Sree Vikari Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu

వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) ఆరోగ్య పరమైన విషయములందు మినహా మిగిలిన విషయాలలో మంచి ఫలితాలను కలుగచేయును. నూతన ప్రయత్నాలు లాభించును. వ్యాపార వ్యవహరాదులు లాభించును. సంతాన సంభంధమైన ప్రయత్నాలు కలసి వచ్చును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధించును. ఉద్యోగ జీవనంలోని వారికి గౌరవ బిరుదులు ప్రాప్తించును. ధనాదాయం బాగుండును. మీ చేతిపై శుభకార్యములు చేయుదురు. వ్యాపార రంగం వారికి నూతన పెట్టుబడులు కలసి వచ్చును. స్నేహితుల సహకారం ఆశించిన విధంగా ఉండదు. గృహమున సౌఖ్యం పెరుగును. జీవిత భాగస్వామి వలన కుటుంబ కార్యములు విజయవంతంగా పూర్తీ చేయగలుగుతారు. వ్యవసాయదారులకు మంచి ఆదాయం లభించును. విద్యార్ధులకు మిశ్రమ ఫలితాలు. వస్త్ర రంగ వ్యాపారులకు శ్రమ అధికం. మద్యం , చలన చిత్ర రంగంలోని వారికి ఖర్చులు అధికం. విదేశీ ప్రయత్నాలు చేయువారికి సానుకూల ఫలితాలు. ఆరోగ్య విషయాలలో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తీవ్ర ఆరోగ్య భంగములు ఏర్పడు సూచనలు అధికం. మానసిక రుగ్మతలు, ప్రయాణములందు ప్రమాదాలు, వాహనముల వలన సమస్యలు. మూత్రపిండాల సమస్యలు కలిగిన వారికి ప్రమాద కాలం. తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు గురు గ్రహానికి శాంతి జపములు జరిపించుకోనూట మంచిది.
వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన ఆరోగ్య విషయముల మినహా నవంబర్ 3 వరకూ అన్ని విషయాలందు మంచి ఫలితాలు ఏర్పడును. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం. అవివాహితులకు చక్కటి సంబంధాలు లభించును. భార్యాభర్తల మధ్య ప్రెమపూరిత వాతావరణం. 04-నవంబర్ - 2019 తదుపరి భాగ్యం స్వల్పంగా ఆరోగ్య సమస్యలు అధికంగా ఏర్పరచును.
వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన 23-జనవరి-2020 వరకూ ఆర్ధిక పరమైన చికాకులు , పూర్వ కాలపు ఋణముల వలన బాధలు ఏర్పరచును. 24-జనవరి-2020 నుండి మిక్కిలి ధనాదాయం ఏర్పరచును. ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ఆశించు వారికి కోరుకొన్న ఫలితాలు. మీ చేతిపై సత్కార్యములు జరుగును. వారసత్వ లాభములు పొందేదురు. కోర్టు తీర్పులు అనుకూలంగా ముగియును.
వృషభరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు మంచి ఫలితాలు ఇవ్వరు. రాహువు వలన అదుపు తప్పిన వ్యయం, ఆయు: గండములు ఏర్పడును. కేతువు వలన వడ్డీ వ్యాపారం చేయువారికి నష్టములు, తగాదాలు ఏర్పడును.
మీ సంపూర్ణ వ్యక్తిగత జాతక ఫలితాలు...
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.