Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Meena Rasi / Pisces Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం - 11, వ్యయం - 05, రాజ పూజ్యం - 02, అవమానం - 04

  • పూర్వ పద్దతి లో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారికి సాధారణ జీవనం ఏర్పడుటను సూచించుచున్నది.
  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Meena Rasi / Pisces Sign's Nature....

మీనరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన అంత అనుకూల ఫలితాలు లభించవు. తరచుగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. రక్త సంబందీకులతో శత్రుత్వాల వలన బాధ పడతారు. ఆర్దికంగా ఆశించిన విజయాలు పొందలేరు. రుణ బాధలు కూడా పెరుగుతాయి.

మీనరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవతరంలో శని వలన కూడా గడిచిన సంవత్సరం మాదిరిగానే అంతగా శుభ ఫలితాలు ఏర్పడవు. అనవసరంగా ధన వ్యయం ఏర్పరచును. మీనరాశి వారికి ఏడున్నార సంవత్సరముల ఏలినాటి శని దశ జరుగుతూ ఉండుట వలన ఈ సంవత్సరం కూడా శని వలన పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం లోపించిన వారు ఈ సంవత్సరం చేయు ప్రయనములందు జాగ్రత్తగా ఉండవలెను. ధన వ్యయం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. నిత్యం శని గ్రహ కవచం స్మరించుట వలన సమస్యలు కొంత వరకు తగ్గుతాయి. 

మీనరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా శరీర పీడ, అధిక వ్యయం ఏర్పడతాయి.

మీనరాశి వార్కి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతువు వలన కూడా సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. వైవాహిక జీవనంలో తరచుగా సమస్యలు వెంటాడతాయి. ఆరోగ్య సమస్యలు బాదిస్తాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం రాజ గ్రహమైన గురువు తో సహా, ఏలినాటి శని , రాహువు మరియు కేతువు చెడు ఫలితాలు ప్రసాదించుట గమనించవలసిన విషయం. తీసుకొనే నిర్ణయాల పట్ల మిక్కిలి జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఏప్రిల్ 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసం గృహ నిర్మాణ సంబంధ పనులు ప్రారంభం అగును. నూతన ఋణాలు లభించును. ధనం సర్దుబాటు జరిగి ఆశించిన విధంగా బాధ్యతలు పుర్తిచేయగలరు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన ప్రయత్నాలు అనుకూలంగా ఉండవు. విదేశీ ప్రయత్నాలు లాభించును. సమాజంలో గౌరవం లభించును. వ్యాపార రంగంలోని వారికి అనుకోని మార్పులు సంభవించు సూచన. అధికారుల వలన తృతీయ వారంలో చికాకులు. స్నేహ వర్గం సహకారంతో ఇబ్బందులనుండి తప్పించుకొందురు. చివరి వారంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించు సంఘటనలకు అవకాశం కలదు.

మే 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రధమ వారంలో ధనాదాయం బాగున్నప్పటికీ అకారణంగా మాటపడుట, నింద ఏర్పడుట వంటి సమస్యలు కలవు. ఇతరులకు సంబంధించిన సున్నిత విషయాలలో దూరంగా ఉండుట మంచిది. పెద్ద వయస్సు వారికి ఉదర సంబంధమైన ఆరోగ్య సమస్య ఏర్పడును. వ్యాపార వ్యవహరాదులు మందకొడిగా కొనసాగును. ద్వితీయ వారంలో చేపట్టే కార్యములు విజయవంతం అగును. ఉద్యోగ రంగంలో ఆటంకములు ఉన్ననూ లక్ష్యాలు పూర్తిచెయగలరు. స్థానచలన ప్రయత్నాలు ఫలించును. మేధావి వర్గంలో స్థానం లభించును. తృతీయ, చతుర్ధ వారాలు ప్రోత్సాహకరంగా ఉండును. విద్యార్ధులకు ఇది చక్కటి ఫలితాలు కలిగించు మాసం.

జూన్ 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం వృద్ధి చెందును. కుటుంబ సమస్యలు తగ్గును. వివాహ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతమగును. నూతన వ్యాపార విస్తరణకు ఇది మంచి కాలం. ఆశించిన విధంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారములు లభించును. 9 నుండి 17 వ తేదీ మధ్య తలపెట్టిన పనులన్నీ విజయవతం అగు సూచనలు కలవు. కోర్తు కేసులకు సంబంధించిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో పరిష్కారం లభించును. సంతానానికి సంబంధించిన అభివృద్ధి వార్తలు ఆనందాన్ని కలుగచేయును. పర్యాటక రంగంలో పనిచేయువారికి ఈ మాసంలో అతి చక్కటి అభివృద్ధి లభించును. ఈ మాసంలో ధనమునకు లోటు రాదు.

జూలై 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. వారసత్వ సంబంధ స్థిరాస్థి లభించుట వలన కుటుంబానికి ఒక లాభం. యువ దంపతుల సంతాన కోర్కెలు సిద్ధించును. ధనాదాయం బాగుండును. నూతన గృహోపకరణాలు ఏర్పరచుకొందురు. శుభాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. ఉత్సాహవంతంగా కాలం గడుచును. ఉద్యోగ జీవనంలో చురుకుదనంతో అధికారుల మన్ననలు పొందుతారు. ఆరోగ్యం సహకరించును. చివరి వారంలో ఆత్మీయుల నుండి ఒక శుభ వార్త. దూరప్రాంత ప్రయాణాల వలన కొద్దిపాటి శారీరక ఒత్తిడి. ఈ మాసంలో 4, 5, 9, 11, 15, 18, 24, 25, 29 తేదీలు నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టుటకు అనుకూలమైనవి.

