Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు

Sree Krodhi Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 14, రాజ పూజ్యం - 04, అవమానం - 05

  • పూర్వ పద్దతిలో వృచ్చిక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "5". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఎదురగు లోకోపవాదములను సూచించుచున్నది. 

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Vrucchika Rasi / Scorpion Sign's Nature.....

వృచ్చికరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా పూర్తిగా అనుకూల ఫలితాలు ఏర్పరచును. ధన సంపదలు ఆశించిన విధంగా ఏర్పరచుకోగలరు. ఈ సంవత్సరం ముఖ్యంగా అవివాహితులకు గురువు మిక్కిలి రూప లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి ని ప్రసాదించును. కళత్ర మూలక సంపద కలసి వచ్చుట వలన మిక్కిలి ఆర్ధిక పరిపుష్టిత అనుభవిస్తారు.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి శని వలన సంవత్సరం అంతా గత సంవత్సరం వలనే సామాన్య ఫలితాలే ఎదురగును. మాతృ వర్గం వారి వలన లాభపడుడురు. విద్యార్దులకు చక్కటి విద్యాభ్యాసం లభిస్తుంది. రైతులకు చక్కటి దిగుబడి లబిస్తుంది. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం కలిగిన వారు భూ సంపదని ఏర్పరచుకోనగలుగుతారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృచ్చికరాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి రాహువు వలన సంవత్సరం అంతా స్వల్ప అనుకూల ఫలితాలే ఎదురగును. నిరుద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగాలను ప్రాప్తింప చేయును. జాతకులు కఠినమైన ప్రవర్తనను ప్రదర్శిస్తారు.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి కేతువు వలన సంవత్సరం అంతా యోగించదు. వృధా ధన వ్యయం తరచుగా ఎదురగును. కష్టం మీదా పనులు పూర్తి చేయగలుగుతారు. అధికమైన శారీరక శ్రమను, తగాదాలను, ఋణములను, కార్య అపజయములను, వ్యవహరపు చిక్కులను ఏర్పరచును. మొత్తం మీద వ్యక్తిగత జాతకంలో రాహు - కేతు దోషం కలిగిన లేదా కాల సర్ప దోషం కలిగిన వ్రుచ్చిక రాశి జాతకులు ఈ సంవత్సరం తరచుగా దోష నివారణ శాంతులు జరుపుకొనుట మంచిది.

ఏప్రిల్ 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చక్కటి ధనాదాయం లభించు సూచన. తలపెట్టిన కార్యములందు జయము ప్రాప్తించును. చిన్న అనారోగ్య సమస్య వలన ఇబ్బంది పడి వెంటనే కోలుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయం లభిస్తుంది. చేస్తున్న వృత్తిలో గుర్తింపు, గౌరవ సత్కారములు పొందగలుగుతారు. వంశ పెద్దల ఆశీస్శులు లభిస్తాయి.మిత్రులతో ప్రియ సంభాషణలు గావిస్తారు. మాసాంతంలో కొద్దిపాటి విఘ్నములు ఎదుర్కొంటారు. ఈ మాసంలో 22, 24,25,27 తేదీలలో జాగ్రత్త అవసరం. అశుభ వార్తలు వినుటకు అవకాశం కలదు.

మే 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో లాభ పూరిత వాతావరణం ఎదుర్కొంటారు. నూతన పదవులు ప్రాప్తించును. గౌరవ ప్రదమైన జీవనం ఏర్పాటు చేసుకోగలుగుతారు. ద్వితియ వారంలో తలపెట్టు ప్రయాణములు ఫలించును. పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు ఎదుర్కోను వారికి ఈ మాసంలో విజయం వరిస్తుంది. ఆశించిన ఉద్యోగం ప్రాప్తిస్తుంది. తృతీయ వారం సామాన్య ఫలితాలు ఎదురగును. మాసాంతంలో విశేష సౌఖ్యం, సుఖ ప్రాప్తి. వస్త్ర లేదా నూతన వస్తువుల అమరిక మొదలగు శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ మాసంలో 1, 4 , 6,10,15,18,22,27,29 తేదీలు అన్నివిధాల అనుకూలమైనవి.

