Dr. Aravind Sidhanthi గారి వివరణ
సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయన లేనిదే ఈ సృష్టిలో జీవం లేదు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో సూర్యభగవానుల వారిని అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉంచారు. జ్యోతిష్య శాస్త్రంలో రవి (సూర్యుడు) గ్రహాలన్నింటికీ రాజు. రవి కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, జ్యోతిష్య పరిభాషలో ఆయనే "ఆత్మకారకుడు". రవి గ్రహాన్ని ఈ భూమి పై ప్రతీ జీవి ఆత్మకు కారకుడిగా, ప్రాణ శక్తికి మూలస్తంభంగా పరిగనిస్తాము.
The Sun is our visible deity (Pratyaksha Daivam). Without Him, there is no life in this creation. This is why, in the science of Astrology, Lord Surya is placed in the highest position. In Astrology, Ravi (the Sun) is the King of all planets. He is not merely a planet; in astrological terminology, He is the 'Atmakaraka' (the Significator of the Soul). We consider the Sun as the significator of the soul for every living being on this Earth and the fundamental pillar of life force
సూర్యుని తండ్రి కశ్యప ప్రజాపతి మరియు తల్లి అదితి. అదితి అనే మాతృమూర్తికి జన్మించడం వలన సూర్యుడిని "ఆదిత్యుడు" అని పిలుస్తాము. రవి జన్మ నక్షత్రం విశాఖ. సూర్య భగవానుడికి ఇద్దరు భార్యలు. ఒకరి పేరు సంజ్ఞాదేవి మరియు మరొకరి పేరు ఛాయాదేవి. సూర్య భగవానుడి సంతానం: యముడు, శని దేవుడు, సుగ్రీవుడు మరియు కర్ణుడు. శ్రీ మహా విష్ణువు అవతారములలో శ్రీ రామావతారం పూర్తిగా రవి గ్రహానికి సంబందించినది. అదే విధంగా సూర్య భగవానుడి గోత్రం తన తండ్రి పేరు అయిన కాశ్యప గోత్రము. మనలో కూడా కుటుంబ గోత్రంగా కశ్యప గోత్రాని కలిగిన వారు అందరూ రవి అంశతో జన్మించినవారే. ఈ గోత్రం పేరును మనం ఎక్కువగా క్షత్రియ కులస్తులలో చూస్తాము.
The Sun's father is Kashyapa Prajapati and His mother is Aditi. Because He was born to the divine mother Aditi, He is called 'Aditya'. Lord Ravi's birth star is Vishakha. Lord Surya has two wives: Sangya Devi and Chaya Devi. His offspring include Yamadharmaraja, Lord Shani, Sugriva, and Karna. Among the incarnations of Lord Maha Vishnu, the Sri Rama Avatar is entirely associated with the Sun. Similarly, Lord Surya's Gotra is the Kashyapa Gotra, named after His father. All those who belong to the Kashyapa Gotra are considered to be born with the essence of Ravi. This Gotra is most commonly found among the Kshatriya community
జ్యోతిష్య శాస్త్ర పితామహుడు అయిన శ్రీ పరాశర మహర్షి సూర్యుని రూపాన్ని ఈ విధంగా వర్ణించారు. సూర్యు భగవానుడు పొట్టిగా ఉంటారు అని, చక్కని కన్నులు కలవాడు అని, ఆయన శక్తి అంతా ఆయన కన్నులలోనే ఉంటుంది అని, చతురస్ర ఆకారంలో శరీరం కలిగి తక్కువ జుట్టు కలిగిన బుద్ధిమంతుడు అని సూర్యుని రూపాన్ని వర్ణించారు. సూర్య భగవానుడి వాహనం తెల్లటి ఏడు అశ్వములు కలిగిన రధం. ఈ ఏడు గుర్రాలు వారంలోని ఏడు రోజులను తెలియచేస్తాయి. సూర్యుని రథ సారథి పేరు అనూరుడు. ఈ అనూరుడు శ్రీ మహా విష్ణువు వాహనం అయిన గరుత్మంతుని సోదరుడు. అనూరుడు ఒక గంధర్వుని శాపం వలన కాళ్లు ఏర్పడకుండా అర్ధ శరీరం తో జన్మించాడు. ఆయన సూర్యుని రథాన్ని నడుపుతూ, సూర్యుని నుండి వచ్చే అత్యంత తీవ్రమైన వేడిని ముందుగా తానే స్వీకరిస్తూ, భూమిపై ఉన్న ప్రాణులకు తట్టుకోగలిగేంత కాంతిని మాత్రమే ప్రసరింపజేస్తాడు. అందుకు కృతజ్ఞతగానే మనం సూర్యోదయానికి ముందు వచ్చే కాలాన్ని అరుణోదయ కాలం అని పిలుస్తాము. ఈ అరుణోదయ సమయంలో చేసే ప్రార్థనలు అనూరుడు శ్రీ సూర్య భగవానుడికి మన తరపున తెలియచేస్తారు అని రుషీశ్వరుల నమ్మకం. మనలో కూడా మన బిడ్డలకు అరుణ్ లేదా అరుణ అనే పేర్లను పెట్టడం కూడా అనూరుడు కి కృతజ్ఞత తెలియచేయడమే.
