Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర వృషభరాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Vrushabha Rasi / Taurus Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2024 - 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వార్కి ఆదాయం - 02, వ్యయం - 08, రాజ పూజ్యం - 07, అవమానం - 03 
  • పూర్వ పద్దతిలో వృషభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎదురగు లాభపూరిత సంవత్సరాన్ని సూచిస్తున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Vrushbha Rasi / Taurus Sign...

వృషభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 30 ఏప్రిల్ 2024 వరకూ అనుకూల ఫలితాలు ఏర్పడవు. గత సంవత్సరం వలనే ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండు పరిస్టితులు ఎదురగును. వ్యయం అధికంగా ఏర్పడినా ఖర్చు జరిగిన ధనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. 01 మే 2025 నుండి సంవత్సరం మొత్తం చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. నిరుద్యోగులకు , వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ బలం కలిగిన వారికి విదేశీ సంబంధ యోగ్యవంతమైన జీవనం ఏర్పరచును. పెద్ద వయస్సు వారు అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఈ సంవత్సరం గురు గ్రహం మంచి చేయును. సంతాన ప్రయత్నాలు చేయు రోహిణి నక్షత్ర జాతకులకు రుపవంతులైన సంతానం ప్రాప్తించును.

వృషభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని గ్రహం మిశ్రమ ఫలితాలు ఏర్పరచును. ఉద్యోగ జీవనములోని వారికి ఈ సంవత్సరం కూడా శని మంచి అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఆశించిన విధంగా ప్రమోషన్లు , నూతన అధికార భాద్యతలు ఏర్పరచును. ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు ఆశించు వారు ఈ సంవత్సరం ప్రయత్నించుట కలసి వస్తుంది. కానీ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా శని వ్యాపార పరంగా మాత్రం అనుకూల ఫలితాలు ఇవ్వరు. వ్యాపార పరంగా భారీ నష్టములు ఎదురగు సూచనలు ఉన్నవి. వ్యాపారస్థులు ఈ సంవత్సరం నూతన వ్యాపారములు ప్రారంభించకుండా ఉండుట మంచిది. వ్యాపార పరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడవలెను. వ్యక్తిగత జాతకంలో అనుకూల స్థానాలలో శని బలం కలిగీ ఉన్న వారకి వ్యాపార పరంగా సమస్యలు ఉండవు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృషభరాశి వార్కి ఏలినాటి శని దశ లేదు. 

వృషభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. ప్రభుత్వ ఉద్యోగులకు చక్కటి ప్రమోషన్లను ఏర్పరచును. విశేష ధనం సులువుగా లభిస్తుంది. ఆర్ధికంగా బలపడతారు. నూతన వాహన కొనుగోలు ఆకాంక్ష కలిగిన వారికి ఈ సంవత్సరం తప్పక వాహన యోగం లభిస్తుంది.

వృషభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతువు గత సంవత్సరం వలనే లాభ వ్యయాలు సమానంగా ఉండునట్టు చేయును. సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారికి మాత్రం విచారత , ప్రతికూల ఫలితాలు ఏర్పరచును. అయితే వ్యక్తిగత జాతకంలో గురు గ్రహ అనుకూల బలం కలిగిన వారికి మాత్రం కేతువు వలన సంతాన ఇబ్బందులు ఏర్పడవు. వ్యక్తిగత జాతకంలో సర్ప దోషం కలిగిన జాతకులు సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారు తరచుగా కేతు గ్రహ శాంతులు జరిపించుకోనుట మంచిది.

ఏప్రిల్ 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. వారసత్వ పరంగా జ్ఞాతుల వైరము కొనసాగును. చేయుచున్న వృత్తి వ్యాపారాలలో , ఉద్యోగ ప్రయత్నాలలో విజయము ప్రాప్తించును. ద్వితీయ వారంలో ఒక ఆకస్మిక చెడు సంఘటన ఏర్పడు సూచన. సోదర వర్గం వారికి మీరు సహాయ సహకారాలు అందించేదురు. మీ సహాయం వలన మీ భాత్రు వర్గం ఇబ్బందుల నుండి బయట పడతారు. తృతీయ వారంలో కుటుంబంలో గృహ సంతోషాలు. శుభకార్యములు జరుగును. సంతోష సమయం లభించును. ఈ మాసంలో 4, 13, 22 తేదీలు మంచివి కావు. ముఖ్యంగా 13 వ తేదీ జాగ్రత్తగా వ్యవహరించవలెను.

