Placeholder image

2019 - 2020 శ్రీ వికారి నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలాలు

Sree Vikari Nama Samvatsara Makara Rasi / Capricorn Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 02 రాజపూజ్యం - 02 అవమానం - 04. పూర్వ పద్దతిలో వచ్చిన శేష సంఖ్య "6". ఇది రాజకీయాలలో విజయాన్ని సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to know your rasi phalitalu in English...
  • Click Here to get your manually written personalised Horoscope Report...

మకరరాశి వారికి కూడా శ్రీ వికారి నామ సంవత్సరం అంతా ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది. శని వలన ఈ సంవత్సరం అనవసర ఆడంబరాలకు అధికంగా ధనవ్యయం ఏర్పరచును. ఆర్ధికంగా ఆశించిన ప్రగతి ఏర్పడదు. పిత్రార్జితం మరియు స్వార్జితం రెండునూ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు కనిపించుచున్నవి. ఆర్ధికంగా క్రమశిక్షణ అవసరం. 24- జనవరి-2020 నుండి కొంత ఆర్ధికంగా పరిస్థితి మెరుగు పడును. ఉద్యోగ జీవులకు లక్ష్యాల కోసం తీవ్రంగా శ్రమించవలసిన పరిస్టితులను , ఒడిదుడుకులను కలుగచేయును. మొత్తం మీద శని వలన మకరరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండవు. శనికి శాంతి జపములు అవసరం.

మకరరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం గురు గ్రహం వలన 03-నవంబెర్-2019 వరకూ వృత్తి జీవనం చేయువరకి ముఖ్యంగా వైద్య రంగంలోని వారికి, కుల వృత్తులు చేయువారికి అధిక వృద్ధిని కలుగచేయును. న్యాయమైన మార్గంలో ధనార్జనను ఏర్పరచును. 04-నవంబెర్-2019 నుండి అంతగా యోగించడు. కుటుంబ సభ్యుల కొరకు , మంచి కార్యములకు అధిక ధన వ్యయం అగునట్లు చేయును.

మకరరాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం రాహు - కేతువుల వలన పూర్తీ ఆయుర్భాగ్యములు పొందును. పారమార్ధిక చింతన అలవడునట్లు చేయును. ధార్మిక కార్యక్రమాల పట్ల అధికంగా ఆకర్షితులగును.

మీ సంపూర్ణ వ్యక్తిగత జాతక ఫలితాలు...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.