Placeholder image

2021 - 2022 శ్రీ ప్లవ నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు

Sree Plava Nama Samvatsara Kanya Rasi / Virgo Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 05, అవమానం - 02.

  • పూర్వ పద్దతిలో కన్యా రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి చక్కటి విజయాన్ని సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Virgo sign / Kanya Rasi's Nature...

కన్యారాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో అనగా 13-ఏప్రిల్-2021 నుండి 01-ఏప్రిల్-2022 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు.తరచుగా గురు గ్రహం  అనేక ఇబ్బందులు, ఆటంకాలు, అపవాదులు ఏర్పరచును. వారసత్వ సంబంధ స్థిరాస్తులు నష్టపోవు సూచనలు అధికంగా ఉన్నవి. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం లోపించిన కన్యా రాశి వారు శ్రీ ప్లవ నామ సంవత్సరంలో ప్రతీ విషయంలో ఆలోచించుకొని వ్యవహరించాలి. వ్యక్తిగత జీవితంలో ముఖ్య నిర్ణయాలలో చాలా జాగ్రత్త వహించాలి.

కన్యా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా ఆర్ధికంగా చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయు వారికి సుందరమైన పుత్రికా సంతానం లభించును. పుత్ర సంతానమునకు మాత్రం ఆరోగ్య సమస్యలు ఏర్పరచును. లోహ సంబంధ వ్యాపారాలు చేసే వారు విశేషమైన లాభములు పొందుతారు. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

కన్యా రాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాహువు- కేతువు ఇరువురూ సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పరచును. భూ సంబంధ వ్యాపారాలు చేయు వారికి విశేష ధనార్జన కలుగ చేయును. అయితే పితృ వర్గం వారికి సంవత్సరం మధ్య మధ్య తీవ్ర ఆరోగ్య భంగములు కలుగ చేయును. 

ఏప్రిల్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో మొదటి వారం తదుపరి నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. గౌరవ ప్రదమైన జీవనం లభిస్తుంది.  వ్యాపారములో అభివృద్ధి. పిత్రువర్గీయులతో విరోధములు పొందుతారు. తృతీయ వారంలో మిత్రుల వలన ఇష్ట కార్యం పూర్తి అవుతుంది. వివాహ ప్రయత్నములలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. నూతనంగా ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో హామీలు ఇచ్చుట మంచిది కాదు.మాత్రు వర్గీయులతో వివాదాలకు అవకాశం ఉన్నది. చివరి వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును.

మే 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో సమస్యలు తగ్గును.పరిస్థితులు మెరుగు పడును. ఆదాయం లో పెరుగుదల లభించును శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. సమయం ప్రాధాన్యత గుర్తించాలి. ఒత్తిడి ని తట్టుకొని పని చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. బంధువుల కలయికతో  సంబంధాలు మెరుగుపడును. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలరు.22 వ తేదీ తదుపరి సంతోషకర వార్తలు వింటారు. ఇష్ట దైవ ఆరాధన కలసి వస్తుంది.జీవనంలోఉన్నతి మరియు సంతాన పరంగా శుభం ఏర్పరుస్తుంది.

జూన్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ఆత్మీయులకు సంబంధించిన విషయాలు ఆందోళన కలుగచేయును. ధన ఆదాయం  ఆశించిన విధంగా బాగుండును. ఋణ సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. జీవన ప్రమాణం పెరుగును. స్థిరమైన జీవనం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన మానసిక ప్రశాంతత పొందుతారు. పుత్ర పౌత్రాభివృద్ధి అనుభవిస్తారు.సంకల్ప సిద్ధి లభిస్తుంది. 

జూలై 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో చక్కటి సుఖసంతోషాలు ఉండును. భూ లేదా గృహ లాభం ఏర్పడును. వ్యాపార జీవనంలోని వారికి ఆశించిన లాభములు లభించును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన భాద్యతల వలన విశ్రాంతి లోపించును. ప్రధమ ద్వితియ వారములలో నూతన పరిచయాల వలన లాభం, సంఘంలో మంచి గుర్తింపు మరియు ఆశించిన ధనాదాయం పొందుదురు. 18 వ తేదీ తదుపరి మొహమాటంతో సమస్యలు జటిలం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములలో ఆశాభంగం ఏర్పడును. సొంత  గృహ నిర్మాణ సంబంధ ప్రయత్నాలు చేయవచ్చు. 

ఆగస్టు 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. అయితే మాస ప్రారంభంలో జ్వరతత్వం వలన బాధపడు సూచనలు ఉన్నవి. నిల్వ ఉంచుకున్న ధనము కొంత వృధా వ్యయం అగును. నమ్మిన వ్యక్తులే ఇబ్బంది పెడతారు. సొంత నిర్ణయాలే మంచివి. మాస మధ్యమం నుండి లాభకరమైన పరిస్థితి ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ సంబంధ ఆటంకములు తొలగును. ప్రతీ వ్యవహారం స్వయంగా పర్యవేక్షించవలసిన పరిస్థితులు ఏర్పడును.కొద్దిగా  శ్రమ అధికమగును. ఈ మాసంలో 7,9,11,25 తేదీలు అనుకూలమైనవి కావు. 

