Sree Vikari Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) సామాన్య ఫలితములను ఏర్పరచును. జీవన మార్గమునకు పెద్దగా ఇబ్బందులు ఏర్పడవు. సంవత్సర ప్రారంభం నుండి సంవత్సర అంతానికి క్రమంగా పరిస్థితులు అనుకూలంగా మారును. నూతన వ్యాపార వ్యవహరాదులు ఆశించిన విధంగా కార్యరూపం దాల్చును. లాభించును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. సోదర వర్గం వార్కి అంత మంచి సంవత్సరం కాదు. స్నేహితుల నుండి ఆశించిన సహాయ సహకారాలు ఏర్పడును. దూర ప్రాంత స్థిర నివాసం కొరకు ప్రయత్నించు వారికి వ్యతిరేక ఫలితాలు ఏర్పడును. సంతాన ప్రయత్నాలు చేయువారికి స్త్రీ సంతానం ఏర్పడు సూచనలు అధికం. స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యలు కొనసాగును. చేతివృత్తి పనివారికి లాభములు ఏర్పడును. వ్యవసాయదారులకు చక్కటి పంట అభివృద్ధి. విద్యార్ధులకు ఆశించిన ఉన్నతి లభించును. వడ్ది వ్యాపారం చేయువారికి ఈ వికారి నామ సంవత్సరం బాగా కలసి వచ్చును.
తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం అనుకూలమైన ఫలితాలను ఇవ్వదు. ఫైనాన్సు వ్యాపారాలకు మాత్రం అతి చక్కటి ఫలితాలను కలుగచేసి వ్యాపార వృద్ధిని ఏర్పరచును. ఆరోగ్య పరంగా మధ్య మధ్య కాలంలో కీళ్ళ సంబంధమైన , రక్త సంభందమైన సమస్యలను ఏర్పరచును. భాత్రు వర్గం వారితో సంబంధాలు తెగిపోవును. మొత్తం మీద ఈ సంవత్సరం గురు గ్రహం తులారాశి వారికి కలసి రాదు.
తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. భూ సంబంధమైన ఆర్ధిక లాభములను కలుగచేయును. స్థాన చలన ప్రయత్నాలు చేయువారికి కొద్దిపాటి విఘ్నాలను కలుగ చేయును. విద్యార్ధులకు ఆశించిన విద్యను ఏర్పరచును.
తులారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇరువురూ యోగించును. పితృ వర్గం వారికి ఆనారోగ్య సమస్యలను ఏర్పరచుట మినహా మిగిలిన వ్యవహారములందు అనుకూలమైన ఫలితాలను ఇచ్చువారగును.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.