Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర సింహరాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Simha Rasi / Leo Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి ఆదాయం - 02, వ్యయం - 14, రాజ పూజ్యం - 02, అవమానం - 02.

  • పూర్వ పద్దతిలో సింహ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వారు పలు రకాల విజయాలు పొందుటను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Leo sign / Simha Rasi's Nature...

సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా అనుకూలమైన ఫలితాలు ప్రసాదించును. పూర్ణ ఆయుర్భాగ్యములు కలిగిన సంతానానికి జన్మనిస్తారు. అందరూ మెచ్చే కార్యములు చేయుట వలన విశేష ఖ్యాతి ని ఆర్జిస్తారు. జీవిత స్థిరత్వం కోసం చేసే ప్రతీ పని లాభిస్తుంది.

సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని గ్రహం వలన గత సంవత్సరం మాదిరిగానే మిశ్రమ ఫలితాలు ఏర్పడును. అనవసర తగాదాలు తరచుగా ఏర్పడుచుండును. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా శరీర బరువుకు సంబందించిన సమస్యలు బాధించును. సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహువు సంవత్సరం అంతా అననుకూల ఫలితాలనే ప్రసాదించును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగిన వారు తరచుగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మిత్ర వర్గాల రుణాల భాద్యత మీ పై పడుతుంది. మీరు ఎంతగానో అభిమానించే వ్యక్తులతో శత్రుత్వాలు ఏర్పడి మిమ్మల్ని మానసికంగా బాధించును.

సింహరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతువు కూడా రాహువు వలనే సంవత్సరం అంతా చెడు ఫలితాలనే ప్రసాదించును. ఈ సంవత్సరం అంతా సింహరాశి వారికి ఏర్పడు ఆరోగ్య సమస్యలకు రాహు - కేతువు లే కారణం అవుతారు. చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలి. క్రమ పద్దతిలో హెల్త్ చెక్ అప్స్ కి వెళ్ళడం మంచిది. దీర్గకాళిక వ్యాదులతో బాధ పడే వారు ఈ సంవత్సరం ఒక పర్యాయం రాహు - కేతు శాంతి జపం జరిపించుకోనుట మంచిది.

ఏప్రిల్ 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జాతకులు మానసికంగా ఉద్రేకపూరితంగా ఉందురు. అకారణమైన కోపం, చిరాకు ప్రదర్శిస్తారు. ధనాదాయం సామాన్యం. అనారోగ్య సమస్యలు కొనసాగును. కుటుంబ పరమైన వ్యయం కొంత తగ్గును. బంధు మిత్రుల ఆదరణ , చేయూత లభించును. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన మార్పులు ఏర్పడును. పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. మాసాంతంలో వినోద సంబంధ వ్యయం ఏర్పడుతుంది. ఈ నెలలో 3,8,11,13,17 తేదీలు మంచివి కావు.

మే 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చక్కటి ఆదాయమునకు సూచనలు కలవు. శరీర అరోగ్యం సహకరించును. మనసు ఉల్లాసంగా ఉండును. గత కాలపు పెట్టుబడుల నుండి రాబడి ప్రారంభమగును. ద్వితీయ వారంలో పశు సంబంధ హాని ఎదుర్కొనుటకు సూచన ఉన్నది. 14, 15, 16, 17 తేదీలలో కార్యానుకులత ఉన్నది. ప్రభుత్వ రంగ ఉద్యోగం చేయు వారికి మంచి కాలం. దూర దేశ స్థిర నివాస ప్రయత్నములు లాభించును. ఆలోచనలు సక్రమంగా ఉండును. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం.

