Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర మిధునరాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Midhuna Rasi / Gemini Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2024- 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిధున రాశీ వారికి ఆదాయం - 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 03, అవమానం - 06 

  • పూర్వ పద్దతిలో మిధున రాశి వారికి వచ్చిన సంఖ్య "1". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఏర్పడు లాభ పూరిత ఫలితాలను సూచిస్తున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Midhuna Rasi / Gemini Sign nature.....

మిధున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 30-ఏప్రిల్-2024 వరకూ మిక్కిలి యోగ వంతమైన జీవనం లభించును. మిక్కిలి సుభ వంతమైన మరియు పుణ్య వంతమైన కార్యములందు పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది మిక్కిలి అనుకూలమైన కాలం. 01-మే-2024 నుండి సంవత్సరం అంతా గురు గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. ఊహించని విధంగా ఖర్చులు జీవితంలో భాగం అవుతాయి. కానీ ఈ ఖర్చు అనేది ఎల్లప్పుడూ సద్వ్యయమే అవుతుంది. అనవసరమైన విషయాలకు ఖర్చు చేయరు. మంచి విషయాలకు మాత్రమే ఖర్చు చేస్తారు.

మిధునరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని గ్రహం వలన గత సంవత్సరం వలనే కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు ఏర్పడును. తండ్రి గారి తరపు వర్గీయులకు ఈ సంవతసరం కూడా అంత మంచి కాలం కాదు. విదేసములందు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయు వారికి శని గ్రహం వలన చక్కటి విజయం లభించును. అయేతే వ్యక్తిగత జాతకంలో శని నీచ స్థానములో లేదా శత్రు స్థానంలో ఉండకూడదు. మిధునరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు.

మిదునరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా దూర ప్రాంత విహార యాత్రలు చేస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగిన వారికి మినహా మిగిలిన వారికి రాహు గ్రహం వలన ఈ సంవత్సరం చక్కటి సంతాన యోగం ఏర్పడుతుంది. మొత్తం మీద శ్రీ క్రోధి నామ సంవత్సరం అంతా రాహువు మిధున రాశి వారికి అనుకూల ఫలితాలనే ఏర్పరచును.

మిధునరాశి వారికి శ్రీ కోది నామ సంవత్సరంలో కేతువు వలన గత సంవత్సరం వలనే మాతృ వర్గీయులతో అభిప్రాయ బేధాలు కొనసాగును. వారసత్వ సంబందంగా లభించిన భూ సంపద వలన నష్టములు ఏర్పడు సూచన ఉన్నది. కావున ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వారసత్వ సంబంధ భూ విక్రయాలు చేయకుండా ఉండుట మంచిది.

ఏప్రిల్ 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ వారంలో వృత్తి వ్యాపారములు చక్కగా జరుగును. ధనాదాయం ఆశించిన విధంగా ఉంటుంది. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ మాసం లో 5,6 తేదీలు ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ద్వితియ వారంలో దీర్గకాళిక ఋణములు తీర్చివేయగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడి లాభపురితంగా పురోగామిస్తాయి. తృతీయ వారం నుండి సామాన్య ఫలితాలు లభిస్తాయి. మాతృ బంధుపరంగా కొద్దిపాటి మాట పట్టింపులు ఎదుర్కొంటారు. 25 వ తేదీ తదుపరి స్త్రీ సంతాన సంబంధ శుభకార్య వ్యయం చేస్తారు. ఇంటిలో ఉత్సాయపూరిత వాతావరణం ఉంటుంది.

మే 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అనుకూల ఫలితాలు లభించవు. సొంత బంధు వర్గం తో విరోధములు చికాకు పరచును. అకారణంగా తగాదాలు ఏర్పడును. ప్రేమ వ్యవహారములు నష్టపెట్టును. తలచిన పనులు జరగవు. అనేక అవరోధములు ఎదుర్కొనును. ఈ మాసంలో 14,15,17 తేదీలలో శిరోబాధ సంబంధ అనారోగ్యత. మాసాంతంలో అధిక ధనవ్యయం ఎదురగుటకు అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ మాసం అంత అనుకూలం కాదు.

