Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu
2019 2020 sri vikari nama midhuna rasi phalitalu

మృగశిర 3, 4 పాదములు లేదా ఆరుద్ర 1,2,3,4 పాదములు లేదా పునర్వసు 1,2,3 పాదములలో జన్మించిన వారు మిధునరాశికి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 11
వ్యయం (Expenditure): 05
రాజపూజ్యం (Honor): 02
అవమానం (Dishonor): 02

శ్రీ వికారి నామ సంవత్సరంలో మిధునరాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 02 అవమానం - 02. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "7". ఇది ఆర్ధిక విషయాలలో విజయాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

మిధున రాశి వారికీ శ్రీ వికారి నమ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆర్ధికంగా కలసి వచ్చును. ధనాదాయం బాగుండును. ఆరోగ్య పరంగా ఈ సంవత్సరం కలసి రాదు. యువ దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించును. నూతన వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఉద్యోగుల స్థానచలన ప్రయాతాలు విఫలమగును. అధికారుల వలన తీవ్ర ఒత్తిడులు ఎదుర్కొందురు. విదేశీ వ్యవహారములందు విజయం ఏర్పడును. మంచి ఆలోచనలు చేయుట, మాట నిలకడ కలిగి ఉండుట వలన మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందేదురు. కుటుంబ భాధ్యతలు చక్కగా నిర్వహించగలరు. సొంత గృహ ప్రయత్నాలు లేదా గృహంలో నిర్మాణాత్మక మార్పులకు ఈ సంవత్సరం కలసిరాదు. చేతి వృత్తి నిపుణులకు గడ్డుకాలం. విద్యార్ధులకు మంచి ఉత్తీర్ణతా ఫలితాలు. వ్యాపార రంగంలోని వారికి చక్కటి లాభాలు. భాగస్వామ్య వ్యవహరాదులు నష్ట పరచును. కుటుంబ తగాదాలు పరిష్కారం అగును. పుణ్యక్షేత్ర సందర్శన చేయుదురు.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు మిశ్రమ ఫలితాలను కలుగచేయును. 03-నవంబర్-2019 వరకూ అనవసర తగాదాలు, వృధా ఖర్చులు, జీవిత భాగస్వామితో తగాదాలు లేదా ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. 04-నవంబర్-2019 నుండి సొంత ఆరోగ్య సమస్యలను కలుగచేయును. అవివాహితులకు అతి చక్కటి సంబంధాలు వచ్చునట్టు చేయును. అవివాహిత మగవారికి మిక్కిలి పతిభక్తి కలిగిన జీవిత భాగస్వామి లభించును. అయితే వక్తిగత జాతకంలో గురు గ్రహం పాప సంబంధం కలిగి, నీచ స్థానాలలో ఉన్న మిధున రాశి వారికీ ఆయుర్ధాయ భంగములకు సూచనలు కలవు.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Influence):

మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం మంచి ఫలితాలను ఇవ్వడు. 23-జనవరి-2020 వరకూ ఆర్ధికంగా మంచి ధనాదాయం కలుగచేయును. ప్రధమ కళత్ర నష్టం జరిగి, ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి జీవిత భాగస్వామిని ఏర్పరచును. 24-జనవరి-2020 నుండి వారసత్వ పరంగా లభించిన భాగ్యంలో కొంత వ్యయం ఏర్పరచు సూచన. వ్యక్తిగతంగా పూర్ణ ఆయుర్దాయం కలుగచేయును.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

మిధున రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహువు - కేతువు ఇరువురూ మిశ్రమ ఫలితాలను కలగచేయును. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు, శరీర ధారుడ్య సమస్యలు వంటి సమస్యలు ఏర్పరచును.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.