Sree Sarvari Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu
మిధున రాశి వారికీ శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అనగా 25-మార్చి -2020 నుండి 12-ఏప్రిల్ -2021 వరకూ ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం 19 నవంబర్ 2020 వరకూ అనుకూల ఫలితాలను కలుగచేయును. ముఖ్యంగా అవివాహితులకు తప్పక వివాహం జరుగును. అతి చక్కటి సంబంధములు పొందుదురు. 20 నవంబర్ 2020 నుండి గురువు నీచ క్షేత్రంలోనికి వెళ్ళుట వలన సమస్యలు ఏర్పరచును. సంతానం వలన సమస్యలు, మానసిక ఆందోళన, సంతాన ప్రయత్నాలలో అపజయం, బంధు వర్గం వలన సమస్యలు, ఉద్యోగ జీవనంలో ఆఖస్మిక సమస్యలు, ప్రతికూల వాతావరణం వంటి ఇబ్బందులను ఏర్పరచును.
మిధున రాశి వారికీ శ్రీ శార్వరి నామ సంవత్సరంలో శని ఒక్క ఆరోగ్య విషయాలలో మినహా మిగిలిన అన్ని విషయములందు సమస్యలను ఏర్పరచును. తగాదాలలో ఉన్న వారసత్వ సంపద నష్టపోవుదురు. వృధా ప్రయాణాల వలన చికాకులు ఎదుర్కొందురు. గురువులను, స్నేహిత వర్గములను ద్వేషించు పరిస్థితులు ఏర్పడును. శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఏలినాటి శని లేదు.
మిధున రాశి వారికీ శ్రీ శార్వరి నామ సంవత్సరంలో రాహు గ్రహం కలసిరాదు. ఆరోగ్య పరంగా మధుమేహ సమస్యలను ఏర్పరచును. శారీరక ధారుడ్యం తగ్గిపోవును. కపట స్వభావంతో ఆలోచించు మనస్తత్వమును , కుటిల ఆలోచనా తత్వమును ఏర్పరచును. 25 సెప్టెంబర్ 2020 నుండి ఆదాయం కన్నా అధికమైన ఖర్చులు ఏర్పడును. తక్కువ స్థాయి వ్యక్తులతో పరిచయం వలన కుటుంబ అపఖ్యాతి ఏర్పడును. నూతన స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను.
మిధున రాశి వారికీ శ్రీ శార్వరి నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఏర్పడును. తీవ్ర ప్రతికూల ఫలితాలు ఏమియూ లేవు. అయిననూ మిధున రాశి జాతకులు శ్రీ శార్వరి నామ సంవత్సరం అంతా ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించుట మంచిది.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.