జూన్ 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అనుకూలమైన కాలం. చక్కటి ఫలితాలు ఏర్పరచును. ఆర్ధికంగా మిక్కిలి మానసిక ప్రశాంతత అనుభవించుదురు. తలపెట్టిన పనులు విజయవంతం అగును. ఆశించిన ధన భాగ్యం చేతికి వచ్చును. ద్వితీయ మరియు తృతీయ వారములు విద్యార్ధులకు విజయం చేకుర్చును. కోరుకున్న పనులన్నీ జరుగును. అన్ని వర్గముల వారికి అదృష్టం కలసివచ్చును. జీవన మార్గంలో నూతన బాధ్యతలు లభించుట వలన గౌరవం, హోదా పెరుగును. వివాహ సంబంధ ప్రయత్నాలకు, సంతాన ప్రయత్నాలకు, వారసత్వ లేదా కోర్టు తగదాలందురాజీ ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది.

జూలై 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చక్కటి ఫలితాలు ఎదురగును. పెద్ద వయస్సు వారికి శరీర అనారోగ్య సమస్యలు తొలగును. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం శత్రు సంబంధ చికాకులు ఎదురగును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఫలించును. మాస మధ్యమంలో ధార్మిక కార్యక్రమాల కొరకు వ్యయం చేస్తారు. 18 వ తేదీ తదుపరి కుటుంబ పరమైన ఒక వ్యవహార విజయం ఉన్నది. వృత్తి వ్యాపారదులలో జయం పొందుతారు. ఈ మాసంలో 23,24,25, తేదీలలో వ్యాపార వర్గమునకు అతి చక్కటి కాలం. ఈ తేదీలలో చేయు నూతన పెట్టుబడులు లాభించును. అదేవిధంగా ఈ మాసంలో 11, 17, 20 తేదీలలో ప్రారంభించు ప్రయాణములు ఫలించును. మాసాంతంలో స్త్రీ సంబంధ సౌఖ్యం ఏర్పడును.

ఆగష్టు 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా అనుకూలమైన కాలం. తలపెట్టిన ప్రతీ ప్రతీ కార్యం విజయం పొందును. ఆశించిన విధంగా బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టములు నుండి బయటపడుడురు. బంధు వర్గంతో కలయికలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. కోర్టు వ్యవహారములలో అనుకూల తీర్పులు పొందుతారు. వ్యాపార వర్గాల వారికి ఆశించిన ధన ప్రాప్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ మాసంలో కూడా అన్ని రంగముల వారికి అనుకూలత ఉన్నది.ఈ మాసంలో 5,9,17,26 తేదీలలో మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.

సెప్టెంబర్ 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గృహ సంబంధమైన సంతోషాలు పొందుతారు. జీవిత భాగస్వామి వర్గం వారి వలన తోడ్పాటు లభించి లాభములు పొందుతారు. ద్వితియ వారంలో అనవసరమైన పనులకు ధనం వృధా చేస్తారు. తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాలు ఎదురవుతాయి. తృతీయ వారంలో సామాన్య ఫలితాలు ఎదురవుతాయి. చతుర్ధ వారం నుండి ఉద్యోగ జీవనం లోని వారి స్థానచలనము కొరకు చేయు పనులు లాభించును. కోరుకొన్న విధంగా నూతన వాహన సౌఖ్యం ఏర్పరచుకోనగలుగుతారు. సంతాన సంబంధ శుభవార్త లభిస్తుంది. ఈ మాసంలో 1, 8, 20, 22 తేదీలు మంచివి కావు.

అక్టోబర్ 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఏర్పరచును. వ్యాపార రంగంలో పోటీదారులు అధికం అగును. ఆదాయంలో కొంత తగ్గుదల ఎదుర్కొంటారు. ఆర్ధిక పరంగా కొద్దిపాటి మానసిక అశాంతి ఎదుర్కొందురు. తల్లితో లేదా మాతృ వర్గీయులతో విభేదాలు ఏర్పడటానికి సూచనలు అధికంగా ఉన్నాయి. ఈ మాసంలో 10,11,12 తేదీలలో విహార యాత్రలు లేదా గృహ సంతోషాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈ మాసంలో 22,23,24,25 తేదీలలో ఉన్నత అధికారుల వలన ఇబ్బందులు ఎదురగును. ఉద్యోగ జీవన భద్రత కు సంబంధించిన భయం, ఆందోళన అనుభవించుదురు. ఈ కాలంలో ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుట మంచిది కాదు. వైద్య రంగంలోని వారు 22 నుండి 26 వ తేదీల మధ్య కాలంలో జాగ్రత్తగా ఉండవలెను.

