Placeholder image

2024 - 2025 శ్రీ క్రోధి నామ సంవత్సర కన్యారాశి రాశీ ఫలాలు

Sree Krodhi Nama Samvatsara Kanya Rasi / Virgo Sign Free Telugu Rasi Phalalu

Placeholder image

 

  • శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 05, అవమానం - 02.

  • పూర్వ పద్దతిలో కన్యారాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎదురగు కుటుంబ వృద్ధిని మరియు వారసత్వ లాభములను సూచించుచున్నది.

  • Click Here to know your rasi if you are not sure...
  • Click Here to get your manually written personalised Horoscope Report...
  • Click Here to know Virgo sign / Kanya Rasi's Nature...

కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అనగా 09-ఏప్రిల్-2024 నుండి 30-మార్చ్-2025 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. వారసత్వ సంపద వలన ఆర్ధిక సౌఖ్యం అనుభవిస్తారు. స్వార్జిత ఆదాయం కూడా పెరుగుతుంది. మీ జాతకం లో గోచార గురు గ్రహ స్థితి పితృ వర్గీయులకు ఆపదలను దూరం చేస్తుంది. అన్ని విధాల ఈ సంవత్సరం గోచార గురు గ్రహ స్థితి చక్కటి ఫలితాలనే ఏర్పరచును.

కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో శనైచ్చరుని వలన అనుకూల ఫలితాలు ఏర్పడవు. సంవత్సరం అంతా శని కన్యరాశి రాశి వారకి గత సంవత్సరం వలనే ఎదో ఒక అసంతృప్తి ని కలుగచేయును. కన్యారాశి వారు నిత్యం శని గ్రహ స్తోత్రం పటించుట మంచిది. '' నీలాంజన సమా భాసం రవి పుత్రం యమాగ్రజం - ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం''. కన్యారాశి వారకి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా ఏలినాటి శని దశ లేదు.

కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాహువు వలన కూడా అనుకూల ఫలితాలు ఏర్పడవు. వైవాహిక జీవనంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురగును. జీవిత భాగస్వామి పట్ల కటినతత్వం పనికిరాదు. స్వ ఆరోగ్య విషయాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా రక్త హీనత తో బాధ పడుతున్నవారు జాగ్రత్త వహించాలి.

కన్యారాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కేతువు వలన కూడా ప్రతికూల ఫలితాలు ఏర్పడును. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆరోగ్య సమస్యలు తరచుగా ఏర్పడుచుండును. మొత్తం మీద కన్యారాశి వారికి రాహువు మరియు కేతువుల వలన ఈ సంవత్సరం కూడా అనుకూల ఫలితాలు ఏర్పడవు. వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగిన వారు, రాహు-కేతువులను నీచ క్షేత్రములలో కలిగి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండవలెను. తరచుగా సర్ప దోష నివారణ పూజలు జరిపించుకోనుట మంచిది.

ఏప్రిల్ 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో మనసుకి కష్టం కలిగించే సంఘటనలు ప్రధమ వారంలో చోటుచేసుకోనును. అకాల భోజనం. నిద్రలేమి, శిరోబాధ ఎదురగును. ద్వితియ వారంలో జీవిత భాగస్వామితో విరోధాలు ఏర్పడును. శత్రుభయం, మానసిక ఆందోళనలు తరచుగా ఎదురగును. పితృ వర్గం వారి అనారోగ్య సమస్యలు తగ్గును. 25 వ తేదీ తదుపరి స్థాన చలన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ మాసంలో 17, 23, 30 వ తేదీలు అనుకూలమైనవి కావు.

మే 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసం కూడా మిశ్రమ ఫలితాలను కలిగించును. మనసు నిలకడగా ఉండదు. చెడు ఆలోచనలు అధికంగా వస్తూ ఉండుట వలన మానసిక ఆందోళన అనుభవిస్తారు. ఆకస్మిక ప్రమాదాల నుండి తప్పించుకొంటారు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యంగా ఉంటుంది. ప్రయత్నాలలో విఘ్నములు ఎదురైనా చివరికి పూర్తి అవుతాయి. తృతీయ వారం నుండి పరిస్థితులలో అనుకూలత ప్రారంభం అవుతుంది. సోదర వర్గం వారితో సమస్యలు తొలగును. వారి సహాయం లభిస్తుంది. ఈ మాసంలో 9 నుండి 13 వ తేదీల మధ్య వాహనాల విషయంలో , ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం.

