Placeholder image

2024-2025 శ్రీ క్రోధి నామ సంవత్సర కర్కాటకరాశీ రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Karkataka Rasi / Cancer Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం - 14, వ్యయం - 02, రాజ పూజ్యం - 06, అవమానం - 06

  • పూర్వ పద్దతిలో కర్కాటక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాబోవు విజయవంతమైన జీవనాన్ని సూచిస్తున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Cancer sign / Karkataka Rasi Nature....

కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా గత సంవత్సరం మాదిరిగానే ఆశించిన ఆయుర్ ఆరోగ్య భాగ్యములు సంపూర్ణంగా లభించును. గురువు కర్కాటక రాశి వారికి మిక్కిలి న్యాయవంతంగా అధిక ధనాన్ని మరియు విశేష యోగావంతమైన జీవనాన్ని ప్రాప్తింప చేయును. యజ్న యాగాది క్రతువులు మరియు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చక్కటి పేరు ప్రతిష్టలు ప్రాప్తించుట జరుగుతుంది. వారసత్వ సంపద లభించుట వలన కూడా ఆర్ధికంగా సంపూర్ణ యోగం అనుభవిస్తారు. మొత్తం మీద కర్కాటక రాశి వారు గురు గ్రహం వలన సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు అనుభవిస్తారు. వ్యక్త్రిగత జాతకంలో గజకేసరి యోగం ఉన్న వారికి మరింత మంచి ఫలితాలు లభిస్తాయి.

కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా శని అంత అనుకూల ఫలితాలు ఇవ్వరు. గత సంవత్సరం మాదిరిగానే అనవసర తగాదాలు ఎదుర్కొందురు. కోర్టు కేసులతో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కూడా తరచుగా ఇబ్బంది పెడతాయి. ఆనారోగ్యత వలన ధన వ్యయం కూడా అధికం అగును. ఈ సంవత్సరం కూడా మీరు తరచుగా శ్రీ శనైచ్చరునికి తైలభిషేకాలు జరిపించుకోనుట మంచిది. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ లేదు. 

కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహువు వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు లభించును. స్వార్జిత ధన సంపద, వారసత్వ ధన సంపద రెండింటి వలన ఆర్ధిక సౌఖ్యం అనుభవిస్తారు. పితృ వర్గం వారితో ఉన్న సమస్యలు తగ్గుతాయి.

కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతువు వలన కూడా కలసి వస్తుంది. కెరీర్ పరంగా, ఆర్ధిక పరంగా, జీవితంలో ఆశించిన అభివృద్ధి లభిస్తుంది. సోదరి వర్గం వారికి కూడా ఈ సంవత్సరం అంత మంచి కాలం కాదు. వారు వ్యక్తిగత జీవితంలో ఒక తీవ్ర నష్టం ఎదుర్కొనే సూచన ఉంది.

ఏప్రిల్ 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసం మొదటి వారంలో శరీర అనారోగ్యం బాదిస్తుంది. ప్రతీ పనియందు శ్రమానంతర కార్య జయం ఎదురగును. ఉద్యోగ జీవనం సామాన్యం. విద్యార్ధులకు మంచి అవకాశములు లభిస్తాయి. ద్వితీయ వారములో నూతన వధూవరులకు సంతాన ప్రాప్తి యోగం ఉన్నది. ఈ నెల 16, 17 తేదీలలో శత్రుత్వములు. తగవుల వలన అశాంతి ఎదుర్కొంటారు. చివరి వారంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. 22 వ తేదీ తదుపరి ధనాదాయంలో పెరుగుదల ఉంటుంది. మిత్ర వర్గంలో మంచి పేరు గడించగలుగుతారు. అవసరములకు ధనం సర్దుబాటు అవుతుంది.

