Telugu Vedic Astrology Horoscope Rasiphalalu Services

శ్రీ విళంబి నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలితాలు 2018 - 2019

2018 - 2019 Sree Vilambi Nama Samvatsara Makara Rasi Phalitalu / Capricorn Sign Predictions

Sri Vilambi Telugu makara Rasi Phalalu 2018 2019
  • ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 04 అవమానం - 05

మకర రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మంచి ధనలాభాలను కలుగచేయును. ఆశించిన ధనము సంపాదించుకొందురు. అదేవిధంగా వీరి చేతిపై ఖర్చు కూడా ఉండును. ఉద్యోగ జీవులు, వ్యాపారములు, ప్రొఫెషనల్ వృత్తులు వారు మంచి అభివృద్ధిని పొందును. వివాహ సంబంధాలు కుదురును. స్థానచలన ప్రయత్నాలు ఆటంకములను ఏర్పరచును. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కలసివచ్చును. ఆశించిన ఉద్యోగం లభించును. జీవన పోరాటంలో జయం. కుటుంబ జీవనంలో స్త్రీలకు ప్రోత్సాహవంతమైన కాలం. వైవాహిక జీవనంలో సంతోషం. సంతాన భాగ్యం. కోర్టు వ్యవహారాలు అనుకూలం కాదు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురు గ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగచేయును. ప్రజా పాలకులకు పేరు ప్రతిష్టలు, విద్యార్థులకు ఉన్నత విద్య, చక్కటి ధనార్జన, సంపద భాగ్యములు ఏర్పరచును. చేతివృత్తులు, కుల వృత్తి చేయువారికి అతి చక్కటి కాలం.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం ఏలినాటి శని ప్రభావం వలన జాతకులు ప్రగల్భాలకు పోయి విశేషమైన ధనవ్యయం చేయును. ఆర్థిక పరంగా ఏలినాటి శని దశ కలసిరాదు. ఈ సంవత్సరం మకర రాశి వారు రాహు గ్రహం వలన శారీరక వ్యాధులను, వివాహ ప్రయత్నాలలో ఆటంకములను, బంధువర్గం వలన నమ్మకద్రోహములను ఎదుర్కొందురు. కేతువు వలన నష్టములు ఉండవు.

Pages you may like to visit:

రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us

Connect on WhatsApp

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.