జూన్ 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. మీ ప్రత్యర్ధులపై మీదే పై చెయ్ అవుతుంది. సకల కార్య విజయం మరియు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మీరు తలపెట్టిన పనుల వలన మిక్కిలి గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తీ చేయగలుగుతారు. సకాలంలో ధనం సర్దుబాటు అవుతుంది. ఈ మాసంలో 10 నుండి 14 తేదీల మధ్య వివాహ ప్రయత్నములు, సంతాన సంబంధ విషయాలకు అనుకూల కాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో చక్కటి సౌఖ్యత ఉంటుంది. బాగా ఎదిగిన సంతానం వలన సంతోషం పొందుతారు. ఈ మాసంలో 5,16,22, 30 తేదీలు అనుకూలమైనవి కావు.

జూలై 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కోర్టు వ్యవహారములలో విజయం లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ కార్యముల కోసం ధన వ్యయం చేస్తారు. నూతన వ్యాపారములు మధ్యమ ఫలితాలను ఇస్తాయి. ద్వితియ వారం నుండి ఉద్యోగ జీవనంలో అనుకోని ఒడిదుడుకులు ఎదురగును. నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి కావు. ప్రయాణములు వలన అలసట అనుభవిస్తారు. లాటరీల వలన నష్టపోవుదురు. మీ వ్యావహారిక స్థాయి ని మించి హామీలు ఇచ్చుట పనికిరాదు. ముఖ్యంగా హస్త నక్షత్ర జాతకులు ఇతరులతో మాటలాడు సందర్భంలో జాగ్రత్తగా ఉండవలెను.

ఆగష్టు 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు పొందుదురు. వృత్తి వ్యాపారములలో ఆశించిన లాభం పొందుతారు. ఆర్ధిక ఋణములు తీరును. తలచిన ప్రతీ ఆర్ధిక కార్యం విజయం పొందును. రావలసిన ధనం చేతికి వచ్చును. కళత్ర వర్గం వారితో వైరం బాదిస్తుంది. వివాహ ప్రయత్నములకు ఈ మాసం అనుకూలమైనది కాదు.ఈ మాసంలో 7,8,9 తేదీలలో ఆదాయం బాగుండును. 13, 16, 19 వ తేదీలు అనుకూలమైనవి కావు.

సెప్టెంబర్ 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ధనాదాయం పెరుగును. కుటుంబంలో సంతోషకర సమయం ఏర్పడుతుంది. పిన్న వయస్సు వారికి కెరీర్ పరంగా ఆశించిన వృద్ధి లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు కూడా ఆటంకాలు తొలగి విజయవంతం అవుతాయి. కళత్ర వర్గం వారితో వైరములు తొలగుతాయి. గౌరవ మర్యాదలు సంఘపరంగా పెరుగును. ఈ మాసంలో 5,7,12,27 తేదీలు అనుకూలమైనవి కావు.

అక్టోబర్ 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసం ప్రధమ వారంలో ఒక అశుభ వార్త వినడానికి సూచన ఉన్నది. మనోవిచారం అనుభవిస్తారు. తెలిసిన వ్యక్తుల వలన ఆర్ధిక లాభములు ఏర్పడతాయి. ద్వితియ వారంలో ఉద్యోగ జీవనంలో కొంచం ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగ నష్టమునకు సూచనలు లేవు. రక్త సంబంధ అనారోగ్య విషయాల పట్ల జాగ్రత్త అవసరం. తృతీయ వారంలో అధికంగా వృధా వ్యయం ఎదురగును. అదృష్ట రాహిత్యత బాదిస్తుంది. చివరి వారం నుండి పరిస్టితులలో అనుకూలత ప్రారంభం అవుతుంది. మాత్రు వర్గీయుల సహకారం లభించుట వలన ఒక సమస్య నుండి బయట పడతారు.

