Placeholder image

2017-2018 Karkataka Rasi Telugu Phalalu for Sri Hemalamba Nama Samvatsaram

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు

Placeholder image
  • పునర్వసు నక్షత్ర 4 వ పాదం , పుష్యమి నక్షత్ర 1,2,3,4 పాదములు, ఆశ్లేషా నక్షత్ర 1,2,3,4 వ పాదములలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం - 14 వ్యయం - 02 రాజపూజ్యం - 06 అవమానం - 06

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశికి చెందిన వ్యవసాయదారులకు , భూసంబంధమైన వ్యాపారములు చేయు వారికి చక్కటి విజయం ప్రాప్తిస్తుంది. వృత్తి జీవనం, ఇతర వ్యాపారములు చేయు వారికి లాభము, రాజ్య గౌరవం, ఆశించిన ధన లాభములు ఏర్పడును. ఉద్యోగ జీవనం చేయువారికి వ్యర్ధ సంచారం, దూరప్రాంత వాసము ఏర్పడు సూచన. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ప్రాప్తి. వివాహాది ప్రయత్నములు చేయువారికి మధ్యమ ఫలితాలు. తీవ్ర ప్రయత్నములు చేయవలెను. పెద్ద వయస్సు వారికి నరముల బలహీనత , నరముల సంబంధమైన అనారోగ్య సమస్యలు. కుటుంభంలో బంధు బలగం పెరుగును. నూతన పరిచయాలు ఆర్ధిక లాభములను కలిగించును. సంతాన ప్రయత్నములు చేయువారికి దైవ అనుగ్రహం అవసరం.

  • Click Here to get 2017 - 2018 Hemalamba Karkataka Rasi Phalalu in .PDF format

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలు కలిగించును. విద్యార్ధుల ఆశలు నేరవేర్చును. గృహస్థులకు భూ లేదా గృహ సంబంధమైన వసతులను ఏర్పరచును. ఇష్ట వాహన సౌఖ్యమును ఏర్పరచును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో శని కర్కాటక రాశి వారికి 20- జూన్- 2017 వరకూ అననుకూల ఫలితాలను, 20- జూన్- 2017 తదుపరి మంచి ఫలితాలను కలిగించును. ఈ సంవత్సరంలో శని కర్కాటక రాశి వారికి నానాదేశ సంచారమును, సంతాన అభివృద్దిని, ఖర్చుకు సరిపడు ఆదాయమును, నల్లని వస్తువుల వలన లాభములను కలుగచేయును. 20-జూన్-2017 వరకూ తీవ్ర చెడు ఫలితాల వలన బాధలను పొందుతున్నవారు శని దేవునికి శాంతి జపములు జరిపించుకోనవలెను.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాహువు యోగించడు. అధర్మ మార్గముల ద్వారా ధనవ్యయమును, అధర్మ జీవనమును, కఠినమైన ప్రవర్తనను ఏర్పరచును. 17-ఆగష్టు-2017 వరకూ కేతువు యోగించడు . అధికమైన శారీరక శ్రమను, తగాదాలను, ఋణములను, కార్య అపజయములను, వ్యవహరపు చిక్కులను ఏర్పరచును. 18-ఆగష్టు-2017 నుండి జీవిత భాగస్వామి సంబంధ విషయములు అనుకూలంగా వుండవు. కోర్టు కేసులను ఏర్పరచు సూచన. ద్వితియ వివాహ ప్రయత్నములు చేయువారికి అనుకూలత వుండదు.

ఏప్రిల్ 2017 కర్కాటక రాశి ఫలితాలు / April 2017 Karkataka Rasi Phalitalu:

ఈ మాసంలో చక్కటి ధనాదాయం ఏర్పడు సూచన. తలపెట్టిన కార్యములందు జయము. చిన్న అనారోగ్యం. ఉన్నత స్థాయి వ్యక్తుల దర్శన భాగ్యము. వృత్తిలో గుర్తింపు, గౌరవ సత్కారములు, వంశ పెద్దల ఆశీస్శులు , ప్రియ సంభాషణలు. మాసాంతంలో కొద్దిపాటి విఘ్నములు. 22, 24,25,27 తేదీలలో జాగ్రత్త అవసరం. అశుభ వార్తలు వినుటకు అవకాశం కలదు.