జూన్ 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మదిలో ఉన్న ఆలోచనలు అన్నీ కార్య రూపం దాల్చును. కుటుంబంలో చిన్నపాటి కలహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. ధనాదాయం మాత్రం బాగుండును. న్యాయబద్ధమైన ధనార్జన లభిస్తుంది. వృత్తి వ్యాపారములలో జయం ప్రాప్తిస్తుంది. కోర్తు వ్యవహరములలో అనుకూలత ఉండదు. వివాహ సంబంధ విషయాల్లో చర్చలు మధ్యవర్తుల ద్వారా కలసివచ్చును. కానీ ఈ మాసంలో సంతాన సంబంధ ప్రయత్నాలు కలసిరావు. ఈ మాసంలో 7,8,9,10 తేదీలలో నూతన పెట్టుబడులు లాభించును.

జూలై 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అంత అనుకూలమైన ఫలితాలను కలిగించదు. ధన వ్యయము అధికం అగును. ఆకస్మిక సమస్యలు వెంటాడును. ప్రయాసతో కూడిన కార్య జయం ఏర్పడుతుంది. ఉష్ణ సంబంధమైన అనారోగ్యములు బాధించును. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చికాకులు ఎదురగును. ఈ మాసంలో ఒక పర్యాయం కేతు గ్రహ శాంతి జరిపించిన మంచిది. ఈ మాసంలో 1, 3, 12, 13, 19, 27 తేదీలు అనుకూలమైనవి కావు.

ఆగష్టు 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా అనేక అవాంతరములను, ఇబ్బందులను కలిగించును. ఉద్యోగ జీవనంలో ఊహించని నష్టములు ఏర్పడు సూచన ఉన్నది. జీవిత భాగస్వామితో మాట కలయికలో విభేదాలు ఎదురగును. మానసిక అశాంతి బాధించును. సంతానం వలన సమాజంలో గౌరవ హాని ఎదుర్కొంటారు. స్థిరాస్తి సమస్యలు, వృధా వ్యయము కూడా భాదించు సూచన. మాసాంతంలో భవిష్యత్ గురించిన అనవసర భందోళనలు ఉండగలవు. ఈ మాసంలో 26 నుండి మాసాంతం వరకూ మంచి సమయం కాదు.

సెప్టెంబర్ 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రారంభంలో అతిగా నమ్మిన వ్యక్తుల వలన నమ్మక ద్రోహం, ధన వ్యయం ఎదుర్కొంటారు. 13 వ తేదీ తదుపరి లాభకరమైన పరిస్థితి మొదలగును. గత రెండు నెలలలో ఎదుర్కొన్న చికాకులు క్రమేపి తొలగును. నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమగును. వివాహ సంబంధ ప్రయత్నాలు, నూతన గృహం కొరకు చేయు ప్రయత్నములు ఫలించును. స్త్రీ సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. చివరి వారంలో నూతన ఆదాయ మార్గములు లభించును. పితృ వర్గం వారి నుండి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సహకారం లభించును.

అక్టోబర్ 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా అనుకూల వాతావరణం కొనసాగును. వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలములు పొందును. జీవిత భాగస్వామి వర్గం వారికి ఈ మాసం ఆరోగ్య పరంగా మంచి కాలం కాదు. గృహంలో కొద్దిపాటి ఆందోళనపూరిత వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్దులు, విదేశీ ప్రయత్నములు చేయువారు, స్థాన చలనమునకు ప్రయత్నించు వారికి తృతీయ వారం నుండి శుభ ఫలితాలు ప్రారంభం అగును. మనోవంచా ఫలసిద్ధి ఏర్పడును. పేరు ప్రఖ్యాతలు గడించగలుగుతారు.