నవంబర్ 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసం విద్యార్ధులకు అనుకూలమైన ఫలితాలను కలిగించును. విద్యా సంబంధమైన ప్రయత్నాలలో జయం. కార్య సిద్ధి. వినోదములు. కుటుంబంలో సంతోషములు. గృహంలో శుభకార్యములు. ఈ మాసంలో దాదాపు అన్ని విషయాలలో అనుకూలత ఉండును. ఉద్యోగ జీవనంలో ఉన్నత స్థితి ఆశించవచ్చు. నూతన వాహన మరియు వివాహాది సంబంధ విషయాలలో లాభములు పొందుతారు. సంతాన ప్రయత్నములు ఫలించును.

డిసెంబర్ 2024 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో సొంత గృహ సౌఖ్యం కొరకు చేయు రుణ ప్రయత్నములు ఫలించును. స్త్రీ మూలక ధనప్రాప్తి అనుభవిస్తారు. బంధువులతో కలయిక నెలసరి వ్యయాన్ని కొద్దిగా అదుపు తప్పునట్టు చేయును. వ్యాపారములలో ప్రభుత్వ సంబంధ ఇబ్బందులు ఎదురవుతాయి. 18 వ తేదీ తదుపరి ఆడంబరాలకు మిక్కిలి వృధా వ్యయము చేయుదురు. నాలుగవ వారంలో ఉద్యోగ జీవనంలోని వారికి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. ఈ మాసంలో 8,15,17,20 తేదీలు అనుకూలమైనవి కావు.

జనవరి 2025 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో జరుగుతూ ఉన్న పనులలో అఖస్మిక విఘ్నములు ఎదురవుతాయి. ఈ మాసమంతా సామాన్య ఫలితాలు పొందుతారు. పితృ సంబంధ విషయాల వలన మానసిక చికాకులు ఎదుర్కొంటారు. వృత్తి జీవనం వారికి, వ్యాపారస్థులకు సామాన్య ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ జీవనంలోని వారికి ఉద్యోగ మార్పిడికి మార్గములు లభిస్తాయి. వివాహ ప్రయత్నములలో ఏర్పడిన స్తంభన తొలగును. విద్యార్ధులకు పోటీ పరీక్షలలో ప్రతికూలమైన వాతావరణం ఎదురవుతుంది. రైతులకు పంట దిగుబడి ఆశించిన విధంగా ఉండదు.

ఫెబ్రవరి 2025 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసం గృహ సంబంధ నిర్మానములకు , ఋణ ప్రయత్నములకు మంచిది. ద్వితియ వారంలో ప్రభుత్వ సన్మానం లేదా ప్రభుత్వ సంబంధ ప్రయోజనం పొందుతారు. కార్య సిద్ధి యోగం ఉన్నది. దూర ప్రాంత ప్రయాణములు అనుకున్న రీతిలో ముగుస్తాయి. తృతీయ వారంలో స్వల్ప కాలిక అనారోగ్య సమస్యలు బాదిస్తాయి. శస్త్ర చికిత్స అవసరం ఉండదు. చివరి వారంలో సామాన్య ఫలితాలు ఎదురవుతాయి. కళత్రముతో చికాకులు కొనసాగును.

మార్చ్ 2025 కన్యారాశి రాశిఫలాలు: 

ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగా ఉండును. భూ లాభం పొందుతారు. అదృష్టం కలసివస్తుంది. వ్యపారాదులలో అధికమైన ధనప్రాప్తి లబిస్తుంది. సుఖసంతోషాలు సంపూర్ణంగా ప్రాప్తిస్తాయి. విందులు, వేడుకలలో పాల్గోనేదురు. వస్త్ర లాభం ఉన్నది. జీవిత భాగస్వామి తో మనస్పర్ధలు తొలగును. ఈ మాసంలో 16, 17, 18, 19 తేదీలు నూతన వ్యాపార వ్యవహారములకు మంచివి. అయితే లోహ సంబంధ వ్యాపారములు ఈ నెలలో మొదలు పెట్టుట మంచిది కాదు. ఈ మాసంలో చేయు ఇతర పెట్టుబడులు లాభించును.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.