ఆగష్టు 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కుటుంబంలో ఒక మార్పు ఏర్పడును. మూత్రపిండాల వ్యాధితో బాధపడు వారికి ఇది మంచి మాసం కాదు. వ్యాపారాదులు సామాన్యంగానే నడుచును. భాగస్వామ్య వ్యాపారాదులు బాగా ఆదాయం కలుగచేయును. జీవిత భాగస్వామి సహకారం ఆశించిన రీతిగా లభించును. రుణభారం తగ్గును. కుటుంబ వ్యక్తుల అభివృద్ధికి కృషి చేయుదురు. భాత్రు వర్గానికి మీ సలహాలు లాభాన్ని కలుగచేయును. విఘ్నాలు ఎదురైనా కార్యజయం పొందుదురు. గతకాలంలో చేసిన తప్పులు సరిదిద్దుకోనుటకు ఒక అవకాశం లభించును. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ఫలితాలు.

సెప్టెంబర్ 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ఆరోగ్య సమస్యలు కొద్దిగా చికాకులను కలుగచేయును. ఉద్యోగ వ్యాపార వ్యవహరాదులు సామాన్యంగా కొనసాగును. నిత్య జీవనంలో శ్రమ అధికంగా ఏర్పడును. అయినా గృహ భాద్యతలను సకాలంలో పూర్తి చేయగలరు. ప్రమోషన్లు ఆశించువారికి ఆశాభంగములు. ఈ మాసంలో 6, 10, 13, 14, 20, 27 తేదీలు అనుకూలమైనవి కావు. ముఖ్యంగా ఈ తేదీలందు ప్రయాణాలు చేయకుండా ఉండుట మంచిది.

అక్టోబర్ 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆర్ధికంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఏర్పడును. ఉహించని రీతిలో ఒక ధన నష్టం ఏర్పడుటకు అవకాశం ఉన్నది. నూతన పెట్టుబడులు ఈ మాసంలో మంచి ఫలితాలు ఇవ్వవు. ద్వితీయ వారంలో ధనవ్యయం అంచనాలు దాటును. ఉద్యోగ కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండుట మంచిది. ఈ మాసంలో నూతన ఋణాలు తీసుకొనుట లేదా ఇతరుల రుణాలకు హామీలు ఇచ్చుట మంచిది కాదు. ఈ మాసంలో శనికి శాంతి జపములు జరిపించుకోనుట మంచిది.

నవంబర్ 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రారంభం నుండే ఆర్ధికంగా పడుతున్న ఇబ్బందులు తొలగును. ధనాదాయం వృద్ధి చెందును. ఆశించిన విధంగా ధన సంబంధ పరిస్థితులు ఏర్పడును. వ్యాపార విస్తరణకు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసం అనుకూలమైనది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మనో ఉల్లాసాన్ని పొందుదురు. వ్యక్తిగత ప్రతిభ, పని నైపుణ్యం ఉద్యోగ జీవులకు చక్కటి గుర్తింపు ఏర్పరచును. 22 వ తేదీ నుండి కొద్దిపాటి శారీరక బలహీనత బాధించును. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక ఆనందాన్ని కలుగచేయును.

డిసెంబర్ 2024 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవనంలోని సమస్యలు పరిష్కారమగును. అపోహలు తొలగును. ఆరోగ్య పరంగా మాత్రం జాగ్రత్త వహించాలి. నూతన వాహన లేదా ప్రయాణ సౌఖ్యం. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. కార్యభారం లేకుండా పనులు పూర్తిచెయగలరు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వ్యాపారాదులు సామాన్యం.

జనవరి 2025 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో తగాదాల వలన కోర్టుకేసులు లేదా పోలిసుల జోక్యం వలన చికాకులు. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. అవసరాలకు సరిపడు ధనాదాయం. మిత్రుల తోడ్పాటు లభించును. ప్రయానములక ఆరోగ్య భంగములు. జీవిత భాగస్వామి కొరకు ధనం వ్యయం చేయుదురు. అతిగా ఆలోచించడం వలన నష్టపోవు సంఘటనలు. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. సంతాన ప్రయత్నాలు ఫలప్రదం.

ఫెబ్రవరి 2025 మీనరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా ఏలినాటి శని ప్రభావం అధికం. వైవాహిక జీవనంలో అననుకూల ఫలితాలు. ద్వితీయ తృతీయ వారాలలో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు. భవిష్యత్ ప్రణాళికలు రచించుటకు లేదా పెద్ద నిర్ణయాలు తీసుకొనుటకు 21 వ తేదీ తదుపరి కొంత అనుకూలమైన కాలం. ఈ మాసంలో 9,10,11 తేదీలలో ప్రమాదం లేదా వాహనముల వలన సమస్యలు.

మార్చ్ 2025 మీనరాశి రాశిఫలాలు:

ఈ మాసం ఆశించిన శుభ ఫలితాలు కలుగచేయును. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలలో విజయం. పై అధికారుల వలన మన్ననలు. నూతన కార్యములను ప్రారంభించవచ్చు. అవకాశములు సద్వినియోగం చేసుకుందురు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండును. శ్రమకు తగిన గుర్తింపు. జీవన విధానాలలో పురోగతి. ఖర్చులు తగ్గును. కాలం కలసివచ్చును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.