పునర్వసు నక్షత్ర 4 వ పాదం లేదా పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు లేదా ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
జనవరి 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో సంతాన సంబంద ఆనందం లేదా సౌఖ్యం. జీవనంలో ప్రశాంతత. సజ్జన సాంగత్యం. పుత్రికా సంతతి కలిగిన వారికి నూతన బాధ్యతలు. చివరి వారంలో అధిక శారీరక శ్రమ. పేర్కొనదగిన ఇతర ప్రధాన ఫలితాలు ఏమియూ లేవు.
ఫిబ్రవరి 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో 12వ తేదీ వరకూ వ్యాపారస్థులకు అనుకూలం. క్రీదరంగాలోని వారికి కూడా బాగా కలసివచ్చును. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందుటకు తగిన బలాలు కలవు. కోర్టు వ్యవహారాలు అనుకూలం. తృతీయ వారం నుండి మిశ్రమ ఫలితాలు. ఒత్తిడి పెరుగును. విలువైన వస్తువులు పోగొట్టుకొండురు. వృధా వ్యయం. ఆశించిన ఫలితాలు లభించవు. రక్షణ రంగంలో సేవ చేయువారికి మంచిది కాదు. ఈ మాసంలో 21 నుండి 26 వరకూ అనుకూలమైన రోజులు కావు.
మార్చ్ 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో కూడా ఫలితాలు మిశ్రమంగా ఉండును. విద్యార్ధులకు కలసివచ్చును. ఉన్నత విద్యావంతులు అగును. ప్రేమవ్యవహరములలో లేదా వ్యక్తిగత జీవితంలో స్పష్టత లభించును. హామీలు నిలబెట్టుకోలేరు. ఆర్ధిక విషయాలలో అత్యాశ వలన చక్కటి అవకాశములు చేజారుటకు సూచన. ధనాదాయం సామాన్యం.
ఏప్రిల్ 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో వ్యాపార వ్యవహరాదులు ఆశించిన ధనలాభాలు ఏర్పరచవు. సంతాన ప్రయత్నాలకు ఇది చాల మంచి సమయం. ఉద్యోగ జీవనంలో విరోధుల వలన సమస్యలు. వ్యవహారాలు వేగంగా ముందుకు కదలవు. నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టలేరు. కుటుంబములో బరువు - భాద్యతలు పెరుగును. శారీరక మార్పులు సంభవించును. వైవాహిక జీవనంలో సమస్యలు ఏర్పడును. అనవసర మాటల వలన దంపతుల మధ్య దూరం పెరుగును. ఈ మాసంలో 17, 18, 26,27 తేదీలు అనుకూలమైనవి కావు.
మే 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ధనాదాయం బాగుండును. మాతృ వర్గీయుల వలన కుటుంబ జీవనంలో సమస్యలు. వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా నడుచును. పెద్ద వయస్సు వారికి వెన్నుపూస సంభందించిన ఆరోగ్య సమస్య. నిరుద్యోగులకు, ఉద్యోగ జీవనంలో మార్పులు కోరుకోన్నవారు తమ ప్రయత్నాలలో సఫలీకృతం అవుదురు. సొంత మనుష్యుల ద్వారా శుభవార్తలు వినుదేరు. ఈ మాసం తృతీయ వారంలో నూతన వస్తు లేదా ఆభరణాలు అమరును. చివరి వారంలో మిత్రువర్గాలతో విభేదాలు ఏర్పడుటకు అవకాశములు కలవు. ఈ మాసంలో 1, 4, 9, 11, 25 తేదీలు అనుకూలమైనవి కావు.
జూన్ 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుండును. నూతన వ్యాపారాదుల వలన లాభం. పేరు ప్రఖ్యాతలు లభించును. దాన ధర్మములు చేయుదురు. కుటుంబంలో మాత్రం మీకు వ్యతిరేకంగా మార్పులు జరుగు సూచన. ద్వితీయ తృతీయ శనివారములందు చేయు ప్రయాణాలలో ఆర్ధిక నష్టములు ఏర్పడు సూచనలు అధికం. చివరి వారంలో తక్కువ ప్రయత్నంతో చక్కటి లాభాలు పొందేదురు. వాహన సౌఖ్యం ఏర్పడును. నూతన పరిచయాల వలన వ్యక్తిగత జీవనంలో ఇబ్బందులు, దీర్ఘకాలిక సుఖ వ్యాధులు.