మే 2017 కర్కాటక రాశి ఫలితాలు / May 2017 Karkataka Rasi Phalitalu:

ఈ మాసంలో ఉద్యోగంలో లాభం. నూతన పదవులు ప్రాప్తి, గౌరవ ప్రదమైన జీవనం మొదలగు శుభ ఫలితాలు. ద్వితియ వారంలో ప్రయాణములు. ప్రయాణములు ఫలించును. పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఎదుర్కోను వారికి విజయం. ఆశించిన ఉద్యోగం లభించును. తృతీయ వారం సామాన్య ఫలితాలు. మాసాంతంలో విశేష సౌఖ్యం, సుఖ ప్రాప్తి. వస్త్ర లేదా నూతన వస్తువుల అమరిక. ఈ నెలలో 1, 4 , 6,10,15,18,22,27,29 తేదీలు అనుకూలమైనవి.

జూన్ 2017 కర్కాటక రాశి ఫలితాలు / June 2017 Karkataka Rasi Phalitalu:

ఆలోచనలు కార్య రూపం దాల్చును. కుటుంబంలో చిన్నపాటి కలహం. అపశ్రుతి. ధనాదాయం మాత్రం బాగుండును. న్యాయబద్ధమైన ధనార్జన ఏర్పడును. వృత్తి వ్యాపారములలో జయం. కోర్తువ్యవహరములలో అనుకూలత. వివాహ సంబంధ సంతోషములు. చర్చలు సఫలం. మధ్యవర్తుల ద్వారా కలసివచ్చును. సంతాన ప్రయత్నాలు కలసిరావు. 7,8,9,10 తేదీలలో నూతన పెట్టుబడులు లాభించును.

జూలై 2017 కర్కాటక రాశి ఫలితాలు / July 2017 Karkataka Rasi Phalitalu:

ఈ మాసం అంత అనుకూలమైన ఫలితాలను కలిగించదు. ధన వ్యయము. ఆకస్మిక సమస్యలు, ప్రయాసతో కూడిన పనులు, ఉష్ణ సంబంధమైన అనారోగ్యములు , చికాకులు కలుగును. ఈ మాసంలో ఒక పర్యాయం కేతు గ్రహ శాంతి జరిపించిన మంచిది. ఈ నెలలో 1, 3, 12, 13, 19, 27 తేదీలు మంచివి కావు.

ఆగష్టు 2017 కర్కాటక రాశి ఫలితాలు / August 2017 Karkataka Rasi Phalitalu:

ఈ మాసం కూడా అవాంతరములను, ఇబ్బందులను కలిగించును. ఉద్యోగ జీవనంలో నష్టములు, జీవిత భాగస్వామితో ఇబ్బందులు, విభేదాలు , మానసిక అశాంతి, సంతానం వలన గౌరవ హాని, స్థిరాస్తి సమస్యలు, వృధా వ్యయము వంటివి భాదించు సూచన. మాసాంతంలో భవిష్యత్ గురించిన అనవసర భందోళనలు ఉండగలవు. 26 నుండి మాసాంతం వరకూ మంచి సమయం కాదు.

సెప్టెంబర్ 2017 కర్కాటక రాశి ఫలితాలు / September 2017 Karkataka Rasi Phalitalu:

ఈ మాసం ప్రారంభంలో స్నేహితుల వలన మోసం, ధన వ్యయం. 13 వ తేదీ తదుపరి లాభకరమైన పరిస్థితి. గత రెండు నెలలలో ఎదుర్కొన్న చికాకులు క్రమేపి తొలగును. నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమగును. వివాహ సంబంధ ప్రయత్నాలు, నూతన గృహం కొరకు చేయు ప్రయత్నములు ఫలించును. స్త్రీ సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. చివరి వారంలో నూతన వృత్తి మార్గములు లాభించును. పితృ వర్గం వారినుండి సహకారం లభించును.

