Placeholder image

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం 02, వ్యయం - 14, రాజ పూజ్యం - 02, అవమానం - 02.

  • పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి అన్ని వ్యవహారములలో విజయాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Leo sign / Simha Rasi's Nature...

సింహరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 19-నవంబర్-2021 వరకు కలిసి రాదు. గత శార్వరి నామ సంవత్సరపు సమస్యలు కొనసాగును. 20-నవంబర్-2021 నుంచి గురు గ్రహం యోగించును. ఆర్ధికంగా నూతన అవకాశములు కలుగ చేయును. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. వైవాహిక జీవన సుఖసౌఖ్యాలు పొందుదురు. దీర్ఘకాలికంగా కళత్ర జీవనంలో ఎదుర్కుంటున్న సమస్యలు తొలగును. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పరచును.

సింహ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు లభించును. కుటుంబ మరియు వ్రుత్తి సంబంధ శత్రువులపై విజయం పొందుదురు. తగాదాలలో ఉన్న స్థిరాస్తి సమస్యలు సింహ రాశి వారికి అనుకూలంగా ముగియు సూచనలు అధికంగా ఉన్నవి. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఏలినాటి శని దశ లేదు.

సింహ రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు - కేతువుల వలన సంవత్సరం అంతా సంపూర్ణ ఆయుర్ భాగ్యములు లభించును. విశేషమైన ధనార్జన ఏర్పరచును. మాత్రు వర్గం వలన లాభాపడుడురు. భూ లేదా గృహ సౌఖ్య ప్రయత్నాలకు ఈ సంవత్సరం అనుకూల కాలం. రాహు- కేతువుల వలన విద్యా పరంగా విద్యార్థులకు అతి చక్కటి  ఫలితాలు ఏర్పరచును. 

ఏప్రిల్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

మాస ప్రారంభంలో సొంత మనుష్యులతో వివాదములు, రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోను సూచన ఉన్నది. ప్రారంభించిన కార్యములు అటంకములను ఎదురైనా చివరికి పూర్తి అగును. చేతిపై వృధా వ్యయము అధికంగా ఏర్పడును. 14వ తేదీ నుండి పరిస్థితి కొంత అనుకులించును. ఆర్ధిక పరిస్థితి మరింత సానుకూలమగును.  విద్యార్ధులకు ముఖ్యంగా  వ్రుత్తి విద్య కొరకు ప్రయత్నించు వారికి మంచి కాలం ప్రారంభం అగును. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. మాసాంతంలో బాల్య మిత్రులను కలువుట వలన లేదా ఆప్తుల తో కలయిక వలన ఆనందమయ సమయం.

మే 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో అతి చక్కటి ఫలితాలు ఎదురగును. ధనాదాయం పెరుగును. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆశించిన లాభములు లభించును. వివాహ పరంగా దూర ప్రాంతము నుండి వచ్చిన ఎదురుచూస్తున్న శుభ వార్త ఆనంద పరుస్తుంది. గృహ వాతావరణం శాంతిని కలిగి ఉంటుంది. మాస మధ్యలో వ్యక్తిగత ఖర్చులు ముఖ్యంగా వాహనాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయుట వలన అధికంగా ఏర్పడును. కోర్తువ్యవహరములలో నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చివరి వారంలో ఒంటరితనం అనుభవిస్తారు. కళాకారులకు చక్కటి అభివృద్ధి లభించును. ఈ మాసంలో 2,6,7,15,16,29 తేదీలు ఉద్యోగ జీవనములో మార్పులకు అనుకూలమైనవి. నూతన ప్రణాళికలు రచించడానికి కూడా అనుకూలమైనవి. 

