Sree Parabhava Nama Samvatsara Meena Rasi / Pisces Sign Free Telugu Rasi Phalalu
- Predictions by Dr. Aravind Sidhanthi M.A.,(Astrology)
Individuals born under any of the following lunar constellations (Nakshatras) are classified under Meena Rashi:
Purvabhadra: 4th Pada (Quarter)
Uttarabhadra: 1st, 2nd, 3rd, and 4th Padas
Revati: 1st, 2nd, 3rd, and 4th Padas
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 11, రాజ పూజ్యం - 07, అవమానం - 02
For those born under Meena Rashi, the planetary alignments for this Telugu New Year indicate the following financial and social trends:
Income (Adayam): 14
Expenditure (Vyayam): 11
Social Honour (Raja Poojyam): 07
Humiliation (Avamanam): 02
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అనగా 19 మార్చ్ 2026 నుండి 6 ఏప్రిల్ 2027 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. సమర్ధవంతమైన గృహ యజమానిగా పేరు తెచ్చుకుంటారు. బంధు వర్గానికి మీ ఆదరణ అవసరం అవుతుంది. బంధువులను పోషిస్తారు. వారి ప్రేమాభిమానములు పుష్కలంగా పొందగలుగుతారు. చక్కటి వాహన సౌకర్యం ఏర్పాటు చేసుకుంటారు. స్వ శక్తి తో సర్వ సౌఖ్యములను పొందగలుగుతారు. పెద్ద వయస్సు వారైన తల్లితండ్రుల యోగక్షేమాలు చక్కగా చూసుకోనగలుగుతారు. వారు కోరుకున్న అన్ని సదుపాయాలు సమకూర్చుతారు. వారి వార్ధక్యము సుఖముగా పూర్తి అవుతుంది. స్థిరాస్తుల నుండి ధనార్జన పొందగలుగుతారు. సంస్కారవంతమైన జీవనాన్ని కలిగి ఉంటారు. అందరితో మైత్రి భావముతో ప్రవర్తించి జీవితంలో అభివృద్దిని పొందుతారు మరియు అందరి చేత గౌరవించబడతారు. 10 జూన్ 2026 నుండి 15 నవంబర్ 2026 మధ్య కాలంలో మీనరాశి వారు బృహస్పతి వలన మిక్కిలి అదృష్గత అనుభవిస్తారు. ముఖ్యంగా విద్యార్ధులకు, విద్యా సంబంధ వ్యాపారములు చేయువారికి ఈ కాలం మిక్కిలి అనుకూల కాలం. ఈ కాలంలో జాతకులు విశేష పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఆశించిన ప్రతీ విషయమందు సహాయ సహకారములు లభిస్తాయి. 16 నవంబర్ 2026 నుండి 31 జనవరి 2027 వరకు కొంత ప్రతికూల ఫలితాలు ఎదురగును. శత్రువులు ఏర్పడతారు కానీ ఏమి చేయలేరు. ఉద్యోగ జీవనంలో మీ శ్రమ వలన మీ పైవారికి మరియు మీ క్రింది వారికి మీ వలన లాభం ఏర్పడుతుంది. మీకు మాత్రం ఆశించిన ఫలితం ఉండదు. 01 ఫెబ్రవరి 2027 నుండి సంవత్సరం ముగింపు వరకు మీనరాశి వారు బృహస్పతి వలన తిరిగి అతి చక్కటి అనుకూల ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో ఎవరికీ అయితే గురువు మకరరాశి లో ఉంటారో అటువంటి మీనరాశి వారు మాత్రం పైన పేర్కొన్న ఫలితాలకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు పొందుతారు.
For those born under Meena Rashi, the Sri Parabhava Nama Samvatsaram (March 19, 2026, to April 6, 2027) promises a year of significant growth and fulfillment, primarily driven by the benevolent influence of Jupiter (Guru). You will distinguish yourself as a capable and respected head of the household, finding deep satisfaction in supporting and caring for your relatives, whose love and affection you will enjoy in abundance. This period favors the acquisition of new vehicles and the attainment of all worldly comforts through your own dedicated efforts, including the noble opportunity to ensure the complete well-being and comfort of your elderly parents during their twilight years. While you will enjoy financial gains from fixed assets and lead a life of cultured refinement, a particularly golden period awaits between June 10, 2026, and November 15, 2026, bringing exceptional luck, fame, and success—especially for students and those in educational sectors. Although a brief challenging phase from November 16, 2026, to January 31, 2027, may bring hidden opposition or professional stagnation despite your hard work, the year concludes on a high note with a return to peak prosperity from February 1, 2027. Please note, however, that these positive results may be reversed for individuals whose personal birth charts feature Jupiter positioned in Capricorn (Makara Rashi).
మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శని వలన సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కూడా మీనరాశి వారికి ఏలినాటి శని దశ జరుగుతున్నది. దీని ప్రభావం వలన మీనరాశి వారు వాత సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. శరీర బరువును కోల్పోవుదురు. అనేకమైన ఆలోచనలతో సతమతమవుతారు. ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. రాజకీయ రంగంలో తీవ్ర నష్టములు ఎదుర్కొంటారు. మిమ్మలని వ్యతిరేకించే వారికీ అపకారం చేయవలెను అనే తప్పుడు ఆలోచన లేదా వారి లోపములను తెలుసుకొని వారిని దెబ్బతీయుటకు ప్రయత్నించుట చివరికి మీకే నష్టమును కలుగచేయును. మిమ్మల్ని మీరే మోసం చేసుకోను పరిస్థితులు ఎదురగును. మీనరాశి వారికి ఏలినాటి శని దశ ఆగష్టు 2029 తో పూర్తి అవుతుంది. అప్పటి వరకు మీనరాశి వారు ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు తరచుగా శనికి నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకములు చేయుట, నిత్యం క్రింది మంత్రమును పటించుట మంచిది. ఆరోగ్య పరంగా ఏ ఇబ్బంది లేనివారు శనివారం రోజున పగటి పూట ఉపవాశం ఉండుట కూడా శని ప్రతికూలతను తగ్గిస్తుంది.
“ నీలాంజన సామభాసం రవిపుత్రం యమాగ్రజం చాయమార్తండ సంభూతం తమ్ నమామి శనైచ్చారం”
For Meena Rashi individuals, the Sri Parabhava Nama Samvatsaram continues to be dominated by the challenging phase of Sade Sati (Elinati Shani), which will persist until August 2029. Throughout this year, Saturn’s influence may bring several adverse effects, particularly regarding physical and mental well-being. You may experience health issues related to gastric or joint pains (Vata imbalances), unexplained weight loss, and a mind burdened by restless, conflicting thoughts. It may become increasingly difficult to honor your commitments to others during this time. Those in the political arena should be especially wary, as significant setbacks are possible. Dr. Aravind Sidhanthi advises against any attempts to undermine or harm your opponents; such negative intentions or "traps" are likely to backfire and cause you self-inflicted harm.
Recommended Remedies (Pariharamulu): To mitigate these negative effects—especially for those born under the Uttarabhadra Nakshatra—the following spiritual practices are highly recommended:
Tailabhishekam: Frequently perform Abhishekam to Lord Shani using black sesame (til) oil.
Fasting: If your health permits, observe a fast during the daytime on Saturdays.
Daily Mantra: Regularly chant the following Shani Shloka to seek protection:
“Neelaanjana Samaabhaasam, Raviputram Yamaagrajam | > Chaaya-Maartanda Sambhootam, Tam Namaami Shanaishcharam ||”
మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాహువు వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. రాహువు వలన ధనార్జన బాగున్నా దుర్జన సహవాసం, చెడు వ్యసనాల వలన కష్టార్జితాన్ని దుర్వ్యయం చేస్తారు. వ్యవసాయదారులకు ధనధాన్య సమృద్ధి లభిస్తుంది. జ్యేష్ట సోదర సోదరి వర్గం వారి వలన లాభములు పొందుతారు. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్నవారు మాత్రం సంతాన సంబంధ చికాకులు ఎదుర్కొంటారు. సంతానానికి ఏర్పడబోవు ఆరోగ్య సమస్యలు మానసికంగా ఆందోళన కలుగ చేయును.
During the Sri Parabhava Nama Samvatsaram, Rahu will generally bring favorable financial results for Meena Rashi individuals. While wealth accumulation remains strong, there is a significant warning to stay vigilant against negative influences or harmful habits, as "bad company" could lead to the wasteful expenditure of your hard-earned money. For those in the agricultural sector, this period promises an abundance of wealth and crops, and you are also likely to receive notable benefits or support through your elder siblings. However, Dr. Aravind Sidhanthi notes a specific caution for those who have Kala Sarpa Dosha in their personal birth charts: you may encounter challenges related to your children. Their health issues or general well-being could become a source of mental anxiety, requiring your extra care and attention during this time.
మీనరాశి వార్కి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కేతువు వలన కూడా సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఎదురగును. ఉత్సాహవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. మంత్రాలను ఉపాశించడం వలన లాభపడతారు. చేయు వృత్తిలో కొద్దిపాటి అనిశ్చితత్వం ఎదురైనా తొందరగానే నూతన ధనార్జన పొందగలుగుతారు. అవసరానికి తగిన విధంగా ఏదో ఒక రూపంలో ధన సహాయం లభిస్తువుంటుంది.