నవంబర్ 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఏర్పడవు. చేస్తున్న ఉద్యోగ నష్టం లేదా స్థిరాస్తి సంబంధమైన నష్టం ఎదురగును. మానసిక అధైర్యం పొందుదురు. ఆత్మీయుల వలన మానసిక ప్రసాంతత లభిస్తుంది. తలపెట్టిన కార్యములందు అనేక కార్య విఘ్నములు ఎదురగును. ఈ మాసంలో 18, 19 తేదీలలో తలపెట్టిన ప్రయాణములలో ప్రమాద సూచన ఉన్నది. జాగ్రత్త అవసరం. ఈ మాసంలో కాలం అంతగా కలసి రాదు. శని దేవునికి శాంతి జపములు జరిపిమ్చుకోనుట మంచిది. నూతన కార్య ప్రారంభములు చేయకుండుట మంచిది.

డిసెంబర్ 2024 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అనుకూలమైన ఫలితాలను కలుగచేయును. గత మాసం కన్నా ధన వ్యయం కొద్దిగా తగ్గును. వైవాహిక జీవనంలో సమస్యలు కూడా తగ్గును. మనో నిగ్రహం అవసరం. అనవసర పట్టుదలకు పోవుట వలన సమస్యలు ఎదుర్కొందురు. ద్వితీయ మరియు తృతీయ వారములు ఉద్యోగ మార్పిడికి అనుకూల కాలం. మాసాంతానికి ఆర్ధిక పరిస్థితులలో అనుకూలత ఏర్పడుతుంది. ఈ మాసంలో 3,8,17,24,26 తేదీలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చును.

జనవరి 2025 మిధునరాశి రాశిఫలాలు:

ఈ మాసంలో అతి కష్టం మీద నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించును. ధనాదాయం బాగుండును. రాజకీయంగా పై స్థానాలలో ఉన్న వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభములు ఏర్పడును. వృత్తి వ్యాపారములు చేయు వారికి సామాన్య ఫలితాలు ఎదురగును. తృతీయ వారంలో గృహంలో ఆకస్మిక శుభకార్యములు నిర్వహించెదరు. బంధు సమాగమం వలన లాభపడతారు. మాసాంతంలో వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఒక శుభవార్త మరియు స్త్రీ మూలక లాభము పొందుతారు. ఈ మాసంలో పునర్వసు నక్షత్ర జాతకుల వివాహ ప్రయత్నములు ఫలించును.

ఫెబ్రవరి 2025 మిధునరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గౌరవ హోదాలు పెరుగును. ఆశించిన విధంగా నూతన పదవుల ప్రాప్తించును. చిరు ఉద్యోగులకు జీవన స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సంతోషములు ఏర్పడుతాయి. సొంత గృహ నిర్మాణ సంబంధ లాభములు పొందుతారు. విదేశీ సంబంధ స్థాన చలనత ఏర్పడుతుంది. గృహంలో ఖరీదైన నూతన వస్తువులను అమర్చుకుంటారు. ఈ మాసంలో 22వ తేదీ తదుపరి ప్రారంభించు నూతన వ్యాపారములు లాభించును. మాసాంతంలో ఉద్యోగ భవిష్యత్ గురించిన ఆందోళన పూర్తిగా తొలగుతుంది. ఈ మాసంలో 1,6,10,19 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

మార్చ్ 2025 మిధునరాశి రాశిఫలాలు:

ఈ మాసం ప్రధమ వారంలో మిత్రులతోనూ , అధికారులతోనూ విభేదములు ఎదురగును. ద్వితియ వారంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. తృతీయ వారంలో సంతాన సంబంధ విషయాల్లో సౌఖ్యత అనుభవిస్తారు. కుటుంబ వాతావరణంలో ఆనందాలు ఏర్పడుతాయి. భాత్రు వర్గం వారితో తగాదాలలో విజయం పొందుతారు. ఈ మాసంలో 20 వ తేదీ నుండి ఆర్ధిక పరమైన విషయాలలో అనుకూల ఫలితాలు పొందుదురు. ఆకస్మిక ధన లాభాములకు అవకాశం ఉన్నది.

 

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.