జూన్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో కూడా చక్కటి ఫలితాలు ఎదురగును. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించును. ప్రవర్తనలోని పొరపాట్లను సరిదిద్దుకొని వ్యవహారములను పూర్తి చేయగలుగుతారు. తృతీయ వారంలో ప్రత్యర్ధుల నుండి సానుకూల సందేశాలు అందుకుంటారు. వివాదాలు కొలిక్కి వచ్చును. ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ మాసంలో వ్యాపార వ్యవహారాలు లాభాపురితంగా సాగుతాయి. ఈ మాసంలో  23,24, 27,29 తేదీలలో నూతన కార్యములు, వివాహము కొరకు చేయు ప్రయత్నములు లాభించును. 

జూలై 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వృత్తి వ్యాపారములు  ఉత్సాహ పూరితంగా , లాభపూరితముగా కొనసాగుతాయి. పనిచేయు కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మూలకంగా కూడా ఆశించిన సౌఖ్యం  ఉండును. ప్రధమ వారంలో గృహంలో కోరుకున్న మార్పులు, పుణ్యక్షేత్ర సందర్శన వంటి అనుకూల ఫలితాలు, ద్వితియ మరియు  తృతీయ వారంలో ఆకస్మిక వివాదములు, సమయం వృధా అగుట , ఖర్చులు పరిమితి మించుట వంటి కొద్దిపాటి ప్రతికూల ఫలితాలు ఎదుర్కొందురు. అయితే వృత్తి వ్యాపారాలలో మాత్రం ఆదాయం సామాన్యం గానే ఉండును. ఉద్యోగ జీవనం సామాన్యం. ఈ నెలలో 19,22,23 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

ఆగస్టు 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో కూడా ధనాదాయం సామాన్యం. గృహంలో  స్త్రీల ఆర్ధిక పరిస్థితి గతం కన్నా ఆశాజనకంగా ఉంటుంది.  కుటుంబ వాతావరణంలో సంతోషములు, బంధువులు మిత్రుల నుండి ఆశించిన సహకారములు పొందుదురు. సంతాన ప్రయత్నాలలో విజయం లభించును.ఈ మాసంలో 3,8,9,16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. 2,11,19, 21, 29 తేదీలు మంచివి కావు. కష్టంతో కార్యములు పూర్తి లేదా మానసిక అశాంతిని ఏర్పరచును

సెప్టెంబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ఆధ్యాత్మిక జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. ముఖ్యంగా అర్చకత్వం వంటి పవిత్ర సేవలో ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడును. కుటుంబ విషయాల్లో సభ్యుల మధ్య మాట కలవదు. స్త్రీ సంబంధ వివాదాములలో చిక్కుకుందురు. వృత్తి వ్యాపారములు మందకొడిగా కొనసాగును. దూరప్రాంత ప్రయాణములు. కోర్టు వ్యవహారములలో అననుకూలత ఎదుర్కొందురు. నిరుద్యుగులకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. జీవన మార్గం శ్రమతో కూడి ఉండును. ఈ మాసంలో 13 నుండి 19వ తేదీ మధ్య ప్రయాణములు చేయుట మంచిది కాదు. 

అక్టోబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నములు లాభించును. స్తంభించిన వ్యాపార వ్యవహారములు తిరిగి ప్రారంభం అగును. నూతన స్థల సందర్శన చేయుదురు. ద్వితియ వారంలో కార్యగతి అనుకూలంగా ఉండును. మంచి మాటలతో వ్యవహారములు పూర్తి చేయుదురు.మీపై ఉన్న వ్యతిరేకత క్రమంగా తగ్గును. తృతీయ వారంలో మాతృ వర్గం సహకారంతో వివాహ ప్రయత్నములు విజయవంతం అగును. చివరి వారం సాధారణ ఫలితాలు కలుగచేయును.

నవంబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం ఆశించిన విధంగా ఉండును. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు ఫలిస్తాయి. పితృ వర్గీయుల ఆదరణ మరియు ప్రేమ పొందుదురు. మిత్రుల వలన ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములు విజయవంతమగును. నూతన కాంట్రాక్టులు లభించును. అవివాహితులకు కూడా శుభవార్త లభించును. తృతీయ వారంలో ధైర్య సాహసములు పనికిరావు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కష్టానికి తగిన ఫలితం లభించదు. ఈ వారంలో ఇతరులకు ఇచ్చిన ముఖ్య వస్తువు లేదా ధనం తిరిగి వచ్చుట కష్టం అగును. ఈ మాసంలో 4, 9, 17, 20, 26 తేదీలు అనుకూలమైనవి కావు. 

డిసెంబర్ 2021 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో వ్యాపారాదులలో జయం , ఆఖస్మిక ధన ప్రాప్తి యోగం ఉన్నవి. ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు పొందుతారు. వృత్తి వర్గం వారికి చక్కటి  ధన లాభములు లభించును. ద్వితియ వారం సామాన్య ఫలితాలు కలుగచేయును. తృతీయ వారంలో కుటుంబంలో  అనారోగ్య కారణాల వలన కొద్దిపాటి మానసిక అశాంతి ఎదురగును. జీవిత భాగస్వామితో మద్యమ సంతోషాలు. దూరప్రాంత లేదా విదేశీ జీవన  ప్రయత్నములు ఆటంకములతో ఫలించును. ఈ మాసంలో బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. ఈ నెలలో ప్రధమ ద్వితియ వారములు నూతన ప్రయత్నాలు చేయుటకు అనుకూలమైనవి. 

జనవరి 2022 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఆదాయం లో కొద్దిపాటి తగ్గుదల ఎదుర్కొందురు. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో ధన లాభం ఏర్పడదు. వడ్డీ వ్యాపార రంగంలో ధననష్టములకు అవకాశములు కలవు. మిత్ర వర్గమునకు సంభందిచిన ఒక అశుభ వార్త వినుటకు కూడా సూచన ఉన్నది. చక్కటి స్త్రీ  సంతాన ప్రాప్తి. 11వ తేదీ తదుపరి నూతన పరిజ్ఞానంలో శిక్షణ లు పొందు అవకాశం ఉన్నది. ఉద్యోగ జీవనంలో చిక్కులు తొలగుతాయి. మాసాంతంలో నూతన వ్యవహారములు ప్రారంభించుట వాయిదా వేసుకొనుట మంచిది. 

ఫిబ్రవరి 2022 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య బాధలు తొలగును. ఉద్యోగ జీవనంలో ఒత్తిడి తగ్గును. ప్రధమ మరియు ద్వితియ వారములలో శత్రువిజయం, ఆదాయ పెరుగుదల మరియు  జీవన హోదాలో ఉన్నతిని ఆశించవచ్చు. పురుష సంతాన వలన చికాకులు ఎదుర్కొందురు.సర్వ  శుభకార్య ప్రయత్నాలు లాభించును. మిత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు స్థిరమైన ఆలోచనలు చేయుట కష్టముగా ఉండును. ముఖ్యంగా 13 నుండి 22వ తేది మధ్య కాలం అనుకూలంగా లేదు. 23వ తేదీ నుండి పరిస్థితులలో అనుకూలమైన మార్పులు పొందుదురు. 

మార్చి 2022 సింహ రాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో కళత్ర మూలకంగా సంతోషకరమైన వాతావరణం అనుభవిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు. లేదా నూతన వస్తువల అమరిక లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలలో  కదలిక ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనాదాయం  సామాన్యం. రాజకీయవర్గంలోని వారికి అవమానములు లేదా అప్రతిష్టలు ఏర్పడును. భూ సంబంధ లావాదేవీలు ఆశించిన విధంగా ముగియవు. ఆశలకు భిన్నంగా ఉండును. తృతీయ వారం నుండి గృహంలో శుభకార్య సంభదమైన వ్యయం. వ్యయములకు అవసరమగు ధనం సకాలంలో లభించును. ఈ మాసంలో 5,7,14,20,21,25 తేదీలు వ్యక్తిగత వ్యవహారాలకు అనుకూలమైనవి.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.