Placeholder image

2024 - 2025 శ్రీ క్రోధి నామ సంవత్సర తులారాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం - 02, వ్యయం - 08, రాజ పూజ్యం - 01, అవమానం - 05

  • పూర్వ పద్దతి లో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఏర్పడు గౌరవ ప్రదమైన జీవనాన్న సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Tula Rasi / Libra Sign's nature....

తులారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన గత సంవత్సరం వలనే సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఏర్పడును. కుటుంబ భాద్యతలు పెరుగుట వలన ఆర్ధికంగా ఋణాలు చేయవలసి వస్తుంది. వ్యక్తిగత ఆరోగ్యం మరియు జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలవాట్ల పట్ల మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి వారకి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని గ్రహం సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ప్రసాదిస్తారు. ఆర్ధికంగా శని వలన మాత్రమే కొంచం వెసులుబాటు ఉంటుంది. వక్తిగత జాతకంలో శని బలంగా ఉన్న వారికి గురువు యొక్క ప్రతికూల ప్రభావం అంతగా ఉండదు. సంతాన సంబంధ ప్రయత్నాలు చేయు వారికి శ్రీ శనైచ్చరుడు సుందరమైన స్త్రీ సంతానమును ప్రాప్తింప చేయు అవకాశములు అధికంగా ఉన్నవి. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

తులారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన కూడా అనుకూల ఫలితాలు ఏర్పడును. స్థిరాస్తి విషయాలలో అనగా భూ సంబంధ లేదా గృహ సంబంధ లాభములు కలుగచేయును. శత్రు సంబంధ విషయాలలో విజయాన్ని ప్రాప్తింప చేయును.

తులారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతువు వలన దైవ సంబంధ విషయాల పట్ల ఆసక్తి అధికం అవుతుంది. గత సంవత్సరం మాదిరిగానే పారమార్ధక చింత అధికం అగుట వలన తరచుగా పుణ్య క్షేత్ర సందర్శనలు చేస్తారు. జీవన ప్రయాణంలో నూతన ఆధ్యాత్మిక శకం మొదలు అవుతుంది.

ఏప్రిల్ 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం బాగుండును. వృత్తి వ్యాపారములు ఉత్సాహ పూరితంగా నడుస్తాయి. లాభపూరిత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి మూలకంగా ఆర్ధిక లాభములు పొందుతారు. ప్రధమ వారంలో గృహంలో మార్పులు చేపడతారు, పుణ్యక్షేత్ర సందర్శన భాగ్యం లభిస్తుంది. ద్వితియ మరియూ తృతీయ వారంలో ఆకస్మిక వివాదములు చుట్టుముడతాయి. సమయం వృధా అవుతుంది. అనవసర ఖర్చులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయం సామాన్యంగా ఉంటుంది. తీసుకొన్న నిర్ణయాలలో చివరి నిమిషంలో మార్పులు చేపడతారు. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుంది. ఈ మాసంలో 28,29,30 తేదీలు అనుకూలమైనవి కావు.

మే 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గృహంలో సంతోషములు మధ్యమ స్థాయిలో ఉంటాయి.బంధువులు మిత్రుల వలన సహకారము లభించి ఆశించిన కార్యములందు విజయం పొందుతారు. మాస మధ్యమంలో శుభకార్య సంబంధ వ్యయం ఎదుర్కొంటారు. 20వ తేదీ తదుపరి జీవిత భాగస్వామి సహాయ సహకారములు సంపూర్ణంగా పొందుతారు. సంతాన ప్రయత్నాలలో సఫలత పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో విజయం చివరి నిమిషములో వరిస్తుంది. ఈ మాసంలో 3,8,9,16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. 2,11,19, 21, 29 తేదీలు అనుకూలమైనవి కావు.

