Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu
2019- 2020 sree vikari nama karkataka rasi free telugu rasi phalitalu

పునర్వసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేష నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.

📊 2019 - 2020 ఆదాయ వ్యయాలు & రాజపూజ్యావమానాలు (Kandaya Phalalu):

ఆదాయం (Income): 05
వ్యయం (Expenditure): 05
రాజపూజ్యం (Honor): 05
అవమానం (Dishonor): 02

శ్రీ వికారి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 05 అవమానం - 02. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "2". ఇది భూసంబంధమైన లేదా గృహ సంభంధమైన లాభాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

2019 - 2020 Horoscope & Planetary Transits Analysis:

కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం (ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మిశ్రమ ఫలితాలను కలుగచేయును. చేపట్టిన పనులలో విజయం ఏర్పడుతున్ననూ సంతృప్తి ఉండదు. కుటుంబంలో క్రమశిక్షణ లోపించును. సొంత గృహ కోరిక నెరవేరును. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం అందదు. కుటుంబమున, సమాజమున గౌరవ హాని సంఘటనలు. సంతాన ప్రయత్నాలు చేయువారికి శుభ వార్త. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వృత్తి జీవనం వారికి కొద్దిపాటి గడ్డుకాలం. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు కలసి వచ్చును. కోర్టు విషయాలలో అనుకూలమైన తీర్పులు. వారసత్వ భాగ్యం కలసి వచ్చును. వ్యాపార రంగంలోని వారికి సామాన్య ఫలితాలు. వ్యాపార లక్ష్యాలను చేరుకొనుట కష్టం. వ్యాపారం మీద శ్రద్ధ అవసరం. మిత్రుల మీద భాద్యతలు పెట్టుట వలన నష్టపోవు సంఘటనలు కలవు. విద్యార్ధులు శ్రమించవలెను. నూతన విద్యకొరకు చేయు ప్రయత్నములందు పట్టుదల అవసరం. రాజకీయ నాయకులకు లాభవ్యయములు సమానం. అవివాహితుల ప్రయత్నాలు విఘ్నములతో విజయం పొందును.

🪐 గురు గ్రహ ఫలితాలు (Jupiter Influence):

కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురువు 03-నవంబర్-2019 వరకూ చక్కటి సంతాన భాగ్యములను కలుగచేయును. పుత్ర సంతానానికి అవకాశములు అధికం. భూసంబంధమైన, గృహ సంబంధమైన వ్యవహారాలలో చక్కటి లాభాలను కలుగచేయును. 04-నవంబర్-2019 నుండి గురువు కలసి రాడు. రక్త సంబంధమైన లేదా నరముల సంబంధమైన ఆరోగ్య సమస్యలను కలుగచేయును. వ్యవహారములందు తగాదాలు ఏర్పడుచుండును.

🪐 శని గ్రహ ఫలితాలు (Saturn Influence):

కర్కాటక రాశి వారికీ శ్రీ వికారి నామ సంవత్సరంలో శని సంవత్సరం అంతా కలసి రాడు. నల్లని వస్తువల వలన సమస్యలను, శత్రుత్వాలను, ఆరోగ్య సమస్యలను, శని గ్రహం నీచ లేదా శత్రు స్థానంలో ఉన్న జాతకులకు ఆర్ధిక ఋణములను ఏర్పరచును. వ్యవసాయ రంగంలోని వారు నల్ల ధాన్యపు పంటలు వేయకూడదు. లోహ సంబంధ వ్యాపారములు చేయువారు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

🪐 రాహు - కేతు గ్రహ ఫలితాలు (Rahu & Ketu Influence):

కర్కాటక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ సంవత్సరం అంతా కలసిరారు. వ్యవహరపు చిక్కులను, శత్రువ్రుద్ధి, దుర్జన సహవాసముల వలన వృధా ధన వ్యయమును, అపఖ్యాతిని, వ్యక్తిగత జాతకంలో రాహు - కేతు దోషాలు కలిగిన వారికి పోలీసుల వలన ఇబ్బందులు, కోర్టు సమస్యలు, కారాగృహ ప్రాప్తి వంటి సమస్యలు ఏర్పడు సూచన.

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

Youtube Channel - Whatsapp Channel - Instagram - Facebook - Telegram - Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or Contact Us for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.