జూలై 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ధనాదాయం బాగున్నప్పటికీ వైవాహిక జీవనంలో అశాంతి కలుగచేయు సంఘటనలు ఏర్పడును. దూరప్రాంత ప్రయత్నాలు లాభించును. ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పురోగతి ఉండదు. ధనం కొరకు లేదా బ్యాంకు ఋణాలు కోసం చేయు ప్రయత్నాలకు ఆటంకములు ఉండును. ప్రయాణాలు అధికంగా ఏర్పడు సూచన. ఈ మాసంలో సాహసోపేతంగా వ్యవహరించుట మంచిది కాదు. 20 వ తేదీ నుండి 27 వ తేదీ మధ్య ఆత్మీయులతో సంతోషంగా సమయం గడిపెదరు.
ఆగష్టు 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో నూతన అవకాశములు లభించును. వీసా సంబంధిత విషయాలలో ఆటంకాలు తొలగిపోవును. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్య ఫలితాలు. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులకు ధన వ్యయం. ద్వితీయ వారంలో ఆకస్మిక లాభములు ఏర్పడును. నూతన ఆలోచనలు కలసి వచ్చును. తృతీయ వారంలో కుటుంబ సభ్యుల శస్త్ర చికిత్సకు సంభందించిన ఒత్తిడులు. చివరి వారంలో ఆశించిన ధనం చేతికి అందును. ఈ మాసంలో 8, 9, 10, 12 తేదీలు మంచి ఫలితాలను కలిగించును.
సెప్టెంబర్ 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో వైవాహిక జీవనంలో ఏర్పడిన సమస్యలు తొలగును. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడును. వ్యాపార వ్యవహారాలలో చేయు ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. కుటుంబ భాద్యతలు సులువుగా నేరవేర్చగలరు. ఉత్సాహ పూరిత వాతావరణం ఏర్పడి ఉండును. మాస మధ్యమంలో విందు - వినోదాలలో పాల్గొనేదురు. ఉద్యోగ జీవనంలోని వారికి క్రింది స్థాయి వ్యక్తుల వలన ఊహించని చికాకులు. నూతన ఆదాయ మార్గాల కోసం చేయు ప్రయత్నాలు ఫలించవు. ఈ మాసంలో 13, 19, 21, 29, 30 తేదీలు అనుకూలమైనవి కావు.
అక్టోబర్ 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో వారసత్వ లేదా స్థిరాస్థి సంబంధ వ్యవహారాలలో పితృ వర్గీయులతో విభేదాలు ఏర్పడును. వ్యాపారస్థులకు ప్రభుత్వ సంబంధమైన చికాకులు. మిత్రుల వలన నమ్మకద్రోహం ఏర్పడు సంఘటనలు. పెద్దల సాకారం లేదా సలహాల వలన ఉద్యోగ జీవనంలో అభివృద్ధి పొందేదురు. కుటుంబానికి శాశ్వత ప్రయోజనాన్ని కలుగచేసే నిర్ణయాలు తీసుకొందురు. కుటుంబానికి ఆర్ధిక భద్రత ఏర్పడును. ఈ మాసంలో 11, 12, 13 తేదీలలో ఒప్పందాలు చేసుకొనుట, నూతన వ్యక్తులను కలవడం, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
నవంబర్ 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసం సంతోషకరమైన పరిస్థితులను కలుగచేయును. ధనాదాయం బాగుండును. సువర్ణ లేదా గృహ లేదా నూతన వాహన లాభం ఏర్పడును. క్షణికావేశముల వలన ప్రమాదం. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకు ఈ మాసంలో ఆరోగ్యం సమస్యలపాలగు సూచన. కుటుంబ పరమైన శ్రమ అధికం అగును. తృతీయ మరియు చివరి వారములలో స్వశక్తితో కార్యములను సిద్ధింపచేసుకొందురు. దూరపు బందువుల సహకారం వలన ఒక సమస్య నుండి బయటపడుదురు. కృతజ్ఞతతో వ్యవహరించవలసిన సమయం.
డిసెంబర్ 2019 కర్కాటకరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో నూతన ఆస్తి కొనుగోలు చేయుటకు అవకాశములు అధికం. అవివాహితులకు చక్కటి వివాహ సంభంధాలు ఏర్పడును. శత్రు విజయం సాధించేదురు. ధనాదాయం సామాన్యం. ప్రయాణాలు కలసిరావు. శ్రమతో కూడుకొని ఉండును. వ్యయ ప్రయాసలు చికాకులను కలుగచేయును. 22వ తేదీ తదుపరి అనుకూలంగా ఉండదు. గౌరవం లోపించు సంఘటనలు, వ్యసనముల వలన, స్నేహితుల వలన తీవ్ర సమస్యలున్నాయి. పితృసంబంధమైన ఖర్మలు చేయవలసి వచ్చును. సమస్యలు సత్వరం పరిష్కారం అగుటకు మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోవుదురు.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.