మానవ జీవితంలో సుఖదుఃఖాలు, జయాపజయాలు అన్నీ కూడా మనం పుట్టిన సమయంలో ఆకాశంలో ఉన్న నవగ్రహాల స్థితులను బట్టే ఆధారపడి ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రంలోని విశిష్టమైన మరియు అత్యంత ప్రభావవంతమైన గ్రహ స్థితులలో "కాలసర్ప దోషం" ఒకటి. చాలామంది ' కాల సర్ప దోషం' అనే పదం వినగానే విపరీతంగా భయపడిపోతుంటారు. కానీ, యదార్థానికి కాలసర్ప దోషం అనే స్థితి వలన ఏర్పడే ప్రతికూల ఫలితాల తీవ్రతను సరైన దోష పరిహారం ద్వారా మనం సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవచ్చు.
Human life, with all its joys and sorrows, successes and failures, depends entirely on the positions of the nine planets (Navagrahas) in the sky at the time of our birth; among the unique and highly influential planetary configurations in astrology, "Kala Sarpa Dosha" is one that often causes immense fear in many people upon hearing its name, but in reality, the intensity of the adverse effects caused by this condition can be mitigated as much as possible through proper remedial measures (Dosha Pariharam).
జ్యోతిష్య పరిభాషలో రాహువును "సర్ప శిరస్సు" అంటే తల భాగంగా , కేతువును "సర్ప పుచ్ఛము" అంటే తోక గాను పరిగణిస్తాము. జాతక చక్రంలో మిగిలిన ఏడు ప్రధాన గ్రహాలు అనగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని ఈ రాహు-కేతువుల మధ్యలోనే చిక్కుకుపోయినప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుంది. అంటే, గ్రహాలన్నీ ఒకే వైపునకు కేంద్రీకృతమై, సర్పబంధనంలో బంధింప బడతారు. ఈ సర్ప బంధనం వలన సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని జాతకానికి ఇవ్వవలసిన అనుకూల శక్తిని ప్రసాదించలేరు.
In astrological parlance, Rahu is considered the "serpent's head" (head portion) and Ketu as the "serpent's tail" (tail portion), and when the remaining seven major planets—namely the Sun, Moon, Mars, Mercury, Jupiter, Venus, and Saturn—become trapped between these two nodes in a birth chart, Kala Sarpa Dosha is formed; this means all the planets are concentrated on one side, bound within the serpent's grip, and due to this confinement, the Sun, Moon, Mars, Mercury, Jupiter, Venus, and Saturn are unable to bestow the positive energy they are meant to provide to the horoscope.
ఇప్పుడు రాహు మరియు కేతువుల జననం ఎలా జరిగింది అనే విషయాన్నీ తెలుసుకుందాం. క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు అమృతం లభిస్తుంది. ఆ అమృతం మొత్తాన్ని రాక్షసులు తమ వెంట తీసుకొని వెళ్ళిపోతారు. తమకు అన్యాయం జరిగింది అని భావించిన దేవతలు అమరత్వాన్ని ప్రసాదించే అమృతాన్ని తమకు ఇప్పించమని శ్రీ మహా మహావిష్ణువును వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అత్యంత మోహన రూపమైన "మోహినీ" అవతారాన్ని ధరించి తన హావభావాలతో రాక్షసులను మైమరపించి, అమృతాన్ని కేవలం దేవతలకు మాత్రమే పంచడానికి ఒక ప్రణాళిక రచిస్తారు.
Now, let us understand how Rahu and Ketu were born: when the churning of the cosmic ocean (Ksheera Sagara Mathanam) took place, the divine nectar of immortality (Amritam) was obtained, which the demons (Rakshasas) took away entirely for themselves; feeling deeply wronged, the deities (Devatas) pleaded with Lord Sri Maha Vishnu to secure the nectar that grants immortality for them, prompting Lord Vishnu to assume the most enchanting form of "Mohini," using Her mesmerizing expressions to captivate the demons while devising a clever plan to distribute the Amritam exclusively to the deities.
