ధనిష్ఠ 3,4 పాదములు లేదా శతభిషం 1,2,3,4 పాదములు లేదా పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభరాశి కి చెందును.
జనవరి 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో కూడా చక్కటి ఫలితాలు కొనసాగును. నూతన వ్యాపార వ్యవహారాలకు , ఉద్యోగ ప్రయత్నాలకు ఈ మాసం చక్కటి కాలం. ఎత్తైన ప్రాంతాలు, కొండ మార్గాలలో సంచరించునపుడు జాగ్రత్తగా ఉండవలెను. విదేశే ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి కోర్కెలు నెరవేరును. కీర్తి ప్రతిష్టలు లభించును.
ఫిబ్రవరి 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసం పితృ వర్గీయులకు మంచిది కాదు. ఆకస్మిక సమస్యలు లేదా కష్ట నష్టములు కలుగు సూచన. ఆదాయం తగ్గును. స్నేహితులతో విరోధాలు లేదా వారి వలన వ్యక్తిగత నష్టాలు. ఆరోగ్య సమస్యలు కలిగిన వారికి ఈ మాసంలో వ్యాధి తీవ్రత అధికం. వ్యక్తిగత జీవనం బాగుండదు. ఈ మాసంలో 1,5,6,12,19,29 తేదీలు అనుకూలమైనవి కావు.
మార్చి 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో స్తంభించిన కార్యములు పునః ప్రారంభం అగును. పట్టుదలతో వ్యవహారాలలో విజయం. ధనాదాయం బాగుండును. కుటుంబ శ్రేయస్సుకై శ్రమించెదరు. అవకాశములను సద్వినియోగం చేసుకొందురు. సంపద వ్రుద్ధి చెందును. మాసాంతంలో కీర్తి ప్రతిష్టలు పెరుగును. కాలం అనుకూలంగా ఉండును. అన్ని విధమైన విఘ్నాలు తొలగును.
ఏప్రిల్ 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసం నూతన కార్యములు ఆరంభించుటకు మంచి ప్రోత్సాహకరంగా ఉండి లాభించును. విరోదులపై విజయం ఏర్పడును. కోర్టు కేసుల తీర్పులు అనుకూలంగా వచ్చును. ధనాదాయం బాగుండును. వ్యాపారాదులు చక్కటి లాభాలను కలుగచేసి ఆశించిన విధంగా ముందుకు సాగును. మాస ద్వితియార్ధంలో గౌరవ పురస్కారాలు లభించును. ఋణ బాధలు తొలగును. మిత్రు వర్గం నుండి దూరంగా ఉండటం మేలు. ప్రతిభకు గుర్తింపు ఏర్పడును. పై అధికారుల ఆదరణ, ప్రోత్సాహం పొందుదురు.
మే 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో కూడా ధనాదాయం బాగుంటుంది. వ్యాపార, ఉద్యోగ , వృత్తి జీవనంలోని వారికి అనుకూలమైన ఫలితాలు కొనసాగును. రావలసిన ధనం సమయానికి అందును. వ్యక్తిగత , వైవాహిక జీవనములలో చక్కటి సంతోషపూరిత రోజులు ఏర్పడును. అవివాహితులకు , నిరుద్యోగులకు ఈ మాసం శుభవార్తలను కలుగచేయును. సమయానుకూలంగా పనులు పుర్తిఅగును. వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు అభివృద్ధి చెందును. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. కుటుంబ సభ్యుల బాధలను పరిష్కారం చేయుదురు. అందరూ హర్షించే కార్యక్రమాలు చేస్తారు.
జూన్ 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన ప్రయత్నాలు ఫలించు గ్రహ గతులు కలవు. వ్యాపారాదులు సామాన్యంగా ఉండును. భాగస్వామ్య వ్యవహారాలకు ఇది మంచి కాలం. ఈ మాసంలో శ్వాస సంబంధ సమస్యలు బాధించు సూచన. తృతీయ వారంలో ఏదో ఒక విషయంలో మనస్థిమితం లోపించు పరిస్థితులు కలవు. ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. కార్య దీక్ష లోపించును. మాసాంతానికి పరిస్థితులలో అనుకూలత ఏర్పడును. ఈ మాసంలో 8, 11, 15, 23, 28 తేదీలు అనుకూలమైనవి కావు.
