. Friction with close relatives or loved ones may result in emotional distress. Additionally, the health of your spouse may become a cause for concern, requiring your attention and care. Financially, the income for this month is expected to be average. It is advised to avoid making significant investments in fixed assets, such as land or housing, as the current timing is unfavorable. To maintain self-control and mental balance, you may find solace in pursuing a spiritual path. While you will likely incur expenses toward improving domestic amenities, this is not an ideal time to implement new ideas or projects. Individuals born under Kanya Rashi are encouraged to postpone major decisions during this period. Furthermore, exercise great caution in your speech when interacting with family elders to avoid misunderstandings. Cautionary Dates: Please note that the 14th, 15th, and 18th are particularly unfavorable.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
సెప్టెంబర్ 2026 కన్యారాశి రాశీఫలితాలు / September 2026 Virgo Predictions:
ఈ మాసంలో కూడా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ మాసంలో ఆదాయం ఆశించినంతగా ఉండదు. సొంత వ్యవహారాలు పూర్తిచేసుకోనుటకు సమయం ఉండదు. ఆలోచనలు కార్యరూపంలోకి అమలుపరచడానికి తగిన ప్రోత్సాహకర వాతావరణం ఉండదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. పోలీసు వ్యవస్థ వలన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. టీమ్ వర్క్ లో మీ అభిప్రాయాలకు విలువ ఉండదు. ఉద్యోగ జీవనంలో పని భారం పెరుగును. ఈ మాసం మొత్తం పట్టుదలతో పనిచేయవలసిన కాలం. వైవాహిక జీవన సంతోషాలు సామాన్యం. వ్యాపార రంగం వారికి కూడా ప్రతికూల ఫలితాలు ఎదురగును. కుటుంబ వ్యయాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ మాసంలో 8 వ తేదీ నుండి 11 వ తేదీ మధ్య ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ కు సంబందించిన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
This month continues to present a series of challenging results. Financial earnings may fall short of your expectations, and you may find yourself lacking the necessary time to attend to your personal affairs. The current environment is not conducive to implementing your ideas, and ongoing tasks may face stagnation.
In your professional life, you may encounter complications involving legal or law enforcement authorities. Within team settings, your opinions and suggestions may not receive the expected valuation, and employees will likely face a significantly increased workload. This is a period that demands immense perseverance and consistent effort. Marital harmony is expected to remain average, and those in the business sector should prepare for unfavorable outcomes. It is highly recommended to keep a strict check on family expenditures.
Health Caution: Between the 8th and 11th of the month, please remain vigilant regarding your health, as there is a strong possibility of facing issues related to the digestive system.
అక్టోబర్ 2026 కన్యారాశి రాశీఫలితాలు / October 2026 Virgo Predictions:
ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఏర్పడును. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు రచించుటకు ఈ మాసం అనుకూలమైనది. కోరుకున్న వారి నుండి పూర్తి సహకారం లభించును. ఈ మాసంలో ఆర్ధిక సంబంధ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. తలపెట్టిన పనులు సకాలంలో పుర్తి అగును. ద్వితీయ లేదా తృతీయ వారాలలో మీరు బాగా గౌరవించే వ్యక్తికీ సంబందించిన అశుభవార్త వినవలసి వస్తుంది. అందరిని ఒక మాటపై చేర్చి వ్యవహారాలు చక్కపెట్టుట ద్వారా పై అధికారుల మన్ననలు పొందుదురు. ఈ మాసంలో 7, 8, 10, 11, 19, 26, 28 తేదీలు అనుకూలమైనవి కావు.
17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
This month promises a return to favorable outcomes. Those seeking employment are likely to receive positive news, and the current period is highly suitable for drafting long-term strategic plans. You will receive full cooperation from those you depend on, and matters related to your professional goals will be encouraging. Your charitable nature will come to the forefront as you contribute financially toward religious or spiritual activities.
While the general income for this month is expected to remain steady, your pending tasks will reach completion on schedule. During the second or third week, you may receive somber news regarding a person for whom you hold deep respect. Professionally, your ability to build consensus and lead others toward a common goal will earn you the appreciation of your superiors.
Cautionary Dates: Please be advised that the 7th, 8th, 10th, 11th, 19th, 26th, and 28th are not favorable for significant activities.
The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.
