మఘ 1,2,3,4 పాదములు లేదా పుబ్బ 1,2,3,4, పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.
జనవరి 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ఇచ్చును. గౌరవ ప్రధమైన జీవనం. నూతన ఆదాయ మార్గాలు. ద్వితీయ తృతీయ వారాలలో ఆఖస్మిక కుటుంబ పరమైన ప్రయాణాలు. ప్రయనములందు చికాకులు. ధనాదాయంలో పెరుగుదల. మానసిక శ్రమ అధికం. ఈ మాసంలో 22 నుండి 29 తేదీల మధ్య కాలంలో వ్యక్తిగత జీవన సంతోషాలు.
ఫిబ్రవరి 2019 సింహరాశి జ్యోతిష్యం:
పనులు నెమ్మదిస్తాయి. ఆర్ధికంగా కొంత అభద్రతా భావం. కుటుంబ సహకారం. వ్యపార వ్యవహారములు సామాన్యం. విదేశీ పర్యటనలు లేదా దురాక్షేత్ర సందర్శన. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. కొత్త ఆలోచనలు గుర్తింపునిచ్చును. సృజనాత్మకత ఉపయోగపడును. సంతాన విషయాలు కొద్దిపాటి ఆందోళన కలిగించును.
మార్చి 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసం ప్రధమార్ధం ఆహ్లాదకరంగా ఉండును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. ద్వితియార్ధంలో ఉద్యోగస్తులకు చేతినిండా పని. అవిశ్రాంతంగా పని చేయవలసిన పరిస్టితులు. పనిపై శ్రద్ధాసక్తులు లోపించును. శ్రమకు గుర్తింపు ఉండదు. ధనాదాయం సామాన్యం. ఆదాయ మార్పిడి ప్రయత్నాలు విఫలం అగును. సహోద్యోగుల వలన సమస్యలు. ఈ మాసంలో 18,19,20 తేదీలు అనుకూలమైనవి కావు.
ఏప్రిల్ 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. సొంత వాహన ఆశ నెరవేరును. గృహంలోనికి స్వర్ణం లేదా ఒక నూతన వస్తువు ఆగమనం. పెద్ద వయస్సు వారికి అనారోగ్య సమస్యలు తగ్గును. వ్యాపారాదులు ఆశించిన విధంగా సాగును. ఉద్యోగస్తులకు నీలాపనిందలు. పేరు ప్రతిష్టలు పోగొట్టుకోనుదురు. తోటి ఉద్యోగస్తుల వలన అపకీర్తి ఏర్పడును. ఆధ్యాత్మిక మార్గం అవసరమగును. ఈ మాసంలో 23 వ తేదీ తదుపరి చేయు ప్రయాణాల వలన ధన వ్యయం ఏర్పడును. నూతన వ్యాపారాలను ప్రారంభం చేయరాదు.
మే 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసం ద్వితీయ వారం నుండి నూతన ప్రయత్నాలు లాభించును. గత కాలంలో ఆర్ధిక ఇబ్బందుల వలన వదిలివేసిన పనులు తిరిగి ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. వృత్తి వ్యాపారాదులు జయం పొందును. సంతాన ప్రయత్నాలు విఫలమగును. దగ్గరి కుటుంబ సభ్యులను కోల్పోవు సూచన. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి , ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనం చేయువారికి నూతన ఒప్పందాలు లభించును. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించేదురు. ఈ మాసంలో 2, 4, 5, 6 తేదీలు అనుకూలమైనవి కావు.
జూన్ 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ప్రయత్నాలు సులువుగా ముందుకు సాగవు. పనులు వాయిదాలు పడుతుండును. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కుటుంబంలో కొద్దిపాటి అసంతృప్తికర సంఘటనలు. ఆస్తుల కోసం కలహాలు ఏర్పడే పరిస్థితులు. మాస మధ్యమంలో నేత్ర సంబంధమైన సమస్య లేదా వాహన ప్రమాదం వలన గాయాలు. 20 వ తేదీ తదుపరి నూతన సంబంధాలు, నూతన రంగంలో నిపుణత, విద్యా రంగంలో పనిచేయువారికి ప్రాముఖ్యత లభించును. 29, 30 తేదీలలో అలంకరణ వస్తువుల కొరకు వ్యయం ఏర్పడు సూచన.
