Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర మేషరాశి రాశీ ఫలాలు 

Sree Krodhi Nama Samvatsara Mesha Rasi / Aries Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • 2024 - 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం - 08, వ్యయం - 14 , రాజ పూజ్యం - 04, అవమానం - 03.
  • పూర్వ పద్దతిలో మేషరాశి వారికి వచ్చిన శేష సంఖ్య "5" . ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీరు ఎదుర్కోనబోయే అపవాదులను, అవమానాలను సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know nature of Mesha Rasi / Aries Sign...

మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరం లో గురు గ్రహం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. గురు గ్రహం వలన ఉద్యోగ వ్యాపార వర్గాలు చక్కటి లాభాలను అర్జిస్తాయి. జాతకంలో గురు గ్రహ బలములు అధికంగా కలిగిన వారు రుపవంతులైన చక్కటి పుత్ర సంతాన భాగ్యములను పొందుతారు. ధీర్గకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడువారు ఉపసమనం పొందుతారు. పరదేశ విద్యా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేయువారు సంపూర్ణమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించగాలుగుతారు. వ్యక్తిగత జాతకంలో అధికమైన గురు గ్రహ బలము కలిగన వారు శ్రీ క్రోధి నామ సంవత్సరం అంతా సంపూర్ణ యోగమును పొందుతారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మెస రాశి వారికి శ్రీ గురు గ్రహం వలన ఏ విధమైన సమస్యలు కలగవు.

మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శని సంవత్సరంలో కూడా గత సంవత్సరం వలనే అధిక భాగం చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పరచును. ఈ సంవత్సరం కూడా మేషరాసి వారికి శ్రీ శనైచ్చరాడు విశేష ధనలాభాములను కలిగించును. వారసత్వ సంబంధ విషయాల్లో సమస్యలు తొలగి ఊహించని విధంగా అనుకూల ఫలితాలను కలుగచేయడు. ఈ సంవత్సర కాలంలో శనికి శాంతి జపములు జరుపుటకు అవసరం లేదు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహు గ్రహం అనుకూల ఫలితాలు కలుగచేయదు. ముఖ్యంగా భరణి నక్షత్ర జాతకులకు అనవసర వ్యయము అధికంగా ఏర్పరచును. భరణీ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం ఆర్ధిక విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యక్త్రిగత జాతకంలో సర్ప దోషం కలిగిన వారు నూతన రుణాలు చేయకుండా ఉండుట మంచిది.

మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా కేతు గ్రహం వలన గత సంవత్సరం వలనే మిశ్రమ ఫలితాలు ఏర్పడును. వైవాహిక జీవనం తీవ్ర ఓడిడుకులు ఎదుర్కొనును. కానీ శత్రు సంబంధమైన నష్టములు కొంచెం తగ్గు ముఖం పడతాయి. కృత్తికా నక్షత్ర జాతకులు సంవత్సరం అంతా ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి.

ఏప్రిల్ 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో సామాన్య ఫలితాలు ఎదురవుతాయి. మిత్రుల వలన లాభం పొందుతారు. ప్రధమ ద్వితియ వారాలలో కుటుంబ సభ్యుల తిరుగుబాటు, రక్త సంబందీకులతో ఘర్షణలు మానసికంగా ఇబ్బంది పెడతాయి. మాతృ వర్గీయుల ఆరోగ్య సమస్యల వలన కూడా ఆందోళన చెందుతారు. చివరి వారంలో మిత్రులతో ప్రయాణాల వలన కొంత సంతోషకర సమయం ఏర్పడుతుంది. ఈ మాసం మొత్తం స్పెక్యులేషన్ వలన నష్టం పొందు సూచనలు అధికం. ముఖ్యంగా తృతీయ వారం లో వ్యాపార పరంగా అధిక ఒత్తిడి ఎదుర్కొంటారు.. ఈ మాసంలో 7, 15, 24, 30 తేదీలు అంతగా అనుకూలమైనవి కావు.