మోహినీ దేవి రూపంలో శ్రీ మహా విష్ణువు వేసిన పధకాన్ని "స్వర్భానువు" అనే పేరు గల రాక్షస రాజు గమనిస్తాడు. ఎలాగైనా అమృతాన్ని సాధించాలనే పట్టుదలతో స్వర్భానువు తనకు గల మాయా శక్తులతో దేవతల రూపం ధరించి మోహినీ దేవి అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో రహస్యంగా సూర్య భగవానుడికి, చంద్ర భగవానుడికి మధ్యలో కూర్చుంటాడు. మోహినీ దేవి ఆ రాక్షసుడిని గుర్తుపట్టకుండా అమృతాన్ని అందిస్తుంది. స్వర్భానువు ఆ అమృతాన్ని త్రాగడం మొదలు పెడతాడు. అమృతం అతని గొంతు దాటుతున్న సమయంలో. పక్కనే ఉన్న సూర్యచంద్రులు అతను రాక్షసుడని కనిపెట్టి మోహినీ దేవి రూపంలో ఉన్న శ్రీ మహా విష్ణువుకి తెలియచేస్తారు. వెంటనే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి స్వర్భానువు తలను మొండెం నుండి వేరు చేస్తాడు. అప్పటికే అమృతం అతని గొంతు దాటడం వల్ల స్వర్భానువు తలకు మరియు మొండానికి అమరత్వం అంటే మరణం లేని స్థితి లభిస్తుంది.
A demon named "Swarbhanu" notices the plan devised by Lord Sri Maha Vishnu in the form of Mohini Devi, and determined to acquire the nectar at any cost, he uses his illusory powers to disguise himself as a deity and secretly sits between the Sun god and Moon god while Mohini Devi is distributing the Amritam; failing to recognize the demon, Mohini Devi serves him the nectar, but just as Swarbhanu begins to drink it and the nectar passes his throat, the adjacent Sun and Moon identify him as a demon and alert Lord Vishnu, who instantly unleashes His Sudarshana Chakra to sever Swarbhanu's head from his body, yet because the nectar had already crossed his throat, both his head and torso attain immortality, entering a state beyond death.
స్వర్భానువుడి అనుచరులు తమ రాక్షస రాజు శరీరంలో అమృతం తాకిన తల భాగమును ఒక సర్పం యొక్క శరీరానికి జతచేస్తారు. ఇదే మన జ్యోతిష్యశాస్త్రంలో "రాహువు" గా మారింది. తల భాగం కలిగి ఉండడం వలన రాహువు మన ఆలోచనలను , భ్రమలను , కోరికలను మరియు రాక్షస ప్రవృత్తిని ప్రభావితం చేస్తారు.
The followers of Swarbhanu attach the head portion of their demon king's body, which had been touched by the immortal nectar, to the body of a serpent, which eventually became known as "Rahu" in our astrology; because he possesses the head portion, Rahu profoundly influences our thoughts, illusions, desires, and materialistic or demonic tendencies.
స్వర్భానువుడి మిగిలిన మొండెం అంటే శరీర భాగమును సర్పం యొక్క తలకు జతచేస్తారు. ఇదే మన జ్యోతిష్యశాస్త్రంలో "కేతువు" గా మారింది. తల లేని భాగం కాబట్టి కేతువు మనలోని వైరాగ్య భావన , మరణం తదుపరి మోక్షం పై ఆశక్తి , ఆధ్యాత్మికత చింతన మరియు అంతర్జ్ఞానాన్ని ప్రభావితం చేస్తారు.
The remaining torso, or body portion, of Swarbhanu is attached to the head of a serpent, which became known as "Ketu" in our astrology; because it is a headless form, Ketu profoundly influences our sense of detachment (Vairagyam), the desire for liberation (Moksha) after death, spiritual contemplation, and inner intuition.