జూలై 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో సామాన్య ఫలితాలు. ఉద్యోగ వాతావరణంలో కొద్దిపాటి అశాంతి, దుఃఖం. ధనాదాయం సామాన్యం. నమ్మినవారి వలన ఒక నష్టం. జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండవలెను. నూతన కార్యములను , స్థానచలన ప్రయత్నాలను, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలను 17 వ తేదీ తదుపరి ప్రారంభించుకోనుట మంచిది. కెరీర్ పరంగా రాజకీయ సహకారం ఉపయోగపడుతుంది.తోటి వారితో మాట తేడా వలన కొత్త శత్రుత్వాలు. మాసాంతానికి ఖర్చులు పెరిగిననూ ధనం సర్దుబాటు జరుగును.
ఆగష్టు 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో పెద్దవయస్సు వారికీ హృదయ సంబంధ సమస్యలు అధికం అగును. వైవాహిక జీవన సౌఖ్యం ఉండదు. అవిధేయత ఎదుర్కోను సూచనలున్నాయి. గృహంలో మార్పులు చేయుదురు. ధనాదాయం బాగుండును. మనోధ్యైర్యం పెరుగును. పోయిన పేరు ప్రతిష్టలు తిరిగి పొందుటకు అవకాశములు లభించును. మాట చాతుర్యంతో పనులను పూర్తీ చేసుకోగలరు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా ముగియును.
సెప్టెంబర్ 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో వ్యాపార వ్యవహరాదులు నష్టాన్ని, నూతన ప్రయత్నాల వలన కష్టాల్ని కలిగించును. ఈ మాసం అంత అనుకూలంగా ఉండదు. ధనవ్యయం అధికం అగును. పై అధికారుల లేదా కుటుంబ పెద్దల కోపానికి గురవుతారు. చేస్తూ ఉన్న ఉద్యోగం అఖస్మికంగా కోల్పోవు సూచన. సిఫారసుల కొరకు తీవ్రంగా తిరగవలసి వచ్చును. ప్రతీ విషయములో సందేహాలు ఏర్పడును. వివాహ సంబంధాలు బెడిసికోట్టును. ఈ మాసంలో 5, 7, 8, 13, 14, 22, 28 తేదీలు అనుకూలమైనవి కావు. స్వ ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవలెను.
అక్టోబర్ 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో కుడా సెప్టెంబర్ మాసంవలె ఇబ్బందులు ఏర్పరచును. అవమానాలు ఎదురగును. ఏదో ఒక మానసిక అశాంతి బాధించును. ప్రయాణాలలో భయాందోళనలు, రహస్య కార్యాచరణ వలన సమస్యలు ఎదుర్కొందురు. ఉద్యోగ జీవనంలో అనిచ్చితి కొనసాగును. ఆశించిన వ్యక్తుల నుండి సహకారం ఆలస్యంగా లభించును. జీవిత భాగస్వామి సంభందిత వ్యక్తులకు పీడగా ఉండు సూచన. ఈ మాసంలో రాహు - కేతువులకు శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.
నవంబర్ 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో కొంత పరిస్థుతులలో అనుకూలమైన మార్పులు ఎదుర్కొందురు. ప్రతీ చర్యలోనూ ఆచితూచి వ్యవహరించుట మంచిది కాదు. ఉద్యోగ రీత్యా చేయు ప్రయత్నాలు 6 వ తేదీ నుండి అనుకూలిస్తాయి. అందివచ్చిన ప్రతీ అవకాశమును ఉపయోగించుకోవాలి. అతిగా ఆలోచించుటకు ఇది మంచి సమయం కాదు. వివాహ విషయాలలో కూడా ఇదే సూత్రం వర్తించును. శారీరాక ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టును. చివరి వారం నుండి వ్యాపార వ్యవహరాదులు అనుకూలంగా సాగును. ఆశించిన లాభములు పొందేదుదురు.
డిసెంబర్ 2019 సింహరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. నూతన ఆదాయ మార్గములు లభించును. తలపెట్టిన కార్యములన్ని విజయం సాధించుదురు. కుటుంబ సభ్యులకు సంబందించిన ఒక భాద్యత మీపై పడుతుంది. వివాహ ప్రయత్నాలు నెరవేరును. గతకాలపు తగాదాలు పరిష్కారమగును. తృతీయ వారం ముగిసే సమయానికి ఉల్లాసపూరిత వాతావరణం ఏర్పడును.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.