మే 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రారంభ వారంలో అనగా 5,6,7 తేదీలలో కళత్ర సంబంధమైన చికాకులు ఎదురగును. నూతన వ్యక్తులతో పరిచయాలు సమస్యలను కలుగచేస్తాయి. ద్వితీయ వారం అంతా సామాన్యంగా ఉంటుంది. తీవ్ర ప్రతికూలత ఉండదు. తృతీయ వారం నుండి వృత్తి వ్యాపారములలో ధనాదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల కొరకు శుభ సంకల్పములు గావిస్తారు. ఉద్యోగ జీవనంలో పోటీతత్వం ప్రదర్శిస్తారు. చివరి వారంలో అనగా 25, 27 తేదీలలో కార్యజయం, వ్యవహార అనుకూలత ఉన్నవి.

జూన్ 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసం అనుకూలమైన ఫలితాలు ప్రసాదించును. దూర ప్రయాణ సంబంధ లాభములు పొందుతారు. జీవిత భాగస్వామి వలన సౌఖ్యం అనుభవిస్తారు. శుభ వార్తలు వింటారు. కందెన సంబంధ వ్యాపారములు చేయువారికి అధిక లాభములు ప్రాప్తించును. వివాహ ప్రయత్నములలో సంబంధములు నిశ్చయం అగును. తృతీయ వారంలో చిన్న అనారోగ్య సూచన లేదా వాహన ప్రమాదం నుండి తప్పించుకొను సంఘటనలు ఉన్నవి. 24 నుండి మాసాంతం మధ్య కాలంలో గృహ సంబంధమైన అవసరాల కొరకు ధనం వ్యయం చేస్తారు. ఈ మాసంలో చివరి వారం స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంది. ట్రేడింగ్ వ్యాపారం చేయు వారు మిక్కిలి జాగ్రత్తగా ఉండవలెను.

జూలై 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అకారణంగా మీ పై స్థాయి వ్యక్తులతో కలహములు ఏర్పడును. ఆత్మీయుల మరణం ఎడబాటు కలుగచేస్తుంది. తలపెట్టిన ప్రయత్నములలో ఆటంకములు ఎదురగును. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గృహంలో పెద్ద వయస్సు వారికి ఆరోగ్య భంగములు ఎదురగును. ఈ మాసంలో 19, 20, 21 తేదీలలో భూ సంబంధమైన లేదా సొంత గృహ సంబంధమైన ప్రయత్నములలో కదలిక ఏర్పడును. చివరి వారం సంతాన సంబంధ ప్రయత్నములు చేయువారికి శుభ ఫలితాలు కలుగచేయును. వ్యాపార రంగంలోని వారికి ఈ మాసం అంతా మద్యమ ఫలితాలు లభిస్తాయి.

ఆగష్టు 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో వ్యపారాదులలో ఆశించిన లాభములు ఉంటాయి. ఉద్యోగ జీవనంలో ప్రమోషన్లు ఆశించవచ్చు. ఉత్సాహ పూరిత కాలం. పదోన్నతి వలన అధిక గౌరవాన్ని గడిస్తారు. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ప్రభుత్వ కాంట్రాక్టు సంబంధ వ్యాపార కార్యములలో మాత్రం ఆటంకములు ఎదురగును. పోటీదారుల వలన పరాభవం పొందుతారు. తొందరపాటు నిర్ణయాల వలన వృధా ప్రయాణములు చేయవలసి వస్తుంది. ఈ మాసంలో 10,11,12,13,14 తేదీలలో ధన వ్యయం అధికంగా ఏర్పడుతుంది. మాసాంతంలో జీవన మార్గంలో ఆర్ధిక పరమైన చికాకులు ఎదురగును. ముఖ్యంగా 29, 30 తేదీలలో ధనం ఇతరులకు ఇవ్వరాదు.

సెప్టెంబర్ 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో భూ లేదా గృహ సంబంధమైన విక్రయాదుల వలన ధన ప్రాప్తి లభిస్తుంది. సువర్ణ సంబధమైన పెట్టుబడులు లాభములు ఏర్పరచును. కుటుంబ జీవనంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. ఆశించిన రంగంలో విద్యార్ధులకు గుర్తింపు మరియు విజయం లభిస్తాయి. మాస మధ్యమంలో ధర్మ కార్య సంబంధమైన పనులకు వ్యయం చేస్తారు. ఇష్ట దైవ సందర్శన భాగ్యం లభిస్తుంది. మిత్రుల సహకారంతో పనులు పూర్తిచేయగలుగుతారు. నూతన పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం మంచి సమయం. అవివాహితులకు కూడా ఈ మాసంలో వివాహ సంబంధమైన శుభ ఫలితాలు ఉన్నవి.