జూన్ 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రయత్నఆటంకములు ప్రారంభంలో కొద్దిగా ఉండినప్పటికి అంతిమంగా విజయం లభించును. ధనాదాయం నెమ్మదిగా పెరుగును. గతకాలపు ఋణములు క్రమంగా తొలగును. ద్వితియ మరియు తృతీయ వారములలో నూతన ఆదాయ మార్గములు లభించును. అవివాహితులకు 16 నుండి 20 వ తేదీలలో వివాహ ప్రయత్నములు ఫలించును. 23 వ తేదీ కుటుంబ పెద్దలతో ముఖ్యమైన విషయాలకై చర్చలు జరుపుటకు అనువైన కాలం. మానసిక ప్రసాంతత లభిస్తుంది.

జూలై 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వృత్తి , ఉద్యోగ , వ్యాపారములలో ఆశించిన స్థాయిలో లాభములు పొందుతారు. సమయానికి అందరి సహకారము లభించును. దూర ప్రయనములు చేయుట కలసివచ్చును. విలువైన డాక్యుమెంట్స్ కనిపించకుండా పోవుట వలన ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల అనారోగ్య కారణంగా ధనవ్యయం ఎదురగును. తృతీయ వారంలో దైవదర్శన మరియు పుణ్య క్షేత్ర సందర్శన భాగ్యం లభిస్తుంది. మాసాంతమునకు కుటుంబంలో చక్కటి ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ మాసంలో 5,14,20,29 తేదీలు మంచివి కావు.

ఆగష్టు 2024 సింహరాశి రాశిఫలాలు:

ఈ మాసంలో ఇష్టమైన వ్యక్తులతో ప్రయాణములు చేస్తారు, ఆశించిన విధంగా ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది. సంతానం వలన చక్కటి సౌఖ్యత అనుభవించుదురు. ప్రధమ వారంలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం ఎదురగును. ద్వితియ వారంలో ఇరుగుపొరుగు వారితో తగాదాలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ఆకస్మికంగా ఒత్తిడి అధికం అవుతుంది. పుబ్బ నక్షత్ర జాతకులకు 16,17,18 తేదీలలో గౌరవ హాని సంఘటనలు ఎదురగును. మాసాంతంలో శ్రమ అధికం అగును. ఆరోగ్య భంగములు కూడా ఎదురగు సూచన ఉన్నది.

సెప్టెంబర్ 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆశించిన రుణాలు లభిస్తాయి. శరీర ఆరోగ్యం సహకరించును. 10 వ తేదీ వరకూ తలపెట్టిన ప్రయత్నములు అతి కష్టం మీద విజయమగును. 14 వ తేదీ నుండి 19 వ తేదీ వరకూ వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. కొన్ని సమస్యలకు మధ్యవర్తిత్వం ఫలించును. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉండును. గృహ సంతోషములు మధ్యమం. ఈ మాసంలో 7,25,30 తేదీలు అనుకూలమైనవి కావు. 5,6 తేదీలలో వివాహ ప్రయత్నములకు అనుకూలం. కళత్ర సౌఖ్యత అనుభవిస్తారు. మొత్తం మీద ధనాదాయం బాగుండును.

అక్టోబర్ 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సామాన్య ఫలితాలు ఎదురగును. నూతన పనులు ఆరంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం కాదు. భూ సంబంధ విషయాల్లో లేదా వారసత్వ సంబంధ విషయాల్లో చికాకులు అధికం అగును. ద్వితియ వారంలో నూతన వస్త్ర లాభం ఉంటుంది. 13 వ తేదీ నుండి ధనదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం నెలకొంటుంది. ఆనందపూరిత సమయం అనుభవిస్తారు. 23 వ తేదీ నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఎదుర్కొందురు. ప్రారంభించిన ప్రయాణములు అనేక చికాకులు ఎదుర్కొనును.