For those born under Meena Rashi, the influence of Ketu throughout the Sri Parabhava Nama Samvatsaram will be largely favorable, fostering a life filled with energy and enthusiasm. You will find significant benefits through spiritual practices and Mantra Upasana, which will provide you with mental strength and clarity. Although you may encounter brief periods of uncertainty or fluctuations in your professional life, these will be short-lived, and new avenues for income will quickly manifest. Remarkably, whenever a financial need arises, help will reach you in one form or another, ensuring your requirements are met just in time.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఒక్క శని వలన మినహా గురు, రాహు మరియు కేతు గ్రహముల వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఏలినాటి శని దశ వలన అధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శనైచ్చరునికి తరచుగా శని గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.
In summary, for the Sri Parabhava Nama Samvatsaram, the planetary landscape for Meena Rashi is largely positive. While Jupiter (Guru), Rahu, and Ketu offer favorable outcomes and growth, Saturn (Shani) remains the primary source of challenges due to the ongoing Sade Sati phase. For those experiencing severe hardships under Saturn’s influence, Dr. Aravind Sidhanthi strongly recommends performing Shani Graha Shanti Japam (remedial prayers and chanting) to mitigate the intensity of these difficulties and find peace.
మార్చ్ 2026 మీనరాశి రాశీఫలితాలు / March 2026 Pisces Predictions:
ఈ మాసంలో ప్రతికూల పరిస్థితులు కొనసాగును. ధనాదాయం ఆశించినంతగా ఉండదు. భూ సంబంధ క్రయవిక్రయాల వలన నష్టం ఏర్పడును. వ్యాపార వ్రుత్తి జీవనంలోని వారికి ఆదాయంలో తగ్గుదల ఎదురగును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన భాద్యతల వలన విశ్రాంతి వుండదు. పూర్తిగా శ్రమించినా కూడా విమర్శలు ఎదుర్కొందురు.
During this month, challenging conditions are likely to persist for Meena Rashi individuals. Financial inflows may not meet your expectations, and you should exercise extreme caution regarding real estate; transactions involving land or property could lead to potential losses during this period.
Business & Profession: Those in business or self-employment may experience a noticeable dip in their regular income. It is a time for patience rather than aggressive expansion.
Career & Employment: Professionals will find themselves burdened with new responsibilities that leave little room for rest. Despite your best efforts and hard work, you may still face undue criticism from superiors or colleagues.
Expert Note: Focus on maintaining your resilience this month, as the workload will be demanding without immediate rewards.
ఏప్రిల్ 2026 మీనరాశి రాశీఫలాలు / April 2026 Pisces Predictions:
ఈ మాసంలో కూడా చేపట్టిన పనులలో విఘ్నములు ఎదురగును. కుటుంబ పరంగా సామాన్య ఫలితాలు పొందుతారు. పితృ సంబంధ విషయాల వలన మానసిక చికాకు అనుభవిస్తారు. మీ ఊహలు నిజం కాగలవు. వృత్తి జీవనం వారికి, వ్యాపారస్థులకు సామాన్య ఆదాయం లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వివాహ ప్రయత్నములలో ఏర్పడిన స్తంభన తొలగును. విద్యార్ధులకు పోటీ పరీక్షలలో ప్రతికూలమైన వాతావరణం ఉంది. చివరి నిమిషంలో కోరుకున్న విద్యా అవకాశములు పొందుతారు. ఇతరులను శాసించుట మీ జన్మ హక్కు అను భావమును విడనాడాలి. విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసంలో ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలమైనవి ఈ మాసంలో 10,19,25 తేదీలు అనుకూలమైనవి కావు.
For April 2026, Meena Rashi individuals may continue to face some hurdles in their ongoing projects, with family dynamics yielding average results and paternal matters potentially causing minor mental stress. While your professional and business income remains moderate, this month marks a positive turn for career growth as new job opportunities emerge and previous stagnation in marriage negotiations begins to clear. Your intuition will be remarkably sharp during this time, and while students may find competitive exams challenging, persistence will lead to securing desired educational seats at the last minute. This is a particularly favorable month for scientists and researchers, though Dr. Aravind Sidhanthi advises tempering any authoritative tendencies toward others to maintain harmony. For those planning travel, the North remains a favorable direction, but please exercise caution and avoid major initiatives on the 10th, 19th, and 25th, as these dates are not auspicious.
