Sree Vikari Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu

సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) సంతాన సంబంధ మరియు గౌరవ సంబంధ విషయాలలో మినహా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. సింహరాశికి చెందిన గర్భవతులు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించడం, వైద్యుల పర్యవేక్షణలో ప్రసవం జరగటం మంచిది. నూతన దంపతులు ఈ వికారి నామ సంవత్సరంలో పిల్లలకు ప్రయత్నించకుండా వుండడం మంచిది. గ్రహగతుల ఫలితంగా శ్రీ వికారి నామ సంవత్సరం పైన పేర్కొనిన రెండు విషయాలలో మినహా మిగిలిన విషయాలలో అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. తలపెట్టిన పనులున్ని సకాలంలో పుర్తిఅగును. సహనముతో మాత్రమె కుటుంబ సభ్యులను కలపి ఉంచగలము అని గ్రహిస్తారు. సంవత్సర ప్రారంభమున ఆర్ధికంగా కొంత ఇబ్బందులు ఎదురగును. క్రమంగా సంవత్సరాంతానికి ఆర్ధికంగా సంతృప్తికర పరిస్థితులు ఏర్పడును. స్థిరాస్థి వ్యవహారాలలో, విదేశీ వ్యవహారాలలో, వైవాహిక జీవనములో ఆశించిన ఫలితాలు ఉండును. వ్యాపార రంగంలోనివారికి వ్యాపార విస్తరణకు సొంత వివేకం అవసరం. ఈ సంవత్సరం చక్కటి గృహలాభం ఏర్పడును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. ఉద్యోగ ప్రయత్నాలలో దళారులను నమ్ముకోనుట వలన వృధా వ్యయం. కోర్టు వ్యవహారాలలో లాభం. మందబుద్ధి వలన తీవ్ర నష్టములు ఎదుర్కొందురు. జీవిత భాగస్వామి వలన ధన విషయాలందు లాభం ఏర్పడును. వ్యవసాయదారులకు రెండు పంటలు కలసి వచ్చును. విద్యార్ధులకు మంచి ఆశించిన ఫలితాలు. వృత్తి జీవనంలోని వారికి సామాన్య ఫలితాలు. పేరు ప్రఖ్యాతలు తగ్గును. రాజకీయ నాయకులకు పదవీ గండం.
సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన సంతాన సంబంధ విషయాలు మినహా మిగిలిన విషయలందు మంచి ఫలితాలను కలుగచేయును. భూ సంబంధమైన వ్యవహారాలు విజయం పొందును. విద్యార్ధులు రెండు మూడు విద్యలందు ప్రవేశం చేసిననూ అతి నమ్మకంతో దేనియందు పరిపూర్ణత పొందక ఇబ్బందులు ఎదుర్కొందురు. 04-నవంబర్-2019 నుండి సంవత్సర అంతం వరకూ పుత్ర సంతానానికి కొద్ది ప్రమాదపూరిత కాలం.
సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగా యోగించును. చక్కటి ధనార్జనను ఏర్పరచును. వారసత్వ సంపద కోసం కోర్టు వ్యవహారాలు కలిగిన వారికి అనుకూల ఫలితాలను ఏర్పరచును. గర్భవతులకు ఇబ్బందులు కలుగచేయును.
సింహరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన చక్కటి ఆర్ధిక పురోగతి ఏర్పడును. న్యాయవంతమైన ఆర్జన ఏర్పరచును. సంతానం వలన మాత్రం సౌఖ్యం ఉండదు.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.