సెప్టెంబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు లభించవు. ఒక చిన్న శస్త్రచికిత్స , గృహంలో చొర నష్టం వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కార్యభారం పెరుగును. దూరప్రాంత ప్రయాణములు నష్ట పరచును. ప్రయాణాలు వాయిదా వేయండి. మనోవేదన ఎదుర్కొందురు. తీవ్ర ప్రయాస అనంతరం కార్యములు విజయం పొందును. వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. పెట్టుబడులు కొరకు చేయు ప్రయత్నాలు ఫలించవు. బాగా ఎదిగిన సంతానముతో కొద్దిపాటి విరోధములు ఏర్పడును. ఉద్యోగ జీవనం సామాన్యం గ కొనసాగును. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును. ఈ మాసంలో ప్రతీ సోమవారం ఈశ్వర అభిషేకాలు జరిపించుట మంచిది. 

అక్టోబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో సంకల్ప సిద్ధి , అంతా ఆశించిన విధంగానే జరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. గత కాలపు ఇబ్బందుల నుండి బయటపడతారు.వ్యక్తిగత జీవనంలో ఆశించిన అనుకూలత ఏర్పడుతుంది. సేవకులపై అతిగా ఆధారపడకుండా ఉండుట మంచిది. ప్రధమ వారమలో వృధా వ్యయం తగ్గించ గలుగుతారు. ద్వితియ వారంలో వాహనముల వలన ఇబ్బందులు ఎదుర్కొందురు. విద్యార్ధులకు  ఆసక్తి కొరవడుతుంది. విదేశీ లేదా ఉద్యోగ ప్రయత్నములలో కష్టం మీద విజయం లభిస్తుంది. ఈ మాసంలో 2,12,17, 23 తేదీలు అనుకూలమైనవి కావు. 

నవంబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసం కూడా అనుకూలమైన కాలం. సజ్జన సాంగత్యం లభించును.వినోద కార్యక్రమాలలో పాల్గోనేదురు.అయితే కుటుంబ సభ్యులతో అపార్ధాలకు సూచనలు ఉన్నవి. మీ భావాలూ స్పష్టంగా ప్రకటించడం మంచిది. వస్త్ర, గృహ, ధన లాభములు పొందుతారు. ఋణ బాధలు తొలగి మానసికంగా ఆనందకరమైన వాతావరణం. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన మంచి బాటలు ఏర్పడును. ఉద్యోగ స్థిరత్వం పై అనుమానాలు ఏర్పడతాయి. 21 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడును. 

డిసెంబర్ 2021 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. సంతాన ప్రాప్తి వలన ఆనందకరమైన కాలం పొందుదురు. కార్యానుకులాత లభించును.పరుష వాక్కుల వలన ఇబ్బందులు ఉన్నవి. వృత్తి వ్యాపారములు నిదానంగా కొనసాగును. మాసాంతంలో పేరు ప్రఖ్యాతలు ఆర్జించేదురు. నిల్వ ధనం ఏర్పర్చుకోగలరు. ఈ మాసంలో 8,16,24 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు.

జనవరి 2022 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ప్రేమ వ్యవహారములందు మానసిక వ్యధ ఎదుర్కొందురు. అకాల భోజనములు, శిరో బాధ మరియు  నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కష్టం మీద కార్య జయం లభించును. చివరి వారంలో విరామం లేకుండా పనులు కొనసాగును. మొత్తం మీద ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోనిన మంచిది. శ్రమతో కూడిన ప్రయాణములు ఉన్నవి. మీ వలన ఇతరులకు ఉపకారం జరుగుతుంది. ఈ మాసంలో 13,14,15 తేదీలు అనుకూలమైనవి కావు. 

ఫిబ్రవరి 2022 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో చికాకులు ఉన్నప్పటికీ తలపెట్టిన పనులలో చివరకు జయం లభించును. వివాహ  సంబంధ సంతోషం పొందుతారు. శత్రు జయం లభిస్తుంది. చేయు పనులలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పురాణ శ్రవణ కాలక్షేపం లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఈ మాసం విదేశీ ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైన కాలం. కుటుంబ వ్యవహారములు ఆశించిన విధంగా అనుకూలంగా ఉండవు. చివరి వారంలో శ్రమ అధికం, అనిశ్చిత వాతావరణం ఎదుర్కొందురు.

మార్చి 2022 కన్యారాశి రాశీ ఫలాలు:

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు. స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు. రావలసిన ధనం సమయానికి అందుట కష్టం. మాసం మధ్య నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభం అగును. సంతాన ప్రయత్నములు దైవ ఆశీస్శులతో విజయం పొందును. ఆర్ధిక విషయాలలో అనుకూలత ఏర్పడును  స్థానచలన ప్రయత్నాలు చివరి నిమిషంలో విఫలం అగును. కుటుంబ భవిష్యనిధి ఏర్పాటు కు ఈ మాసం మంచి కాలం. 

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.