జూన్ 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కుటుంబంలో కొద్దిపాటి ఘర్షణలు మరియు కుటుంబ సభ్యుల మధ్య మాట కలయికలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్త్రీ సంబంధ వివాదాములలో చిక్కుకుందురు. వృత్తి వ్యాపారములు బాగుగానే ఉండును. దూరప్రాంత ప్రయాణములు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారములలో అననుకూలత ఎదురగును. నిరుద్యుగులకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. జీవితంలో శ్రమతో కూడిన అభివృద్ధి ఉండును. మాయా మొహాముల వలన నష్టపోవు సూచన ఉన్నది. ఈ మాసంలో 10 నుండి 13వ తేదీ మధ్య ప్రయాణములు చేయుట మంచిది కాదు.

జూలై 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆశించిన స్థాయిలో లాభములు ఏర్పడును. నూతన వాహన లేదా సొంత గృహ ప్రయత్నములు లాభించును. గత కాలంలో స్తంభించిన వ్యాపార వ్యవహారములు తిరిగి ప్రారంభం అగును. నూతన స్థలములను సందర్శన చేస్తారు. ద్వితియ వారంలో కార్యగతి అనుకూలంగా ఉండును. మంచి మాటలతో వ్యవహారములు పూర్తి చేస్తారు. తృతీయ వారంలో మాతృవర్గం సహకారంతో వివాహ ప్రయత్నములు లాభించును. ఈ మాసంలో 18 నుండి 24వ తేదీల మధ్య ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలించును.

ఆగష్టు 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి లేదా జీతం లో పెరుగుదల ఆశించవచ్చు. పితృ వర్గీయుల ఆదరణ మరియు ప్రేమ పొందుదురు. మిత్రుల వలన లాభపడతారు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములు విజయవంతమగును. నూతన కాంట్రాక్టులు , ప్రాజెక్టులు లభించును. అవివాహితులకు శుభవార్త. తృతీయ వారంలో ధైర్య సాహసములు పెరుగును. ఇతరులకు ఇచ్చిన ముఖ్య వస్తువు లేదా ధనం తిరిగి వచ్చుట కష్టం. ఈ మాసంలో 4, 9, 17, 20, 26 తేదీలు అనుకూలమైనవి కావు.

సెప్టెంబర్ 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపారాదులలో జయం ఎదురగును. ఆశించిన ధన ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి పనులు చేయు వారికి ఆశించిన ధన లాభములు లభిస్తాయి. ద్వితియ వారం సామాన్య ఫలితాలు ఏర్పరుస్తాయి. తృతీయ వారంలో కుటుంబంలో మానసిక అశాంతి నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ప్రతికూలత ప్రారంభం అవుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యములకు ధనవ్యయం చేయవలసి వస్తుంది. చివరి వారం బాగుండును. ముఖ్యంగా దూరప్రాంత లేదా విదేశీ నివాస ప్రయత్నములు ఫలించును. ఈ మాసంలో బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. ఈ మాసంలో ప్రధమ మరియు చతుర్ధ వారములు మంచివి.

అక్టోబర్ 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో ధన లాభములు ఏర్పడవు. వ్యాపార రంగంలో ధననష్టములకు అవకాశములు కలవు. మిత్ర వర్గమునకు సంభందిచిన ఒక అశుభ వార్త వినవలసి రావచ్చు. ఉద్యోగ జీవనంలో మార్పులకు అవకాశం లభించదు. ఈ మాసంలో సంతాన ప్రయత్నములు మాత్రం కలసి వచ్చును. చక్కటి సంతాన ప్రాప్తి యోగం ఉన్నది. 10వ తేదీ తదుపరి నూతన శిక్షణలు పొందు అవకాశం ఉన్నది. మాసాంతంలో నూతన వ్యవహారములు ప్రారంబించుట వాయిదా వేసుకొనుట మంచిది. ఒక పర్యాయం శనికి తైలాభిషేకం జరిపించిన మంచిది.