జూలై 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ఆలోచనలలో వేగం కనిపిస్తుంది. కానీ ఆచరణలో ఆ వేగం లోపిస్తుంది. ప్రణాళికాబద్ధమైన కార్యదీక్ష అవసరమగును. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. పెద్దలను లేదా అనుభవజ్ఞులైన వారిని సంప్రదించవలసి వచ్చును. ధనాదాయం సామాన్యం. ఆర్ధిక ఇబ్బందులన్నీ అధిగమిస్తారు. నూతన భాధ్యతలు ఏర్పడును. ధార్మిక విషయాలందు ఆసక్తి పెరుగును.
ఆగష్టు 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో కుటుంబ విషయాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవిగా ఉంటాయి. ఉద్యోగ కార్యాలయంలో వ్యతిరేక స్వభావం కల వ్యక్తులతో జాగ్రత్త అవసరం. ధనాదాయం సామాన్యం. వ్యాపార వర్గం వారికి మందకొడి ఆర్జన. ఆశించిన స్థాయి వ్యాపారం ఉండదు. మాస ద్వితీయ భాగంలో వివాహప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో నూతన వ్యక్తుల కలయిక ఇబ్బందులకు దారితియవచ్చు. ఈ మాసంలో జల ప్రయాణాలు చేయువారు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంతవరకు జల సంబంధ ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.
సెప్టెంబర్ 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో గతకాలంలో గాడి తప్పిన వ్యాపార వ్యవహారాలు ఒక దారికి వచ్చును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం కలసి వచ్చును. ఉద్యోగ జీవనంలో మార్పులు ఆశిస్తున్న వారికి కూడా ఈ మాసం కలసి వచ్చును. నూతన పదవులు లభించును. ధనాదాయం సామాన్యం. స్త్రీలకు ఉదర సంబంధ అనారోగ్య సమస్యకు సూచనలు కలవు. మాసాంతంలో ఆత్మీయులతో సంతోష సమయం లేదా విహార యాత్రలకు అవకాశం. నూతన వాహనాల కొనుగోలుకు ఈ మాసం అనుకూలమైనది కాదు.
అక్టోబర్ 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో మేనమామ వర్గీయులకు మంచిది కాదు. వ్యాపార వ్యవహారాలు ధనాదాయం సామాన్యం. గృహ జీవనంలో కొద్దిపాటి అశాంతి, సౌఖ్యం తగ్గును. తక్కువ స్థాయి స్త్రీలతో పరిచయాల వలన సమస్యలు. నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. వాయిదా వేసిన పనులను పూర్తీ చేయగలుగుతారు. మాసం చివరి వారంలో దూర ప్రాంత ప్రయాణాలు. శారీరక అలసట. ఈ మాసంలో 13, 19, 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు.
నవంబెర్ 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ఇష్ట దేవతా అనుగ్రహ ప్రాప్తి ఏర్పడును. స్వశక్తితో కార్యాలను పూర్తీ చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారాన్ని పొంది సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఒక పెద్ద పనిని పూర్తీ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఉద్యోగంలో కోరుకొన్న మార్పులు. సత్కారములు పొందుదురు.
డిసెంబర్ 2019 కుంభరాశి జ్యోతిష్యం:
ఈ మాసంలో ఆర్ధిక విషయాలలో అభివృద్ధి క్రమానుగతంగా తగ్గును. వ్యాపార వ్యవహరాదులలో చిక్కులు ఏర్పడును. అదృష్టం కలసి రాదు. మంచి మంచి అవకాశములు కోల్పోవుదురు. సమస్యల పరిష్కారం కోసం ఇతరులను ఆశ్రయించవలసి వచ్చును. సరిహద్దు విషయాలలో సమస్యలు. అనవసర సామాగ్రి కొనుగోలు చేస్తారు. చివరి వారంలో శ్రమతో కూడిన జీవనం. నూతన ప్రయత్నాలు కలసిరావు. పాత మిత్రులు అవసరమగును.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.