Telugu Vedic Astrology Horoscope Rasiphalalu Services

శ్రీ విళంబి నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలితాలు 2018 - 2019

2018 - 2019 Sree Vilambi Nama Samvatsara Vrushabha Rasi Phalitalu / Taurus Sign Predictions

Sri Vilambi Telugu Vrushabha Rasi Phalalu 2018 2019
  • మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములలో ఒకటి అయిన మీది వృషభ రాశి.
  • శ్రీ విళంబి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం - 11 వ్యయం - 05 రాజపూజ్యం - 01 అవమానం - 03.

వృషభ రాశి వారికి శ్రీ విళంబి నామ సంవత్సరంలో ధనాదాయం ప్రధమార్ధంలో అధికంగా ఉండును. ద్వితీయార్ధంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఏర్పడును. అనుకోని విధానంలో వాయిదా పడుతున్న పనులు ఈ సంవత్సరం పూర్తి అగును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములు ఫలించును. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఆశించువారికి కొద్దిపాటి నిరాశ. సొంత గృహ ప్రయత్నాలు ఫలించును. రాజకీయ రంగంలోనివారికి లౌఖ్యం అవసరం. పట్టుదల వలన గౌరవ భంగం. జూన్, జూలై, ఆగష్టు మాసాలలో వివాదాలు, పోలీస్ కేసులు వలన చికాకులు. విద్యార్థులకు సామాన్య ఫలితాలు. వ్యాపార వ్యవసాయ రంగం వారికి మధ్యమ ఫలితాలు. వృషభ రాశికి చెందిన స్త్రీలు ఈ సంవత్సరం సంపత్ గౌరీ వ్రతము ఆచరించడం మంచిది.

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురు గ్రహం 10-అక్టోబర్-2018 వరకూ చెడు ఫలితాలను కలుగచేయును. అనవసర శత్రుత్వములను, అపవాదులను, ఆరోగ్య సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను కలుగచేయును. 11-అక్టోబర్-2018 తదుపరి కొంచెం శాంతించును. అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. అవివాహితుల వివాహ ప్రయత్నములను ఫలవంతం చేయును. కానీ శరీర దారుఢ్యం తగ్గును.

శ్రీ విళంబి నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. కష్టార్జితం అంతా వృధాగా మిత్రులకు, బంధువులకు వినియోగించవలసిన పరిస్థితులు ఏర్పరచును. నల్లని వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పరమైన వ్యయం అధికం అగును.

వృషభ రాశి వారు ఈ సంవత్సరంలో రాహువు వలన సోదర సంబంధ సమస్యలను లేదా తగాదాలను లేదా సోదర వర్గ నష్టములను పొందు సూచన. స్వ విషయాలలో అనుకూలమైన ఫలితాలను ఏర్పరుచును. వృషభ రాశి వారు ఈ సంవత్సరం భ్రాతృ వర్గం వారికి అప్పులు ఇచ్చుట, వారి కొరకు హామీలు ఉండుట, భాగస్వామ్య వ్యాపారాలు చేయుట మంచిది కాదు. కేతు గ్రహం ఈ రాశి వారికి వైవాహిక జీవనంలో సమస్యలను, జీవిత భాగస్వామికి అనారోగ్యమును ఏర్పరచును. విడాకులు ఆశిస్తున్న వారికి ఈ సంవత్సరం విడాకులు, కళత్ర నష్టం ఏర్పడును. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కలుగచేయును.

Pages you may like to visit:

రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us

Connect on WhatsApp

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.