మే 2026 మీనరాశి రాశీఫలాలు / May 2026 Pisces Predictions:
ఈ మాసం గృహ సంబంధ నిర్మానములకు, తత్సంబంధ ఋణ ప్రయత్నములకు అనుకూలమైనది కాదు. ద్వితియ వారంలో గౌరవ సన్మానములు పొందు అవకాశం ఉన్నది. రేవతి నక్షత్ర జాతకులకు కార్య సిద్ధత లభిస్తుంది. విదేశీ ప్రయాణాలకు ఈ మాసం అనుకూలమైనది. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. అవసరాలకు ఆర్ధిక లోటు ఏర్పడదు. ప్రతీ కార్యమును నిదానంగా జాగ్రత్తతో పట్టుదల గలిగి పూర్తిచేస్తారు. ద్వితీయ వారం సాంకేతక రంగ ఉద్యోగులకు చాలా అనుకూలమైన వారం. తృతీయ వారంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొందురు. చిన్న శస్త్ర చికిత్స చేయించుకొనుటకు సూచన ఉన్నది. సంతాన ప్రయత్నాలు విఫలం అగును. నాలుగవ వారంలో సామాన్య ఫలితాలు ఎదురగును. కళత్రముతో చికాకులు తొలగును. నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు.
03 మే 2026 నుండి 29 మే 2026 వరకు వాస్తు కర్తరీ ఏర్పడుతుంది. ఈ కాలంలో గృహ నిర్మాణ పనులు ఆరంభించకూడదు. నిర్మాణ దశలో ఉన్న పనులను కూడా కర్తరీ కాలం పూర్తి అగువరకు ఆపడం మంచిది. ఈ కాలం లో గృహ ప్రవేశాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఈ కాలంలో శంఖుస్థాపన ముహుర్తాలు, గృహ నిర్మాణ ఆరంభ ముహుర్తాలు మరియు గృహ ప్రవేశ ముహుర్తాలు ఉండవు.
For May 2026, this month presents a blend of significant achievements and necessary health precautions. While it is not an auspicious time for home construction or applying for property-related loans, you will possess the determination and focus to successfully complete any other task you undertake. Financial stability is well-indicated, ensuring no shortage of funds for your requirements, and the second week stands out as particularly rewarding with opportunities for honors and public recognition. This period is especially favorable for those born under the Revati Nakshatra and tech professionals, while those seeking foreign travel will find the timing ideal. However, Dr. Aravind Sidhanthi advises caution regarding your health during the third week, as minor ailments may arise, potentially requiring a small surgical procedure. While efforts related to progeny may face setbacks this month, the final week brings relief as misunderstandings with your spouse clear up, paving the way for signing successful new agreements.
The Vastu Kartari period will occur from May 3, 2026, to May 29, 2026. During this time, it is advised not to commence any new house construction works. It is also recommended to pause ongoing construction activities until the Kartari period concludes, and housewarming ceremonies (Gruhapravesam) should be postponed. Please note that during this interval, there are no auspicious Muhurthams available for foundation stone laying (Shankusthapana), commencement of house construction, or housewarming ceremonies.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
జూన్ 2026 మీనరాశి రాశీఫలాలు / June 2026 Pisces Predictions:
ఈ మాసంలో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండును. ధనాదాయం బాగుంటుంది. వారసత్వ లేదా సొంత గృహలాభం ఏర్పడును. వ్యాపార వ్యపారాదులలో ఆశించిన దాని కన్నా ఎక్కువ ధనప్రాప్తి లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సుఖ సంతోషాలు ఉన్నవి. సామజిక వేడుకలలో పాల్గోనేదురు. కొన్ని నిర్ణయాలను చివరి నిమిషంలో మార్చుకుంటారు. దాని వలన లాభపడతారు. 16, 17, 18, 19 తేదీలలో అధిక భాద్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నూతనంగా గృహాలంకరణ సంబంధ వ్యాపారములు ఈ మాసంలో ప్రారంభించకూడదు. ఈ మాసంలో చేయు మిగిలిన వ్యాపార పెట్టుబడులు లాభించును. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ మాసంలో గణిత శాస్త్రమందు అద్వితీయ పాండిత్యం సంపాదించగలరు.
01 జూన్ 2026 రాత్రి 2.09 నిమిషాలకు గురువు కర్కాటక రాశి లోనికి ప్రవేశించడంతో 02 జూన్ 2026 నుండి 13 జూన్ 2026 వరకు యమునా నదికి పవిత్ర పుష్కరములు నిర్వహించబడతాయి.
For June 2026, the positive momentum continues as this month promises excellent financial returns and domestic prosperity. You can expect significant gains from inherited property or the acquisition of a new home, and those in business will likely see profits that exceed their expectations. Your personal life will be filled with joy and happiness, providing ample opportunities to participate in vibrant social gatherings and celebrations. While you may find yourself reconsidering certain decisions at the last minute, these intuitive shifts will ultimately work in your favor. Dr. Aravind Sidhanthi notes that between the 16th and 19th, you will need to manage a sudden increase in responsibilities. While most new investments made this month are destined for profit, you should specifically avoid starting any new ventures related to home decor or interior design businesses. For students, this is a brilliant period for academic growth, particularly for those with an interest in Mathematics, who may achieve exceptional mastery in the subject.