Sage Parashara, the father of Vedic Astrology, described Lord Surya's appearance in this manner: Lord Surya is of short stature, possesses beautiful eyes, and His entire power is concentrated within them. He has a square-shaped body, sparse hair, and is highly intelligent. Lord Surya's vehicle is a chariot drawn by seven white horses, which represent the seven days of the week. His charioteer is named Anura, who is the brother of Garuda, the mount of Lord Maha Vishnu. Due to a Gandharva’s curse, Anura was born with an incomplete body, having no legs. As he drives the chariot, he absorbs the Sun's most intense heat himself, transmitting only as much light as the creatures on Earth can endure. In gratitude, we call the time before sunrise 'Arunodaya.' Sages believe that prayers offered during this Arunodaya time are conveyed to Lord Surya by Anura on our behalf. Even naming our children Arun or Aruna is a way of expressing our gratitude to Anura.
రవి గ్రహానికి అధిదేవత శ్రిమన్నారయునుడు. రవి ఒక రాశిలో సుమారు 30 రోజులు ఉంటాడు. ఆయన ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడాన్నే మనం "సంక్రాంతి" అని పిలుస్తాము. సూర్యుడు ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు. ఈ ప్రయాణాన్నే మనం సౌర మాసం అని పిలుస్తాము. సూర్యుడు మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణ కాలం అని అంటాము. ఇది దేవతలకు పగలు వంటిది, చాలా పవిత్రమైనది. సూర్యుడు కర్కాటక రాశి నుండి ధనుస్సు రాశి వరకు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయన కాలం అని అంటాము.
"The presiding deity of the planet Sun (Ravi) is Lord Srimannarayana. The Sun stays in each zodiac sign for approximately 30 days. His transition from one zodiac sign to another is what we call 'Sankranti.' The duration of the Sun’s stay in a single sign for 30 days is known as a 'Solar Month' (Soura Maasam). The period during which the Sun travels from Capricorn (Makara Rasi) to Gemini (Mithuna Rasi) is called 'Uttarayana.' This period is considered as daytime for the Deities and is held very sacred. Conversely, the period when the Sun travels from Cancer (Karkataka Rasi) to Sagittarius (Dhanus Rasi) is known as 'Dakshinayana.
వ్యక్తిగతంగా నేను ఒక డాక్టర్ ను కాబట్టి ఇక్కడ కొన్ని సైన్సు కు సంబందించిన విషయాలు తెలియచేయాలి అని అనుకుంటున్నాను. సైన్సు ప్రకారం సూర్య కాంతిని విశ్లేషిస్తే అది ఏడు వర్ణాల సమ్మిళితం అని తెలుస్తుంది. ఆ ఏడు రంగులనే VIBGYOR అని సైన్సు పరిభాషలో పిలుస్తాము. అసలు రవి ఎందుకు నవ గ్రహాలలో రాజు అయ్యాడు? జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసుకుంటే తన అంతర్గతంగా తీవ్ర ఉష్ణ శక్తిని పుట్టించుకోగలిగి మన సౌర మండలానికి కాంతిని ప్రసాదించే గ్రహం మరొకటి లేదు. మన భారతీయ ఇస్రో శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ప్రస్తుతం సూర్యుడు తన జీవితకాలం మధ్య వయస్సులో ఉన్నాడు. ఆయన వయస్సు సుమారు 460 కోట్ల సంవత్సరాలు. మరో 500 కోట్ల ఏళ్ల తర్వాత సూర్యుని శక్తికి కారణం అయిన హైడ్రోజన్ నిల్వలు అయిపోతాయి.
