Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర మకరరాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Makara Rasi / Capricorn Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయం- 14, వ్యయం- 14, రాజ పూజ్యం- 03, అవమానం- 01

  • పూర్వ పద్దతి లో మకర రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "3". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎదురగు కష్టములను సూచించుచున్నది. 

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Marara Rasi / Capricorn Sign's Nature....

మకరరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం సంవత్సరం అంతా గత సంవత్సరం మాదిరిగానే అనుకూల ఫలితాలు ప్రసాదించును. విద్యార్ధులకు చక్కటి విద్యాభ్యాసం లభిస్తుంది. సొంత గృహ సౌఖ్యం ఏర్పాటు చేసుకొంటారు. సంతాన ప్రయత్నాలలో మాత్రం కొంత ప్రతికూలత కలుగచేస్తారు. మొత్తం మీద శ్రీ క్రోధి నామ సంవత్సరంలో గురువు వలన అధిక భాగం అనుకూల ఫలితాలు ఏర్పడును.

మకరరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా శని గ్రహం వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. స్వ ఆరోగ్య విషయల్లో అశ్రద్ధ చేయుట వలన ఇబ్బందులు ఎదురగును. కుటుంబ పరమైన చికాకులు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. జీవిత భాగస్వామి తో సఖ్యత లోపిస్తుంది. అవివాహితుల వివాహ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అవుతాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుడా మకర రాశి వారికి ఏలినాటి శని దశ జరుగుచున్నది. కావునా ఈ సంవత్సరం కూడా మీరు సాహసోపేతమైన , అదృష్టం పై ఆధారపడు నిర్ణయాలు తీసుకొనుట మంచిది కాదు.

మకర రాశి వారికీ శ్రీ క్రోధి నామ సంవతసరంలో రాహువు వలన అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. రాహు గ్రహం సంపూర్ణ ఆయుర్భాగ్యములు ప్రసాదించును.

మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా శుభ ఫలితాలు ఏర్పడతాయి. మనోవాంచా ఫల సిద్ధత లభిస్తుంది. కానీ ఈ సంవత్సరం పితృ వర్గం వలన సమస్యలు ఎదురగును. అత్యవసర సమయాల్లో పితృ వర్గీయుల సహకారం లభించదు.

ఏప్రిల్ 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గృహంలోనూ , వృత్తి వ్యాపార ఉద్యోగ జీవనంలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. చక్కటి లాభకరమైన వాతావరణం అనుభవిస్తారు. అన్ని రంగముల వారికి ఈ మాసంలో సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడును. నూతన వాహన కొనుగోలు సంబంధ ప్రయత్నాలు లాభించును. గత కాలంగా వాయిదా వేస్తూ వస్తున్నా పనుల వలన ఈ మాసంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొందురు. ఈ మాసంలో 16 నుండి 21 వ తేదీ మధ్య కలుషిత ఆహార సంబంధ అనారోగ్యం బాధించును. మాసాంతంలో అందరి మన్ననలు పొందగలుగుతారు. సంతోషకర రోజులు ఏర్పడతాయి.

మే 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నిల్వ ధనమును ఏర్పరచుకోనగాలుగుతారు. బంధు వర్గం సహకారం వలన అభివృద్ధి చెందుతారు. వృత్తి జీవనంలోని వారికి గౌరవం, ఆశించిన చక్కటి అభివృధ్హి లభిస్తుంది. మాస మధ్యమంలో గృహంలో శుభ కార్యములు నిర్వహించెదరు. తృతీయ వారములో విదేశీ జీవనం చేయువార్కి స్థిరాస్తి నష్టములు ఎదురగును. ఎదిగిన పుత్ర సంతానంతో విరోధములు ఏర్పడుతాయి. స్త్రీలను అపవాదులు బాదిస్తాయి. మనశ్శాంతి కోల్పోవుదురు. మాసాంతమునకు ప్రతీ వ్యవహారం శ్రమకరంగా ఉండును. ముఖ్యంగా 26, 27, 28 తేదీలు అనుకూలమైన రోజులు కావు.

జూన్ 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆరోగ్య సమస్యల వలన బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఊహించని విధంగా సమసిపోతాయి. నిర్మాణ సంబంధమైన కార్యములకు ఈ మాసం అనుకూలమైన కాలం. ఉద్యోగ జీవనంలో పదోన్నతిని ఆశించవచ్చు. ఉదార స్వభావం వలన పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. జీవిత భాగస్వామి సంబంధ విషయాలలో అనుకూలత అనుభవించుదురు. మనోబలం పెరుగును. గురువులు , పెద్దల సహాయ సహకారములు లభించును. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వినుదురు. అయితే ఈ మాసంలో గర్భిణి స్త్రీలు జాగ్రత్త వహించవలెను.

జూలై 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కొద్దిపాటి అననుకూల పరిస్థితులు ఎదుర్కొందురు. ప్రధమ వారంలో స్థాన భ్రంశం, విద్యావిఘ్నత, శరీరమునకు హాని వంటి ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటారు. వ్యాపార రంగం వార్కి ఆదాయంలో తగ్గుదల ఆందోళన కలుగ చేస్తుంది. తలపెట్టిన వ్యవహారములందు సమస్యల వలన మానసిక అశాంతి ప్రారంభం అవుతుంది. అనవసర ఖర్చులు బాదించును. ద్వితియ మరియు తృతీయ వారములలో ఉద్యోగ జీవులకు శ్రమకరంగా ఉండును. ఈ మాసంలో 4, 7 9, 12 , 13, 18, 21, 27 తేదీలు అనుకూలమైనవి కావు.