తమను శ్రీ మహా విష్ణువుకు పట్టించారనే కోపంతో రాహు, కేతువులు సూర్యచంద్రులపై పగ పెంచుకున్నారు. అందువల్లే, వారు అవకాశం లభించినప్పుడల్లా సూర్యుడిని, చంద్రుడిని మింగడానికి ప్రయత్నిస్తుంటారు. దాన్నే మనం ఖగోళ శాస్త్రంలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం గా పరిగానిస్తాము.
Out of intense anger for being exposed to Lord Sri Maha Vishnu, Rahu and Ketu harbored a deep-seated vendetta against the Sun and the Moon, and as a result, they attempt to swallow the Sun and the Moon whenever an opportunity arises, which we recognize in astronomy as a solar eclipse (Surya Grahanam) and a lunar eclipse (Chandra Grahanam).
మరిన్ని వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.
కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన జీవితం మొత్తం శూన్యమైపోతుందని అనుకోవడం పూర్తిగా పొరపాటు. ఈ గ్రహస్థితి ఉన్నవారి జీవితంలో అకస్మాత్తుగా అడ్డంకులు రావడం, కష్టపడినా ఫలితం ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, వృత్తిలో సమస్యలు ఎదురవడం, సరైన సమయంలో స్థిరపడలేకపోవడం, మానసికంగా ఎదో ఒక అసంతృప్తి ఎదురవడం వంటి ఫలితాలు ఎదురవతాయి. 2008 వ సంవత్సరం నుండి నా ఆస్ట్రోలాజికల్ కెరీర్ పరంగా ఇన్ని వేల జాతకాలు పరిశీలించిన మీదట నేను కాల సర్ప దోషం ఉన్న వారిలో ఒక ప్రత్యెక విషయాన్నీ గమనించాను. అదేమిటంటే కాల సర్ప దోషం ఉన్న వారు అసాధారణమైన పోరాట పటిమను, ఎంతటి కష్టాన్నైనా తట్టుకునే మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు.
It is a complete misconception to believe that life becomes entirely empty just because one has Kala Sarpa Dosha; while this planetary configuration can cause sudden obstacles, delayed results despite hard work, delays in marriage, professional challenges, difficulties in settling down at the right time, and a persistent sense of mental dissatisfaction, I have observed a very special trait among individuals with Kala Sarpa Dosha after analyzing thousands of horoscopes throughout my astrological career since 2008, which is that these individuals possess an extraordinary fighting spirit and the mental resilience to endure any amount of hardship.
వ్యక్తిగత జాతకంలో రాహు కేతువులు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ప్రధానంగా 12 రకాల కాల సర్ప దోషాలను మన జ్యోతిష్య శాస్త్రం వివరించింది. ఒక్కో రకమైన దోషానికి ఒక్కో ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. వాటి పూర్తి వివరాలు గమనిద్దాం.
Our astrology explains that there are primarily 12 types of Kala Sarpa Doshas based on the specific positions of Rahu and Ketu in an individual's birth chart, with each type of dosha yielding its own unique results, the complete details of which we shall now observe.
రాహువు మొదటి స్థానం లో మరియు కేతువు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు అనంత కాలసర్ప దోషం ఏర్పడుతుంది. అనంత కాలసర్ప దోషం ఉన్నవారికి మానసిక ప్రశాంతత లోపించడం, తరచుగా అనారోగ్య సమస్యలు బాధించడం, సమాజంలో పేరు ప్రతిష్టలు రావడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి ఫలితాలు ఎదురవుతాయి. అయితే నేను గమనించింది ఏమిటి అంటే అనంత కాలసర్ప దోషం ఉన్న వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు.
Ananta Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the first house and Ketu is in the seventh house, causing those afflicted to experience a lack of mental peace, frequent health issues, and a prolonged struggle to achieve fame and reputation in society; however, what I have observed is that individuals with Ananta Kala Sarpa Dosha possess an inherently hardworking nature.
