Telugu Vedic Astrology Horoscope Rasiphalalu Services

శ్రీ విళంబి నామ సంవత్సర ధనుర్రాశి రాశీ ఫలితాలు 2018 - 2019

2018 - 2019 Sree Vilambi Nama Samvatsara Dhanur Rasi Phalitalu / Sagittarius Sign Predictions

Sri Vilambi Dhanur Rasi Phalalu 2018 2019
  • మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1 వ పాదములో జన్మించినవారు ధనుర్ రాశికి చెందును.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారికి ఆదాయం - 05 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 05

ధనుర్ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరం మంచి చెడుల మిశ్రమంగా ఉండును. నూతన వ్యాపారాలు, వ్యవహారాలు లాభించును. ఉద్యోగ అన్వేషణ చేయువారికి, వలసదారులకు వారి వారి కోరికలు నెరవేరును. వివాహ ప్రయత్నాలు నిష్ఫలం. యంత్ర తయారీ పరిశ్రమదారులకు లాభాలు. వస్త్ర రంగ పరిశ్రమదారులకు, చేనేత వర్గం వారికి నష్టములు. ఆరోగ్య పరంగా సుఖ వ్యాధుల వలన సమస్యలు.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనుర్ రాశి వారు గురు గ్రహం వలన 10-అక్టోబర్-2018 వరకూ మంచి ఫలితాలు పొందును. సక్రమ మార్గంలో విశేష ధనాదాయం ఏర్పడును. ప్రభుత్వ ఉద్యోగులకు అంతగా కలసిరాడు. గౌరవ హాని, అపకీర్తి. బృహస్పతి జాతకులు ధర్మ మార్గంలో నడుచునట్లు చేయును. శుభ ఫలితాలు ఏర్పరచును. 10-అక్టోబర్-2018 తదుపరి ఇదే బృహస్పతి కలసిరాడు. వ్యవహార చిక్కులను, ఆరోగ్య సమస్యలను ఏర్పరచును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ వలన ధనుర్ రాశి వారు అనుకూలమైన ఫలితాలు తక్కువ స్థాయిలో పొందుదురు. శరీర సౌఖ్యం దూరమగును. సులువుగా పూర్తి కావలసిన పనులు కూడా అధిక శ్రమను కలుగచేయును. ఆర్థిక పరిస్థితులు అదుపులో ఉండవు. కుటుంబ సభ్యులు మరియు సంతాన ప్రవర్తన మానసిక చికాకులు కలుగచేయును. ధనుర్ రాశి వారికి రాహు - కేతువులు ఇరువురు కలసిరారు. శారీరక సమస్యలు, కష్టములు, మానసిక ఆందోళన కలుగచేయును.

Pages you may like to visit:

రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us

Connect on WhatsApp

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.