మే 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మీ పై అధికారుల వలన, కుటుంబ పెద్దల వలన మానసికంగా కొద్దిపాటి ఆందోళన ఎదుర్కోను సూచన. తోటి ఉద్యోగులతో లేదా యజమానితో అభిప్రాయ భేదాలు ఎదుర్కొందురు. ఈ మాసంలో వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం గా ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు 20 వ తేదీ తదుపరి చేయవలసిన ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మాసాంతంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఎదురగుట వలన ధన వ్యయం అదుపు తప్పును.

జూన్ 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అంత అనుకూల ఫలితాలు లేవు. ఆత్మీయుల వియోగ వార్త వినవలసి రావచ్చును. కొట్టిపాటి కష్టం మీద వ్యవహార విజయాలు పొందుతారు. గురు గ్రహ బలం వలన సంతాన ప్రయత్నాలు చేయువారికి చక్కటి పుత్ర సంతాన ప్రాప్తికి సూచనలు ఉన్నవి. కుటుంబ సమాగములందు పాల్గొంటారు. స్త్రీ లకు వారసత్వ భాగ్యం ప్రాప్తించును.జీవిత భాగస్వామి వలన ఆర్ధికంగా బలపడుదురు. ఇతరులను విమర్శించకుండా ఉండుట మంచిది. ఈ నెలలో 6, 27 తేదీలు మంచివి కావు.

జూలై 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అజాగ్రత్త వలన మాటపడు సంఘటనలు ఎదురగును. 6,7,8 తేదీలలో వాహన ప్రమాదమునకు లేదా ఆకస్మిక అస్వస్థతతో బాధ పడు అవకాశం ఉన్నది. ద్వితియ వారం కూడా అంత మంచిది కాదు. ప్రారంభించిన కార్యములందు అననుకూలమైన ఫలితాలు ఎదురగును. ప్రాణ స్నేహితులతో విభేదాలు మానసికంగా బాధను కలుగచేస్తాయి. తృతీయ వారం నుండి గతంలో ఆగిపోయిన విదేశీ జీవన సంబంధ ప్రయత్నాలు తిరిగి ప్రారంభమగును. మాసాంతంలో జీవిత భాగస్వామితో సౌఖ్యం. ఈ మాసంలో 10, 14, 26, 27 తేదీలు అవివాహితుల వివాహ ప్రయత్నములకు మంచిది.

ఆగష్టు 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యక్తిగత మరియు కుటుంబ పరమైన జీవనంలో విశేష సంతోషములు, సుఖములు అనుభవిస్తారు. తలపెట్టిన నూతన కార్యములు విజయవంతం అవుతాయి. వ్యాపార రంగంలోని వారికి చక్కటి ధన లాభం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వలన మీ ఆలోచనలను కార్యాచరణలో పెట్ట గలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి శుభవార్త లభిస్తుంది. రాజకీయ రంగంలోని వారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు. ఈ మాసంలో 3,9 తేదీలు సంతాన సంబంధ ప్రయత్నములకు అనుకూలం.

సెప్టెంబర్ 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా గత మాసంలో వలె శుభ ఫలితాలు కొనసాగును. తలపెట్టిన నూతన ఆలోచనలు కార్య రూపం దాల్చును. ఇష్ట దైవ సందర్శన భాగ్యం లభిస్తుంది. కుటుంబంలోని స్త్రీ సనాతనం వలన వ్యయం ఎదురవును. ప్రభుత్వ ఉద్యోగ జీవనంలో వారికి ఆశించిన అనుకూల మార్పులు లభిస్తాయి. ఈ మాసంలో 7, 9 , 16 తేదీలు వ్యాపార రంగం లోని వారికి మంచిది. యువకులకు చివరి వారం లో దారితప్పే ఆలోచనలతో మనఃశాంతి లోపించును. జీవిత భాగస్వామి తో అపార్ధాలు ఏర్పడును.

అక్టోబర్ 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కొద్దిపాటి చికాకులు, గృహ లేదా భూ సంబంధమైన నష్టములు ప్రాప్తించును. ద్వితియ వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి శస్త్ర చికిత్స లేదా తీవ్ర అనారోగ్యం వలన ఆందోళన ఎదురగును. తదనుకూల ధన వ్యయం వలన ఆర్ధిక సంబంధ ఒత్తిడి ఎదుర్కొందురు. కార్మిక రంగంలోని వారికి శ్రమ అధికమగును. రోహిణి నక్షత్ర జాతకులకు కళత్ర వర్గం వారి వలన చికాకులు ఎదుర్కొందురు. వ్యాపార వర్గంలోని వారికి మిత్రుల సహకారం వలన ప్రయోజనం లభిస్తుంది. ఈ మాసంలో 22, 23 తేదీలు మరియు 28, 29 తేదీలు అనుకూలం కాదు. ఈ మాసంలో ప్రతీ దినం వృషభ రాశి వారునవ గ్రహ స్తోత్రములు చదువుకొనుట మంచిది.