With the entry of Jupiter (Guru) into Karkataka Rasi (Cancer) on June 2, 2026, at 2:09 AM, the sacred Yamuna River Pushkarams will be observed from June 2, 2026, to June 13, 2026
జూలై 2026 మీనరాశి రాశీఫలాలు / July 2026 Pisces Predictions:
ఈ మాసంలో మనసుకి కష్టం కలిగించే సంఘటనలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొందురు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. అర్ధవంతమైన ఆలోచనలు ఏర్పడవు. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదుర్కొంటారు. మీ పరిసర వాతావరణానికి లేదా ఇతరుల భావాలకు విలువ ఇచ్చుట మంచిది. వాహనాల విషయంలో ఊహించని విధంగా ప్రమాదాలు చోటుచేసుకోను సూచనలు ఉన్నవి. ఇతరులు చేసే వాదనలను మీరు నిరోధించగలరు. 25 వ తేదీ తదుపరి కాలం కలసి వచ్చును. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ధన లాభం లభిస్తుంది. చరిత్రకారులకు, పురావస్తు వ్యాపారులకు ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో 2,7,13,15 వ తేదీలు అనుకూలమైనవి కావు.
15 జూలై 2026 నుండి 13 ఆగష్టు 2026 వరకు గురు మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక శుభ కాలం. ఈ గురు మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను గురు మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
For July 2026, the month begins with several emotional and practical challenges that will require significant patience and resilience. Women, in particular, may face situations that cause emotional distress, and you might find that your ongoing projects hit a standstill while your clarity of thought feels temporarily clouded. It is a period that will test your patience, making it vital to value the opinions of others and remain mindful of your surroundings. Dr. Aravind Sidhanthi advises extreme caution regarding vehicles, as there are indications of unexpected accidents during this time. While you will remain sharp enough to counter others' arguments effectively, real relief arrives after the 25th of the month, when your hard work finally begins to yield results and financial gains manifest. This month is notably favorable for historians and those in the antique or archaeology business, though everyone should be wary of the 2nd, 7th, 13th, and 15th, as these dates are considered inauspicious.
The Guru Moodhami (Jupiter Combustion) period will occur from July 15, 2026, to August 13, 2026. During this Guru Moodhami interval, no auspicious ceremonies or functions should be performed. All significant events and celebrations must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this inauspicious time.
ఆగస్టు 2026 మీనరాశి రాశీఫలాలు / August 2026 Pisces Predictions:
ఈ మాసం కూడా మిశ్రమ ఫలితాలను కలిగించును. చెడు ఆలోచనలు ఏర్పడుతూ ఉండుట వలన మనసు నిలకడగా ఉండదు. మానసిక ఆందోళన తగ్గించుకొనుట కొరకు వైద్య సహాయం అవసరమగును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో ఉద్రిక్తతలు ఎదుర్కొంటారు. తలపెట్టిన ప్రయత్నాలలో విఘ్నములు ఎదురగుతూ ఉంటాయి. మీకు ఉన్న పని నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించదు. చివరి వారం నుండి పరిస్థితులలో అనుకూల మార్పు వస్తుంది. ఈ మాసంలో 7 నుండి 11 వ తేదీల మధ్య తలపెట్టు వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇతరుల అభిప్రాయాలు సావధానంగా స్వీకరించడం వలన లాభపడతారు.
For August 2026, the month presents a mix of results, primarily focused on internal stability and persistence. You may find your mind wavering due to the persistence of negative thoughts, leading to a sense of restlessness; Dr. Aravind Sidhanthi suggests that seeking medical advice or professional counseling may be necessary to manage this mental anxiety effectively. While your financial income remains average and you may face some tensions within family affairs, your professional skills might not receive the recognition they truly deserve this month. Despite hurdles in your initial efforts, a positive shift in circumstances is expected to arrive starting from the final week. Notably, marriage-related efforts undertaken between the 7th and 11th are likely to be highly successful. By remaining open to and patiently listening to the opinions of others, you will find yourself gaining unexpected benefits and clarity.
సెప్టెంబర్ 2026 మీనరాశి రాశీఫలాలు / September 2026 Pisces Predictions:
ఈ మాసంలో ఒక అశుభ వార్త మిమ్మల్ని భాదిస్తుంది. అనవసర తగాదాల వలన మనో విచారం ఏర్పడుతుంది. తెలిసిన వ్యక్తుల వలన ఆర్ధిక నష్టం ఎదుర్కొంటారు. ఆర్ధిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 5 నుండి 15 వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగ జీవనంలో తీవ్ర ఒడిదుడుకులు లేదా ఉద్యోగ నష్టం ఎదురగును. కాలేయ సంబంధ అనారోగ్య సమస్యలు ఉన్న వారికి జాగ్రత్త అవసరం. ప్రయత్నాలలో అదృష్ట రాహిత్యత వెంటాడుతుంది. స్త్రీ తిరస్కారం మిమ్మలను మిక్కిలి బాధిస్తుంది. ప్రాపంచిక విషయాల మీద మనస్సు లగ్నం చేయుట వలన మానసిక స్వాంతన పొందుతారు.