మే 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎదురగును. తలపెట్టిన నూతన కార్యములు విజయం పొందును. సంతాన ప్రయత్నములు చేయు వారికి సంతాన పరంగా సంకల్ప సిద్ధి ఏర్పడును. ఈ మాసంలో 4,6,7 తేదీలలో విదేశీ సంబంధ ప్రయాణములు ఫలించును. 19, 20 తేదీలలో కుటుంబ పరమైన సౌఖ్యం అనుభవించేదురు. ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టులకు , క్రీడా సంబంధ విజయములకు , నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నములకు, ఉద్యోగ ఉన్నతి కొరకు చేయు ప్రయత్నములకు ఈ మాసం అనుకూల కాలం. ఈ మాసంలో మొత్తం మీద ధనాదాయంలో వృద్ది కనిపిస్తుంది. ఈ మాసంలో 13, 15, 26, 27 తేదీలు అనుకూలమైనవి కాదు.

జూన్ 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వారసత్వ సంబంధమైన తగాదాల వలన చికాకులు ఏర్పడు సూచన. వ్యాపారములు సామాన్యంగా కొనసాగును. అశ్విని నక్షత్ర యువకులకు స్త్రీ సంబంధమైన విషయాలలో చికాకులు మరియు స్త్రీ సంబంధ ధన వ్యయం ఎదురగును. ఈ మాసంలో వివాహ ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. సోదర వర్గీయులతో మాట తగాదాలు కుటుంబంలో పరువు పోవు సంఘటనలు ఎదురగును. తృతీయ వారంలో జీవిత భాగస్వామికి అనారోగ్యం వలన వైవాహిక జీవన సుఖ రాహిత్యత ఎదురగును. గృహ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసంలో చివరి వారం అనుకూల కాలం.

జూలై 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసం మేషరాశి వారికి అనుకూలమైన కాలం. చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాదులలో వ్యతిరేకత తగ్గుతుంది. పై అధికారుల వలన ప్రశంసలు పొందుతారు. స్థాన చలన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపారములు ప్రారంభించవచ్చు. ఉద్యోగ మార్పిడికి ఈ మాసం అనుకూలమైన కాలం. ఈ మాసంలో కూడా జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు కొనసాగును. చివరి వారంలో ఆకస్మిక ప్రయాణాలు ఎదురగు సూచన. మాసం చివరికి శారీరక శ్రమ పెరుగును.

ఆగష్టు 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వారసత్వ సంపద కు సంబందించిన సమస్యల ప్రభావం కొద్దిగా తగ్గును. ఈ మాసం సంతాన ప్రయత్నములకు అనుకూలమైన కాలం కాదు. దైవ ఆశీస్శులు మరియు వంశ పెద్దల ఆశీస్సులు అవసరం. భరణీ నక్షత్ర జాతకులకు ఈ మాసం కోర్టు వ్యవహరములలో అనుకూలత ఎదురగును. ప్రభుత్వ సంబంధ పెద్దల పరిచయం వలన లాభ పడుదురు. బంధు వర్గ కలయికలు ఆనందము కలుగచేయును. వృత్తి వ్యాపారములలో సామాన్య ఫలితాలు ఎదురగును. అశ్విని నక్షత్ర జాతకులకు మాసాంతంలో శిరోబాధ వలన సమస్యలు ఉన్నాయి.

సెప్టెంబర్ 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు ఏర్పడవు. మీ తప్పు లేకుండానే గౌరవ హాని ఎదురగుతుంది. వడ్డీ వ్యాపారం చేయు వారికి ఆకస్మిక నష్టములు ఎదురగును. తలపెట్టిన నూతన కార్యములందు విజయం అంత త్వరగా లభించదు. విద్యార్జన చేయువారికి, విదేశీ స్థిర నివాస ప్రయత్నాలు చేయు వారికి ఈ మాసంలో ఆటంకాలు ఎదురగును. ద్వితియ మరియు తృతీయ వారంలలో కారణ రహితంగా గొడవలు, కలహములు ఎదురగును. జీవిత భాగస్వామి సంబందీకులతో తగాదాలు ఇబ్బంది పెడతాయి. నాలుగవ వారం వివాహ ప్రయత్నములకు మాత్రం శుభం. మొత్తం మీద ఈ మాసంలో ఆశించిన ధనం చేతికి అందదు. ఈ మాసంలో 7, 9, 13 తేదీలు అనుకూలమైనవి కాదు.

