Placeholder image

శ్రీ విళంబి నామ సంవత్సర మేషరాశి రాశీ ఫలితాలు 2018 - 2019

2018 - 2019 Sree Vilambi Nama Samvatsara Mesha Rasi Phalitalu / Aries Predictions.

Sri Vilambi Mesha Rasi telugu Rasi phalitalu 2018 - 2019

అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదములు , భరణి నక్షత్రం 1,2,3,4 పాదములు , కృత్తిక నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేష రాశికి చెందును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మేష రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 05 అవమానం - 07

మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారు కష్టంతో ఉద్యోగమును పొందును.విదేశీ ఉద్యోగం ప్రయత్నాలు చేయువారికి సంవత్సర ప్రారంభం లో అంత అనుకూలంగా పరిస్థితులు ఉండవు. వ్యాపార రంగంలోనివారికి ప్రారంభ మాసములలో అధిక వ్యయం, ధన సమస్యలు ఏర్పడి ద్వితీయ భాగంలో తగ్గును. సంతాన ప్రయత్నములు చేయువారికి ప్రయత్న ఆటంకములు ఎదురగును. బాగా ఎదిగిన సంతానం స్థిరత్వం విషయంలో సమస్యలు. నూతన ప్రయత్నాలకు శ్రమానంతర విజయం ఏర్పడును. అశ్రద్ధ వలన ఆరోగ్య సమస్యలు తీవ్రమగును. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలలో విజయం లభించుట కష్టం. విద్యార్ధులకు ఆశించిన విద్య లభించును. చక్కటి పురోగతి ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి ఆశించిన స్థాన చలనములు లభించును. వస్త్ర వ్యాపారములు, కందెన వ్యాపారములు చేయువారికి నష్టములు. రాజకీయ రంగం వారికి పదవీ లాభం. వ్యవసాయదారులకు రెండు పంటలు సామాన్యంగా ఫలించును.

మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10 - అక్టోబర్ - 2018 వరకూ చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వివాహ ప్రయత్నములు చేయువారికి ఆశించిన సంబంధములు ఏర్పరచును.11-అక్టోబర్ -2018 నుండి మధ్య మధ్య ధనలాభాములను , మధ్య మధ్య ధన నష్టములను కలుగచేయును.

మేష రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యములు వలన లాభములు కలుగచేయును. పితృ వర్గం వారితో వైరములు, అపోహలు ఏర్పడును.

మేషరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో రాహు - కేతువుల వలన మంచి ఫలితాలు ఏర్పడవు. వాహన ప్రమాదములను, గాయములను కలుగచేయును. శరీర శౌఖ్యం వుండదు. అనేక చిక్కులు ఏర్పరచును. రాహు - కేతువులకు శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.

 

  • Click Here to know other Rasi's Rasiphalitalu...
  • Click Here to get your personalised manually written "Horoscope Prediction Report"
  • Click Here to know your Raasi / Sign Nature...
  • Click Here to know your Birth Star Nature...
  • Click Here to know your Lucky vaastu facing...

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.