Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర కుంభరాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 14, రాజ పూజ్యం - 06, అవమానం - 01

  • పూర్వ పద్దతి లో కుంభ రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "3". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఏర్పడు సమస్యలను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Kumbha Rasi / Aquarius Sign's Nature...

కుంభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా గడిచిన సంవత్సరం మాదిరే అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. నూతన ధన ఆదాయ మార్గాలు లభిస్తాయి. సోదరి వర్గం వారి వలన బాగా లాభపడతారు. భూ సంపద కు సంబందించిన లాభములు పొందుతారు. మాతృ వర్గీయుల వలన సౌఖ్యమును పొందగలుగుతారు.

కుంభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా శని వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. సర్వ కార్యములందు శ్రమ అధికం అవుతుంది. కార్యములు సమయానికి పూర్తీ కావు. నిరుత్సాహం బాధిస్తుంది. ఉద్యోగ జీవనం లోని వారికి ప్రమోషన్లు ఆఖరి నిముషంలో ఆగిపోవు అవకాశం ఉన్నది. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం లోపించిన వారు ప్రతీ శనివారం నాడు పగటి సమయంలో ఉపవాసం ఆచరించుట మంచిది. కుంభ రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఏలినాటి శని దశ జరుగుతున్నది. కావునా సదా అలోచించి జీవన విధానంలో నిర్ణయాలు తీసుకోవాలి.

కుంభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహు గ్రహం సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడవు. ధనానికి చికాకులు ఏర్పరచును. అనారోగ్యత వలన ధన వ్యయం కూడా అదుపు తప్పును.

కుంభ రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా అనుకుల ఫలితాలు పొందలేరు. శత్రు పీడ, ఆరోగ్య సమస్యలు మరియు ఆర్ధిక సమస్యలు తరచుగా చికాకు కలుగచేయును. అదృష్టం ఏ మాత్రం కలసి రాదు.

ఏప్రిల్ 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మానసిక ఆందోళన అధికం అవుతుంది. అనారోగ్య సమస్యలు , ప్రభుత్వ అధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహచరుల వలన ఉద్యోగ జీవనంలో సమస్యలు ఏర్పడతాయి. జూదం వలన గౌరవ హాని మరియు తన్మూలక ధన నష్టం పొందుతారు. వినరాని మాటలు వినుట మానసికంగా ఇబ్బంది పెడుతుంది. వృత్తి జీవనంలోని వారికి, వ్యాపార రంగంలోని వారికి ఈ మాసం కలసి రాదు. వేగంగా పూర్తి కావలసిన పనులలో జాప్యం ఎదురగును. రుణ భారం పెరుగుతుంది. ఈ మాసంలో గ్రహ శాంతులు అవసరం.

మే 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆదాయం సామాన్యం. కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు దెబ్బతింటాయి. ద్వితియ వారంలో ముఖ్యమైన పనులలో అవాంతరములు ఎదురగును. ఆస్తి వివాదములు పరిష్కారం అవ్వడంలో జాప్యం బాధిస్తుంది. వ్యవహార జయం కొరకు మిక్కిలి శ్రమించవలెను. కొత్త బాధ్యతలు ఆందోళన కలిగించవచ్చును. ఈ మాసంలో 1, 10,14,19,24,29 తేదీలు అనుకూలమైనవి కావు.

జూన్ 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడును. నూతన అవకాశములు లభించును. ఆరోగ్య సమస్యలు శాంతిమ్చును. పనిచేయుచున్న స్థలంలో అవమానుపడు సంఘటనలు ఎదురగును. సహచర ఉద్యోగుల నుండి సహకార లేమి ఎదుర్కొంటారు. కొత్త పరిచయాల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ మాసంలో ప్రయాణములు వాయిదా వేయుట మంచిది. ఆదాయం సామాన్యం. కొన్ని విపరీత అనుభవాలు ఎదుర్కొనుటకు సూచనలు కలవు.

జూలై 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆదాయ వ్యయములు సమానంగా ఉండును. కుటుంబ సహకారం వలన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుదురు. గతకాలపు వాయిదా పడిన పనులు పూర్తిఅగును. జీవిత భాగస్వామి సంబంధిత విషయాలలో చక్కటి సౌఖ్యత ఏర్పడును. అవివాహితుల వివాహ ప్రయత్నములు ఫలించును. ఈ మాసంలో పౌరాహిత్యం నిర్వహించువారికి అంత మంచిది కాదు. దానములు స్వీకరించునపుడు ఆలోచించుట మంచిది.

ఆగష్టు 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రారంభం నుండి ధన సంబంధ ఒత్తిడి తగ్గును. సంతానం వలన చక్కటి సౌఖ్యత అనుభవిస్తారు. శుభకార్య సంబంధ వ్యవహారములు బంధు మిత్రుల ఆదరణ వలన పూర్తి చేయుదురు. వ్యాపార వ్యవహారములు సామాన్యంగా కొనసాగును. ఆదాయం పెరుగును. తృతీయ వారం నుండి నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తికావడంలో అనేక అవాంతరములు ఎదురగును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం పొందుతారు. మాసాంతంలో విదేశాలలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. వారి ఆదరణ వలన సమస్యల నుండి బయట పడతారు. మాసాంతంలో మాతృ వర్గీయులకు ఆరోగ్య సమస్యలు.

