Sree Vikari Nama Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu

వృచ్చికరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. వృచ్చికరాశి వారికి ఈ సంవత్సరం 23-జనవరి-2020 నుండి ఏలినాటి శని దశ పుర్తిఅగును. గత ఆరు సంవత్సరాల నుండి ఉన్న శని దోష ప్రభావం తొలగిపోవును. ఈ సంవత్సరం కుటుంబ , ఆర్ధిక లావాదేవీలు , వ్యాపార వ్యవహరాదులు లాభదాయకంగా కొనసాగును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆటంకములు ఎదుర్కొనును. అవసరములకు బంధు సహకారములు లభించును. తగాదాలందు విజయం చెకూరును. ఈ సంవత్సరం వృచ్చికరాశి వారికి అనారొగ్యమూలక ధనవ్యయం తరచుగా ఏర్పడుటకు సూచనలు కలవు. కావునా ఆరోగ్య విషయాలందు జాగ్రత్తగా ఉండవలెను. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగును. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు ద్వితియార్ధంలో సఫలమగును. విదేశీ వ్యవహారములందు ఆశించిన ఫలితాలు ఏర్పడును.
వృచ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా చాలా చక్కని ఫలితాలు కలుగచేయును. మిక్కిలి ధన భాగ్యములను ఏర్పరచును. విద్యార్ధులకు అతి చక్కటి విద్యాభ్యాసం కలుగచేయును. సమాజంలో , వంశంలో పేరు ప్రఖ్యాతలను ఏర్పరచును. శన్మానములను కలుగచేయును.
వృచ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం 22-జనవరి-2020 వరకూ మంచి ఫలితాలను ఇవ్వడు. సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులు , అధిక ధన వ్యయం, నేత్ర హాని లేదా నేత్ర సంబంధ అనారోగ్యం వంటి సమస్యలను ఏర్పరచును. 23-జనవరి -2020 తదుపరి ఏలినాటి శని దశ పుర్తిఅగును. లాభావ్యయములు సమానంగా ఉండును.
వృచ్చిక రాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతు గ్రహముల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. రాహువు ఆరోగ్య కష్టములను, కేతువు అధిక ధనవ్యయం ఏర్పరచును. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కోను వారు రాహు గ్రహ శాంతి జరిపించుకోనువలెను.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.