ఆగష్టు 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా అంత అనుకూలంగా ఉండదు. ఆదాయం మరింత తగ్గును. నిల్వ ధనం కూడా వ్యయమగును. ఆశించిన ఫలితాలు లభించవు. పెట్టుబడులు వృధా అగును. ఒంటరితనం బాధించును. పరిస్థితులు అనుకూలించక నిరాశ ఆవహించును. పితృ వర్గం వారి వలన ఖర్చులు పెరుగుతాయి. ఈ మాసంలో ఒక పర్యాయం రాహు గ్రహ శాంతి జపములు జరిపించుకోనుట మంచిది. ఈ మాసంలో 2,3,16,17,25,26 తేదీలు అంత అనుకూలమైనవి కావు.

సెప్టెంబర్ 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆర్ధికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కుటుంబ చికాకులు కొనసాగును. సొంత మనుష్యుల నిరాదరణ బాధించును. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. 12, 13 తేదీలలో శరీరమునకు అలసట అధికం అవుతుంది. 20 నుండి 25 వ తేదీ మధ్య ఉద్యోగ జీవనలో లక్ష్య సాధన కొరకు ఒత్తిడి అధికం అవుతుంది. కార్య విఘ్నతలు ఎదురగును. ఆలోచనలు రాణించవు.

అక్టోబర్ 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు మాత్రం లాభించవు. తోదరపడి పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. మాస మధ్యమంలో ఇష్ట దైవ దర్శన భాగ్యం లభిస్తుంది. పారమార్ధిక చింతన అధికం అవుతుంది. ఆర్ధిక పరిస్థితులు నెమ్మదిగా సంతృప్తికరంగా పరిణామం చెందుతాయి. బంధు మిత్రులతో జరుపు మాటలందు జాగ్రత్త అవసరం. వివాహ , సంతాన ప్రయత్నములు లాభించును. ఈ మాసం పుత్ర సంతానము పొందుటకు అనుకూలమైన కాలం.

నవంబర్ 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసం అనుకూలమైన మాసం. నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరును. అవసరమైన ధనం చేతికి లభించును. ఇతరుల సమస్యల్లో మధ్యవర్తిత్వం నిర్వర్తించడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందురు. ఆలోచనలు సక్రమంగా ఉండును. పనుల భారం వలన అలసట ఏర్పడును. తోటి ఉద్యోగులతో తృతీయ వారంలో విభేదాలు బాధించును. క్రయవిక్రయాలలో లాభం పొందుతారు. కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగును. జీవిత భాగస్వామి కి కొద్దిపాటి అనారోగ్య సమస్య.

డిసెంబర్ 2024 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో శరీర ఆరోగ్యం సహకరించును. మానసిక ఉల్లాసం అనుభవిస్తారు. స్థాన చలన ప్రయత్నములకు అనుకూల కాలం. ఆగిపోయిన్ పనులలో ఆటంకములు తొలగును. అధికారులతో వివాదాలు సమసిపోతాయి. ధనాదాయం బాగుండును. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. ఆశించిన ప్రమోషన్లు లభించుట కష్టం. పెద్దల సలహాలు పాటించుట మంచిది. ఈ మాసంలో 11, 15, 22, 29 తేదీలు అనుకూలమైన రోజులు కావు.

జనవరి 2025 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో గృహంలో చికాకులు తొలగును. ధనాదాయం బాగుండును. వృత్తి వ్యాపారములలో చక్కటి లాభములు ఆర్జిస్తారు. శుభకరమైన ఫలితాలు మరియు కార్య సిద్ధి పొందగలుగుతారు. బహుమతులు ప్రాప్తించును. ప్రయాణ సౌఖ్యం. తృతీయ వారంలో అపకీర్తి, శరీరక రుగ్మతలు బాదించును. ఈ మాసంలో ధనానికి లోటు రాదు. చివరి వారం సామాన్య ఫలితాలు ఎదురగును.

ఫెబ్రవరి 2025 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. కానీ ఆదాయం బాగుండును. రావలసిన ధనం చేతికి వచ్చును. ద్వితియ వారంలో వాహన ప్రమాద సూచన. తృతీయ వారం ధన వ్యయం, ఆరోగ్య విషయాలలో అననుకూలత, ఆశాభంగములు వంటి సమస్యలు బాదించును. 24, 25, 26 తేదీలలో ఉద్రేకం వలన నష్టం కొని తెచ్చుకుంటారు.

మార్చ్ 2025 మకర రాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో బాగుండును. ధనాదాయం పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యపారాదులలో ప్రోత్సాహం. పై అధికారుల వలన కొద్దిగా అశాంతి. కీళ్ళ సంబంధమైన అనారోగ్యం బాదించును. కానీ ప్రమాదం ఉండదు. వ్యాపార విస్తరణకు ఈ మాసం మంచి సమయం. వ్యవహారములు సానుకూలంగా పూర్తి అగును. గృహంలో ఆకస్మిక శుభకార్యములు. ఆధిపత్య పోరు కొంత బాధించును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.