నవంబర్ 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సొంత గృహ సంబంధమైన పనులు కార్యాచరణలో కి వచ్చుట వలన సంతోషములు అనుభవిస్తారు. వృషభ రాశి వారికి ఈ మాసం గృహ మార్పిడికి మంచి సమయం. అయితే మృగశిరా నక్షత్ర జాతకులకు ఈ మాసంలో అన్ని విషయాలలో కొద్దిపాటి వ్యతిరేకతతో పనులు పూర్తి అగును. ఈ మాసం అన్ని రకాల కోర్సులు చేయు విద్యార్ధులకు మంచి కాలం. విద్యార్ధులకు మరియు ఉద్యోగులకు ఈ మాసంలో 9,10.16.25 తేదీలు విదేశీ ప్రయత్నములకు, ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైనవి. ఈ మాసంలో 4, 28 తేదీలలో శ్రమ అధికంగా ఉండును.

డిసెంబర్ 2024 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా ధనాదాయం సామాన్యం. ఈ మాసంలో కూడా కొద్దిపాటి మానసిక ఆందోళన ఎదురగును. అతిగా నమ్మిన వారి వలన మోసం, ధన వ్యయం ఎదురగును. సోదర వర్గం వారితో విరోధములు మానసికంగా ఇబ్బంది ఏర్పరచును. జీవిత భాగస్వామి నుండి మానసికంగా ఆశించిన సహకారం లభించదు. తృతీయ వారంలో స్వల్ప కాలిక ఆరోగ్య సమస్యలు వలన శారీరక పీడ అనుభవించును. ఈ మాసంలో 22 వ తేదీ తదుపరి కొద్దిపాటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా చివరి వారంలో 28, 29 తేదీలలో శుభం.

జనవరి 2025 వృషభరాశ ిరాశిఫలాలు: 

ఈ మాసంలో మాసంలో దీర్గకాళిక అనారోగ్యం తో బాధ పడుతున్న వారికి శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గోనేదురు. ఈ మాసంలో 10, 14, 15 తేదీలలో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ద్వితియ వారంలో సంతాన సంబంధ అనారోగ్యం బాధించును. ఇష్టమైన వారికి సంబంధించిన అశుభ వార్త వినుటకు అవకాశం ఉన్నది. ఈ మాసంలో తృతీయ వారం నుండి అనగా 21 వ తేదీ తదుపరి కార్య సిద్ధి లభించును. ప్రయత్న విజయములు ప్రాప్తించును. దూర స్నేహితుల కలయిక వలన ఆనందం ఏర్పడుతుంది. నెల మొత్తం ధనాదాయం సామాన్యం. నూతన దంపతుల సంతాన ప్రయత్నములు కూడా లాభించును.

ఫెబ్రవరి 2025 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వృత్తి , ఉద్యోగ , వ్యాపార వ్యవహారాలలో సామాన్య ఫలితాలు ఎదురగును. ధనాదాయం కూడా సామాన్యం. ద్వితీయ మరియు తృతీయ వారాలలో అవివాహితుల కు వివాహ సంబంధ సంతోషాలు ఎదురగును. నూతన వాహన సౌఖ్యం ఏర్పరచు కొనగలరు. తృతీయ వారం నుండి తలపెట్టిన పనులందు కార్య విఘ్నతలు ఎదురగును. ప్రతీ పనికి శ్రమించవలెను. ఉద్యోగస్తులకు కూడా చికాకులు ఎదురగును. స్త్రీలకు ఈ మాసంలో అంతగా అదృష్టం కలసిరాదు. ముఖ్యంగా 19, 20, 29 తేదీలలో అధికంగా సమస్యలు ఎదురగును. మాసాంతంలో కుటుంబ పెద్దవారితో వ్యవహార చిక్కులు ఎదురగును.

మార్చ్ 2025 వృషభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ధనాదాయం కొంత తగ్గును. గృహ సంతోషములు సామాన్యం. ధన వ్యయం కొంత అదుపు తప్పుతుంది. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరికలు ఏర్పడటానికి అవకాశం ఉన్నది. తలవంపులు ఎదుర్కోను సంఘటనలు ఉన్నవి. ఇతరులతో మాట్లాడు సందర్భాలలో మాట జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 17, 18 తేదీలలో అనవసర తగాదాలు ఎదుర్కొందురు. నాలుగవ వారంలో మానసిక ప్రసాంతత మరియు కార్య సిద్ధి లభించును. ఈ మాసంలో 3, 11, 20 తేదీలు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములకు మంచిది. ఆశించిన ఉద్యోగ ప్రాప్తి లభించును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.