For September 2026, the month presents significant challenges that require immense mental fortitude and caution in all dealings. You may receive distressing news that causes emotional pain, and unnecessary disputes could lead to further mental worry. Dr. Aravind Sidhanthi advises being extremely vigilant regarding financial matters, as there is a risk of monetary loss through people you know. Specifically, between the 5th and 15th, professionals may face severe instability or even the risk of job loss, making it vital to remain composed and diligent. Those with pre-existing liver-related health issues must take extra precautions during this time. While you may feel a lack of luck in your endeavors and face emotional distress due to rejection from a female figure, focusing your mind on worldly duties and practical responsibilities will eventually help you find the mental peace you seek.
అక్టోబర్ 2026 మీనరాశి రాశీఫలాలు / October 2026 Pisces Predictions:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. మీ నైపుణ్య సామర్ధ్యాలు అందరికి తెలుస్తాయి. ఎంతటి శత్రువును అయినా వెంటనే క్షమించగలరు. అనుకున్న విధంగా కుటుంబ పెద్దల ముందు ముఖ్య విషయాలు చర్చించగలరు. దీర్గకాళిక కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వ్యాపారములు మధ్యమంగా ఫలించును. ఉద్యోగ జీవనంలో అనుకున్న లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణములు వలన అలసట మరియు లాటరీల వంటి జూద ప్రక్రియల వలన నష్టం ఏర్పడు సూచన. మీ వ్యావహారిక స్థాయిని మించిన హామీలు ఇచ్చుట పనికిరాదు.
17 అక్టోబర్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు శుక్ర మూఢమి కాలం జరుగుతుంది. ఇది ఒక అశుభ కాలం. ఈ శుక్ర మూఢమి కాలంలో ఏవిధమైన శుభకార్యములను జరిపించకూడదు. సర్వ శుభకార్యములను శుక్ర మూఢమి కాలం పూర్తి అగు వరకు వాయిదా వేయవలెను. ఈ అశుభ కాలంలో ఎటువంటి శుభ ముహుర్తాలు ఉండవు.
For October 2026, the month brings a stabilizing influence where your professional skills and capabilities will finally gain the recognition they deserve. While your financial income remains moderate, you will find yourself in a position of emotional strength, displaying the grace to forgive even your harshest rivals. This is an excellent time for open communication with family elders; important discussions will go as planned, leading to the long-awaited resolution of deep-seated family issues. Dr. Aravind Sidhanthi notes that while new business ventures will yield average results, professionals will successfully meet their targets and objectives. However, be mindful that travel may lead to exhaustion, and there is a strong warning to avoid any form of gambling or lotteries, as they are likely to result in losses. Most importantly, do not commit to guarantees or promises that exceed your practical capacity or social standing.
The Shukra Moodhami (Venus Combustion) period will occur from October 17, 2026, to October 30, 2026. This is considered an inauspicious time. During this Shukra Moodhami interval, no auspicious ceremonies or sacred rituals should be performed. All significant celebratory events must be postponed until this period concludes. There are no auspicious Muhurthams available during this time.
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
నవంబర్ 2026 మీనరాశి రాశీఫలాలు / November 2026 Pisces Predictions:
ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారములలో లాభం పొంది ఆర్ధిక ఋణములు తీర్చివేస్తారు. తలచిన ప్రతీ ఆర్ధిక కార్యం విజయం పొందును. రావలసిన ధనం చేతికి వచ్చును. తృతీయ వారములో కళత్ర వర్గం వారితో వైరం భాదిస్తుంది. వివాహ ప్రయత్నములకు , సంతాన ప్రయత్నాలకు ఈ మాసం అంతగా అనుకూలమైనది కాదు. మానసిక వైద్యులకు ఈ మాసం చక్కగా కలసి వస్తుంది. వీరు వారి రోగులకు చక్కటి ఆత్మవిశ్వాసం మరియు శాంతిని ప్రసాదించగలుగుతారు. ఈ మాసంలో 13, 14, 15 మరియు 16 తేదీలలో ఆదాయం బాగుంటుంది. శుభవార్తలు వింటారు. ఈ మాసంలో 19, 20, 21, 22 వ తేదీలు అంతగా అనుకూలమైనవి కావు.
