శ్రీ విళంబి నామ సంవత్సరం సింహ రాశి వారికి అంత అనుకూలంగా వుండదు. తలపెట్టిన ప్రయత్నాలు విజయవంతమగుట కష్టం. వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా ఉండును. నూతన వ్యాపారములు లాభించవు. వివాహ ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇచ్చును. అవసరములకు ధనం సర్దుబాటు జరుగుటలో ఇబ్బందులు ఏర్పడును. ఆర్థికంగా ఋణములు చేయుదురు. మాటగౌరవంతో వ్యవహారాలు కొనసాగును. ఉద్యోగ జీవనం వారికి సామాన్య ఫలితాలు. పదోన్నతులకు అనువైన సమయం కాదు. విద్యార్థులు శ్రమించవలెను. వ్యవసాయం మిశ్రమ ఫలితాలు కలిగించును. సంతాన ప్రయత్నాలు చేయువారికి దైవ ఆశీస్సులు అవసరం.
సింహ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ అనుకూలమైన ఫలితాలు పొందలేరు. సోదర సోదరీ వర్గం వలన సమస్యలు ఎదుర్కొందురు. 11-అక్టోబర్-2018 తదుపరి భూ లేదా గృహసంబంధ భాగ్యం పొందెదరు. దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించుట కష్టం. శనికి శాంతులు అవసరం.
రాహు - కేతువులు ఇరువురు సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఇవ్వరు. పిత్రార్జితం లేదా వారసత్వ సంపద వ్యయమగు పరిస్థితులు కలుగచేయును.
Pages you may like to visit:
రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:
Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us
Connect on WhatsAppWe can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.