రాహువు ద్వితీయ స్థానంలో , కేతువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు గులిక కాలసర్ప దోషం ఏర్పడుతుంది. గులిక కాలసర్ప దోషం ఉన్న వారికి తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురగును, కుటుంబంలో చిన్నచిన్న కలహాలు, మాట పట్టింపులు ఉంటాయి. ఎంత సంపాదించినా ధనం నిలవడం కష్టమవుతుంది. సాధారణంగా గులిక కాలసర్ప దోషం ఉన్నవారు తమ మాట తీరు వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Gulika Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the second house and Ketu is in the eighth house, causing those afflicted to frequently face financial difficulties, minor conflicts, and arguments within the family, making it difficult to retain wealth no matter how much they earn; generally, individuals with Gulika Kala Sarpa Dosha tend to face problems primarily due to their manner of speaking.
రాహువు తృతీయ స్థానంలో, కేతువు నవమ స్థానంలో ఉన్నప్పుడు వాసుకి కాలసర్ప దోషం ఏర్పడుతుంది. వాసుకి కాలసర్ప దోషం ఉన్న వారికి తోబుట్టువులతో సత్సంబంధాలు లోపిస్తాయి, రక్త సంబంధీకుల వల్ల మోసపోవడం జరగవచ్చు. కష్టానికి తగిన భాగ్యం లేదా అదృష్టం త్వరగా కలిసిరాదు. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి.
Vasuki Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the third house and Ketu is in the ninth house, which leads to a lack of harmonious relationships with siblings, potential betrayal by blood relatives, and fortune or luck not favoring hard work easily, while particularly causing obstacles in foreign travel.
రాహువు చతుర్థ స్థానంలో , కేతువు దశమ స్థానంలో ఉన్నప్పుడు శంఖపాల కాలసర్ప దోషం సంభవిస్తుంది. శంఖపాల కాలసర్ప దోషం ఉన్న వారికి మానసిక సంతృప్తి తక్కువగా ఉంటుంది, ముఖ్యంగా తమ తల్లిగారి ఆరోగ్యం పాడవుతుంది, వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. శంఖపాల కాలసర్ప దోషం ఉన్నవారు జీవితంలో స్థిరపడటానికి ఎక్కువ పోరాడాల్సి వస్తుంది.
Shankhapala Kala Sarpa Dosha occurs when Rahu is positioned in the fourth house and Ketu is in the tenth house, which results in a lower sense of mental satisfaction, specifically causing deterioration in their mother's health and recurring difficulties in purchasing vehicles or properties; consequently, individuals with Shankhapala Kala Sarpa Dosha must strive much harder to settle down in life.
రాహువు పంచమ స్థానంలో , కేతువు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు పద్మ కాలసర్ప దోషం ఏర్పడుతుంది. పద్మ కాలసర్ప దోషం ఉన్న విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లోపిస్తుంది, సంతాన ప్రాప్తి ఆలస్యం అవుతుంది లేదా సంతానం వల్ల ఆందోళనలు పొందుతూ ఉండడం జరుగుతుంది. పద్మ కాలసర్ప దోషం ఉన్న వారు చేసే వ్యాపారాలలో అనుకున్నంత త్వరగా లాభాలు రావు.
Padma Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the fifth house and Ketu is in the eleventh house, which causes students afflicted with it to experience a lack of concentration in their studies, leads to delays in bearing children or ongoing anxieties regarding their children, and prevents profits from materializing as quickly as expected in the businesses they pursue.
రాహువు షష్ఠమ స్థానంలో , కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు మహాపద్మన కాలసర్ప దోషం ఏర్పడుతుంది. మహాపద్మన కాలసర్ప దోషం ఉన్నవారు కోర్టు సమస్యల వలన , శత్రువుల వల్ల పరోక్ష ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి. నేను గమనించిన ముఖ్య విషయం ఏమిటంటే మహాపద్మన కాలసర్ప దోషం ఉన్న వారు ఎంత ప్రయత్నించినా అప్పుల బాధలు త్వరగా తీరడం లేదు.