నవంబర్ 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గృహంలో విందు భోజనములు నిర్వహించెదరు. అతిధుల ఆతిధ్యంతో సమయం గడిచిపోతుంది. గృహంలో నూతన వస్తువులు అమరుతాయి. సంతానం యొక్క ప్రవర్తన మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. తృతీయ వారంలో ఉద్యోగ జీవనంలో ఉన్నతి లభించు సూచనలు ఉన్నవి. ఆశించిన ప్రమోషన్లు లభిస్తాయి. అందరి మన్ననలను పొందుదురు. మాసాంతంలో సామాన్య ఫలితాలు ఎదురగును. గృహ మార్పిడి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మాసంలో 8,11,20,26 తేదీలు అనుకూలమైనవి కావు.

డిసెంబర్ 2024 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యాపారములో లాభములు పెరుగును. చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. వ్రుత్తి వ్యాపారాదులలో పోటీదారులు తొలగును. ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రధమ వారంలో కళత్ర సంబంధ అనారోగ్యం వలన మనస్తాపం ఎదురగును. మిత్రుల సహకారంతో కొన్ని సమస్యల నుండి బయట పడతారు. ద్వితియ వారంలో ఆకస్మిక ధన వ్యయములు ఎదుర్కొంటారు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం ఏర్పడుతుంది. ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. ఒక పర్యాయం శనికి శాంతి జపములు జరిపించుకోనుట వలన అడ్డంకులు తొలగుతాయి. తృతీయ వారం నుండి మాసాంతం వరకూ సామాన్య ఫలితాలు ఎదురగును. చివరి వారంలో రాత్రి పూట చేయు ప్రయాణాలలో మిక్కిలి జాగ్రత్త అవసరం.

జనవరి 2025 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నలుగురిలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ జీవనంలో వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు పొందుతారు. కుటుంబములో మీ మాటకు విలువ పెరుగును. సంకల్ప సిద్ధి ఏర్పడును. ద్వితియ వారంలో విహార యాత్రలలో పాల్గొంటారు. సంతోషకర సమయం. ఈ మాసంలో 16 తేదీ నుండి నిలకడైన జీవనం లభిస్తుంది. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకు ఇది మంచి కాలం. జీవిత భాగస్వామితో సోఖ్యం. ఉన్నత వర్గం వారితో స్నేహ సంభందాలు ఏర్పడును. తన్మూలక లాభములు పొందుతారు.

ఫెబ్రవరి 2025 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అన్నివిధాలా ఆదాయం బాగుండును. ఈ మాసం విదేశీ ప్రయత్నములు, వివాహ ప్రయత్నములు, సంతాన ప్రయత్నములకు చక్కటి అనువైన కాలం. మాస మధ్యమంలో ఆకస్మిక ప్రయాణములు చేయవలసి వస్తుంది. పితృ వర్గీయులకు ఈ మాసం అశుభం కలుగ చేయు సూచన ఉన్నది. ఈ మాసంలో 20,21,22 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారములలో నష్టం ఏర్పడును. చివరి వారంలో శారీరక శ్రమ అధికం అగుట వలన అలసట అనుభవిస్తారు. నరముల సంబందిత సమస్యలు బయట పడు అవకాశం ఉన్నది. మానసిక విచారం ఎదుర్కొందురు. .

మార్చ్ 2025 సింహరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా ఆరోగ్య సమస్యలు కొనసాగును. ఆశించిన స్థాయిలో కుటుంబం నుండి సహకారం లభించదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించని స్థాన చలనం ఏర్పడుతుంది. పిల్లలలో మానసిక చాంచల్యత ఆందోళన కలుగ చేస్తుంది. ఈ మాసంలో 17, 18 తేదీలలో ప్రయాణాలు చేయుట వాయిదా వేసుకొనుట మంచిది. ద్విచక్ర వాహన దారులకు వాహన ప్రమాద సూచన ఉన్నది. 20 వ తేదీ తదుపరి వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో జయం లభిస్తుంది. సౌకర్య వంతమైన జీవనం అనుభవిస్తారు. మాసాంతానికి అన్నివిధములా పరిస్థితులు అనుకూలంగా ఉండును.

 

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.