For November 2026, the positive momentum continues as you experience favorable outcomes across various aspects of your life. This is an excellent month for financial recovery; profits from your profession or business will enable you to clear outstanding debts, and almost every financial initiative you undertake is likely to succeed, including the recovery of long-pending dues. While the 13th through the 16th promise strong income and the arrival of joyful news, Dr. Aravind Sidhanthi advises caution during the third week, as friction with your spouse's side of the family may cause some distress. This month is not particularly ideal for initiating marriage proposals or efforts regarding progeny. However, it is an exceptionally rewarding time for psychiatrists and mental health professionals, who will find great success in instilling confidence and peace in their patients. While the middle of the month is prosperous, please note that the 19th, 20th, 21st, and 22nd are not very favorable for major activities.
డిశంబరు 2026 మీనరాశి రాశీఫలాలు / December 2026 Pisces Predictions:
ఈ మాసంలో ధన ఆదాయం పెరుగును. కుటుంబ సంతోషాలు సంపూర్ణంగా పొందుతారు. పిన్న వయస్సు వారికి కెరీర్ పరంగా ఆశించిన వృద్ధి లభిస్తుంది. విదేశీ జీవన ప్రయత్నాలు లాభించును. కార్యాలయంలో గౌరవ మర్యాదలు పెరుగును. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు వ్యక్తిగత జీవితంలో ఊహించని సంఘటనలు అనుభూతి చెందుతారు. అర్హత లేనివారిని అతిగా నమ్ముట ఎంత ప్రమాదమో తెలిసివస్తుంది. ఈ మాసంలో కళారంగం వారికి ఆశించిన పురోగతి లభిస్తుంది. మీ మనోబలం పెంచుకోనవలసిన కాలం ఇది. పొరపాటున ఇతరులు బాధపడినా మీరు పశ్చాతాపం పొందుతారు. ఈ స్వభావం విడనాడాలి.
For December 2026, the month brings a surge in financial prosperity and complete domestic harmony, making it a fulfilling period for your family life. Younger individuals can expect significant career growth, while those aspiring for opportunities abroad will find their efforts yielding successful results. Your reputation and respect within the workplace are set to rise; however, Dr. Aravind Sidhanthi highlights a specific experience for those born under the Purvabhadra Nakshatra, who may encounter unexpected personal events that serve as a stark lesson on the dangers of over-trusting undeserving individuals. While professionals in the arts and creative fields will see excellent progress, this is a crucial time to strengthen your mental fortitude. You may find yourself feeling deep guilt even when others are hurt by mere accidents or misunderstandings; it is advised to let go of this oversensitive nature to maintain your inner peace.
జనవరి 2027 మీనరాశి రాశీఫలాలు / January 2027 Pisces Predictions:
ఈ మాసంలో చక్కటి ఆరోగ్య భాగ్యత అనుభవిస్తారు. శత్రు నాశనం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్రుత్తి జీవనం లోని వారికి ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. ఈ మాసంలో 10 నుండి 14 తేదీల మధ్య చేయు వివాహ ప్రయత్నములు కలసి వస్తాయి. నూతన వస్తువులు అమర్చుకుంటారు జీవిత భాగస్వామితో సౌఖ్యత మానసికంగా ఆనంద పరుస్తుంది. జీవిత భాగస్వామి మీతో ఏకీభవించక పోయినా మీరు విమర్శలకు దిగారాదు. ఇతరుల భావములు సావధానంగా విని వారి ఉద్దేశం గ్రహించవలెను. బాగా ఎదిగిన సంతానం కెరీర్ పరంగా అభివృదకర స్థితిని పొందుట సంతోషం కలుగచేస్తుంది.
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పుష్యమాస శుక్ల షష్ఠి గురువారం రాత్రి గం. 9.07 ని. లకు అనగా 14 జనవరి 2027న ఉత్తరాభాద్ర నక్షత్రంలో శ్రీ సూర్య భగవానుడు మకర రాశి లోకి ప్రవేశించును. సూర్యాస్తమయం తదుపరి మకర సంక్రమణ సంభవిస్తుంది కాబట్టి మరునాడు అనగా 15 జనవరి 2027 న సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. పితృ వర్గ సంస్కరణలు 15 జనవరి 2027 సూర్యోదయం ఉదయం 6.38 నిముషాల తరువాత నిర్వహించుకోవాలి.
భోగి పండుగ: 14 జనవరి 2027 (గురువారం).
సంక్రాంతి పండుగ: 15 జనవరి 2027 (శుక్రవారం)
కనుమ పండుగ : 16 జనవరి 2027 (శనివారం)
ముక్కనుమ పండుగ: 17 జనవరి 2027 (ఆదివారం)
For January 2027, the year begins on a high note with excellent health and the successful resolution of long-standing rivalries. This is a particularly auspicious month for job seekers, as you are likely to secure your desired employment, while those already in their professions will see a welcome increase in income. You will finally be able to complete pending home construction projects and may find yourself purchasing new household items or luxuries. While the period between the 10th and 14th is exceptionally favorable for marriage-related efforts, and your relationship with your spouse will generally bring mental peace, Dr. Aravind Sidhanthi advises avoiding criticism even if your partner disagrees with you. By patiently listening and understanding the perspectives of others, you will maintain harmony. Furthermore, seeing your grown children achieve significant milestones in their careers will bring you immense pride and joy during this month.