As I am a Doctor by profession, I would like to share some scientific facts here. According to science, when sunlight is analyzed, it is revealed to be a blend of seven colors, scientifically referred to as 'VIBGYOR'. Why is the Sun considered the King of the Navagrahas (nine planets)? From an astrological perspective, there is no other celestial body that can generate such intense internal thermal energy and provide light to our entire solar system. According to the calculations of our Indian ISRO scientists, the Sun is currently in its middle age. It is approximately 4.6 billion years old. In another 5 billion years, the hydrogen reserves that power the Sun will eventually be exhausted.
సూర్యుని ఉపరితలం నుండి బయలుదేరిన కాంతి భూమిని చేరడానికి సుమారు 9 నిమిషాల సమయం పడుతుంది. మన ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం చూసుకుంటే మన సౌర్ వ్యవస్థలో సూర్యుడి పరిమాణంతో లేదా సూర్యుని గురుత్వ ఆకర్షణ శక్తితో పోటీ పడగలిగే గ్రహం మరొకటి లేదు. సూర్యుని పరిమాణం ఎంత పెద్దది అంటే సూర్యుని లోపల దాదాపు 13 లక్షల భూములను నింపవచ్చు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం బృహస్పతి (గురు గ్రహం). కానీ, సూర్యుని లోపల దాదాపు 1,100 బృహస్పతి గ్రహాలు సరిపోతాయి. దీనిని బట్టి సూర్య గ్రహ పరిమాణం ఎంత పెద్దదో ఊహించవచ్చు. సూర్య కేంద్రక సిధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నకస్ అనే శాస్త్రవేత్త సూర్యుడి పరిమాణం గురించి సరళంగా ఏమన్నారు అంటే ఒకవేళ సూర్యుడు ఒక సాధారణ ఫుట్‌బాల్ పరిమాణంలో ఉంటే, మన భూమి ఒక చిన్న ఆవగింజ (Mustard seed) అంత పరిమాణంలో ఉంటుంది. ఇంత భారీ పరిమాణం వల్లే సూర్యుడు తన గురుత్వాకర్షణతో అన్ని గ్రహాలను తన చుట్టూ తిప్పుకోగలుగుతున్నాడు అని కోపర్నికస్ తెలియచేసాడు. కోపర్నికస్ కంటే కొన్ని వందల సంవత్సరాల ముందుగా మన భారతీయ శాస్త్రవేత్త అయిన శ్రీ ఆర్యబట్టు సూర్యుడి పరిమాణం గురించి, సూర్యుడి చుట్టూ మిగిలిన గ్రహాలు తిరుగుతాయి అని చెప్పినా ఈ ప్రపంచం దృష్టిలో కోపర్నికస్ మాత్రమె గొప్పవాడు అయ్యాడు.
It takes approximately 9 minutes for the light starting from the Sun's surface to reach the Earth. According to the research of our ISRO scientists, no other planet in our solar system can compete with the Sun's size or its gravitational force. The Sun is so immense that nearly 1.3 million Earths could fit inside it. Jupiter (Guru Graha) is the largest planet in the solar system, yet nearly 1,100 Jupiters could fit inside the Sun. This gives us an idea of its colossal scale. Nicolaus Copernicus, the scientist who proposed the Heliocentric theory, simplified the Sun's size by stating that if the Sun were the size of a standard football, our Earth would be as small as a mustard seed. Copernicus explained that it is this massive size and gravity that allow the Sun to keep all the planets revolving around it. Although our ancient Indian scientist, Sri Aryabhata, had mentioned the Sun's magnitude and the planetary orbits around it hundreds of years before Copernicus, it was Copernicus who gained global recognition for these facts.