Mahapadma Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the sixth house and Ketu is in the twelfth house, causing those afflicted to face indirect troubles due to enemies and legal or court-related issues, while being troubled by long-term health problems; a major observation I have made is that no matter how hard individuals with Mahapadma Kala Sarpa Dosha try, it is very difficult for them to get cleared of their debt burdens quickly.
రాహువు సప్తమ స్థానంలో , కేతువు మొదటి స్థానంలో ఉన్నప్పుడు తక్షక కాలసర్ప దోషం ఏర్పడుతుంది. తక్షక కాలసర్ప దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం కావడం లేదా వైవాహిక జీవితంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఎదుర్కోవడం జరుగుతుంది. తక్షక కాలసర్ప దోషం ఉన్నవారు వ్యాపార భాగస్వాములతో వివాదాలు ఎదుర్కొంటారు.
Takshaka Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the seventh house and Ketu is in the first house, which causes those afflicted to face delays in marriage or experience severe differences of opinion in marital life, while also leading to frequent disputes with business partners.
రాహువు అష్టమ స్థానంలో, కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కార్కోటక కాలసర్ప దోషం ఏర్పడుతుంది. కార్కోటక కాలసర్ప దోషం ఉన్న వారికి పిత్రార్జిత ఆస్తులు దక్కడంలో ఇబ్బందులు ఎదురగును, తమకు ఎదో ఒక ప్రమాదం జరగవచ్చు అనే భయం వెంటాడుతూ ఉంటుంది. అకస్మాత్తుగా నష్టాలు ఎదుర్కోవడం జరగవచ్చు. కార్కోటక కాలసర్ప దోషం ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా ఆహార నియమాల పట్ల జాగ్రత్త వహించాలి.
Karkotaka Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the eighth house and Ketu is in the second house, which causes those afflicted to face difficulties in inheriting ancestral properties, leaves them haunted by a persistent fear of potential accidents, and can bring about sudden losses; therefore, individuals with Karkotaka Kala Sarpa Dosha must remain highly cautious about their health, particularly regarding their dietary habits.
రాహువు నవమ స్థానంలో , కేతువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శంచి చూడ కాలసర్ప దోషం ఏర్పడుతుంది. శంచి చూడ కాలసర్ప దోషం ఉన్న వారికి తండ్రి వైపు నుంచి మద్దతు లోపిస్తుంది. అదృష్టం ఎప్పుడూ చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటుంది. వీరు తలపెట్టిన వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆకస్మిక ప్రతికూల మార్పులు తరచుగా ఎదురవుతూ ఉంటాయి.
Shankhachuda Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the ninth house and Ketu is in the third house, which leads to a lack of support from the paternal side for those afflicted, while luck constantly slips away at the very last moment, and sudden adverse changes frequently disrupt the businesses and jobs they undertake.
రాహువు దశమ స్థానంలో , కేతువు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఘాతక కాలసర్ప దోషం సంభవిస్తుంది. ఘాతక కాలసర్ప దోషం ఉన్నవారికి ఉద్యోగంలో స్థిరత్వం ఉండదు, తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉండడం లేదా అధికారులతో సమస్యలు ఎదుర్కొనవలసి రావడం జరుగుతుంది. ఘాతక కాలసర్ప దోషం ఉన్న వారికి రాజకీయ, సామాజిక రంగాలలో తరచుగా పదవీ గండాలు లేదా అనవసరమైన అవమానాలు ఎదురవుతూ ఉంటాయి.
Ghataka Kala Sarpa Dosha occurs when Rahu is positioned in the tenth house and Ketu is in the fourth house, which leads to a lack of stability in one's career, causing individuals to frequently change jobs or face recurring issues with higher authorities, while those involved in political and social spheres often encounter threats to their positions or unearned humiliations.