అక్టోబర్ 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో నూతన పదవులు ప్రాప్తించును. గౌరవ ప్రధానమైన జీవనం గావిస్తారు. ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు. కుటుంబ సభ్యుల వినోద సంబంధమైన కోరికల వలన ధనం వ్యయం చేస్తారు. ద్వితియ వారంలో సోదరీ వర్గం వారికి వ్యక్తిగత జీవనంలో ఒక నష్టం ఏర్పడు సూచన. మానసికంగా ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తారు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వ్యాపారములలో అంతగా ప్రోత్సాహం ఉండదు. ఈ మాసంలో 2,6,15, 26 తేదీలు మంచివి కావు.

నవంబర్ 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జన్మ స్థానానికి కెరీర్ పరంగా స్థానచలనముకు అవకాశం ఉన్నది. ప్రయత్నాలు చేయవచ్చు. మాస ప్రారంభంలో కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురగును. సేవకుల వలన ఆర్ధిక ద్రోహం పొందుటకు అవకాశములు అధికంగా ఉన్నవి. ఈ మాసం లో 19 వ తేదీ తదుపరి ఉద్యోగ జీవనంలో ఉన్నతి ఉన్నది. జీవన మార్గంలో ఆశించిన అభివృద్ధి పొందుతారు. మాసాంతంలో జీవిత భాగస్వామితో అతి చక్కటి అనుకూలత ప్రాప్తించును. నూతన కార్యములందు విఘ్నములు తొలగును. యంత్ర సంబంధ లాభములు గడిస్తారు. మొత్తం మీద ఈ మాసంలో ఆర్ధికంగా బాగుంటుంది.

డిసెంబర్ 2024 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సంతాన ప్రయత్న సంబంధ వ్యయం ఎదురగును. గృహంలో వేడుకలు. బంధువుల కలయికలు. సహా పంక్తి భోజనాలలో పాల్గొంటారు. ఉద్యోగ సంబందంగా అఖస్మిక ప్రయాణములు చేయవలసి వస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. విద్యార్ధులకు దూర ప్రాంత విద్య కొరకు చేయు ప్రయత్నములు లాభించును. వంశ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఈ మాసంలో 4,5,6 తేదీలలో వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం.

జనవరి 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో ధన ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. మాసం మొత్తం సామాన్య ఫలితాలు ఏర్పడును. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో కష్టం మీద సఫలత లభిస్తుంది. అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశములను కోల్పోవుదురు. ఈ మాసంలో వృత్తి వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఈ మాసంలో 9,13,17,23 మరియు 29 తేదీలు మంచివి కావు.

ఫెబ్రవరి 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జీవిత భాగస్వామి సంబంధిత ధన లాభములు ఏర్పడును. స్వార్జిత పరంగా కూడా ఆర్ధికంగా చక్కటి సౌఖ్యం అనుభవిస్తారు. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ మాసంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కలసి వస్తుంది. మానసిక ఉల్లాసం అనుభవిస్తారు. తృతీయ వారం పూర్తి అగు వరకూ అనుకూలంగా ఉంటుంది. చివరి వారం నుండి ఉద్యోగ జీవనంలో ఒత్తిడి అధికం అవుతుంది. సమయా భావం వలన ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో తోటివారి సహకారం లభించదు. మీ నుండి సహాయం పొందిన వారు కూడా మీకు సహకారం అందించకుండా ఉండుట మిమ్మల్ని బాధిస్తుంది.

మార్చ్ 2025 కర్కాటకరాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అన్ని విధములా లాభ పడతారు. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో అభివృద్దిని పొందుదురు. వంశ గౌరవం పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గౌరవ ప్రదమైన జీవనం లభిస్తుంది. దగ్గరి బంధువులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినవలసి వస్తుంది. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం కొంత వృద్ది చెందుతుంది. ప్రత్యర్ధులపై మీదే పై చేయి అవుతుంది..

 

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.