భూమి యొక్క గురుత్వ ఆకర్షణ శక్తితో పోలిస్తే సూర్యును గురుత్వ ఆకర్షణ శక్తి 28 రెట్లు ఎక్కువ. ఇంత ఎక్కువ గురుత్వ ఆకర్షణ కలిగి ఉండడం వలనే ఈ అనంత విశ్వంలో సూర్యుడు తానూ ముందుకు ప్రయాణిస్తూ మిగిలిన గ్రహాలు తన చుట్టూ తిరిగేలా చేసుకుంటూ ముందుకు సాగి పోతున్నాడు. కేవలం సూర్య భగవానుడి వలనే మిగిలిన గ్రహాలు, వాటి సహజ ఉపగ్రహాలు ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలుగా స్థిరంగా వాటి వాటి కక్ష్యలలో పరిభ్రమిస్తూ ఈ విశ్వం లయ తప్పకుండా ఉంది. ఇప్పుడు మీకే అర్ధం అయి ఉంటుంది ఎందుకు గ్రహ రాజు గా సూర్య భగవానుడిని పరిగనిస్తాము అనేది. ఇప్పటి వరకు మనం రవి గ్రహం గురించి సైన్స్ పరంగా ఎక్కువ చర్చించుకున్నాం. ఇంక జ్యోతిష్య పరంగా సూర్య భగవానుడి గొప్పతనాన్ని పరిశీలిద్దాం.
The gravitational force of the Sun is 28 times stronger than that of the Earth. Due to this immense gravitational pull, as the Sun moves forward through the infinite universe, He ensures that all other planets revolve around Him while staying on their course. It is solely because of Lord Surya that the other planets and their natural satellites have remained stable in their respective orbits for trillions of years, maintaining the cosmic rhythm without fail. By now, you must have understood why Lord Surya is regarded as the 'King of Planets' (Graha Raja). So far, we have discussed the greatness of the Sun more from a scientific perspective. Now, let us examine the significance of Lord Surya through the lens of Astrology.
ఏ జాతకులు అయితే కృత్తికా నక్షత్రంలో లేదా ఉత్తరా నక్షత్రంలో లేదా ఉత్తరాషాడ నక్షత్రంలో జన్మిస్తారో వారి జీవితాలు రవి మహా దశతో ప్రారంభం అవుతాయి. రవికి మిత్ర గ్రహాలు: చంద్రుడు, కుజుడు, గురువు. శత్రు గ్రహాలు: శుక్రుడు, శని. సూర్య భగవానుడికి ఇష్టమైన రత్నం కెంపు. సూర్య భగవానుడు తూర్పు దిక్కుకు అధిపతి. ఎరుపు వర్ణం అనేది రవికి ఇష్టమైన రంగు. గోధుమలు అనేవి రవి కి ఇష్టమైన ఆహార పదార్ధం. బంగారం, రాగి మరియు ఇత్తడి లోహాలు సూర్య భగవానుడికి ఇష్టమైన లోహాలు. వ్యక్తిగత జాతకంలో రవి గ్రహ శాంతి అవసరం అయిన వారిచేత పైన పేర్కొన్న వస్తువులనే దానం ఇప్పించడానికి గల కారణం ఇది.
Those who are born in Krittika, Uttara (Uttara Phalguni), or Uttarashada Nakshatras begin their lives with the Ravi Maha Dasha (Sun's major period). The friendly planets to the Sun are the Moon, Mars, and Jupiter, while His enemy planets are Venus and Saturn. The Sun's favorite gemstone is Ruby (Kempu), and He is the lord of the East direction. Red is the preferred color of Lord Ravi. Wheat is His favorite food grain, and Gold, Copper, and Brass are the metals He favors. This is precisely why, for those who require 'Ravi Graha Shanti' (remedies for the Sun) in their personal horoscopes, these specific items are recommended for donation (Daana).
వ్యక్తిగత జాతకంలో రవి గ్రహ బలం కలిగినవారి జాతక లక్షణాలు / Characteristics of individuals with a strong Sun (Ravi) in their personal horoscope:
వ్యక్తిగత జాతకంలో రవి బలంగా వుంటే వారు ఏ వ్యాపారం చేసినా లాభ పడతారు. కానీ వ్యాపారంలో వచ్చే ధనం కన్నా కీర్తి ప్రతిష్టలు అధికంగా కావలి అని కోరుకుంటారు. / Individuals with a strong Sun in their personal horoscope tend to prosper in any business they undertake. However, they value fame and reputation far more than the monetary profits gained from their business.