నవంబర్ 2026 కన్యారాశి రాశీఫలితాలు / November 2026 Virgo Predictions:
ఈ మాసంలో చేపట్టిన పనులు సజావుగా పూర్తిఅగును. శత్రువులపై విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో లాభసాటి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఈ మాసంలో ధనాదాయం ఆశించిన విధంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో కఠిన నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభవార్త. ఈ మాసంలో ఉత్తరా నక్షత్ర జాతకులకు భూ సంబంధమైన క్రయవిక్రయాలు కలసి వచ్చును. ఈ మాసంలో ఆఖస్మిక ప్రయాణాలు ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ మాసం శుభ సమయం. వ్రుత్తి పరమైన జీవనంలోని వారికి ఆదాయం తగ్గును. ఈ మాసంలో 11, 12, 22, 29, 30 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి.
During this month, your endeavors will reach completion smoothly and without significant obstacles. You will achieve a definitive victory over your rivals and competitors. In professional spheres—both in employment and business—you will enter into new, highly profitable agreements. Financial earnings will remain consistent with your expectations. However, you may find it necessary to make firm or difficult decisions regarding family matters. For those aspiring for children, this month brings auspicious news.
Specifically, for individuals born under the Uttara Nakshatra, real estate transactions and land-related dealings will prove highly beneficial. The month may also involve sudden or unexpected travel. For those aspiring for government positions, this is an excellent and auspicious period for your efforts. However, those in specialized professional services may notice a slight decrease in their usual income. Auspicious Dates: The 11th, 12th, 22nd, 29th, and 30th are particularly favorable for initiating new ventures.
డిసెంబర్ 2026 కన్యారాశి రాశీఫలితాలు / December 2026 Virgo Predictions:
ఈ మాసంలో సోదర లేదా సోదరి వర్గం వారితో కుటుంబ వారసత్వ విషయాలపై మనస్పర్ధలు ఎదుర్కోను సూచన. ధన ఆదాయం మాత్రం పెరుగును. పితృ సంబంధమైన భూ లేదా గృహ సంపద లభించును. విద్యా - సాంస్కృతిక రంగాలలోని వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. పనిచేయు కార్యాలయములందు అంతర్గత వ్యవహారాలు మీకు నచ్చిన విధంగా ఉండవు. ఇతరుల పనిభారం కూడా మీరు తీసుకొనవలసి వస్తుంది. ఈ మాసం నిరుద్యోగుల ప్రయత్నాలకు అంతగా కలసిరాదు. మాసాంతానికి ఆరోగ్య భంగములు, చికాకులు ఎదురగును. ముఖ్యంగా శరీర ధారుడ్య సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆహారపు అలవాట్లను నియంత్రించుకొనుట మంచిది.
During this month, there are indications of potential misunderstandings or disputes with siblings regarding ancestral properties or family inheritance. Despite these domestic tensions, your financial income is expected to increase. You are likely to acquire paternal assets, such as land or residential property. This month is particularly favorable for those working in the educational and cultural sectors.
In your professional life, the internal dynamics or administrative affairs at your workplace may not align with your preferences. You may also find yourself burdened with the additional responsibilities of others. For the unemployed, efforts toward securing a new position may not yield the desired results during this period. Toward the end of the month, you may face health setbacks and general irritability; specifically, issues related to physical stamina or bodily strength may arise. It is highly recommended to exercise strict control over your dietary habits to maintain your well-being.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
జనవరి 2027 కన్యారాశి రాశీఫలితాలు / January 2027 Virgo Predictions:
ఈ మాసం ప్రారంభంలో కొద్దిపాటి ఆరోగ్య, ఆర్ధిక సమస్యలు కొనసాగును. మాస మాధ్యమానికి పరిస్థితులు మెరుగవును. జీవిత భాగస్వామితో మాట తగాదాలు తగ్గును. జీవిత భాగస్వామి సహకారం వలన నూతన ఉత్సాహం లభిస్తుంది. కెరీర్ పరంగా ఒక మంచి మార్పు ఏర్పడును. అవివాహితులకు ఆశించిన శుభ ఫలితాలు. విద్యార్ధులు వారి వారి స్థాయిలో ప్రత్యెక గుర్తింపు తెచ్చుకుంటారు. వాయిదా వేసుకుంటూ వస్తున్న పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన వస్త్ర సౌఖ్యం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారములు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. ఆశించిన లాభాలు పొందగలుగుతారు. ఈ మాసంలో ఉత్తరాయణ పుణ్య కాలంలో అన్నదనాదులు చేయడం వలన పితృ వర్గ శాంతి లభిస్తుంది. ముఖ్యంగా శ్రీ పరాభవ నామ సంవత్సర మకర సంక్రమణ కాలంలో కన్యారాశి వారు బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేయుట మిక్కిలి పుణ్య కార్యం. రవి గ్రహ అనుకూలత సంపూర్ణంగా లభిస్తుంది.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకరరాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.
భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం).
సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)
కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)
ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం)
At the beginning of this month, minor health and financial challenges may persist; however, conditions will improve significantly by mid-month. Conflicts and misunderstandings with your spouse will subside, and their renewed cooperation will provide you with a fresh sense of enthusiasm. Professionally, a positive and significant career change is on the horizon. For those who are unmarried, this is an auspicious period that will yield desired matrimonial results. Students will achieve unique recognition at their respective levels of study.
You will successfully complete tasks that have been previously postponed, and you will enjoy the comfort of new acquisitions, such as fine clothing. This is an exceptionally favorable time for those engaged in partnership businesses, as you will be able to secure your expected profits.
Spiritual Recommendations: During the auspicious period of Uttarayana, engaging in Annadana (food donation) will bring peace to your ancestors (Pithru Shanti). Specifically, during the Makara Sankranti period of this Sri Parabhava Naama year, donating Swayampaka (a full set of raw cooking ingredients) to Brahmins is considered a highly meritorious act. You will also enjoy the complete and favorable influence of the Sun (Surya) during this time.
In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027. Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.
Bhogi Festival: January 14, 2027 (Thursday)
Sankranti Festival: January 15, 2027 (Friday)
Kanuma Festival: January 16, 2027 (Saturday)
Mukkanuma Festival: January 17, 2027 (Sunday)
ఫిబ్రవరి 2027 కన్యారాశి రాశీఫలితాలు / February 2027 Virgo Predictions:
ఈ మాసంలో కుటుంబ సభ్యుల అవసరాలకు అధికంగా ధనం, సమయం కేటాయించవలసి వస్తుంది. జీవిత భాగస్వామి కి సంబందించిన ఒక వివాదాన్ని మీరు పరిష్కరించెదరు. మీ మధ్యవర్తిత్వం వలన రావలసిన ధనం సమయానికి అందుకుంటారు. ఈ మాసంలో వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. మానసిక ప్రశాంతత కొరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు . రాజకీయ నాయకులకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఆశించిన పదవులు పొందగలుగుతారు. చిత్త నక్షత్ర జాతకులు ఈ మాసంలో తలపెట్టిన కార్యములన్ని విజయవంతంగా పూర్తి అగును. మనోవంచా ఫలసిద్ధత సంపూర్ణంగా లభిస్తుంది.
During this month, you will find it necessary to allocate a significant amount of both time and financial resources toward the needs of your family members. You will play a pivotal role in resolving a dispute or conflict related to your spouse; your timely mediation will also ensure that pending funds are recovered on schedule. While business activities are expected to continue at a moderate pace, you will find yourself drawn to spiritual activities to maintain your mental peace and clarity.
For those in the political sphere, this is an exceptionally favorable period, as you are likely to attain the positions or designations you have been aspiring for. Specifically, for individuals born under the Chitta Nakshatra, all tasks undertaken this month will reach a successful and triumphant conclusion. You will experience the complete fulfillment of your inner desires and aspirations (Manovancha Phalasiddhi).
మార్చి 2027 కన్యారాశి రాశీఫలితాలు / March 2027 Virgo Predictions:
ఈ మాసంలో వైవాహిక జీవితంలో బంధం మరింత బలపడుతుంది. దీర్ఘకాలంగా నెలకొన్న మనఃస్పర్ధలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తర నక్షత్ర వృద్ధులకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆర్ధిక పరంగా పాత ఋణాలు తీర్చివేసేదురు. ఆర్ధిక లక్ష్యాలు పూర్తిచెయగలరు. విదేశీ ప్రయత్నాలు మాత్రం విఘ్నాలు ఎదుర్కొంటాయి. ఈ మాసంలో ధనాదాయం వృద్ధి చెందును. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సర ముగింపు మీకు సంతృప్తిగా ఉంటుంది.
During this month, marital bonds will strengthen significantly as long-standing misunderstandings are finally resolved. A deep sense of harmony and mutual understanding will prevail between spouses. Regarding health, elderly individuals born under the Uttara Nakshatra are advised to remain vigilant and prioritize their well-being.
Financially, this is a productive period as you will successfully clear old debts and achieve your primary financial objectives. While there may be some obstacles or delays regarding foreign travel or overseas opportunities, your overall income will see a steady increase. On the whole, the conclusion of the Sri Parabhava Naama year will bring you a profound sense of satisfaction and contentment.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.