కన్యా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ప్రాప్తించును. ఉద్యోగ, వ్యాపార, వృత్తి జీవనముల వారికి మంచి ఫలితాలు ఏర్పడును. అవివాహితుల వివాహ ప్రయత్నములు చివరి సమయంలో సమస్యలను ఏర్పరచు సూచన. సంతాన ప్రయత్నములు చేయువారు నిరాశ చెందుటకు అవకాశములు కనిపించుచున్నవి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమగును. నూతన వ్యాపారములు, భాగస్వామ్య వ్యాపారములు ఈ సంవత్సరం ప్రారంభించకుండా ఉండుట మంచిది. సొంత ఇంటి కొరకు ప్రయత్నములు చేయుటకు, స్థిరాస్తులు కొనుటకు ఈ సంవత్సరం కలసివచ్చును. వ్యవసాయదారులకు రెండు పంటలు ఫలించును. విద్యార్థులకు సామాన్య ఫలితాలు.
శ్రీ విళంబి నామ సంవత్సరంలో కన్యారాసి వారికి గురువు 10-అక్టోబర్-2018 వరకూ ఆర్థికంగా కలసివచ్చును. కానీ ఆరోగ్యమూలక సమస్యలను, చికాకులను కలుగచేయును. ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్త అవసరం. 11-అక్టోబర్-2018 నుండి ఆర్థికంగా కూడా అంతగా కలసిరాడు. జాతకంలో గురుబలం లేని చిన్న పిల్లలకు బాలారిష్టములు ఏర్పరచును.
కన్యా రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని యోగించడు. సంతానంతో గొడవలు, కుటుంబ జీవనంలో సమస్యలు, విద్యార్థులకు ఆటంకాలు, వారసత్వ సంబంధ విషయాలలో చిక్కులు, కొద్దిపాటి పిత్రార్జిత వ్యయమును లేదా నష్టమును కలుగచేయును.
కన్యా రాశి వారికి ఈ 2018 - 2019 సంవత్సరంలో రాహువు వలన అంతగా సమస్యలు ఏర్పడవు. రాహువు అధికంగా ప్రయాణములను కలుగచేయును. పుణ్యక్షేత్ర దర్శనములు ఏర్పరచును. కేతువు కూడా అనుకూలమైన ఫలితాలు కలుగచేయును. భూసంబంధ వ్యాపారములు చేయువారికి, కాంట్రాక్టు పనులు చేయువారికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చును.
Pages you may like to visit:
రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us
Connect on WhatsAppWe can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.