రవి పితృ కారకుడు. వారసత్వ సంబంధ సంపదల వలన సుఖవంతమైన జీవితాన్ని అనుభవించే జాతకులకు రవి గ్రహ బలమే కారణం. / Ravi (the Sun) is the 'Pithru Karaka' (the significator of the father). For those individuals who enjoy a comfortable life through ancestral properties and inherited wealth, it is primarily due to the strength of the planet Sun in their horoscope.
కోర్టు తగాదాలలో లేదా ఇతరులతో గొడవలలో విజయానికి రవి బలం కావలెను. / The strength of Ravi (the Sun) is essential for achieving success in court litigations or disputes with others.
వ్యక్తిగత జాతకంలో రవి బలం కలిగిన వారు శౌర్య వంతులు అగును. ప్రభుత్వ లేదా రాజ్యాంగ బద్దమైన ఉద్యోగాలలో ఉన్నత స్థితిలో ఉంటారు. అన్ని విషయాలపై అవగాహనా , చక్కటి ప్రతిభ ఉంటుంది. / Individuals with a strong Sun in their personal horoscope are naturally courageous and valorous. They often hold high-ranking positions in government or constitutional sectors. Furthermore, they possess deep insight into various subjects and showcase exceptional talent in everything they do.
అటవీ సంపద, గనులు లేదా పర్వతాల మైనింగ్ సంబందించిన వ్యాపారాలలో లాభాలు పొందుతారు. / They will reap significant profits in businesses related to forest resources, mines, or mountain mining activities.
జాతకంలో రవి గ్రహ బలం కలిగిన వారి చేతిపై భారీ హోమ క్రతువులు నిర్వహించబడతాయి. / Those who possess a strong Sun (Ravi) in their personal horoscope are often destined to perform and lead grand Vedic rituals and massive sacrificial ceremonies (Homas/Yagnas).
వంశ పేరు ప్రతిష్టల పట్ల మిక్కిలి ఆశక్తి కలిగి ఉంటారు. / They possess a profound interest and great passion for upholding the name, fame, and prestige of their lineage (Vamsha).
సాధారణంగా వీరు శివోపాసకులు అవుతారు. వారి మాటతీరు , ప్రవర్తనలో రాజత్వం ఉట్టిపడుతుంది. / Generally, they tend to be devotees of Lord Shiva (Shivopasakas). Their speech, mannerisms, and overall conduct naturally exude a sense of royalty and majesty.
ప్రభుత్వ ఉద్యోగం అనేది వీరికి అతి సులువుగా లభిస్తుంది. ఇతరులను ఆదేశించు శక్తి ఉన్న అధికారం కలిగిన ఉద్యోగ్గం చేస్తారు. / Securing a government job comes very easily to them. They tend to hold authoritative positions that grant them the power and command to lead and instruct others.
ప్రజలకు మంచి చేసే రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటారు. / They earn a distinguished reputation as political leaders who strive for the welfare of the people.
వ్యక్తిగత జాతకంలో సంపూర్ణ రవి గ్రహ అనుకూలత కలిగిన స్త్రీలకు సంకల్ప సిద్ధి ఉంటుంది. వీరికి ఆత్మ బలం అధికం, మంచి తేజస్సు కలిగి ఉంటారు. / Women who have the complete blessings and favor of the planet Sun (Ravi) in their personal horoscopes possess immense willpower (Sankalpa Siddhi). They are endowed with great inner strength (Atma Balam) and a radiant, divine glow (Tejas) on their faces.
వ్యక్తిగత ఆరోగ్య విషయాలలో రవి గ్రహ బలం అధికంగా కలిగిన వారికి శారీరక శక్తి మరియు రోగనిరోధక శక్తి. అధికంగా ఉంటుంది. / In terms of personal health, those with a strong Sun (Ravi) in their horoscope possess immense physical vitality and a robust immune system.
వీరి ఆధిపత్యాన్ని అందరూ అంగీకరిస్తారు. / Their authority and leadership are universally accepted and respected by everyone.
ఇతరుల వద్ద తలవంచి పని చేయరు. / They do not prefer to work under others or bow down to anyone. They possess a strong sense of self-respect and independence.