నవంబర్ 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గత మాసములోని బాధలు తొలగును. ఒత్తిడి తగ్గును. ప్రధమ మరియు ద్వితియ వారములలో శత్రువిజయం ప్రాప్తిస్తుంది. జీవనంలో ఉన్నతిని ఆశించవచ్చు. స్త్రీ సంతాన సంభందమైన చికాకులు ఎదుర్కొంటారు. శుభకార్య ప్రయత్నాలు లాభించును. మాసాంతంలో స్థిరమైన ఆలోచనలు చేయుట కష్టముగా ఉండును. ముఖ్యంగా 13 నుండి 22వ తేది మధ్య కాలం అనుకూలంగా లేదు. 23వ తేదీ నుండి పరిస్థితులలో అనుకూలమైన మార్పులు ప్రారంభం అగును. ఈ మాసంలో నిత్యం నవగ్రహ స్తోత్రములు చదువుట మంచిది.

డిసెంబర్ 2024 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కళత్ర వర్గం వారి వలన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడుట లేదా నూతన వస్తువల అమరిక జరుగును. వివాహాది ప్రయత్నాలలో కదలిక ప్రారంభం ఐయ్యి వివాహం నిచ్చయం అగును. ఈ మాసంలో ఆదాయం సామాన్యం. రాజకీయవర్గంలోనివారికి అవమానములు ఎదురగును. భూసంబంధ లావాదేవీలు లాభించును. తృతీయ వారం నుండి గృహంలో శుభకార్య సంభదమైన వ్యయం అధికం అగును. వ్యయములకు అవసరమగు ధనం లభించును. మాసాంతములో చేయు ప్రయాణాలు లాభించును. విందు వినోదములలో పాల్గొంటారు.

జనవరి 2025 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాస ప్రారంభంలో సొంత మనుష్యులతో వివాదములు నెలకొంటాయి. ఆకస్మిక అనారోగ్య సూచన ఉన్నది. చర్మ సంభండ దోషములు ఇబ్బంది పెట్టును. తలచిన కార్యములు అటంకములను ఎదుర్కొనా చివరికి పూర్తి అగును. వృధా వ్యయములు తరచుగా ఏర్పడును. 16వ తేదీ నుండి పరిస్థితి అనుకులించును. విద్యార్ధులకు , విదేశీ విద్య కొరకు ప్రయత్నించు వారికి తృతీయ వారం నుండి మంచి అనుకూల కాలం ప్రారంభం అగును. కార్యమార్గంలో చిన్న చిన్న ఆటంకములు ఉన్నప్పటికీ వ్యవహార విజయం ఉండును. మాసాంతంలో ఆనందమయ సమయం అనుభవిస్తారు.

ఫెబ్రవరి 2025 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టములు ఎదురగును. ద్వితియ వారంలో దూరప్రాంతము నుండి ఒక అశుభ వార్త వినవలసి వస్తుంది. గృహ వాతావరణం అశాంతిని కలిగి ఉండును. మాస మధ్యలో ఖర్చులు అధికంగా ఉండును. కోర్టు వ్యవహరములు చిరాకు కలుగ చేయును. చివరి వారంలో ఒంటరితనం బాధించును. కళాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. విద్యార్దులు శ్రమించవలెను. అన్యకార్యములపై శ్రద్ధ తగ్గించ వలెను. ఈ మాసంలో 2,6,7,15,29 తేదీలు అనుకూలమైనవి కావు.

మార్చ్ 2025 తులారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా కొద్దిపాటి కష్టములు ఎదురగును. ఒక పర్యాయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొనుట మంచిది. ఆరోగ్య మందగమనం ఆందోళన కలిగించును. తృతీయ వారం నుండి ఆహార అలవాట్లు , వ్యసనాల పట్ల జాగ్రత్త అవసరం. ఈ మాసంలో 23,24, 27,29 తేదీలలో నూతన కార్యములు, వివాహము కొరకు చేయు ప్రయత్నములు లాభించును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.