Telugu Vedic Astrology Horoscope Rasiphalalu Services

2017 - 2018 Simha Rasi Telugu Phalitalu For Sri Hemalamba Nama Telugu Year

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర సింహ రాశి ఫలితాలు

Simha Rasi Telugu Phalalu
  • మఘ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సింహ రాశి వారి ఆదాయం - 02 వ్యయం - 14 రాజపూజ్యం - 02 అవమానం - 02

సింహ రాశి వారికి శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఉండును. ముఖ్యంగా ధన సంబంధమైన విషయాలు లాభం కలిగించును. పుణ్యక్షేత్ర సందర్శన ఏర్పడును. ధర్మ గ్రంధాల లేదా సజ్జన సాంగత్యం లభించును. ఈ సంవత్సరంలో బంధు వియోగమునకు సూచన. మాతృ వర్గీయులకు మంచిది కాదు. కుటుంబ, కోర్టు సంబంధమైన సమస్యలు పరిష్కారమగును. అకారణంగా కలహములు, మనోవైకల్యం, వక్రబుద్ధి వలన గౌరవ హాని.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సింహ రాశి వారికి గురువు వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు కలుగవు. ఒకప్పుడు ధనమును, ఒకప్పుడు ఋణములను కలుగచేయును. సోదర సంబంధమైన ఆర్థిక నష్టములను, విద్యార్థులకు ఆశించిన విజయాలను, ధార్మిక సంబంధమైన వ్యయములను కలిగించును. ఇబ్బందులను కలిగించినా యోగము చెడిపోదు. గురువుకి శాంతి అవసరం లేదు.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శని ప్రభావం వలన సింహ రాశికి చెందిన గర్భిణులు జాగ్రత్త వహించవలెను. శని ప్రభావం వలన సమస్యలు తలెత్తవచ్చును. నిత్యం శని గ్రహ కవచం చదువుకొనవలెను. మిగిలిన విషయాలలో శని సామాన్య ఫలితాలను కలిగించును. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సింహ రాశివారికి రాహువు అధిక శారీరక శ్రమను, పట్టుదలలో లోపమును, దురాలోచన వలన అవమానములను కలుగచేయును. వారసత్వంగా లభించిన పిత్రార్జితంలో కొద్దిపాటి వ్యయమును ఏర్పరచును. కేతువు వలన శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మిక్కిలి చికాకులు ఏర్పడు సూచన. అనారోగ్యమూలక కష్టములు, ప్రమాదములు, కళత్ర జీవనంలో అపసవ్యతలను కలుగచేయును. ఈ సంవత్సరం ఒక పర్యాయం కేతు శాంతి జరిపించిన మంచిది.

Pages you may like to visit:

రోజూవారీ మా పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి:

Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

YouTube Channel | WhatsApp Channel | Instagram | Facebook | Telegram | Contact Us

Connect on WhatsApp

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr. Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.