నవంబర్ 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వివాహ ప్రయత్నములు చేయువారికి, ఆర్ధిక ఋణములు కొరకు ప్రయత్నించు వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. బంధువుల వలన ఆర్ధిక లాభములు గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కెరీర్ పరంగా వాహనముద్రిదికార యోగం ప్రాప్తిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంతాన ప్రయత్నాలు చేయు వారికి స్త్రీ సంతతి ప్రాప్తిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. ద్వితియ తృతీయ వారాలలో వ్యాపార జీవనంలోని వారికి ఒత్తిడులు అధికం అగును. 22 వ తేదీ తదుపరి ప్రేమ వ్యవహారాల వలన అపఖ్యాతి పాలగుతారు. 27 వ తేదీ తదుపరి కుటుంబ సభ్యుల కొరకు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

డిసెంబర్ 2024 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రధమ వారంలో సామాన్య ఫలితాలు ఎదురవుతాయి. ద్వితియ వారం నుండి ఊహించని అపవాదులు. మాటపాడు సంఘటనలు ఎదుర్కొంటారు. ఈ మాసంలో ఆదాయ వ్యయములు సమానం. వ్యవహార చిక్కుల వలన కొన్ని కార్యములను మధ్యలోనే విడిచిపెట్టుట జరుగుతుంది. 20 వ తేదీ తదుపరి పరిస్థితులలో అనుకూలత ప్రారంభం అగును. పెంపుడు జంతువుల వలన సమస్యలు ఎదుర్కొందురు. మాసాంతంలో కుటుంబ సంతోషాలు పొందగలుగుతారు. ఈ మాసంలో 11, 12, 13 , 17 తేదీలు అనుకూలమైనవి కావు.

జనవరి 2025 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం సంతోషకరమైన ఫలితాలను కలిగించును. జీవన మార్గంలో సుఖ ప్రాప్తి లభించును. ఈ మాసంలో ఆశించిన ధనం లభించును. ప్రత్యర్ధులపై విజయం మరియు సకల కార్య విజయాలు పొందుతారు. సంసార సంబంధమైన సంతోషాలు పరి పూర్ణంగా పొందగలుగుతారు. దీర్ఘకాలికంగా పరిష్కారం అవ్వని వారసత్వ సంబంధ సమస్యలు పరిష్కారం పొందును. ప్రభుత్వ సంబంధ వ్యవహారములు లాభించును. ఈ మాసంలో 2, 6, 8, 11, 21, 26 తేదీలు కార్యానుకులత కలిగించును.

ఫెబ్రవరి 2025 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. ప్రధమ మరియు ద్వితీయ వారాలు అన్ని విధములా సౌకర్యవంతమైన జీవనాన్ని ప్రసాదించును. తృతీయ వారంలో మాత్రం సుఖ వ్యాధుల వలన బాధ పొందు సూచన ఉన్నది. ఈ మాసం అంతా ధనాదాయం బాగుండును. ఆర్ధిక పరమైన సంకల్పములు నెరవేరును. బంధు వర్గం వారితో మాత్రం జాగ్రత్త అవసరం. మొత్తం మీద ఈ మాసం ఉత్సాహపూరిత సమయం.

మార్చ్ 2025 వృచ్చికరాశి రాశిఫలాలు: 

ఈ మాసం మిశ్రమ ఫలితాలను కలిగించును. కారణం తెలియని మానసిక భయం ఏర్పడు సూచన. మనసున తొందరపాటుతనం వలన మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించ లేరు. పై అధికారుల వలన ఒత్తిడి అధికం అగును. ద్వితియ వారంలో సంతాన సంబంధ ప్రయత్నాలు ఫలించును. కుటుంబ ఖర్చులు కూడా అధికమగును. ఈ మాసంలో 14, 15 తేదీలలో చేయు ప్రయానములందు జాగ్రత్త వహించవలెను.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.