సెప్టెంబర్ 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం వృత్తి , ఉద్యోగ , వ్యాపారముల వారికి సామాన్య ఫలితాలు ఏర్పరచును. స్త్రీ సంబంధమైన ధన వ్యయం ఎదురగును. భూ సంబంధ విషయాలలో క్రయవిక్రయాల వలన నష్టం ఎదుర్కొందురు. సంతాన లేమి దంపతుల సంతాన ప్రయత్నాలు ఫలించును. ఆదాయం గత మాసముల కన్నా మెరుగ్గా ఉండును. ద్వితియ వారంలో విలువైన సమాచారం లభించును. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలలో జాగ్రత్త వహించవలెను. ప్రయాణములు సఫలమగును. కొత్త ప్రణాళికలు రచించుటకు ఈ మాసం సరైన సమయం.

అక్టోబర్ 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసం మొదటి వారంలో ఒక ముఖ్య వ్యవహారం ఆటంకములను పొందును. పోలీసుల వలన లేదా కోర్టుల వలన వేధింపులు ఉండగలవు. మానసిక ఆందోళన అధికం అవుతుంది. ఈ మాసంలో కూడా ధనాదాయం సామాన్యం. 12 వ తేదీ తదుపరి వృత్తి వ్యాపారదులు అభివృద్దిలో ఉండును. 19, 20 వ తేదీలలో యంత్ర సంబంధమైన సమస్యలు. 22 వ తేదీ తదుపరి సమస్యల తీవ్రత తగ్గును. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును.

నవంబర్ 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ప్రయత్నములు నెమ్మదిగా విజయం పొందును. కోర్టు తీర్పులు ప్రతికూలం. నిత్య జీవనంలో శ్రమ అధికమగును. పలుమార్లు ప్రయత్నించిన మీదట కార్య జయం ఏర్పడును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గోనేదురు. ఉన్నత వర్గముల వారితో పరిచయం. తన్మూలక గౌరవం పొందుతారు. మాసాంతంలో గృహ మార్పిడి ప్రయత్నాలు విజయం పొందుతాయి. స్థాన చలనముకు అవకాశం. ఈ మాసంలో 8,13, 21,22, 28 తేదీలు అనుకూలమైనవి కావు.

డిసెంబర్ 2024 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నూతన వ్యాపారాలు, ఆలోచనలు కార్యరూపం దాల్చును. ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. కళత్ర మూలక సంతోషాలు . ధనం అవసరములకు తగిన విధంగా సర్దుబాటు అవుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించు అవకాశం ఉన్నది. పేరు ప్రఖ్యాతలు తిరిగి సంపాదిన్చుకోగాలుగుతారు. సంతాన ప్రయత్నములకు ఈ మాసం మంచి కాలం. ద్వితియ వారంలో ఒక ముఖ్యమైన వస్తువు పోగట్టుకొనే సూచన. ట్రేడింగ్ వ్యాపారం చేయువారికి ఈ మాసం మంచి కాలం. స్వ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. రాజకీయంగా పలుకుబడి పెరుగును. శత్రుబాధలు కొంతవరకూ తగ్గును.

జనవరి 2025 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో విలువైన ఆభరణములు కొనుగోలుచేయుదురు. వ్యక్తిగత జీవితంలో శుభం జరుగును. మొదట ప్రయత్న విఘ్నములు ఉన్నప్పటికీ అంతిమంగా విజయం పొందుదురు. వాహన, భూ, వస్త్ర సౌఖ్యం ఏర్పడును. వ్యాపారములు లాభించును. వంశ పెద్దల సహకారం వలన కుటుంబ కలహాలు తొలగును. గృహంలో వేడుకలు జరుగును. అన్నివిధములా ఈ మాసం అనుకూలమైన కాలం.

ఫెబ్రవరి 2025 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ఆదాయం సామాన్యం. తలపెట్టిన కార్యములందు అవకాశములు చేజారిపోవును. నూతన ఆదాయ మార్గముల కొరకు శ్రమించవలెను. పురుష సంతానం వలన సమస్యలు ఎదురగును. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడును. తగాదాల వలన అశాంతి అనుభవిస్తారు. ఇచ్చిపుచ్చుకొను వ్యవహారములలో జాగ్రత్త వహించవలెను. స్త్రీలకూ ఆరోగ్య సమస్యలు ఉన్నవి.

మార్చ్ 2025 కుంభరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధనాదాయం పెరుగును. కుటుంబములో స్త్రీల అనారోగ్యం కొనసాగును. స్థిరాస్తి ఋణములు కొంతవరకూ తీరును. సోదర వర్గం వారికి ఖ్యాతి పెంపొందుతుంది. ప్రయాణ మూలక ఆరోగ్య భంగములు ఎదురగును. ఆహార విషయంగా సమస్యలు పొందుతారు. ఈ మాసంలో ఆశించిన ఉద్యోగ అవకాశములు లభించును. అన్య స్త్రీ సంబధాలు ఇబ్బందులను కలిగించును. ఈ మాసంలో 26, 27 తేదీలలో అవాంచిత తగాదాలు ఎదుర్కొందురు.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.