అక్టోబర్ 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కొద్దిగా మంచి ఫలితాలనే ఏర్పరచును. గత కాలంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన కార్యములు ఊహించని విధంగా తరిగి ప్రారంభించబడి పూర్తి అగుట మిమ్మల్ని అబ్బుర పరుస్తుంది. తలచిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ధనాదాయం బాగుండును. సమాజహితమైన పనులలో పాల్గొంటారు. ఈ మాసంలో 15 నుండి 25 వ తేదీ మధ్య నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల కాలం. పై అధికారుల సహకారం లభించి లాభపడతారు. వ్యాపారములలో చక్కటి ధనప్రాప్తి లభిస్తుంది. బాగా ఎదిగిన స్త్రీ సంతానం వలన సంతోష పడతారు. వారి ఉన్నతి మీకు పేరు ప్రఖ్యాతలు కలుగచేయును.

నవంబర్ 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జీవితంలో నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవ ప్రధమైన జీవనం ఏర్పరచుకోగలరు. అన్ని విధములా ఆరోగ్యం సహకరించును. వృత్తి వ్యపారాదులలో మంచి లాభములు గడిస్తారు. కుటుంబ జీవనంలో పట్టుదలకు పోవడం వలన నష్టములు ఎదురవుతాయి. స్వార్ధం వదిలి ఆలోచించడం మంచిది. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక అనుకూలమైన మార్పులు ఎదురగును. నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వలన మానసికంగా అధిక ఆలోచనలు గావిస్తారు. అన్ని వర్గముల వారికి ఆదాయం సామాన్యం. వైవాహిక మరియు సంతాన సంబంధ విషయాలకు ఈ మాసం అనుకూలమైన కాలం.

డిసెంబర్ 2024 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఎదురగును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనలో ఆందోళన కలిగించు వాతావరణం ఎదురగును. ఆకస్మిక వివాదాలు ఎదుర్కొంటారు. అన్ని వర్గముల వారికి ధనాదాయం తగ్గును. బంధు వర్గం వలన ఒత్తిడులు ఎదురగును. వారు మిమ్మల్ని కోరిన సహకారం ఇవ్వలేరు. స్త్రీలకు మాస మధ్యమంలో శస్త్ర చికిత్స ఏర్పడు సూచన. తృతీయ వారం నుండి సమస్యలు అధికం అగును. అనేక చికాకులు, గృహ సంబంధమైన విషయాలలో అధిక వ్యయం మానసికంగా ఇబ్బందులు ఏర్పరుస్తుంది. మొత్తం మీద ఈ మాసంలో జాగ్రత్తగా ఉండడం అవసరం.

జనవరి 2025 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. సొంత మనుష్యులతో విరోధములు మరియు గృహంలో అనవసర ఖర్చులు కొనసాగును. ప్రయత్నాలలో ఆటంకములు తీవ్ర నిరాశ ను ఏర్పరచును. ప్రయాసతో కూడిన ప్రయాణములు చేయవలసి వస్తుంది. జూదం వలన నష్టం పొందుతారు. జీర్ణ వ్యవస్థకు సంబందించిన సమస్యలు బాధిస్తాయి. 18 వ తేదీ తదుపరి కొంత అనుకూలత. నూతన ఆదాయ మార్గముల కొరకు చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మాసాంతంలో కొద్దిపాటి సౌఖ్యం అనుభవిస్తారు.

ఫెబ్రవరి 2025 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసం కొంచం అనుకూల ఫలితాలు ఏర్పరచును. కుటుంబ పరమైన వేధింపులు తగ్గుతాయి. వ్యవహార నష్టములు తగ్గుముఖం పడుతాయి. నూతన వ్యాపారములు ప్రారంభించుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో మార్పులకు కూడా ఈ మాసం అనుకూలమైనది. వ్యయం అదుపులోకి వస్తుంది. కాలి నరములకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. ఈ మాసంలో తృతీయ మరియు చతుర్ధ వారములు పితృ వర్గీయులకు మంచిది కాదు. ఈ మాసంలో 11 నుండి 16 వరకూ నూతన కార్య ప్రారంభములకు అనుకూలమైన రోజులు.

మార్చ్ 2025 మేషరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో శరీర ఆరోగ్య సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడును. శత్రుత్వములు తొలగును. మానశిక శాంతి లభించును. వృత్తిలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ద్వితియ వారం, తృతీయ వారములలో జీవితంలో చక్కటి పురోగత లభిస్తుంది. కోర్టు తీర్పులు అనుకూలం గా లభించును. నాలుగవ వారం నుండి చేపట్టిన కార్యములందు స్తబ్ధత. శ్రమ అధికం. ప్రయత్న పూర్వక విజయాలు.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.