రాహువు ఏకాదశ స్థానంలో , కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు విషిధాన కాలసర్ప దోషం ఏర్పడుతుంది. విషిధాన కాలసర్ప దోషం ఉన్నవారు నిరంతరం ప్రయాణాలు చేయాల్సి వస్తూంటుంది. ఈ విషిధాన కాలసర్ప దోషం ఉన్న వారు తాము అనుకున్న సమయానికి లాభాలు పొందలేరు. పెద్ద వయసు వచ్చినా స్థిరమైన ఆదాయ వనరులు తమంతట తాముగా ఏర్పరచుకోలేరు.
Vishadhara Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the eleventh house and Ketu is in the fifth house, which requires those afflicted to travel constantly, prevents them from realizing profits at their expected times, and makes it difficult for them to independently establish a stable source of income even as they reach an advanced age.
రాహువు ద్వాదశ స్థానంలో, కేతువు షష్ఠమ స్థానంలో ఉన్నప్పుడు శేషనాగ కాలసర్ప దోషం ఏర్పడుతుంది. శేషనాగ కాలసర్ప దోషం ఉన్న వారు అనవసరపు ఖర్చులు తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. కంటికి సంబంధిత సమస్యలు లేదా నిద్రలేమి సమస్యలు, తెలియని భయాలు వీరిని పీడించడం జరుగుతూ ఉంటుంది. సమాజంలో శేషనాగ కాలసర్ప దోషం ఉన్న వారు సొంత కుటుంబ సభ్యుల వల్ల సమాజంలో తరచుగా అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
Sheshanaga Kala Sarpa Dosha is formed when Rahu is positioned in the twelfth house and Ketu is in the sixth house, which causes those afflicted to frequently face unnecessary expenses, be troubled by eye-related issues, insomnia, or unknown fears, and often endure public slander or loss of reputation in society due to their own family members.
ఈ 12 రకాల కాల సర్ప దోషాలలో ఏది ఉన్నప్పటికీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతక చక్రంలో గ్రహాల బలాబలాలు, లగ్నాధిపతి స్థితి మరియు నడుస్తున్న దశాంతర్దశలను బట్టి మీకు ఉన్న కాల సర్ప దోష తీవ్రత మారుతుంది.
No matter which of these 12 types of Kala Sarpa Doshas is present, there is absolutely no need to lose courage, as the intensity of the dosha changes based on the strength and weaknesses of the planets in the birth chart, the placement of the Ascendant lord (Lagnadipati), and the current ruling planetary periods (Dasha-Antardashas).
కాలసర్ప దోష నివారణ మార్గాలు – పరిహారాలు - Remidial Procedures for Kala Sarpa Dosham:
కాలసర్ప దోష నివారణకు
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలవబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజ చేయించుకోవడం మంచిది / It is highly recommended to perform the Rahu-Ketu Sarpa Dosha Nivarana Puja at the Sri Kalahasti temple, which is revered as the Dakshina Kashi (Varanasi of the South) in our state of Andhra Pradesh.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహారాష్ట్ర రాష్ట్రంలోని త్రయంబకేశ్వరం క్షేత్రంలో కాలసర్ప దోష శాంతి పూజ చేయించుకోవడం మంచిది. / It is highly recommended to perform the Kala Sarpa Dosha Shanti Puja at the Trimbakeshwar temple in the state of Maharashtra, which is revered as one of the twelve sacred Jyotirlingas.
కర్ణాటక రాష్ట్రం లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువైన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలను దర్శించుకుని అభిషేకం చేయించడం మంచిది. / It is highly recommended to visit the Kukke Subramanya Swamy Temple in the state of Karnataka, where Lord Subramanyeshwara resides, and have an Abhishekam performed there.
రాహు-కేతువుల సర్ప దోష ప్రభావం తగ్గడానికి పరమశివుని ఆరాధన అమోఘంగా పనిచేస్తుంది. / The worship of Lord Shiva works phenomenally well in mitigating the adverse effects of Rahu-Ketu Sarpa Dosha.