సంకుచిత స్వభావులకు దూరంగా ఉంటారు. ఏ పని చేసినా ప్రశాంతమైన బుద్ధితో అలోచించి కడు నిదానంగా పని చేస్తారు. / They distance themselves from narrow-minded individuals. Whatever task they undertake, they approach it with a calm mind, thinking deeply and executing it with great patience and composure
జాతక చక్రంలో రవి బలంగా ఉంటే ఆ వ్యక్తి సమాజంలో ఉన్నత స్థితిని, కీర్తిని పొందుతాడు. / If the Sun (Ravi) is strong in one's horoscope, that individual will attain a high status in society and earn immense fame and recognition.
వీరికి ఉన్న ఆకర్షణ వలన వీరి జీవితంలో అక్రమ సంబంధాలు ఉంటాయి. వాటి నుండి బయట పడాలి. చిరు తిల్ల పట్ల ఆకర్షణ అధికం. / Due to their natural charisma and magnetic personality, they may face the risk of getting involved in extramarital or illicit relationships. It is essential for them to exercise self-control and steer clear of such involvements. Additionally, they tend to have a strong craving for snacks and tidbits (Chiru-thitlu).
రవి బలంగా ఉంటే లాభించే వృత్తులు / Professions Benefited by a Strong Sun (Ravi):
ఐఏఎస్ (IAS), ఐపిఎస్ (IPS) వంటి ఉన్నత ప్రభుత్వ పదవులు చాలా సులువుగా సాధించగలుగుతారు. / They can effortlessly achieve high-ranking government positions such as IAS and IPS.
రాజకీయ నాయకులు మరియు మేనేజర్లు. / Political Leaders and Managers.
బంగారు ఆభరణాల వ్యాపారం. / Gold Jewelry Business.
మంచి వాగ్ధాటి కలిగి ఉండడం వలన మీడియా రంగంలో బాగా పేరు గడిస్తారు. / Owing to their excellent oratory skills and eloquence, they earn great fame and recognition in the media sector.
ప్రభుత్వ పదవులు వలన లాభపడతారు. అన్యాయర్జిత ధనం అధికంగా నిలువ చేసుకోగలుగుతారు. / They benefit significantly from government positions. Due to their influence and power, they are also capable of accumulating a vast amount of wealth through various means.
రాజకీయ పదవుల వలన కొన్ని తరాలకు సరిపడు స్థిర చరాస్తులు సంపాదించగలుగుతారు. / Through their political positions, they are capable of acquiring vast movable and immovable assets sufficient for several generations
బంగారం, రాగి, ఇత్తడి సంబంధ వ్యాపారాలలో అద్భుత విజయం సాధిస్తారు. / They achieve extraordinary success in businesses related to Gold, Copper, and Brass.
వైద్య రంగంలో ముఖ్యంగా రక్త సంబంధ శాస్త్ర చికిత్సలు చేయడంలో మంచి హస్తవాసి ఉందనే పేరు గడిస్తారు. / In the medical field, they earn a distinguished reputation for having a 'healing touch' (Hasta Vasi), particularly in performing surgeries related to the blood and circulatory system.
రవి ప్రతికూలంగా ఉంటే జాతకుల స్వభావం / Traits of Individuals when the Sun (Ravi) is Unfavorably Placed:
వ్యక్తిగత జాతకంలో ప్రతికూల రవి బలాన్ని కలిగి ఉన్నవారు తీవ్ర అహంభావం ప్రదర్శిస్తారు. / Individuals with an unfavorably placed Sun (Ravi) in their personal horoscope tend to exhibit extreme arrogance and a dominating ego.
తండ్రి ఆయుష్షు ని తగ్గిస్తారు. తండ్రి మరణం తదుపరి వీరికి జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. తండ్రితో సత్సంబంధాలు లేకపోవడం లేదా చిన్నతనంలోనే తండ్రికి దూరం కావడం. / An unfavorable Sun may adversely affect the longevity of the father. Such individuals often find stability in their lives only after their father's demise. They may also suffer from strained relationships with their father or might face separation from him during their childhood
సమాజంలో పోగరుబోతులుగా గుర్తింపు పొందుతారు. ఇటువంటి వారితో ఇష్టపూర్వకంగా ఎవరూ స్నేహం చేయరు. / They gain a reputation in society as being arrogant and haughty. Consequently, people rarely step forward to build sincere friendships with them by choice.
