Placeholder image

2017-2018 Vruchika Rasi Telugu Rasi Phalalu For Sri Hemalamba Telugu Year

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు

 

Placeholder image
  • విశాఖ 4 వ పాదము, అనురాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం - 08 వ్యయం - 14 రాజపూజ్యం - 04 అవమానం - 05

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు మిశ్రమఫలితాలను పొందును. ఆశించినంత లాభములు కనిపించవు. సామాన్య పరిస్థితి ఏర్పడును. జ్ఞాతుల వలన పీడ, బంధువులతో కలహం, చోర బాధ, విదేశీ ప్రయత్నములకు ఆటంకములు, వివాహములు తప్పిపోవుట, కలత్రమూలక వివాదములు ఏర్పడును. వృత్తి జీవనం మరియు వ్యాపార రంగంలోనివారికి మధ్యమ ఫలితాలు. ఉద్యోగ జీవనం చేయువారికి ఒడిదుడుకులు. దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం. వ్యవసాయ రంగం వారికి మంచిది. రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలాలు. ధనవ్యయం. సంతాన సంబంధ ప్రయత్నములు లాభించును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి గురువు 12 - సెప్టెంబర్ - 2017 వరకూ విశేషమైన ధనదాయమును కలిగించును. చక్కటి అనుకూలమైన ఫలితాలను ఏర్పరచును. సత్కార్యములను చేయును. 12- సెప్టెంబర్-2017 తదుపరి మిశ్రమ ఫలితాలను కలిగించును. ప్రభుతం వలన , ఋణముల వలన బాధ, నరముల సంబంధిత ఆరోగ్య సమస్యలు ఏర్పడును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ధనవ్యయమును , నేత్ర సంబంధ సమస్యలను, సంతాన వ్యతిరేకతను ఏర్పరచును. ప్రతీ విషయములోను అటంకములను , కష్టపడాల్సిన పరిస్థితులను ఏర్పరచును. ఎల్నటి శని దాస కూడా ఉండుట వలన శని ప్రభావం తీవ్రంగా ఉండును. శనికి శాంతి జపములు జరుపవలెను. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సంవత్సరం అంతా రాహువు అనుకూలమైన ఫలితాలనే కలిగించును. గృహ సంబధమైన ప్రయత్నములకు బలం చేకూరును. కేతువు కూడా మంచి ఫలితాలనే కలిగించును.

Pages you may like to visit:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.