అక్టోబర్ 2017 కర్కాటక రాశి ఫలితాలు / October 2017 Karkataka Rasi Phalitalu:

ఈ మాసం అనుకూల వాతావరణం. వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలములు పొందును. జీవిత భాగస్వామి వర్గం వారికి మంచిది కాదు. గృహంలో కొద్దిపాటి ఆందోళనపూరిత వాతావరణం. విద్యార్దులు, విదేశీ ప్రయత్నములు చేయువారు, స్థాన చలనమునకు ప్రయత్నించు వారికి శుభం. కార్యసిద్ధి, మనోవంచా ఫలసిద్ధి ఏర్పడును. పేరు ప్రఖ్యాతలు పెరుగును.

నవంబర్ 2017 కర్కాటక రాశి ఫలితాలు / November 2017 Karkataka Rasi Phalitalu:

వివాహ ప్రయత్నములు చేయువారికి, ఆర్ధిక ఋణములు కొరకు ప్రయత్నించు వారికి ఇది చక్కటి మాసం. బంధువుల వలన లాభములు. వాహనముద్రిదికార యోగం. నూతన పరిచయాలు. స్త్రీ సంతతికి అవకాశం. ధనాదాయం బాగుండును. ద్వితియ తృతీయ వారాలలో ఉద్యోగ జీవనంలో ఒత్తిడులు. 22 వ తేదీ తదుపరి అనారొగ్యమూలక ధనవ్యయం. కుటుంబంలో నూతన వస్తువుల అమరిక.

డిసెంబర్ 2017 కర్కాటక రాశి ఫలితాలు / December 2017 Karkataka Rasi Phalitalu:

ఈ మాసంలో ప్రధమ వారం సామాన్యం. ద్వితియ వారం నుండి ఊహించని అపవాదులు. మాటపాడు సంఘటనలు. ఆదాయ వ్యయములు సమానం. వ్యవహార చిక్కుల వలన కొన్ని కార్యములను మధ్యలోనే విడిచిపెట్టుట, 20 వ తేదీ తదుపరి పరిస్థితులలో అనుకూలత. పెంపుడు జంతువుల వలన సమస్యలు. మాసాంతంలో కుటుంబ సంతోషాలు. ఈ నెలలో 11, 12, 13 , 17 తేదీలు మంచివి కావు.

జనవరి 2018 కర్కాటక రాశి ఫలితాలు / January 2018 Karkataka Rasi Phalitalu:

ఈ మాసం సంతోషకరమైన ఫలితాలను కలిగించును. సుఖప్రాప్తి. విహార యాత్రలు, ఆశించిన ధనం లభించును. శత్రు నాశనం. కార్య విజయాలు. సంసార సంబంధమైన సంతోషాలు. వారసత్వ లాభములు. దీర్ఘకాలికంగా పరిష్కారం అవ్వని సమస్యలు పరిష్కారం పొందును. ప్రభుత్వ సంబంధ వ్యవహారములు లాభించును. ఈ నెలలో 2, 6, 8, 11, 21, 26 తేదీలు కార్యానుకులత కలిగించును.

ఫిబ్రవరి 2018 కర్కాటక రాశి ఫలితాలు / February 2018 Karkataka Rasi Phalitalu:

ఈ మాసంలో కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. తృతీయ వారంలో సుఖ వ్యాధుల వలన బాధ. మాసం అంతా ధనాదాయం బాగుండును. సంకల్పములు నెరవేరును. బంధు వర్గం వారితో జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఉత్సాహపూరిత సమయం.

మార్చి 2018 కర్కాటక రాశి ఫలితాలు / March 2018 Karkataka Rasi Phalitalu:

ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలిగించును. భయం, అనారోగ్యం, మనసున తొందరపాటుతనం, పై అధికారుల వలన ఒత్తిడి. ద్వితియ వారంలో సంతాన సంబంధ ప్రయత్నాలు లాభించును.కుటుంబ ఖర్చులు అధికమగును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. 14, 15 తేదీలలో ప్రయానములందు జాగ్రత్త వహించవలెను.

Pages you may like to visit:

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.