ఉన్నత పరిపాలనా స్థానంలో వుండి కూడా ప్రజలపై దండనీతిని ఉపయోగించడానికి చూస్తారు. ప్రజలకు వ్యతిరేకంగా శాశనాలు చేస్తారు. గర్వం అధికంగా ఉంటుంది. / Even while holding high administrative positions, they tend to use punitive measures and harsh authority against the people. They often enact laws or rules that are contrary to public welfare, driven by their excessive pride and ego.
ఎంత చిన్న పని అయినా చేయగలిగే సామర్ధ్యం ఉండదు. కానీ అతిశయం కలిగిన ప్రగల్భాలు పలుకుతారు. They lack the capability to perform even the simplest of tasks, yet they constantly indulge in boastful talk and excessive self-praise.
ఆత్మ స్తుతి , పరనింద అధికంగా చేసుకుంటారు. వీరికి ధైర్యం తక్కువ. కానీ బయటకు కనపడనివ్వారు. / They indulge excessively in self-praise and the criticism of others. Despite lacking true courage, they meticulously hide their fears from the outside world
పదిమందిలోకి వెళ్ళడానికి భయపడతారు. తీవ్రమైన స్టేజ్ ఫియర్ ఉంటుంది. / They are afraid to go into public gatherings and suffer from intense stage fear.
కుటుంబ సభ్యులకు మంచి చేసే నిర్ణయాలు తీసుకోలేరు. / They are unable to take decisions that are beneficial for their family members.
ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఉండవు. / They lack self-confidence and mental courage.
ప్రభుత్వ లేదా కోర్టు సమస్యలు వెంటాడుతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుండి తరచుగా తీవ్ర విమర్శలు లేదా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు కేసుల్లో అపజయం ఎదుర్కొంటారు. / They are often haunted by government or legal complications. In their professional life, they frequently face severe criticism or hurdles from their superiors, and they may also encounter failures in court cases
రవి ప్రతికూలంగా ఉంటే ఎదురగు ఆరోగ్య సమస్యలు / Health Issues Caused by an Unfavorable Sun (Ravi):
తరచుగా తలనొప్పి లేదా మైగ్రైన్ వంటి తలనొప్పి సంబంధ సమస్యలు వలన బాధ పడతారు. / They frequently suffer from persistent headaches or migraine-related issues.
ఎముకల బలహీనంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రమాదాలలో కూడా ఎముకలు విరిగిపోవడం వంటి పరిస్థితులు ఎదురగును. / Their bones tend to be weak. They may face situations where their bones fracture easily, even during minor accidents.
తరచుగా గుండె దడ బాధిస్తుంది. రక్తపోటు సంబంధ ఇబ్బందులు బాధిస్తాయి. / They frequently suffer from heart palpitations and issues related to blood pressure.
జటరాగ్ని సంబంధ రోగములు, లాలాజలమునకు సంబందించిన రోగములు బాధిస్తాయి. / They suffer from ailments related to digestive fire (Jatharagni) and disorders concerning the salivary glands.
చాలా సులువుగా వడదెబ్బకు లోనవుతారు. లేదా ఏమాత్రం ఎండలో తిరిగినా వీరి ఆరోగ్యం పాడు అవుతుంది. / They are highly susceptible to heatstroke and tend to fall ill even with minimal exposure to the sun.
నేత్ర వ్యాదులు ముఖ్యంగా కుడి కంటికి సంబందించిన సమస్యలు ఎదుర్కొంటారు. / They suffer from eye diseases, particularly issues related to the right eye.
సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి చేయవలసిన క్రతువులు లేదా దానాలు / Rituals and Donations to Propitiate Lord Surya (The Sun God):
"The Legend of Aditya Hrudayam": "During the fierce battle between Lord Rama and Ravana, Ravana was relentlessly attacking with his mystical powers and a vast army. Having fought for a long time, Lord Rama, in his human form, experienced moments of mental fatigue and exhaustion. Observing Rama’s state from the heavens, the deities requested Sage Agastya to intervene and bestow upon Rama a powerful secret hymn that would ensure victory.
Sage Agastya approached Lord Rama and said, 'O Rama! I shall initiate you into a supreme, holy, and eternal prayer that destroys all enemies and guarantees victory.' This was the most powerful 'Aditya Hrudaya Stotram'. After performing Achamana (ceremonial sipping of water) three times and meditating upon the Sun God, Lord Rama recited the hymn as instructed by the Sage. Instantly, his despondency vanished, and he was infused with boundless energy and enthusiasm. Shortly thereafter, he defeated Ravana and emerged victorious.
