Sree Vikari Nama Samvatsara Mesha Rasi / Aries Sign Free Telugu Rasi Phalalu

మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) మంచి ఫలితాలను కలుగచేయును. సంవత్సరం ప్రారంభం నుండి చక్కటి ఆశించిన ధనాదాయం ఏర్పడును. ఫైనాన్సు వ్యాపార రంగం వారికి ఈ సంవత్సరం బాగా కలసివచ్చును. నూతన వ్యాపార - వ్యవహరాదులు ఆశించిన విధంగా విజయవంతం అగును. సోదర వర్గం వారితో గొడవలు. మానసిక ఆందోళనలు. స్థిరాస్థి వ్యవహారాలలో తగవులు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం తప్పక ఫలించును. సంతాన ప్రయత్నములు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం. ఐ.వి.ఫ్ పద్దతి ద్వార గర్భధారణ ప్రయత్నాలు చేయువారికి ఆటంకములు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు. మానసిక సంతోషం కలిగే వాతావరణంలో ఉన్నప్పటికీ శారీరక శ్రమ అధికం అగును. ఉద్యోగ మార్పిడి యత్నాలకు మంచి కాలం. విదేశీ వ్యవహారములు కొంత కష్టంతో పూర్తీ అగును. పై అధికారుల వలన నమ్మక ద్రోహం. నూతన వ్యక్తుల పరిచయాలలో జాగ్రత్త అవసరం. గృహమునందు శుభ కార్యములు వాయిదా వేయుట మంచిది. పితృ వర్గీయులకు మంచిది కాదు. తీవ్ర ఆరోగ్య భంగములకు సూచనలు కలవు. వ్రుత్తి జీవనములోని వారికి, వ్యవసాయ రంగంలోని వారికి చక్కటి ఫలితాలు కలవు. విద్యార్ధులకు చక్కటి ప్రోత్సాహవంతమైన సంవత్సరం. కళారంగం వారికి గౌరవం తగ్గును. ఆర్ధికంగా నష్టములు ఏర్పడును. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి తీవ్ర ఇబ్బందులు. రావలసిన బకాయిలు ఆశించిన సమయానికి చేతికి రావు.
మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన ది.03-నవంబర్-2019 వరకూ మిశ్రమ ఫలితాలు ఏర్పడును. చేపట్టిన పనులలో మొదట మంచి ఆరంభం ఏర్పడి చివరకు యోగించక కష్టములను ఏర్పరచును. అష్టమ గురు ప్రభావం వలన రక్త సంబంధ అనారోగ్యములతో బాధపడు వారికి సమస్యలు అధికం అగును. ది. 04-నవంబర్ - 2019 నుండి గురువు అతి చక్కటి అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. వారసత్వ సంబంధ భాగ్యం కలసివచ్చును. సంతాన ప్రయత్నములు చేయువారికి శుభ వార్తలను కలుగచేయును.
మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పడును. సంవత్సరం అంతా చక్కటి ధనలాభాలు కలుగచేయును. నల్లని భూములు మంచి దిగుబడిని ఇచ్చును. నల్లని వస్త్రములు, ధాన్యములు, లోహముల వ్యాపారములు చేయువారికి బాగా కలసివచ్చును. న్యాయవాద వృత్తిలోని వారికి బాగా రాణింపు ఏర్పడును.
మేషరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువులు ఇద్దరూ సంవత్సరం అంతా మంచి చేయరు. చక్కగా జరుగుతూ ఉన్న పనులలో భంగములు, ధన వ్యయములు, పిత్రువర్గీయులతో సమస్యలు, పితృ సౌఖ్య లేమి సంతాన ప్రయత్నాలలో విఘ్నాలు వంటి చికాకులను ఏర్పరచును.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.