In the Sri Parabhava year, on Pushya Masa Shukla Shashti, Thursday night at 9:07 PM (specifically on January 14, 2027), Lord Surya will enter Makara Rasi (Capricorn) while in the Uttarabhadra Nakshatra. Since the Makara Sankramanam occurs after sunset, the Sankranti festival should be celebrated the following day, January 15, 2027.
Regarding ancestral rites (Pitru Karma/Tarpanam), they should be performed on January 15, 2027, after sunrise at 6:38 AM.
Bhogi Festival: January 14, 2027 (Thursday)
Sankranti Festival: January 15, 2027 (Friday)
Kanuma Festival: January 16, 2027 (Saturday)
Mukkanuma Festival: January 17, 2027 (Sunday)
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today.
ఫిబ్రవరి 2027 మీనరాశి రాశీఫలాలు / February 2027 Pisces Predictions:
ఈ మాసం విద్యార్ధులకు అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. అన్ని వర్గముల వారికి ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. గృహంలో శుభకార్యములు నిర్వహిస్తారు. దాదాపు అన్ని విషయాలలో ఈ మాసం అనుకూలత ఏర్పరుస్తుంది. ఉద్యోగ జీవనంలో ఉన్నత స్థితి మరియు హోదా అనుభవిస్తారు. వాహన వివాహాది సంబంధ విషయాలలో లాభములు పొందుతారు. సంతాన ప్రయత్నములు కూడా ఫలిస్తాయి. ఈ మాసంలో పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు పరిపూర్ణ మానవత్వం ప్రదర్శిస్తారు. వీరి జ్ఞాపక శక్తి అద్వితీయంగా ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ లలో మిక్కిలి ఉపయుక్తంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో ఉత్తమ ఫలితాలు పొందుతారు.
For February 2027, the month unfolds with highly favorable outcomes across all sectors of life. Students will find this period particularly supportive for their academic pursuits, while individuals from all walks of life can expect a very satisfying level of financial income. Business ventures will continue to be profitable, and the home environment will be filled with joy as auspicious functions or celebrations are successfully conducted. Professionally, you are likely to reach a new height in your career, enjoying both elevated status and increased authority. Dr. Aravind Sidhanthi notes that efforts related to purchasing vehicles, marriage proposals, or expanding your family through progeny are all destined for success this month. Specifically, for those born under the Purvabhadra Nakshatra, your innate humanity and exceptional memory will shine brightly, proving to be a massive asset during interviews and competitive assessments. This is also a golden period for those aspiring to or working within Central Government services, as peak results are indicated.
మార్చి 2027 మీనరాశి రాశీఫలాలు / March 2027 Pisces Predictions:
ఈ మాసంలో దీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్న కుటుంబ స్థానచలనము కొరకు చేయు ప్రయత్నములు విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామి మూలక ధనప్రాప్తి పొందుతారు. సువర్ణ వ్యాపార రంగంలోని వారికి ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు ఎదురగును. ఈ మాసంలో 11 వ తేదీ తదుపరి వృధా వ్యయము తరచుగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా అనవసర ఆడంబరాలకు మిక్కిలిగా వ్యయము చేస్తారు. చివరి వారంలో ఉద్యోగ జీవనంలో తీవ్ర ఒత్తిడి ఎదురగుతుంది. ప్రతీ విషయములో ఇతరులపై అనుమానము కలిగి ఇతరులను తీవ్రముగా పరీక్షిస్తారు. ఈ మాసంలో 8,15,17,20 తేదీలు అంత అనుకూలమైనవి కావు.
As the Telugu year draws to a close, your long-standing efforts regarding a change of residence or family relocation are likely to meet with success. Financial gains are indicated through your spouse or life partner, providing a welcome boost to your resources. However, Dr. Aravind Sidhanthi highlights specific challenges for those in the gold and jewelry trade, as you may face complications or hurdles related to government regulations or official documentation.
Financial Caution: From the 11th of the month onwards, be vigilant against a tendency toward wasteful expenditure. You may find yourself spending excessively on unnecessary luxuries or outward appearances, which could strain your budget.
Career & Temperament: The final week of the month brings intense pressure in your professional life. During this time, you may become prone to doubting others, leading you to scrutinize or test your associates severely. Maintaining trust and emotional balance will be vital to navigating this stress.
Important Dates: Please note that the 8th, 15th, 17th, and 20th are not particularly favorable for significant activities or major decisions.
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.