When the Sun is weakly placed in an individual's horoscope or when one faces obstacles from enemies, chanting the Aditya Hrudayam yields miraculous results."
"The Ravi Graha Stotram by Sage Veda Vyasa:" "Japa Kusuma Sankasham, Kashyapeyam Mahadyutim, Tamorim Sarva Paapaghnam, Pranathosmi Divakaram."
Meaning: "I bow to the Sun God (Divakara), who is as brilliant and red as the Japa (Hibiscus) flower, the illustrious son of Sage Kashyapa. He is the enemy of darkness and the destroyer of all sins; I prostrate before that bringer of light."
ఆ మహా శివుడు స్వయంగా నందీశ్వరుల వారికి ఉపదేశించినట్లు చెప్పబడే సూర్యుని గొప్పతనం వర్ణించిన శ్లోకం "ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర | దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే" పటించడం మంచిది.
"The Divine Hymn Taught by Lord Shiva to Nandiswara:" "Adideva Namasthubhyam Praseeda Mama Bhaskara | Divakara Namasthubhyam Prabhakara Namosthuthe"
Meaning: "O First of the Gods (Adideva), I bow to you. O Bhaskara (Creator of Light), please be gracious to me. O Divakara (The one who makes the day), I prostrate before you. O Prabhakara (Source of radiance), I offer my salutations to you."
To mitigate the negative effects of the Sun and to seek the blessings of Lord Surya, the following donations are highly recommended, especially when performed on Sundays:
Offerings to Brahmins: One may donate a Copper Vessel, Jaggery, White Lotus, or Gold to three Brahmins. These items are symbolically linked to the Sun's energy and help in strengthening its positive influence.
Donation of Wheat: Donating Wheat (the primary grain associated with the Sun) on Sundays is considered an effective remedy to overcome professional hurdles and health issues related to vitality.
Performing Surya Namaskara while chanting the 12 names of Lord Surya is not merely a physical exercise; it is a complete spiritual and physiological discipline (Sadhana). This practice is designed to activate and balance the 7 Vital Chakras (Energy Centers) of the human body.
To gain the maximum benefit, one should chant the following names during the 12 postures of the sequence:
Om Mitraya Namaha (Salutations to the Friend of all)
Om Ravaye Namaha (Salutations to the Radiant one)
Om Suryaya Namaha (Salutations to the Dispeller of darkness)
Om Bhanave Namaha (Salutations to the One who illumines)
Om Khagaya Namaha (Salutations to the One who moves quickly through the sky)
Om Pushne Namaha (Salutations to the Giver of strength)
Om Hiranyagarbhaya Namaha (Salutations to the Golden Cosmic Self)
Om Marichaye Namaha (Salutations to the Lord of Dawn)
Om Adityaya Namaha (Salutations to the Son of Aditi)
Om Savitre Namaha (Salutations to the Benevolent Creator)
Om Arkaya Namaha (Salutations to the One who is fit to be praised)
Om Bhaskaraya Namaha (Salutations to the Bestower of splendor)
Students striving for Government Jobs can gain immense benefits by meditating on Lord Surya daily while chanting the Gayatri Mantra. Since the Sun is the significator of authority and governance, this practice helps in achieving success in competitive examinations.
The Gayatri Mantra:
"Om Bhur Bhuvah Svah, Tat Savitur Varenyam, Bhargo Devasya Dhimahi, Dhiyo Yo Nah Prachodayat"
శ్రీ రవి గ్రహ పూర్ణ కుంభ కలశ సహిత జాతక దోష నివారణ శాంతి జపం.
Sri Ravi Graha Poorna Kumbha Kalasha Sahita Jataka Dosha Nivarana Shanti Japam . This is a comprehensive Vedic ritual performed to neutralize severe doshas (afflictions) caused by the Sun in one's birth chart.
రవి గ్రహం ప్రధానంగా నవగ్రహ మండపారాధన హోమం మరియు రవి గ్రహ రాగి యంత్ర జల నిమజ్జనం.
Special Vedic Rituals for the Sun: Navagraha Mandaparadhana Homam
రోజూవారీ మా పంచంగం మరియు జ్యోతిష్య శాస్త్ర విషయాల కోసం మా అధికారిక ఛానల్‌లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.