2018 - 2019 Sree Vilambi Nama Samvatsara Meena Rasi Phalitalu / Pisces Sign Predictions.
మీనరాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం అధిక శాతం శుభ ఫలితాలు కలుగచేయును. ముఖ్యంగా ద్వితియార్ధం అధికమైన లాభాలను కలుగచేయును. ఉద్యోగ అన్వేషణలో వున్నవారు చక్కటి ఉద్యోగాన్ని పొందేదురు. సంతానం యొక్క స్థిరత్వంలో సమస్యలు కలుగును. చేపట్టిన ప్రయత్నములు కష్టంతో ప్రారంభం ఇయినా అనుకూలమైన దిశలో పయనించి ఫలవంతంగా ముగియును.
శ్రీ విళంబి నామ సంవత్సరం లో మీనరాశి వారు గురుగ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ అననుకూల ఫలితాలు, 11-అక్టోబర్-2018 తదుపరి అత్యంత చక్కటి ఫలితాలను పొందును. విశేషమైన భూ లేదా గృహ సంపదను కలుగచేయును. వారసత్వం వలన, స్వార్జితం వలన కలసివచ్చును. శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని మీనరాసి వారికి సంవత్సరం అంతా మంచి చేయును. విశేష ధనార్జన ఇచ్చువాడు అగును. కానీ ఆర్ధిక విషయాలలో లోభత్వం ప్రదర్శించు పరిస్థితులు కలుగచేయును.
మీనా రాశి వారికి రాహు - కేతువులు ఇరువురు ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉండును. ఆయుర్భాగ్యములు సంపూర్ణంగా ఇచ్చును. కానీ రాహువు వలన సంతాన సంబంధిత విషయాలలో నష్టం లేదా సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించునట్టు చేయును. సంతానం వలన ప్రశాంతత వుండదు.
We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.