ప్రతిరోజూ లేదా ప్రతి ఆదివారం మీకు దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్లి రాహు కేతు గ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేయడం మంచిది. / It is highly recommended to visit a nearby Navagraha temple every day or at least every Sunday and perform an Abhishekam to Rahu and Ketu with Panchamritams (the five sacred nectars).
ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం, వీలైతే పుట్టలో పాలు పోయడం లేదా నాగేంద్రుని విగ్రహానికి అభిషేకం చేయడం మంచిది. / It is highly recommended to worship Lord Sri Subramanya Swamy every Tuesday, recite the Subramanya Ashtakam, and if possible, offer milk at a snake hill or perform an Abhishekam to the idol of Nagendra (the serpent god).
మీకు వీలు అయినన్ని శనివారములు మినుములు దానం చేయడం మంచిది. / It is highly recommended to donate black gram (minumulu) on as many Saturdays as possible for you.
మీకు వీలు అయినన్ని మంగళవారములు ఉలవలు దానం చేయడం మంచిది. / It is highly recommended to donate horse gram (ulavalu) on as many Tuesdays as possible for you.
వెండితో చేసిన చిన్న నాగ ప్రతిమలను ప్రవహించే నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేయడం కూడా మంచి పరిహారమే. / Immersing small serpent idols made of silver into a flowing river or the sea is also considered an excellent and effective remedy.
నేను పైన పేర్కొన్న పరిహార మార్గాలు అన్ని ప్రయత్నించినా మీకు సర్ప దోష తీవ్రత తగ్గక ప్రతికూల ఫలితాలు ఎదురగుతూ ఉంటే మీ వ్యక్తిగత జాతకమునకు అనుగుణంగా 18 రోజుల రాహు - కేతు శిలా విగ్రహ ఆరాధనా సహిత కాల సర్ప దోష నివారణార్ధ పూర్ణ కుంభ శాంతి జపం జరిపించుకోవాలి. / If you continue to face adverse results and the intensity of the Sarpa Dosha does not mitigate despite trying all the aforementioned remedies, you should have the "18-day Rahu-Ketu Shila Vigraha Aaradhana Sahita Kala Sarpa Dosha Nivarandhartha Purna Kumbha Shanti Japam" performed in accordance with your personal birth chart.
నా దృష్టిలో నవ గ్రహాలు అనేవి మనల్ని భయపెట్టడానికి లేవు. ఆ ప్రత్యక్ష దైవాలు అయిన నవగ్రహాలు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి సంకేతాలుగా ఉన్నాయి. కాలసర్ప దోషం ఉన్నవారు నిరంతర సాధన, దైవచింతన మరియు పట్టుదలతో ఉంటే, సామాన్యుల కంటే అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
In my perspective, the Navagrahas (nine planets) do not exist to frighten us; rather, these living deities serve as guiding symbols to align us on the right path, and there is absolutely no doubt that if individuals with Kala Sarpa Dosha maintain constant practice, deep devotion, and unwavering perseverance, they will rise to heights far superior to those of ordinary individuals.
రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:
Trending Tags:
#KalaSarpaDosha #KalaSarpaDosham #AstrologyTelugu #RahuKetuDosha #KalaSarpaDoshaRemedies #AstrologyTips #AnantaKalaSarpaDosha #GulikaKalaSarpaDosha #VasukiKalaSarpaDosha #ShankhapalaKalaSarpaDosha #PadmaKalaSarpaDosha #MahapadmaKalaSarpaDosha #TakshakaKalaSarpaDosha #KarkotakaKalaSarpaDosha #ShankhachudaKalaSarpaDosha #GhatakaKalaSarpaDosha #VishadharaKalaSarpaDosha #SheshanagaKalaSarpaDosha #Srikalahasti #Trimbakeshwar #KukkeSubramanya #SarpaDoshaNivarana #RahuKetuPuja #KalaSarpaShanti #TeluguAstrology #Jatakam #RahuKetu #LordShivaRemedies #OurSubhakaryam #AstrologerAravind
We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.