Sree Vikari Nama Samvatsara Kanya Rasi / Virgo Sign Free Telugu Rasi Phalalu

కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరం ( ది.06-ఏప్రిల్-2019 నుండి ది.24-మార్చి-2020 వరకూ) చక్కటి ఆర్ధిక పురోగతిని కలుగచేయును. వ్యాపార వ్యవహరాదులలో గతంలో ఏర్పడిన అవరోధాలు అన్ని తొలగిపోవును. నూతన ఆలోచనలకు పెట్టుబడులు లభించును. ధన విషయాలలో సొంత నిర్ణయాలు కలసి వచ్చును. భాగస్వామ్యాలు కలసి వచ్చును. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు లాభించును. ప్రమోషనులు ఆశిస్తున్నవారు ఆటంకములు, పైరవీల అనంతరం అనుకున్నది సాధిస్తారు. పుత్ర సంతాన ప్రయత్నాలకు దైవ ఆశీస్సులు అవసరం. సంవత్సర మధ్యకాలంలో ఉదర సంబంధమైన సమస్య వలన బాధపడు సూచన. ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్ర సందర్శనలు ఏర్పడును. మాట గౌరవం పెరుగును. కుటుంబ సభ్యుల సహకారం వలన మనశ్శాంతి పొందుతారు. విదేశీ ఉద్యోగ లేదా నివాస ప్రయత్నాలు చేయువారికి 2019 నవంబర్ తదుపరి అనుకూలత ఏర్పడును. కోర్టు వ్యవహరాదులకు సంవత్సరాంతం వరకూ వేచివుండుట అవసరం. వైవాహిక జీవనములో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సౌఖ్యం తగ్గును. విద్యార్ధులకు సామాన్య ఫలితాలు. కష్టించ వలసిన అవసరం ఉన్నది. వ్యవసాయదారులకు పెట్టుబడికి మించి ఆదాయం లభించును. కళాకారులకు నూతన అవార్డులు, చక్కటి గుర్తింపు లభించును.
కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 03-నవంబర్-2019 వరకూ చెడు ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా ఈ రాశికి చెందిన 12 సంవత్సరములలోపు పిల్లలకు బాలారిష్టములు కలుగచేయు సూచన. వారి ఆరోగ్య విషయములందు తల్లితండ్రులు జాగ్రత్త వహించవలెను. 04-నవంబర్-2019 నుండి చక్కటి ఫలితాలు ఏర్పరచును. ముఖ్యంగా మాత్రు వర్గం వారి వలన సౌఖ్యం, వారి వలన లాభం, విద్యార్ధ్యులకు ఆశించిన విద్య, నూతన వాహన సౌఖ్యం, భూ సంబంధ లాభం ఏర్పరచును.
కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో శని గ్రహం వలన పిత్రార్జితం కొంత వ్యయం అగును. పుత్ర సంతాన వితవిభవములను ఏర్పరచును. స్త్రీ సంతానం వలన సౌఖ్యతను కలుగచేయును. 24-జనవరి-2020 నుండి ఆర్ధికంగా బాగా యోగించును.
కన్యారాశి వారికి శ్రీ వికారి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన ప్రయాణాలు అధికంగా ఏర్పడుచుండును. తీర్ధయాత్రా ఫలితమును ఏర్పరచును. స్వల్ప భూ వ్యయం ఏర్పరచు సూచన.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.