Placeholder image

2017-2018 Makara Rasi Telugu Rasi Phalalu For Sri Hemalamba Nama Telugu Year

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర మకర రాశి ఫలితాలు

 

Placeholder image
  • ఉత్తరాషాడ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2, పాదములలో జన్మించినవారు మకర రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం - 14 వ్యయం - 14 రాజపూజ్యం - 03 అవమానం - 01

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందును. వృత్తి జీవనం వారికి , ఉద్యోగ జీవనంలోని వారికి లాభములు. వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు. స్వస్థలంలో అభివృద్ధి. విదేశాములలోని వారికి కొద్దిపాటి విఘ్నములు , కష్ట నష్టములు. సొంత గృహ ప్రయత్నము ఫలించును. భూసంబంధ లేదా వ్యవసాయ సంబంధ లాభములు కలుగును. సోదర వర్గంతో అనుకూలత, పురాణ శ్రవణం వంటి శుభ ఫలితాలు ఏర్పడును. సోదర అనుకూలత, కళత్ర విషయాలలో శుభం. మొత్తం మీద ఆదాయం బాగుంటుంది. తీవ్ర ప్రయత్నము అనంతరం విజయములు ఏర్పడును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి గురువు సంవత్సరం అంతా సామాన్య ఫలితాలను కలిగించును. మిక్కిలి పేరు ప్రతిష్టలను ఏర్పరచును. ఆధ్యాత్మిక భావన అధికమగును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి శని మంచి ఫలితాలను ఇవ్వడు. ఏల్నాటి శని దశ ప్రభావం వలన స్వార్జితం, పిత్రార్జితం ఖర్చు అగును. అనవసర ధన వ్యయం. ఈ సంవత్సరం నెలకు ఒక పర్యాయం 100 గ్రాముల నల్ల నువ్వులు జల దానం చేయుట , సంవత్సరములో ఒక పర్యాయం శని గ్రహ శాంతి జపం చేయించుకొనుట మంచిది.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో మకర రాశి వారికి రాహువు సంవత్సరం అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు. కళత్ర , పిత్రార్జిత సమస్యలను ఏర్పరచును. నిత్యం రాహు గ్రహ స్తోత్రము చదువుకొనుట మంచిది. కేతువు కూడా మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలిగించును. కాని తీవ్ర నష్టములు కలుగవు. కావున కేతువుకు శాంతి అవసరం లేదు.

 

Pages you may like to visit:

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.